కోరిక ఆపుకోలేక విమానం టాయ్‌లెట్‌లో..
బీజింగ్: సిగరెట్ తాగేవారు విమాన ప్రయాణాల్లో తమ కోరికను చంపుకొని ప్రయాణించాల్సి ఉంటుంది. కాదు కూడదు అని కోరికను ఆపుకోలేక సిగరెట్ అంటించారో.. చైనా వ్యక్తి వాంగ్‌లా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్ ఏసియా విమానంలో చైనాకు వచ్చిన వాంగ్‌ను జిజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్జూ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విమానం టాయ్‌లెట్‌లో తాను సిగరెట్ తాగానని వాంగ్ అంగీకరించాడు. పబ‍్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నిబంధనలు పాటించనందుకు గాను అతడికి ఐదు రోజులు జైలు శిక్ష విధించారు. విమానంలో సిగరెట్ పొగ వాసన రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది కెప్టెన్‌కు సమాచారం ఇవ్వడంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడని అధికారులు వెల్లడించారు. టోబాకో ఉత్పత్తి, వినియోగంలో చైనా ముందుంది. సుమారు 300 మిలియన్లకు పైగా పొగరాయుళ్లు చైనాలో ఉన్నారు.