reusable
-
రీయూజబుల్ రాకెట్.. రూమీ-1 సక్సెస్
-
పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/సాక్షి, బెంగళూరు: గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరసగా మూడోసారీ విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఆదివారం ప్రకటించింది. రీ యూజబుల్ లాంఛ్ వెహికల్(ఆర్ఎల్వీ) అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సముపార్జించిందని ఈ ప్రయోగం మరోసారి నిరూపించింది. ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా రావడం, ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండ్ అవడం వంటి పరామితులను పుష్పక్‌గా పిలుచుకునే ఈ ఆర్ఎల్వీ ఖచి్చతత్వంతో సాధించిందని ఇస్రో ఆదివారం పేర్కొంది. ల్యాండింగ్ ఎక్స్పరిమెంట్(ఎల్ఈఎక్స్–03) సిరీస్‌లో మూడోది, చివరిదైన ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇస్రో వారి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో జరిపారు. మొదట పుష్పక్‌ను భారత వాయుసేకు చెందిన చినూక్ హెలికాప్టర్లో రన్‌వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్‌వే వైపు ఖచి్చతత్వంతో దూసుకొచ్చి అతి గాలులున్న ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండ్ అయింది. తక్కువ ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్ సమయంలో దాని వేగం గంటకు 320 కి.మీ.లు పెరిగింది. సాధారణంగా ల్యాండింగ్ జరుగుతున్నపుడు వాణిజ్య విమానం గంటకు 260 కి.మీ.లు, యుద్ధవిమానమైతే గంటకు 280 కి.మీ.ల వేగంతో ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ కాగానే బ్రేక్ పారాచూట్ విచ్చుకోవడంతో పుష్పక్ వేగం గంటకు 100 కి.మీ.లకు తగ్గిపోయింది. ల్యాండింగ్ గేర్ బ్రేకులు వేయడంతో పుష్పక్ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్ స్వయంచాలిత రడ్డర్, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థలను సరిగా వాడుకుందని ఇస్రో పేర్కొంది. -
Reusable Launch Vehicle: పుష్పక్.. తగ్గేదేలే!
సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేందుకు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ విషయంలో మరో మైలురాయిని అధిగమించింది. పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ (రాకెట్లు)ను మళ్లీ వినియోగించుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్‌ను ఇస్రో తయారు చేయడమే కాకుండా ముద్దుగా ‘పుష్పక్’ అని పేరు పెట్టుకుంది. ఈ పుష్పక్‌కు సంబంధించి తొలి ధపాలో గతేడాది నిర్వహించిన ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–01 మిషన్ పరీక్ష విజయవంతమైంది. తాజాగా రెండో దఫాలో పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగం సైతం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–02 మిషన్ పరీక్ష నిర్వహించారు. నింగిలోకి పంపిన రాకెట్‌కు స్వయంగా ల్యాండింగ్ సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించారు. పుష్పక్‌ను భారత వైమానిక దళానికి చెందిన చిన్నూక్ హెలీకాప్టర్ ఆకాశంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు వదిలేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, స్వతహాగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారం రన్‌వే మీద పుష్పక్ సురక్షితంగా దిగింది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్‌వీల్ సిస్టమ్ సాయంతో పుష్పక్ తనంతట తానే వచ్చి నిలిచిపోవడం గమనార్హం. పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందాన్ని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అభినందించారు. -
ISRO: ‘పుష్పక్’ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: రీ యూజబుల్ లాంచ్ వెహికిల్(ఆర్ఎల్వీ) ‘పుష్పక్’ను శుక్రవారం(మార్చ్ 22) ఉదయం 7 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది.కర్ణాటకలోని చాలకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. పుష్పక్ ఆర్ఎల్వీని తొలుత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో వదిలేశారు. ఆ తర్వాత భూమి నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా ముందు నిర్ణయించిన చాలకెరె ఏటీఆర్ రన్‌వేపై కచ్చితమైన ప్రదేశంలో పుష్పక్ ల్యాండ్ అయింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించుకునేందుకుగాను లాంచింగ్ రాకెట్లను తిరిగి వాడుకునే క్రమంలో ఇస్రో ఆర్ఎల్వీ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ‘పుష్పక్ లాంచ్ వెహికిల్ పై భాగంలో చాలా ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలుంటాయి. వీటిని సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురాగలిగితే మళ్లీ వాడుకునేందుకు వీలుంటుంది’అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. పుష్పక్ ఆర్ఎల్వీలో ఫ్యూసిలేజ్(బాడీ), నోస్ క్యాప్, డబుల్ డెల్టా రెక్కలు, ట్విన్ వర్టికల్ టెయిల్స్ భాగాలుంటాయి. Pushpak captured during its autonomous landing📸 pic.twitter.com/zx9JqbeslX — ISRO (@isro) March 22, 2024 ఇదీ చదవండి.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్లపై సుప్రీం స్టే -
ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?
ఇటీవల కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ మంచిదికాదని స్టీల్ లేదా రాగి వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ ఉంటే ఒక రకమైన వాసన రావడమే గాక ఆరోగ్యానికి పర్యావరణానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో విరివిగా మార్కెట్లోకి వస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ వాడుతున్నారు చాలామంది. ఇలాంటి పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌ని ఉపయోగించేటప్పుడ తగు జాగ్రత్తుల తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయం. అందుకు నెట్టింట వైరల్ అవుతున్న.. యూఎస్ఏకి చెందిన మహిళ ఉదంతమే ఉదహారణ. ఆమె ఈ పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌తో ఎలా అనారోగ్యం పాలైందో టిక్‌టాక్‌లో వివరించింది. మీరు కూడా ఆమెలానే చేస్తున్నట్లయితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకన్నట్లే అవుతుంది. అందువల్ల ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో సదరు మహిళ.. ఇలాంటి పునర్వినయోగ స్టెయిన్ లెస్ బాటిల్స్‌నే తాను వాడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తనకు ఒక రోజు ఉన్నట్లు జలుబు చేసిందిని, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నాక తగ్గింది మళ్లీ రెండు రోజులకే జలుబు, దగ్గు రెండు విపరీతంగా వచ్చాయి. దీంతో డాక్టర్లను సంప్రదించి యాంటీబయోటిక్ మందులు వాడింది. త్వరితగతినే కోలుకుంది కూడా. అయితే మళ్లీ వారం రోజులకే మళ్లీ సైనస్ వంటి లక్షణాలతో జలబు రావడం జరిగింది. తనకు జలుబు చేయడం అన్నదే చాలా అరుదు అలాంటిది ఇలా తరచుగా ఒక నెలలోనే రెండు మూడు సార్లు జలుబున బారిన పడుతున్నానేంటీ ఏమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నాయా అని భయపడింది. దీంతో సమస్య ఎక్కడ ఉందా అని చెక్చేసుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర నుంచి తీసుకునే ఆహార పదార్థల వరకు ఎక్కడ తలెత్తుంది ఈ సమస్య, దేనివల్ల తనకు ఇలా అయ్యిందని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా..తాగే వాటర్ సురక్షితంగా ఉందా లేదా అన్న ఆలోచన తట్టింది. వెంటనే బాటిల్స్ అన్ని చెక్‌చేయగా ఆమె తాగే వాటర్ బాటిల్ అడుగున నాచులా ఆకుపచ్చిన బూజు(శిలింధ్రం) ఉండటం చూసి అవాక్కయ్యింది. అన్ని శుభ్రంగా ఉంచే నేను బాటిల్స్ మాత్ర అస్సలు క్లీన్ చేయడం లేదని తెలిసింది. బహుశా దీని వల్ల ఇన్నిసార్లు జలుబు బారిన పడ్డానని అర్థమయ్యే తక్షణమే వాటిని క్లీన్ చేసినట్లు వివరించింది. ఈ విషయాన్నే వైద్యులకు తెలపగా, వారు కూడా ఇలాంటి ఆకుపచ్చ నాచు కారణంగా ఫుడ్ పాయిజినింగ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి పలు రకాల ఇన్పెక్షన్లు వస్తాయని చెప్పారు. తాగే నీరు, తీసుకునే ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని సూచించారని పేర్కొంది. ఈ స్టీల్ బాటిల్స్ పర్యావరణానికి హితమైనప్పటికీ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే తనలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని చెబుతోంది సదరు మహిళ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. ఏ బాటిల్ అయినా దానిలో వాటర్ అలానే ఉండిపోతే కచ్చితంగా కింద బాటిట్ అడుగుభాగన జిగురులాంటి సిలికాన్ మాదిరి పదార్థం ఏర్పడుతుంది. కొద్దిరోజులక ఆకుపచ్చని బూజులాంటి శిలిధ్రం ఫామ్ అయ్యిపోతుంది. మనం అందులో ఉన్న నీటిని అలాగే తాగితే ముందుగా గొంతునొప్పి, జలుబు వంటి అనారోగ్యాల బారిన పడతాం. తరుచుగా జలుబుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాటిల్స్‌ని కనీసం మూడు లేదా ఐదు రోజుల కొకసారి వేడినీటితో క్లీన్ చేసుకోవాలి లోపల జిగురు వంటి సిలాకాన్లాంటి పదార్థం రాకుండా మార్కెట్లో దొరికే బ్రెష్‌తో క్లన్ చేసుకోవాలి. తాగే బాటిల్ బాగుందో లేదో కూడా చెక్‌చేసుకుని తాగండి ఏ బాటిల్లోనైన నీరు నిశ్చలంగా మూడు నుంచి నాలుగు రోజులు ఉండిపోతే ఒక విధమైన వాసన వస్తుంది. ఇలాంటి వాటర్ అత్యంత ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు బాటిల్లో ఎక్కువకాలం నిల్వ ఉండే వాటర్‌ని తాగొద్దు, వాటిని ఎప్పిటికప్పుడూ లేదా కనీసం మూడు నుంచి నాలుగురోజుల కొకసారి క్లీన్ చేసుకుని తాగేందుకు యత్నించండి. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?) -
ఆర్ఎల్వీ పరీక్ష విజయవంతం
సూళ్ళూరుపేట/సాక్షి బెంగళూరు: గగన్‌యాన్ ప్రాజెక్టు పరిశోధనా పరీక్షల్లో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటనామస్ ల్యాండింగ్ మిషన్(ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్) రాకెట్ ప్రయోగ పరీక్షలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కుందాపురం సమీపంలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్)లో ఈ పరీక్ష చేపట్టారు. భారత వైమానిక దళానికి సంబంధించిన చినోక్ అనే హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ రాకెట్‌ను ఉదయం 7.10 గంటలకు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్లోని మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కమాండ్ ఆధారంగా రాకెట్ తిరిగి 7.40 గంటలకు భూమిపై నిర్దేశిత ప్రాంతంలో క్షేమంగా ల్యాండయ్యింది. ముందస్తుగా సిద్ధం చేసి రూపొందించిన నేవిగేషన్, గైడెన్స్, నియంత్రణ వ్యవస్థల సహాయంతో ఈ మానవ రహిత లాంచింగ్ వాహనం ఎలాంటి ఆటంకం లేకుండా భూమిపైకి చేరింది. ఈ ప్రయోగంలో ఇస్రోతోపాటు డీఆర్డీవో, భారత వైమానిక దళం కూడా భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ లాంటి రాకెట్‌ను ఆకా«శంలో వదిలి, తిరిగి విజయవంతంగా భూమి మీదకు చేర్చిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆర్ఎల్వీ ప్రాజెక్టు నిర్వహణ బృందాన్ని ఆయన అభినందించారు. 2016 మే 23న ఆర్ఎల్వీ–టీడీ పేరుతో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఆఖరుకు గగన్‌యాన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించిన ఇస్రోకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రయోగ రాకెట్ ల్యాండ్ అయిన దృశ్యం -
డిసెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యం పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైస్ కార్డు ఉన్న పేదలకు నాణ్యమైన సోర్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 9,260 ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. బియ్యం సరఫరాకు గాను ప్రభుత్వం రీయూజబుల్ సంచులను పంపిణీ చేయనుంది. -
మహమ్మా...చైతన్యం భేషమ్మా!
కేరళ అంటేనే సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. ఆ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లా మహమ్మా గ్రామంలో మహిళల్లో చైతన్యం చూస్తే నగర యువతులు ఎంత వెనుకబడ్డారో అర్థమవుతుంది. మహిళల్లో నెలనెల వచ్చే రుతుస్రావం గురించి బహిరంగంగా మాట్లాడటానికే సంకోచించే సమాజం మనది. అలాంటిది ఆ గ్రామం మాత్రం రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రం గురించి, ప్లాస్టిక్ శానిటరీ న్యాప్కిన్స్ వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి గొంతెత్తి మాట్లాడుతోంది. ఆ గ్రామంలో 700 మంది వరకు మహిళలు ఉంటారు. వారిలో 500 మంది హ్యాపీ పీరియడ్ గురించి ఆలోచన చేస్తున్నారు. శానిటరీ న్యాప్‌కిన్స్‌కి బదులుగా మెనుస్ట్రల్ కప్స్, క్లాత్ ప్యాడ్స్ వాడితే ఎంత సౌకర్యంగా ఉంటుందో తెలుసుకొని తమ అలవాట్లను మార్చుకున్నారు. ఆ ఊరు గ్రామ పంచాయతీ మహమ్మోద్యమం పేరుతో రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన పెంచుతోంది. ఇలా ఆ గ్రామాన్ని మార్చడానికి బెంగళూరుకు చెందిన ఏటీఆర్ఈఈ చొరవ కూడా చాలా ఉంది. అరటి చెట్టు వ్యర్థాలు, పత్తి వంటివి వినియోగించి ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు తయారు చేసిన ఈ రీ యూజబుల్ ప్యాడ్స్‌ను ఆ గ్రామంలో పంచిపెట్టారు. మన యువత ఏ ఆవిష్కరణలోనైనా గో గ్రీన్ అన్న కాన్సెప్ట్‌ని చూస్తూ ముందుకు సాగుతోంది. -
నీటిబొట్టు.. ఒడిసి పట్టు!
పుణే : నగరంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మురుగునీటిని శుద్ధిచేసి తిరిగి వినియోగించుకోవాలని యోచిస్తోంది. ‘సాధారణంగా మన వాడుక నీటిలో 69 శాతం గ్రే వాటర్, 31 శాతం బ్లాక్ వాటర్ ఉంటాయి. బ్లాక్ వాటర్ నుంచి మురుగు నీరును వేరుచేసి శుద్ధి చేయగలిగితే శుద్ధి చేసేందుకు అయ్యే వ్యయాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు’ అని పీఎంసీ కార్పొరేటర్లు, అధికారులు అంటున్నారు. నగరంలోని 67వ వార్డు (సహకర్‌నగర్) కార్పొరేటర్ అబా బాగుల్ మాట్లాడుతూ ప్రాజెక్టు ఏర్పాటుకు గల ఆవశ్యకతను కార్పొరేషన్ అధికారులు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘వంటగదిలో, షవర్లు, వాషింగ్ మిషన్ల వాడకం ద్వారా మురుగు నీరు వస్తుంది. నివాస గృహాల్లో వినియోగం వల్ల విడుదలైన నీటిలో 50 -80 శాతం వ్యవసాయానికి, మరుగుదొడ్లు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది’ అని నిపుణులు చెబుతున్నారు. ‘మరుగుదొడ్లలో మురుగు నీరును తిరిగి వినియోగించుకునేందుకు అదనపు పైపులు, పంపులు, నిల్వ ట్యాంకు, శుద్ధి కేంద్రం ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని..’ అని వారు చెప్పారు. ‘మురుగు నీరు పునర్వినియోగ కేంద్రం ఏర్పాటుకు పీఎంసీ చాలా ఉత్సాహంగా ఉంది. ఒకసారి 67వ వార్డులో దీన్ని ఏర్పాటుచేసిన తర్వాత, నగరంలోని మిగిలిన వార్డుల్లో కూడా ఇటువంటి ప్లాంట్లు ఏర్పాటుకు స్థానికులు ముందుకు వస్తారనే నమ్మకం ఉంది..’ అని కార్పొరేటర్ బాగుల్ చెప్పారు. నీటి పునర్వినియోగ కేంద్రాల ఏర్పాటు వల్ల నగరంలో నీటి సమస్య కొంతవరకు తీరవచ్చన్నారు. ముఖ్యంగా వేసవిలో నీటిఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇదే సరైన మార్గమన్నారు. మొక్కల పెంపకం, కార్లు కడగడానికి తదితర పనులకు మంచినీటికి బదులు ఈ నీటిని వాడుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిసమస్యను ఎదుర్కొనేందుకు మురుగు నీరు పునర్వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పీఎంసీ అధికారులు చెబుతున్నారు. జల శుద్ధీకరణ కేంద్రానికి నిధులు పుణే: రూ. 12 కోట్ల విలువైన వద్గావ్ జల శుద్ధీకరణ ప్రాజెక్టు నిర్మాణానికి పుణే మున్సిపల్ కార్పొరేషన్‌లోని స్థాయీ సమితి రూ. 11 కోట్లు మంజూరు చేసింది. 125 ఎంఎల్డీ నీటిని శుద్ధిచేయగల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ సాయంతో కార్పొరేషన్ నిర్మించనుంది.