బీజింగ్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు రెండు గంటల్లోనే చేరుకోగల విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. దీనిని పరీక్షించేందుకు ధ్వని వాయు సొరంగం (హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్)ను చైనా నిర్మిస్తోందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. వాహనాలు రోడ్డుపైన, విమానాలు ఆకాశంలో వెళ్తున్నప్పుడు గాలి బలంగా వీస్తుండటం తెలిసిందే. కొత్తగా తయారైన వాహనాలు, విమానాలు తదితరాలపై అలా వీచే గాలి ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించడానికి ఏరోడైనమిక్స్ పరిశోధనల్లో వాయు సొరంగాలను ఉపయోగిస్తారు.
ఇప్పుడు చైనా అభివృద్ధి చేస్తున్న కొత్త విమానం ధ్వని వేగానికి 25 రెట్ల అధిక వేగం (మ్యాక్ 25)తో ప్రయాణించగలదు. సాధారణ లెక్కల్లో చెప్పాలంటే గంటకు ఏకంగా 30,625 కిలోమీటర్ల వేగంతో ఇది ఆకాశంలో దూసుకుపోగలదు. అంత వేగంతో వెళ్తున్నప్పుడు దీనిపై గాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ పరిస్థితిని కృత్రిమంగా వాయుసొరంగంలో కల్పించి విమానాన్ని పరీక్షిస్తారు. అందుకోసమే చైనా ఈ 265 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మిస్తోందని అధికారిక మీడియా పేర్కొంది
Comments
Please login to add a commentAdd a comment