ప్రతీకాత్మక చిత్రం
చికాగో : పురాణాల్లో, పౌరాణిక చిత్రాల్లో ఒక చోట మాయమై, మరో చోట ప్రత్యక్షమవడం చూస్తూనే ఉంటాం. కానీ, నిజ జీవితంలో అది సాధ్యమా అంటే.. కాదని అందరికీ తెలుసు. కానీ, మూడు గంటల్లో ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. అదెలాగంటే.. హైపర్‌సోనిక్ విమానంతో..! అవును దిగ్గజ విమాన తయారీ సంస్థ బోయింగ్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ధ్వని కంటే అయిదు రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్‌సోనిక్ విమానాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రచించింది.
గంటకు 3,800 మైళ్ల వేగంతో ప్రయాణించే విమానాన్ని తయారు చేసేందుకు పూనుకుంది. ఈ విమానంలో న్యూయార్క్ నుంచి లండన్‌కు 120 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. అంటే ప్రపంచాన్ని మూడు గంటల్లో చుట్టి రావచ్చన్నమాట..! విమానం తయారీకి సంబంధించిన ప్రణాళికలు ప్రాథమిక దశలో ఉన్నాయనీ, కొన్ని సాంకేతిక చిక్కు ముడులను అధిగమించాల్సి ఉందని సంస్థ ప్రతినిధి బియానా జాక్సన్ తెలిపారు. బోయింగ్ సంస్థ ప్రయోగాలు ఫలించి హైపర్‌సోనిక్ విమానం గనుక అందుబాటులోకి వస్తే.. ధ్వని కంటే రెండు రెట్లు వేగంగా ప్రయాణించే ఆంగ్లో-ఫ్రెంచ్ విమానం ‘కాంకోర్డ్’ను తలదన్నినదవుతుంది. అయితే, ఈ అద్భుత విమాన సేవలు అందుబాటులోకి రావాలంటే మరో ఇరవై ఏళ్లకు పైగా సమయం పడుతుందట..!
Comments
Please login to add a commentAdd a comment