ISRO: ‘పుష్పక్‌’ టెస్ట్‌ సక్సెస్‌ | ISRO Successfully Tests 'Pushpak' RLV From Bengaluru | Sakshi
Sakshi News home page

ISRO: విజయవంతంగా ల్యాండ్‌ అయిన ‘పుష్పక్‌’ ఆర్‌ఎల్‌వీ

Published Fri, Mar 22 2024 9:08 AM | Last Updated on Fri, Mar 22 2024 9:23 AM

Isro Successfully Tests Pushpak Rlv From Bengaluru - Sakshi

బెంగళూరు: రీ యూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌(ఆర్‌ఎల్‌వీ) ‘పుష్పక్‌’ను శుక్రవారం(మార్చ్‌ 22) ఉదయం 7 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు పెట్టింది.కర్ణాటకలోని చాలకెరెలోని ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌(ఏటీఆర్‌) నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

పుష్పక్‌ ఆర్‌ఎల్‌వీని తొలుత ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో  వదిలేశారు. ఆ తర్వాత భూమి నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా ముందు నిర్ణయించిన చాలకెరె ఏటీఆర్‌ రన్‌వేపై కచ్చితమైన ప్రదేశంలో పుష్పక్‌ ల్యాండ్‌ అయింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించుకునేందుకుగాను లాంచింగ్‌ రాకెట్‌లను తిరిగి వాడుకునే క్రమంలో ఇస్రో ఆర్‌ఎల్‌వీ ప్రయోగాలను నిర్వహిస్తోంది.

‘పుష్పక్‌ లాంచ్‌ వెహికిల్‌ పై భాగంలో చాలా ఖరీదైన ఎలక్ట్రానిక్  పరికరాలుంటాయి. వీటిని సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురాగలిగితే మళ్లీ వాడుకునేందుకు వీలుంటుంది’అని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. పుష్పక్‌ ఆర్‌ఎల్‌వీలో ఫ్యూసిలేజ్‌(బాడీ), నోస్‌ క్యాప్‌, డబుల్‌ డెల్టా రెక్కలు, ట్విన్‌ వర్టికల్‌ టెయిల్స్‌ భాగాలుంటాయి. 

ఇదీ చదవండి.. ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్లపై సుప్రీం స్టే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement