బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పునర్వినియోగ ప్రయోగ వాహనం ల్యాండింగ్‌ను ఆదివారం విజయవంతంగా చేపట్టింది. దీంతో భారత్ తన సొంత అంతరిక్ష విమానం కలకి ఒక అడుగు దూరంలో నిలిచినట్లయింది. ఏప్రిల్ 2న తెల్లవారుజామున కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుంచి చినూక్ హెలికాప్టర్ ద్వారా ఈ వ్యోమనౌక అండర్‌స్లాంగ్‌గా బయలుదేరింది. దీనిని గాలిలో వదిలేయడానికి ముందు 4.6 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లారు.
ఈ పునర్వినియోగ ప్రయోగ వాహనం(RLV) ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్ & కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగించి అప్రోచ్, ల్యాండింగ్ విన్యాసాలను ప్రదర్శించింది. ఉదయం 7:40 గంటలకు ATR ఎయిర్ స్ట్రిప్‌లో స్వయంప్రతిపత్త ల్యాండింగ్‌ను పూర్తి చేసింది.
RLV's autonomous approach and landing pic.twitter.com/D4tDmk5VN5
— ISRO (@isro) April 2, 2023
'స్పేస్ రీ-ఎంట్రీ వాహనం ల్యాండింగ్ లాగా ఖచ్చితమైన పరిస్థితులలో ఈ స్వయంప్రతిపత్త ల్యాండింగ్ జరిగింది. అతివేగం, మానవరహిత, అదే తిరుగు మార్గంలో వాహనం అంతరిక్షం నుండి వచ్చినట్లుగా ల్యాండ్ చేశాం. ప్రయోగం విజయవంతమైంది' అని ఇస్రో తెలిపింది.
అంతరిక్షంలోకి తక్కువ ఖర్చుతో చేరుకునేందుకు పూర్తిగా పునర్వినియోగ ప్రయోగ వాహనం కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ప్రయోగం నిర్వహించింది. RLV కాన్ఫిగరేషన్ ఒక విమానం వలె ఉంటుంది. ప్రయోగ వాహనాలు, విమానం రెండింటి సంక్లిష్టతను మిళితం చేస్తుంది.
చదవండి: ఏప్రిల్ 4 వరకు అక్కడ స్కూళ్లు బంద్.. కారణమిదే..!
Comments
Please login to add a commentAdd a comment