launching vehicle
-
మనల్నీ మోసుకెళ్తుంది!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భవిష్యత్‌లో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో.. అందుకు తగ్గట్లుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) అని నామకరణం చేసింది. ఇస్రో తొలినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత.. 40 కిలోల నుంచి 5,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం3, ఎస్ఎస్ఎల్వీ అనే ఆరు రకాల రాకెట్లను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. త్వరలో మానవ సహిత ప్రయోగంతో పాటు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిట్‌లోకి, 10 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీని ఇస్రో చేపట్టింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశ అభివృద్ధితో పాటు రాకెట్ భాగాలను రూపొందించేందుకు ఇస్రో కృషి చేస్తోంది. ఎన్జీఎల్వీ రాకెట్‌లోని అన్ని దశలను విడివిడిగా ప్రయోగించి.. పరీక్షించనుంది. 2028 నాటికల్లా మొదటి టెస్ట్ వెహికల్‌ను, దాని సామర్థ్యాన్ని పరీక్షించి.. 2035 నాటికి పూర్తి స్థాయిలో ఎన్జీఎల్వీ రాకెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు.. ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► రాకెట్ వెడల్పు 5 మీటర్లు ► దశల్లోనే రాకెట్ ప్రయోగం ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలో ఎన్జీఎల్వీ రాకెట్‌కు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► క్రయోజనిక్ దశలో 30 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► ఇది ఫాల్కన్ రాకెట్, అట్లాస్–వీ, ప్రోటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ఇటీవల ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 2030–35 నాటికి మానవ సహిత అంతరిక్షయానం, అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. షార్‌లో మూడో లాంచ్‌ప్యాడ్ షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు, 4 వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఎన్జీఎల్వీ కోసం మూడో ప్రయోగ వేదిక అవసరమని ఇస్రో గుర్తించింది. ఇప్పటికే శ్రీహరికోటలో స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. భవిష్యత్‌లో మ్యాన్ ఆన్ ద మూన్ ప్రయోగంతో పాటు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించి.. సురక్షితంగా తీసుకువచ్చే ప్రయో గాలు, చంద్రయాన్–4లో చంద్రుడి మీదకు రోబోను పంపించే ప్రయత్నాలు వంటి ప్రయోగాల కోసం మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమైంది. -
Reusable Launch Vehicle: పుష్పక్.. తగ్గేదేలే!
సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేందుకు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ విషయంలో మరో మైలురాయిని అధిగమించింది. పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ (రాకెట్లు)ను మళ్లీ వినియోగించుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్‌ను ఇస్రో తయారు చేయడమే కాకుండా ముద్దుగా ‘పుష్పక్’ అని పేరు పెట్టుకుంది. ఈ పుష్పక్‌కు సంబంధించి తొలి ధపాలో గతేడాది నిర్వహించిన ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–01 మిషన్ పరీక్ష విజయవంతమైంది. తాజాగా రెండో దఫాలో పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగం సైతం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–02 మిషన్ పరీక్ష నిర్వహించారు. నింగిలోకి పంపిన రాకెట్‌కు స్వయంగా ల్యాండింగ్ సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించారు. పుష్పక్‌ను భారత వైమానిక దళానికి చెందిన చిన్నూక్ హెలీకాప్టర్ ఆకాశంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు వదిలేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, స్వతహాగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారం రన్‌వే మీద పుష్పక్ సురక్షితంగా దిగింది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్‌వీల్ సిస్టమ్ సాయంతో పుష్పక్ తనంతట తానే వచ్చి నిలిచిపోవడం గమనార్హం. పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందాన్ని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అభినందించారు. -
ISRO: ‘పుష్పక్’ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: రీ యూజబుల్ లాంచ్ వెహికిల్(ఆర్ఎల్వీ) ‘పుష్పక్’ను శుక్రవారం(మార్చ్ 22) ఉదయం 7 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది.కర్ణాటకలోని చాలకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. పుష్పక్ ఆర్ఎల్వీని తొలుత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో వదిలేశారు. ఆ తర్వాత భూమి నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా ముందు నిర్ణయించిన చాలకెరె ఏటీఆర్ రన్‌వేపై కచ్చితమైన ప్రదేశంలో పుష్పక్ ల్యాండ్ అయింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించుకునేందుకుగాను లాంచింగ్ రాకెట్లను తిరిగి వాడుకునే క్రమంలో ఇస్రో ఆర్ఎల్వీ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ‘పుష్పక్ లాంచ్ వెహికిల్ పై భాగంలో చాలా ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలుంటాయి. వీటిని సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురాగలిగితే మళ్లీ వాడుకునేందుకు వీలుంటుంది’అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. పుష్పక్ ఆర్ఎల్వీలో ఫ్యూసిలేజ్(బాడీ), నోస్ క్యాప్, డబుల్ డెల్టా రెక్కలు, ట్విన్ వర్టికల్ టెయిల్స్ భాగాలుంటాయి. Pushpak captured during its autonomous landing📸 pic.twitter.com/zx9JqbeslX — ISRO (@isro) March 22, 2024 ఇదీ చదవండి.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్లపై సుప్రీం స్టే -
జీఎస్ఎల్వీ–ఎఫ్14 సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జియో సింక్రనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్14) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 27.30 గంటల అనంతరం నిర్దేశిత సమయానికి రాకెట్ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగంలోని మొత్తం మూడు దశలు విజయవంతమయ్యాయి. 2,275 కిలోల బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు(పెరిజీ), భూమికి దూరంగా 36,647 కిలోమీటర్ల(అపోజీ) జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఇన్శాట్–3డీఎస్‌లో నింపిన 1,250 కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండించి, మరో రెండు మూడు రోజుల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్(భూ స్థిరకక్ష్య)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. ఏమిటీ ఇన్శాట్–3డీఎస్? దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు, విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది. దీంతో వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత రానుంది. ఇన్శాట్–3, ఇన్శాట్–3ఆర్ ఉపగ్రహాలకు అనుసంధానంగా మూడో తరం ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహం పని చేస్తుంది. ఇప్పటిదాకా ఇన్శాట్ శ్రేణిలో 23 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ శాటిలైట్లకు కొనసాగింపుగా ఇన్శాట్–3డీఎస్‌ని అభివృద్ధి చేశారు. ఇందులో ఆరు చానెల్ ఇమేజర్స్, 19 చానెల్ సౌండర్స్తోపాటు మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను అమర్చారు. వాతావరణ పరిశీలనతోపాటు భూమి, సముద్ర ఉపరితలాల అధ్యయనం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా సేవలు అందించనుంది. త్వరలో నిస్సార్ ప్రయోగం: సోమనాథ్ నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్(నిస్సార్) మిషన్ అనే జాయింట్ ఆపరేషన్ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జూన్‌లో జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. పీఎస్ఎల్వీ–సీ59, ఎస్ఎస్ఎల్వీ–డి3, జీఎస్ఎల్వీ–ఎఫ్15 ప్రయోగాలతో పాటు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ఆర్ఎల్వీ–టీడీ–2 ప్రయోగం కూడా నిర్వహించబోతున్నట్లు ఎస్.సోమనాథ్ తెలిపారు. -
Next Generation Launch Vehicle: ఇస్రో అమ్ములపొదిలో ఎన్జీఎల్వీ!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో, అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)గా నామకరణం చేశారు. తొలి నాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఏస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం03, ఎస్ఎస్ఎల్వీ... ఇలా ఆరు రకాల రాకెట్లను ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ది చేసింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవసహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్నీ చేపట్టాలని భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ కక్ష్యలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా 20 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో అర్బిట్‌లోకి, 10 వేల కిలోల ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీకి ఇస్రో తెర తీసింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశను అభివృద్దితో పాటు రాకెట్ విడి భాగాలను దేశీయంగానే రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 6న ‘ఎల్పీ1’ వద్దకు ఆదిత్య ఎల్1: సౌర ప్రయోగాల నిమిత్తం గత సెపె్టంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం జనవరి 6 సాయంత్రం సూర్యుడికి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ 1ను చేరనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ పాయింట్‌ను చేరాక సూర్యుని రహస్యాలను అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యు డి వెలుపలి వలయమైన కరోనాపై అధ్యయనాలు చేయనున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు... ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► వెడల్పు 5 మీటర్లు. ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలోనే దీనికీ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. ► ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులు ► రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగిస్తారు. ► ఇది ఫాల్కన్, అట్లాస్–వీ, ప్రొటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ► ఇస్రో ౖచైర్మన్ సోమ నాథ్ ఇటీవలే ఎన్జీఎల్వీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ► 2030–35 నాటికి మానవ అంతరిక్ష యానం, అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. -
సొంత అంతరిక్ష విమానం.. కల సాకారానికి అడుగు దూరంలో భారత్..
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పునర్వినియోగ ప్రయోగ వాహనం ల్యాండింగ్‌ను ఆదివారం విజయవంతంగా చేపట్టింది. దీంతో భారత్ తన సొంత అంతరిక్ష విమానం కలకి ఒక అడుగు దూరంలో నిలిచినట్లయింది. ఏప్రిల్ 2న తెల్లవారుజామున కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుంచి చినూక్ హెలికాప్టర్ ద్వారా ఈ వ్యోమనౌక అండర్స్లాంగ్గా బయలుదేరింది. దీనిని గాలిలో వదిలేయడానికి ముందు 4.6 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ పునర్వినియోగ ప్రయోగ వాహనం(RLV) ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్ & కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగించి అప్రోచ్, ల్యాండింగ్ విన్యాసాలను ప్రదర్శించింది. ఉదయం 7:40 గంటలకు ATR ఎయిర్ స్ట్రిప్‌లో స్వయంప్రతిపత్త ల్యాండింగ్‌ను పూర్తి చేసింది. RLV's autonomous approach and landing pic.twitter.com/D4tDmk5VN5 — ISRO (@isro) April 2, 2023 'స్పేస్ రీ-ఎంట్రీ వాహనం ల్యాండింగ్ లాగా ఖచ్చితమైన పరిస్థితులలో ఈ స్వయంప్రతిపత్త ల్యాండింగ్ జరిగింది. అతివేగం, మానవరహిత, అదే తిరుగు మార్గంలో వాహనం అంతరిక్షం నుండి వచ్చినట్లుగా ల్యాండ్ చేశాం. ప్రయోగం విజయవంతమైంది' అని ఇస్రో తెలిపింది. అంతరిక్షంలోకి తక్కువ ఖర్చుతో చేరుకునేందుకు పూర్తిగా పునర్వినియోగ ప్రయోగ వాహనం కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ప్రయోగం నిర్వహించింది. RLV కాన్ఫిగరేషన్ ఒక విమానం వలె ఉంటుంది. ప్రయోగ వాహనాలు, విమానం రెండింటి సంక్లిష్టతను మిళితం చేస్తుంది. చదవండి: ఏప్రిల్ 4 వరకు అక్కడ స్కూళ్లు బంద్.. కారణమిదే..! -
హైదరాబాద్‌లో ఫోర్స్ అర్బానియా
హైదరాబాద్: ఆటోమొబైల్ సంస్థ ఫోర్స్ మోటర్స్ తాజాగా తమ అర్బానియా వాహనాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ కోచ్ బిల్డర్స్ ఎండీ సుదీప్ మచా 7 వాహనాలను కొనుగోలుదారులకు అందజేశారు. దీని ధర శ్రేణి రూ. 28.99 లక్షల నుంచి రూ. 31.25 లక్షల వరకు ఉంటుంది. 10, 13, 17 సీటింగ్ సామర్థ్యాల వేరియంట్లలో ఈ వాహనం లభిస్తుంది. అర్బానియా వాహనాల ఉత్పత్తి కోసం అధునాత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, ఇందుకోసం రూ. 1,000 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది. -
SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం విఫలం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ1) ప్రయోగం విఫలమయ్యింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్‌ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. మైక్రోశాట్–2ఏ (ఈఓఎస్శాట్)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్‌ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. మొదటి మూడు దశలు ముందస్తు ప్రణాళిక ప్రకారం సక్రమంగానే పూర్తయ్యాయి. నాలుగో దశ నుంచి మిషన్ కంట్రోల్ సెంటర్‌కు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. రెండు ఉపగ్రహాల నుంచి కూడా గ్రౌండ్స్టేషన్కు సంకేతాలు అందకపోవడం ఉత్కంఠకు గురిచేసింది. తొలి మూడు దశలు విజయవంతం ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగానికి ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఏడు గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగింది. సరిగ్గా ఉదయం 9.18 గంటలకు ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగివైపు ప్రయాణం కొనసాగించింది. అప్పుడే కురుస్తున్న వర్షపు జల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలను చీల్చుకుంటూ తొలి మూడు దశల్లో విజయవంతంగా ప్రయాణం సాగించింది. నాలుగో దశలో రాకెట్ రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిపెట్టిన వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్లో సూది పడినా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. శాస్త్రవేత్తలంతా కంప్యూటర్ల వైపు ఉత్కంఠగా చూడడం ప్రారంభించారు. ఇంతలోనే ఏదో అపశుతి చోటు చేసుకున్నట్లు గుర్తించారు. పనిచేయని సెన్సర్లు.. అందని సిగ్నల్స్ రాకెట్లో నాలుగు దశలూ అద్భుతంగా పనిచేశాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన మాట్లాడారు. మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్లను 13.2 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఉపగ్రహాలకు ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా విచ్చుకున్నాయని చెప్పారు. అయితే, ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరుకోవడంతో వాటిలోని సెన్సర్లు పనిచేయక సిగ్నల్స్ అందలేదని పేర్కొన్నారు. వృత్తాకార కక్ష్యలోకి కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించడంతో సెన్సార్లు పనిచేయక గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందకుండా పోయాయని వివరించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఎస్.సోమనాథ్ అభినందనలు తెలిపారు. రాకెట్ ప్రయోగమంతా సక్సెస్ అయినట్టేనని, ఆఖర్లో ఉపగ్రహాలు చేరుకున్న కక్ష్య దూరంలో తేడా రావడంతో చిన్నపాటి ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. వీలైనంత త్వరగానే.. అంటే వచ్చే నెలలో ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సిద్ధం కాబోతున్నామని ప్రకటించారు. ఇప్పుడు చోటుచేసుకున్న ఈ చిన్నపాటి లోపాలను సరిచేసుకుంటామని, మరో ప్రయోగంలో కచ్చితంగా విజయం సా«ధించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఇస్రో మాజీ చైర్మన్లు కె.రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్‌కుమార్, కె.శివన్ తదితరులు విచ్చేసి, ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగాన్ని వీక్షించారు. ఆ ఉపగ్రహాలు ఇక పనిచేయవు నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా మరో కక్ష్యలోకి ప్రవేశించిన మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్ ఉపగ్రహాలు ఇక పనిచేయవని, వాటితో ఉపయోగం లేదని ఇస్రో తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రస్తుతం జరిగిన పొరపాటును శాస్త్రవేత్తల కమిటీ విశ్లేషించనుందని పేర్కొంది. ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగంలో ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని వెల్లడించింది. ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ రెండు శాటిలైట్లను 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, 356 కిలోమీటర్లు x 76 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో తెలియజేసింది. -
మొదటి ఓలా స్కూటర్ ఇదే... ఓ లుక్కేయ్యండి !
ప్రీ బుకింగ్స్‌తోనే వరల్డ్ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ లుక్‌ని ఆ కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ రివీల్ చేశారు. తమిళనాడులో ఉన్న ఫ్యాక్టరీలో తయారైన మొట్ట మొదటి ఓలా మొదటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఫిబ్రవరిలో స్కూటర్ తయారీ పనులు మొదలు పెట్టామని, కంపెనీ ఉద్యోగులు ఎంతో శ్రమించి ఈ స్కూటర్ని తయారు చేశారని ఆయన వెల్లడించారు. పెట్రోలు ధరల పెరుగుదలతో ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్న వారికి ఓలా ఊరట ఇచ్చింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ స్కూటర్‌కి సంబంధించిన ఒక్కో ఫీచర్‌ని ట్విట్టర్ ద్వారా భవీష్ అగర్వాల్ వెల్లడిస్తూ వస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ స్కూటర్‌కి సంబంధించిన అన్ని వివరాలను ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నారు. Built the first scooter in our Futurefactory today! From barren land in Feb to this in under 6 months despite a pandemic!! The @OlaElectric team is just amazing❤️👍🏼 pic.twitter.com/B0grjzWwVC — Bhavish Aggarwal (@bhash) August 14, 2021 -
30న జీశాట్-7 ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపగ్రహ సేవలు అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 30న ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి మొట్టమొదటగా జీశాట్-7 అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. 2,550 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచి అంతరిక్ష సంస్థకు చెందిన అరైన్-వీఏ215 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా పంపేందుకు సిద్ధమైంది. ఈ తరహా సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో జియోసింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ) ఉపగ్రహ వాహకనౌకను రూపొందించింది. ఈ రాకెట్ సాంకేతిక పరిజ్ఞానంలో కాస్త వెనుకబడి ఉండటంతో అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచి అంతరిక్ష సంస్థ వారి సహకారంతోనే ప్రయోగిస్తున్నారు. ఈ నెల 19న చేపట్టిన జీఎస్ఎల్వీ డీ-5 ద్వారా జీశాట్-14ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేయగా.. చివరి గంటలో సాంకేతికలోపంతో ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇస్రో ఇప్పటి దాకా 23 సమాచార ఉపగ్రహాలను ప్రయోగించింది. 24వ ఉపగ్రహాన్ని ఈ నెల 30న ప్రయోగించనుంది. దేశరక్షణ వ్యవస్థకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించేందుకు మల్టిపుల్ బాండ్ ఆల్ట్రా హై ఫ్రీక్వెన్సీతో కూడిన ఎస్-బాండ్, సీ-బాండ్, హై క్వాలిటీ కేయూ-బాండ్ అనే సాంకేతిక పరికరాలను ఉపగ్రహంలో అమర్చిపంపుతున్నారు. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులో ఉన్న ఐసాక్ కేంద్రం, అహ్మదాబాద్‌లోని స్పేస్ అఫ్లికేషన్ సెంటర్ వారు రూపొందించారు.