![India Signs Five Defense Deals Including to Supply BrahMos and Engines for MiG-29 - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/2/defence-deals.jpg.webp?itok=3y9Q1Y__)
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, అత్యాధునిక రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్–29 జెట్ విమానాలకు ఏరో ఇంజిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.39,125 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో ఒకటి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్)తో రెండు, లార్సెన్ అండ్ టూబ్రోతో రెండు ఒప్పందాలు ఉన్నాయి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమానె సమక్షంలో శుక్రవారం ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ‘సైనిక బలగాల పోరాట సామర్థ్యాన్ని మరింత ఇనుమడింప జేసే ఈ ఒప్పందాలు దేశీయ సంస్థల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తాయి. భవిష్యత్తులో విదేశీ పరికరాల తయారీపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి’అని రక్షణశాఖ తెలిపింది. ఒప్పందంలో భాగంగా భారత్– రష్యాల జాయింట్ వెంచర్ బీఏపీఎల్ నుంచి 200 బ్రహ్మోస్ క్షిపణులను రక్షణశాఖ కొనుగోలు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment