మహమ్మా...చైతన్యం భేషమ్మా! | 500 Women In Kerala Village Made Menstrual Cups For a Green Future | Sakshi
Sakshi News home page

మహమ్మా...చైతన్యం భేషమ్మా!

Published Sun, Jan 12 2020 3:26 AM | Last Updated on Sun, Jan 12 2020 8:03 AM

500 Women In Kerala Village Made Menstrual Cups For a Green Future - Sakshi

కేరళ అంటేనే సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం.  ఆ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లా మహమ్మా గ్రామంలో మహిళల్లో చైతన్యం చూస్తే నగర యువతులు ఎంత వెనుకబడ్డారో అర్థమవుతుంది. మహిళల్లో నెలనెల వచ్చే రుతుస్రావం గురించి బహిరంగంగా మాట్లాడటానికే సంకోచించే సమాజం మనది. అలాంటిది ఆ గ్రామం మాత్రం రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రం గురించి, ప్లాస్టిక్‌ శానిటరీ న్యాప్‌కిన్స్‌ వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి గొంతెత్తి మాట్లాడుతోంది. ఆ గ్రామంలో 700 మంది వరకు మహిళలు ఉంటారు. వారిలో 500 మంది హ్యాపీ పీరియడ్‌ గురించి ఆలోచన చేస్తున్నారు. శానిటరీ న్యాప్‌కిన్స్‌కి బదులుగా మెనుస్ట్రల్‌ కప్స్, క్లాత్‌ ప్యాడ్స్‌ వాడితే ఎంత సౌకర్యంగా ఉంటుందో తెలుసుకొని తమ అలవాట్లను మార్చుకున్నారు. ఆ ఊరు గ్రామ పంచాయతీ మహమ్మోద్యమం పేరుతో రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన పెంచుతోంది. ఇలా ఆ గ్రామాన్ని మార్చడానికి బెంగళూరుకు చెందిన ఏటీఆర్‌ఈఈ చొరవ కూడా చాలా ఉంది. అరటి చెట్టు వ్యర్థాలు, పత్తి వంటివి వినియోగించి ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు తయారు చేసిన ఈ రీ యూజబుల్‌ ప్యాడ్స్‌ను ఆ గ్రామంలో పంచిపెట్టారు. మన యువత ఏ ఆవిష్కరణలోనైనా గో గ్రీన్‌ అన్న కాన్సెప్ట్‌ని చూస్తూ ముందుకు సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement