ladies
-
జార్ఖండ్ ఎన్నికలు: 32 సీట్లలో ‘లేడీస్ ఫస్ట్’
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అంతకంతకూ ఆసక్తిరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్యనే ఉంది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈసారి మహిళలే కీలకం కానున్నారు. ఓటర్ల జాబితా లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. ఈ 32 స్థానాల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. జార్ఖండ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.60 కోట్లు. వీరిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న స్థానాలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మహిళల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత హేమంత్ సోరెన్ ప్రభుత్వం మహిళల కోసం ‘మయ్యా సమ్మాన్ యోజన’ను అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు. మరోమారు తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని నెలకు రూ.2500కు పెంచుతామని ఇటీవల సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.ఎన్డీఏలో మొత్తం 14 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉండగా ఏజేఎస్‌యూలో ఇద్దరు మహిళా అభ్యర్థులు టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇండియా కూటమిలో మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.ఇది కూడా చదవండి: స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి -
ఫ్యాషన్ ఐకాన్ లేడీస్ : నీతా అంబానీ, ఇషా, శ్లోకా మెహతా (ఫోటోలు)
-
మహిళామణులకు ఉచిత ప్రయాణం షురూ..
సాక్షి, మహబూబ్‌నగర్: 'రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల హామీలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమలుకానుంది. వయస్సుతో సంబంధం లేకుండా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా రాష్ట్ర పరిధిలో ఎక్కడికై నా ప్రయాణం చేయవచ్చు.' రీజియన్ పరిధిలో.. మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ 10 డిపోల్లోని 845 బస్సుల్లో ప్రతిరోజు 2.50 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. వీరిలో దాదాపు 75–80 వేల మంది మహిళలు రాకపోకలు సాగిస్తారు. రీజియన్‌లో పల్లె వెలుగు 467, ఎక్స్‌ప్రెస్ 263 బస్సులు ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి బాలికలు, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో మహిళలు స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాలి. అయితే ఆర్టీసీ బస్సుల్లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం లభించడంతో మధ్య తరగతి ప్రజలకు కొంత ప్రయాణ ఆర్థికభారం తగ్గనుంది. ఆర్థికభారం తగ్గుతుంది.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దీంతో మధ్య తరగతి ప్రజలకు కొంతమేర ఆర్థికభారం తగ్గుతుంది. – త్రివేణి, మహబూబ్‌నగర్ హామీని నిలబెట్టుకున్నాం..! కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే కచ్చితంగా అమలు చేసి తీరుతుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రధానమైనది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమవుతుండడం సంతోషంగా ఉంది. – బెక్కరి అనిత, కాంగ్రెస్ జిల్లా నాయకురాలు, మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహబూబ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఏఎస్పీ రాములు, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి ప్రారంభించనున్నారు. -
వ్యసనాల నుంచి వెలుగులోకి
పట్నాలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న రాఖీ శర్మ ఆ ఉద్యోగాన్ని వదిలేసి భర్త నడుపుతున్న రీహాబిలిటేషన్ సెంటర్‌ను తను స్వయంగా నిర్వహించడం మొదలుపెట్టింది. 5 వేల మంది ఇరవై ఏళ్ల లోపు పిల్లలను డ్రగ్స్ బారి నుంచి విముక్తి పొందేలా చేసింది. ఖైదీలలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్స్ ఇస్తోంది. మహిళలు వ్యసనానికి ఎలా లోనవుతున్నారు, వారు ఆ వ్యసనాల నుంచి బయట పడటం ఎలా అనే అంశంపై పని చేస్తున్నాను’ అని వివరిస్తోంది రాఖీ. వ్యసనాలకు గురైన వారు వాటినుంచి బయటపడి తిరిగి సంతోషకరమైన జీవనాన్ని పొందేందుకు ఆమె చేస్తున్న స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం కీలక అంశాలు. ‘‘ఒకరోజు అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. విషయం విని చాలా బాధ అనిపించింది. ఒక మహిళ బ్లేడ్‌తో ఒళ్లంతా కోసుకుంది. డ్రగ్స్ కారణంగా ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. మత్తు పదార్థాల నుంచి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కావడం లేదు. మహిళలు డీ–అడిక్షన్ సెంటర్లకు వెళ్లడం అనేది ఉందా.. అని నన్ను అడిగారు. మద్యపానం, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడిన వ్యక్తులు తమ అలవాటును వదిలించుకోవడానికి సహాయం చేయడం కూడా ఒక ముఖ్యమైన పని. నా మౌనం–పని ఈ రెండింటితో ఈ సెంటర్‌ను 22 ఏళ్లుగా నడుపుతున్నాను. వేలాదిమందిని మాదకద్రవ్య వ్యసనం బారి నుంచి బయటికి తీసుకువచ్చాను. ఒకప్పుడు తమ జీవితాలు అంధకారంలో ఉండి, అన్ని వైపులా నిరాశకు గురైన వారు ఇప్పుడు వారి కుటుంబాలతో జీవిస్తున్నందుకు సంతోషపడుతున్నాను. ► బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి.. పుట్టి పెరిగింది గురుగ్రామ్. కొన్నాళ్లు ఢిల్లీలోనే ఉన్నాను. జంషెడ్పూర్, కోల్‌కతాలలో చదువుకున్నాను. డాక్టర్ కావాలనుకున్నాను కాని బ్యాంక్ ఉద్యోగి అయిన నాన్న కోరిక మేరకు సీఏ చదివాను. పెళ్లయ్యాక పట్నా వచ్చాను. నేనూ బ్యాంకు ఉద్యోగం సంపాదించుకున్నాను. కానీ కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఏకకాలంలో నిర్వహించడం అంత సులభం కాదని కొన్ని రోజుల్లోనే అర్థమయ్యింది. అప్పటికే మా వారు డీ–అడిక్షన్ సెంటర్ నడుపుతున్నారు. కొన్నిరోజులు గమనించిన తర్వాత, బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేశాను. నిజానికి డీ–అడిక్షన్ సెంటర్ ఎలా పనిచేస్తుంది, మత్తు పదార్థాల నుంచి వ్యసనపరులను ఎలా బయట పడేయాలో ఏమాత్రం తెలియదు. కానీ క్రమంగా నేర్చుకున్నాను. ► కాల్చివేస్తానని బెదిరింపులు.. బీహార్‌లో డీ–అడిక్షన్ సెంటర్ నడపడం చాలా కష్టం. మాదకద్రవ్యాల వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఎక్కువగా నేర నేపథ్యం ఉన్న వారు వస్తారు. మంచి కుటుంబాలకు చెందిన పిల్లలు డ్రగ్స్‌కు బానిసలైతే పరువు పోతుందనే భయంతో వారిని బీహార్ నుంచి వేరే చోటకు పంపేవారు. ఇక ఓల్డ్‌సిటీలో డీ అడిక్షన్ సెంటర్‌కు వచ్చిన వారిని నిలువరించడం పెద్ద సవాలుగా ఉండేది. అలాంటి వాళ్లు మా కేంద్రానికి వచ్చి కొడతామంటూ ఉద్రేకంతో వస్తుంటారు. ఆ సమయంలో వారిపై వారికి అదుపు ఉండదు. వారి అలవాట్లను అడ్డుకుంటే బెదిరింపులు ఉండేవి. ‘బయటకు వెళ్లాక చూడు.. నిన్ను కాల్చేస్తామ’నేవారు. కేంద్రాన్ని మూసివేస్తామని బెదిరింపులు. కానీ నేనేం తప్పు చేయట్లేదు. భయమెందుకు? ► జైలులో డ్రగ్స్ నుంచి మహిళా ఖైదీల వరకు... పట్నాలోని బ్యూర్ జైల్లో ఖైదీల కోసం 10 ఏళ్లపాటు డీ–అడిక్షన్ క్యాంప్ నడిపాను. మహిళాఖైదీలతో ఈ క్యాంప్ స్టార్ట్ అయ్యింది. జైలులో ఓ బాలిక తన బట్టలు చింపుకుని బీభత్సం సృష్టించింది. అప్పుడు నన్ను పిలిచారు. ఆమెను చూడగానే ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని అర్థమైంది. తనకు డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఆమె అలా ప్రవర్తించింది. అప్పుడు ఇక్కడ ఖైదీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో జైలు ఐజీకి నివేదించాను. ఐజీ అభ్యర్థన మేరకు జైలులో మూడు రోజుల పాటు డీ–అడిక్షన్ క్యాంపు నిర్వహించారు. శిబిరంలో 1000 మందికి పైగా ఖైదీలు పాల్గొన్నారు. వందలాది మంది ఖైదీలు మాదకద్రవ్యాల నుండి విముక్తి పొందారు. ► నిషేధం తర్వాత.. ఒక డ్రగ్ మానేస్తే మరో మందు వాడటం మొదలు పెడతారు. బీహార్‌లో మద్య నిషేధం తర్వాత ఈ ట్రెండ్ కనిపించింది. ఇప్పుడు ప్రజలు గంజాయి, ఇతర డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులు మద్యం కంటే వారి వ్యసనం నుండి బయటపడటం చాలా కష్టం. నిషేధం కారణంగా, ప్రజలు డీ–అడిక్షన్ సెంటర్లకు రావడం మానేశారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ కోసం 15 ప్రత్యేక పడకలను అందించేందుకు కృషి చేశాం. ఆ తర్వాత ఈ విషయంలో వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చాం. 5 వేల మంది పిల్లలు మాదకద్రవ్యాల నుండి విముక్తి పొందారు. ► మహిళల కోసం.. చాలా మంది మహిళలు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండానే డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడేందుకు వస్తుంటారు. మహిళల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్ కూడా ఉంది. చాలా మంది మహిళలు తమ గుర్తింపును దాచుకుంటారు, కొందరు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇక్కడకు వస్తారు. ఓ మహిళ భర్త దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి ఖరీదైన మద్యం తెచ్చేవాడు. ఆమె తన బిడ్డతో ఇంట్లో ఒంటరిగా ఉంటూ మద్యం సేవించి క్రమంగా దానికి బానిసయ్యింది. పట్టించుకునేవారెవరూ లేకపోవడంతో ఆమె బిడ్డ చదువుకు దూరమయ్యాడు. దాంతో డీ–అడిక్షన్ సెంటర్‌కి వెళ్లి, కొన్ని సెషన్స్ తర్వాత నార్మల్‌గా మారింది. అదేవిధంగా పట్నాలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన ఓ మహిళ డ్రగ్స్‌కు బానిసైంది. ఆమె ఎంబీఏ చేసింది. తల్లి చైనాలో, సోదరుడు అమెరికాలో ఉన్నారు. ఆమె వైవాహిక జీవితం బాగోలేదు. విడాకుల తర్వాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. డీ–అడిక్షన్ సెంటర్‌కు వచ్చేటప్పటికి ఆమె శరీరంపై చాలా కోతలు ఉన్నాయి. బ్లేడుతో తానే కోసుకుని ఆనందించేది. కొన్నినెలల చికిత్స తర్వాత ఆమె సాధారణ స్థితికి వచ్చింది. బీహార్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి మద్యానికి బానిసయ్యాడు. ఎంత ప్రయత్నించినా ఆ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నాడు. భార్య ప్రోద్బలంతో ఆ ఐఏఎస్ డీ–అడిక్షన్ సెంటర్లో చికిత్స తర్వాత తన వ్యసనాన్ని విడిచిపెట్టాడు. చాలా మంది డాక్టర్లు, ఇంజినీర్లు డీఅడిక్షన్ సెంటర్ కు వచ్చి డ్రగ్స్ అలవాటు నుండి విముక్తి పొందారు.’’ అంటూ తను చేస్తున్న సేవ గురించి వివరించే రాఖీశర్మ ఎందరికో స్ఫూర్తిదాయకం. వీధిబాలలు, అనాథలు, వదిలివేయబడిన పిల్లలు ఎక్కువగా మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారు. అలాంటి పిల్లల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించాం. వీధి బాలల కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. 30–35 మంది పిల్లలకు భోజనం, పానీయం, విద్య అన్ని ఏర్పాట్లు ఉన్న చోట ఈ కేంద్రానికి వసతి కల్పించే సామర్థ్యం కల్పించాం. -
గర్బవతులకు మైగ్రేన్ వస్తే..
నాకు మైగ్రేన్ ఉంది. తరచుగా వస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు నాకు మూడో నెల. ఎలాంటి మందులు వేసుకోవాలి? ఈ టైమ్‌లో మైగ్రేన్ బాధించకుండా ఏం చేయాలి? – టి. స్రవంతి, నాగ్‌పూర్ మైగ్రేన్ సర్వసాధారణమైన తలనొప్పి. మైగ్రేన్ నొప్పి మొదలవడానికి ముందు కొంతమందికి వాంతులు, వికారం, తల తిప్పినట్టవడం వంటివి ఉంటాయి. మీకు అలాంటి లక్షణాలు ఉంటాయా? ఉండవా? మీ మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ముందు మీరు మీ గైనకాలజిస్ట్‌తో చర్చించండి. దాదాపుగా సగం మందిలో ప్రెగ్నెన్సీలో సమయంలో మైగ్రేన్ తగ్గుతుంది. మందుల అవసరం కూడా తగ్గుతుంది. కానీ ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న కొందరిలో హై బీపీ, Pre eclampsia చాన్సెస్ పెరుగుతాయి. ప్రెగ్నెన్సీలో తగినంత విశ్రాంతి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, టైమ్‌కి తినడం, యోగా, ధ్యానం లాంటివాటితో తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడైనా తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారసిటమాల్ మాత్రను వేసుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అయిన మైండ్‌ఫుల్‌నెస్ లాంటివీ తలనొప్పి తగ్గేందుకు దోహదపడతాయి. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ముందుగా.. మీకు దేనివల్ల మైగ్రేన్ పెరుగుతుందో చెక్ చేసుకోండి. ఆ ట్రిగర్ని మేనేజ్ చేస్తే ఎపిసోడ్స్ తగ్గుతాయి. కంటి నిండా నిద్ర చాలా అవసరం. ఎండలో తిరగటం, చీజ్, చాకోలేట్స్ మొదలైనవి కొందరిలో మైగ్రేన్‌ను ట్రిగర్ చేస్తాయి. మైగ్రేన్ ఎక్కువసార్లు వస్తూంటే ఒకసారి న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. సురక్షితమైన మందుబిళ్లలను అదీ తక్కువ మోతాదులో అదీ తక్కువసార్లు మాత్రమే తీసుకోమని సజెస్ట్ చేస్తారు. కొన్ని మందులు గర్భంలోని శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే స్పెషలైజ్డ్ కేర్ టీమ్ పర్యవేక్షణలో ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో Ergotamine, Ibuprofen లాంటివి అస్సలు ప్రిస్క్రైబ్ చేయరు. తెలియకుండా మందులు వాడకూడదు. హైరిస్క్ కేర్ టీమ్‌ని సంప్రదించాలి. కొన్ని మందుల వల్ల బిడ్డకు పుట్టుకతో లోపాలు ఏర్పడవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీ కంటే ముందే అధిక మోతాదులో కొన్ని మందులను తీసుకుంటూ ఉండి ఉంటే గర్భం నిర్ధారణ అయిన తర్వాత వాటిని మారుస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: పంపాతీరంలో హనుమంతునిచే త్రిశూలరోముడి హతం.. మునులకు ప్రశాంతత) -
మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడి ఎంట్రీ.. ఆ తర్వాత..
ఢిల్లీ: వివాదాలతో, చిత్రవిచిత్రాలతో తరచూ వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా మరో ఘటన జరిగింది. అసభ్య డ్యాన్సులు, ఫైటింగ్‌లు, వైరల్ కావడానికి కొందరు చేసే పిచ్చి పనులతో ఢిల్లీ మెట్రో యాజమాన్యం కఠిన నిబంధనలు విధించింది. మెట్రో ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రయాణికులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు మహిళా కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. మహిళ విభాగంలోకి పురుషులకు అనుమతి ఉండదు.. అయినప్పటికీ నియమాలను ఉల్లంఘిస్తూ వెళ్లడంపై రైలులో ఓ యువతి ప్రశ్నించింది. యువకునికి తోడుగా వచ్చిన మరో మహిళ.. ఆ యువతిపై దురుసుగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ కొట్టేంత పని చేసింది. Kalesh b/w Ladies and a Guy over He Stepped up Into ladies Coach in Delhi Metro pic.twitter.com/wzks795oqW — Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ, యువకుడిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే.. తాను తోడుగా ఉన్న మహిళకు సహాయంగా మాత్రమే మహిళల విభాగంలోకి వెళ్లానని, అంతకు మించి వేరే ఉద్దేశం లేదని ఆ యువకుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: 'విక్రమ్ ల్యాండర్ నేనే తయారు చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి.. -
Health tip : కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయొద్దు
తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం వల్ల అది మన మనస్తత్వ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుందని, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని వెల్నెస్ కోచ్, ఆయుర్వేద ఔత్సాహికురాలు అమృత కౌర్ రాణా తెలిపారు. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమృత. ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ ఇవి. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి (షవర్ తీసుకోకండి), ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది ఆయుర్వేదం 'జీవిత శాస్త్రం'. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతోంది శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడం మన కర్తవ్యం, లేకుంటే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేము ప్రతిరోజూ, మన ఆరోగ్యాన్ని నిర్దేశించే ఎంపికలను చాలా తరచుగా, మనకు తెలియకుండానే మార్చుకుంటాం. వేగవంతమైన జీవితాలు మరియు అనేక బాహ్య కారకాలచే ప్రభావితమవుతున్నాయి. వేదాలు ప్రకృతిలోని ఐదు అంశాలను - గాలి, నీరు, అంతరిక్షం, అగ్ని మరియు భూమి - పంచమహాభూతంగా సూచిస్తాయి. మానవ శరీరంలో ఈ మూలకాల ఉనికి లేదా లేకపోవడం దాని జీవ స్వభావం లేదా దోషాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనం కోసం ఆరోగ్యకరమైన శరీరం & మనస్సు కోసం ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోజువారీ అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి శక్తితో కూడిన శరీరం కోసం మనస్సు తేలికగా ఉండాలి ఎప్పుడు మానసిక ఒత్తిడితో జీవితం గడిపితే అది కచ్చితంగా శరీరంపై, తద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆయుర్వేద పోషకాహారం ప్రకారం రోజువారీ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి మంచి జీర్ణ శక్తి, సరైన రుతుస్రావం మెరుగైన హార్మోన్లకు దోహదపడతాయి ఒత్తిడి లేని జీవితం గడిపేలా స్వీయ-సంరక్షణ పద్ధతులను పాటించాలి కంటి నిండా నిద్ర, మానసిక ఆరోగ్యం వల్ల చర్మం, జుట్టు సంరక్షింపబడతాయి మైండ్‌ఫుల్‌గా తినడం అంటే ఎక్కువ తినమని కాదు అర్థం. దీనికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేదా ప్రోటీన్‌తో సంబంధం లేదు. కానీ ఏం తింటున్నామో.. మనసుకు తెలియజేయాలి. మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనసు దాన్ని జీర్ణింపజేయడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియ జ్ఞానం వల్ల తినే తిండి సత్పలితాలను ఇస్తుంది. తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం మన శరీరధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నీళ్లు తాగకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు నడవడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మీరు అతిగా తింటే, మీ తదుపరి భోజనాన్ని తగ్గించండి లేదా దానిని దాటవేయండి. సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి. ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది. స్నానం మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది ఇది కడుపు నిండినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు (అమృత ఫుడ్ బ్లాగర్ మరియు సర్టిఫైడ్ ఆయుర్వేద పోషకాహార సలహాదారు, జర్నలిస్ట్, రేడియో జాకీ, కంటెంట్ సృష్టికర్త మరియు ఉపాధ్యాయురాలు) -
లేడీసంతా కలిసి కుమ్ముడు కుమ్మేసారు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన మహిళలు
-
చీర పెట్టిన చిచ్చు.. జుట్టు జుట్టు పట్టుకుని షాపులో కొట్టుకున్న మహిళలు
-
వధువు కోసం పాదయాత్ర
ఇది పాదయాత్రల సీజన్.దేశంలో అనేక యాత్రలు సాగుతున్నాయి. వాటి మతలబు వేరు. కాని కర్ణాటకలో ఫిబ్రవరి 23న 200 మంది పల్లెటూరి యువకులు పా దయాత్ర చేయనున్నారు. దాని పేరు ‘బహ్మచారిగళ పా దయాత్రె’ అంటే ‘బ్రహ్మచారుల పా దయాత్ర’ మాండ్య జిల్లాలో గతంలో ఆడపిల్ల భ్రూణ హత్యలు జరిగాయి. ఇవాళ యువకులకు అక్కడ వధువు కరువైంది. బ్రహ్మచారులంతా డిప్రెషన్ బారిన పడ్డారు. వారికి ఆశ కల్పించడానికి దేవుని కొండ వరకూ పా దయాత్ర చేయిస్తున్నారు. ఆడపిల్ల ఎంత విలువైనదో సిరి సమానమైనదో తెలుసుకోవాల్సిన వాళ్లు ఇంకా ఉన్నారు. వారికి కనువిప్పు ఈ కథ. ఇవాళ అనేక ఇళ్లల్లో అబ్బాయిలు ఈసురోమంటూ ఒంటరిగా ఉంటున్నారు. సంబంధం ఒక పట్టాన కుదరడం లేదు. అమ్మాయిలు అంత సులువుగా దొరకడం లేదు. 2003లో హిందీలో ‘మాతృభూమి’ అనే సినిమా వచ్చింది. మనీష్ ఝా దర్శకుడు. బిహార్‌లో ఆడపిల్ల పుడితే పా లల్లో ముంచి ్రపా ణాలు తీసే దురాచారం ఉంది. అలాంటి ఆచారం పా టించిన ఒక ఊరు కొన్నాళ్లకు అసలు ఒక్క అమ్మాయి కూడా లేక అందరూ మగవాళ్లతో నిండిపో యే స్థితికి చేరుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? పెళ్లి కాని యువకులు ఎంత నిస్పృహకు లోనవుతారు? దొరక్క దొరక్క ఒక వధువు దొరికి ఆ ఊరికి కోడలిగా వస్తే ఏమవుతుంది? దర్శకుడు షాకింగ్‌గా ఈ సినిమా కథను అధివాస్తవిక దృష్టితో చూపిస్తాడు. దీనికి బోలెడన్ని అవార్డులు వచ్చాయి. ఇలాంటి స్థితి ఇప్పుడు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఇంకా దేశంలో మరికొన్ని చోట్ల నెలకొని ఉన్నదంటే ఆ దర్శకుడు ఊహించిందే నిజమైంది. లింగ నిష్పత్తికి విఘాతం 1970, 80, 90... ఈ మూడు దశాబ్దాలు మన దేశం అనేక భ్రూణ హత్యలను, ఆడపిల్ల అయితే శిశు హత్యలను చూసింది. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించడం మధ్యతరగతి వారికి కట్నాలు, కానుకలు తప్పించుకునే ఒక మార్గం అయ్యింది. ఆ కాలంలో లింగ నిష్పత్తికి కలిగిన విఘాతం ఆ సమయంలో పుట్టిన ముఖ్యంగా 1990లలో పుట్టిన అబ్బాయిలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. 2000 సంవత్సరం తర్వాత ప్రభుత్వం మేల్కొని లింగ నిర్థారణ, భ్రూణ హత్యలపై కఠిన చట్టాలు తెచ్చినా 2005 నాటికి ప్రతి 1000 మంది అబ్బాయిలకు 876 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. 2018–20 నాటికి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 907 ఉంది. ఇది జాతీయ సగటు. కాని కొన్ని రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి చాలా ప్రమాదకరంగా ఉంది. సోలాపూర్ పెళ్లికొడుకులు మొన్నటి డిసెంబర్లో మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 50 మంది బ్రహ్మచారులు పెళ్లికొడుకుల వేషాలు కట్టి, గుర్రాలు ఎక్కి, మేళ తాళాలతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ‘తగిన వధువు’ను వెతకమని మెమొరాండం ఇచ్చారు. కొందరు ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసి మొర పెట్టుకున్నారు. మహారాష్ట్రలో కొన్ని ్రపా ంతాల్లో నీటి వసతి లేదని అమ్మాయిని ఇవ్వడం లేదు. మరికొన్ని చోట్ల అమ్మాయిలు లేక దొరకడం లేదు. అక్కడ ప్రస్తుతం ప్రతి 1000 మంది అబ్బాయిలకు 889 మంది అమ్మాయిలే అందుబాటులో ఉన్నారు. దాంతో పెళ్లిళ్లు జరక్క అబ్బాయిలు ఆవేదన చెందుతుంటే, వాళ్ల తల్లిదండ్రులు మనోవేదనతో హార్ట్ ఎటాక్‌లు తెచ్చుకుని మరణిస్తున్నారు. కర్ణాటక పాదయాత్ర ఇప్పుడు కర్ణాటకలోని మాండ్య ్రపా ంతం వార్తల్లోకి వచ్చింది. అక్కడ గత కొన్నేళ్లుగా బలవంతపు బ్రహ్మచర్యాన్ని అబ్బాయిలు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు మాండ్య ్రపా ంతంలో సాగిన భ్రూణ హత్యలు ఇపుడు పెళ్లి కాని యువకుల పట్ల శాపంగా మారాయి. దాంతో చదువు, యోగ్యత, ఉద్యోగాలు ఉన్నా సరే జంట లేక కుర్రాళ్లు డిప్రెషన్లోకి వెళుతున్నారు. వీరు ఇదే విధంగా ఉండటం సరి కాదని అక్కడ కొంతమంది సామాజిక కార్యకర్తలు వారి ఓదార్పుకై, దైవశక్తి తోడుకై ‘బ్రహ్మచారి పా దయాత్ర’ను ప్రతిపా దిస్తే ప్రకటన వెలువడిన వెంటనే వందకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఫిబ్రవరి 23న 30 ఏళ్ల వయసు దాటిన 200 మంది బ్రహ్మచారులు మాండ్యాలోని మద్దూరు నుంచి పొరుగు జిల్లా చామరాజనగర్‌లోని ప్రఖ్యాత మాలె మహదేశ్వర గుడికి మూడు రోజుల పా టు 105 కిలోమీటర్ల మేరకు ఈ పా దయాత్ర సాగనుంది. ఆశ్చర్యంగా మాండ్యా జిల్లా నుంచే కాక మైసూరు, బెంగళూరు నుంచి కూడా నిర్వాహకులకు ఫోన్లు వస్తున్నాయి. 200కు పరిమితం చేశారు కాని ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ‘బ్రహ్మచారులకు బతుకు మీద ఆశ కల్పించడానికి ఈ పా దయాత్ర కొంతైనా ఉపకరిస్తే అదే పదివేలు’ అని నిర్వాహకులలో ఒకరు వ్యాఖ్యానించారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయి. 1970లలో 80లలో అబ్బాయిలు కట్నం కోసం అమ్మాయిలను కాల్చుకుతిన్నారు. వయసుకొచ్చిన యువకుడు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఎంతో డిమాండ్ ఉండేది. ఇవాళ అనేక ఇళ్లల్లో అబ్బాయిలు ఈసురోమంటూ ఒంటరిగా ఉంటున్నారు. సంబంధం ఒక పట్టాన కుదరడం లేదు. అమ్మాయిలు అంత సులువుగా దొరకడం లేదు.ఆడపిల్ల దేశానికి ఆయువు. ఈ వార్తలు చూసైనా ప్రతి ఇంటా ఆడపిల్లను సంతోషంగా ఆహ్వానించాలి. -
మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం..
భారతీయ రైల్వే.. ప్రతీ రోజు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణమే గాకా వివిధ సేవలను ప్యాసింజర్లకు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం మహిళల కోసం రైల్వేశాఖ పెద్ద ప్రకటనే చేసింది. మహిళలు ఇకపై రైలులో సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలిపింది. బస్సు, మెట్రో తరహాలో ఇకపై భారతీయ రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మహిళలకు ప్రత్యేకంగా సీటు రిజర్వ్ సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం.. భారతీయ రైల్వే ప్రత్యేక బెర్త్‌లను కేటాయించనున్నారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైళ్లలో మహిళల సౌకర్యార్థం రిజర్వ్ బెర్త్‌ల ఏర్పాటుతో పాటు అనేక సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో ఆరు బెర్త్‌లు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌లోని మహిళలకు ఆరు బెర్త్‌లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ (3ఏసీ క్లాస్)లో ఆరు బెర్త్‌లు మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు. రైలులోని ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు, 3 టైర్ ఏసీ కోచ్‌లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు, 2 టైర్ ఏసీ సీనియర్ సిటిజన్లలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీలకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), జీఆర్పీ, జిల్లా పోలీసులతో భద్రత కల్పిస్తారు. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
అండాశయాల్లో వచ్చే క్యాన్సర్
గర్భాశయానికి ఇరుపక్కలా బాదం పప్పు సైజులో ఉండే అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయడంతో పాటు స్త్రీ హార్మోన్లు అయిన ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్లను విడుదల చేస్తుంటాయి. స్త్రీలలో నెలసరికి ఈ హార్మోన్లే కారణం. ఈ హార్మోన్లు సరిగ్గా విడుదల అయినంత కాలం అనేక గైనిక్ సమస్యలకు దూరంగా ఉండటంతో పాటు సంతానలేమి సమస్య కూడా బాధించదు. అండాశయాలలో కణాలు అపరిమితం గా పెరిగి పక్కనున్న కణజాలాలకు, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని ‘ఒవేరియన్ క్యాన్సర్’ అంటారు. అపరిమితంగా పెరిగిపోయే ఈ కణాలను బట్టి ఈ క్యాన్సర్‌ను మూడు రకాలుగా విభజించారు. 1. ఎపిథీలియల్ ఒవేరియన్ క్యాన్సర్ వయసు పైబడిన స్త్రీలలో దాదాపు 90% వరకు ఈ క్యాన్సర్ వస్తుంటుంది. 2. జెర్మ్‌సెల్ ట్యూమర్ ఒవేరియన్ క్యాన్సర్ వయసులో ఉండే అమ్మాయిల్లో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ ఇది. ఈ క్యాన్సర్ కణాలు అండాల నుంచి పుడతాయి. 3. సెక్స్కార్డ్ స్ట్రోమల్ ట్యూమర్ ఒవేరియన్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ కణాలు అండాలలో హార్మోన్స్ ఉత్పత్తి అయ్యే దగ్గర్నుంచి తయారవుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్ హార్మోన్లు చాలా ఎక్కువగా, దీర్ఘకాలికంగా ఉంటే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్‌ది మూడో స్థానం. గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్ల తర్వాత ఈ క్యాన్సర్లే ఎక్కువ. ఇక్కడ పేర్కొన్న మూడు రకాలే కాకుండా వాటిలోనూ ఇంకా ఎన్నో సబ్–టైప్స్ ఉంటాయి. స్త్రీలలో 50 ఏళ్లు పైబడ్డాక ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్‌ను ఒక సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటూ ఉంటారు. ఎందుకంటే పొత్తికడుపు లో చాలా లోపలికి ఉండే అండాశయాల క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు కూడా చాలా ఆలస్యంగా బయటపడుతూ ఉంటాయి. ఎవరెవరిలో... ►పిల్లలు కలగని మహిళల్లో ►బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన మహిళల్లో ►సంతానం కోసం చాలా ఎక్కువగా మందులు వాడిన వారిలో ►హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని దీర్ఘకాలికంగా తీసుకున్నవారిలో ►కొవ్వు పదార్థాలు, మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారిలో ►క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి, 50 ఏళ్లు పైబడిన స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు కొంత ఎక్కువ అనే చెప్పవచ్చు. గైనకాలజిస్ట్ దగ్గరికి గైనిక్ చెకప్స్‌కు వెళ్లినప్పుడు ఈ క్యాన్సర్ అంత త్వరగా బయటపడకపోవచ్చు. అందుకే అనుమానంగా ఉంటే అల్ట్రాసౌండ్ పరీక్షతో పాటు బ్లడ్‌టెస్ట్‌లు, సీఏ 125, పాప్ టెస్ట్ మొదలైనవాటితో పాటు సీటీ, ఎమ్మారై వంటివి కూడా చేస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమయ్యే బీఆర్సీఏ–1 జీన్ మ్యుటేషన్లో తేడాలున్నప్పుడు ఈ క్యాన్సర్ పరీక్షలు 25 ఏళ్ల వయసు నుంచే చేయించడం మంచిది. మెనోపాజ్ దశకు ముందు నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్ ను మాత్రమే 5 నుంచి 10 ఏళ్ల కంటే ఎక్కువగా తీసుకుంటే ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరగవచ్చు. ప్రోజెస్టిరాన్ హార్మోన్ కాంబినేషన్లో ఈస్ట్రోజెన్ తీసుకుంటే ఆ ముప్పు కొంతవరకు తగ్గవచ్చు. అన్ని క్యాన్సర్లలోలాగే ఈ క్యాన్సర్‌లో కూడా నాలుగు స్టేజ్‌లు ఉంటాయి. స్టేజ్ 1: ఒకటి లేదా రెండు అండాశయాలకు మాత్రమే పరిమితం. స్టేజ్ 2: గర్భాశయానికీ వ్యాప్తి చెందడం స్టేజ్ 3: అండాశయాలు, గర్భాశయంతో పాటు లింఫ్ నాళాలు, పొత్తికడుపు లైనింగ్‌కు వ్యాప్తి చెందడం. స్టేజ్ 4: పైవాటితోపాటు శరీరంలోని ఇతర అవయవాలకు సోకడం. ఈరోజుల్లో వాడే బర్త్‌కంట్రోల్ పిల్స్ (పిల్లలు పుట్టకుండా ఉండేందుకు వాడే టాబ్లెట్ల) వల్ల ట్యూబల్ లిగేషన్, హిస్టరెక్టమీ అయిన మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంత తక్కువగా ఉండవచ్చు. చికిత్స స్టేజ్‌లపై ఆధారపడి సర్జరీతో పాటు ఇతర థెరపీలను ఎంతకాలం ఇవ్వాలో నిర్ణయిస్తారు. నోటిద్వారా, ఐవీ ద్వారా లేక నేరుగా పొట్టలోకే ఇచ్చే కీమోతో పాటు టార్గెటెడ్ థెరపీలు కూడా ఉంటాయి. పెళ్లికాని అమ్మాయిలు ఈ క్యాన్సర్‌కు ఇచ్చే కీమో, రేడియోథెరపీల కారణంగా మెనోపాజ్ లాంటి లక్షణాలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే వీరి అండాలను చికిత్సకు ముందే తీసి, భవిష్యత్తులో సంతానభాగ్యం పొందడానికి భద్రపరిచే సౌకర్యాలు ఉన్నాయి. ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు: ఈ క్యాన్సర్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అంతేకాకుండా అవి అజీర్తి, యూరినరీ ఇన్ఫెక్షఅ న్స్లా అనిపించవచ్చు. మొదట్లో లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవడం వల్ల తొలిదశలో ఈ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టం కావచ్చు. ►పొత్తికడుపు ఉబ్బినట్లుగా ఉండి, నొప్పిగా ఉండటం. ►అజీర్తి, వికారం, తేన్పులు లాంటి జీర్ణ సంబంధ సమస్యల్లాంటి లక్షణాలు. ►యోని స్రావాలు అసాధారణంగా ఉండటం. ∙మూత్రం ఎక్కువగా లేదా త్వరగా రావడం. ►అలసట, జ్వరం ∙ఎక్కువగా లేదా ఇంతకుముందులా తినలేకపోవడం. కొంచెం తినగానే పొట్ట నిండినట్లుగా ఉండటం. ►ఊపిరి కష్టంగా ఉండటం. ∙కలయిక కష్టంగా ఉండటం. ►వెన్నునొప్పి లేదా నడుమునొప్పిగా అనిపించడం. ►అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం. ►ఈ క్యాన్సర్‌లో పై లక్షణాలలో కొన్ని కనిపించవచ్చు. -
రంగస్థలం..శ్రీ మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్
ఫ్లాష్‌బ్యాక్‌లు సినిమాల్లోనే కాదు నాటకాల్లో కూడా ఉంటాయి. నాటకాల్లోనే కాదు నాటకరంగ సంస్థలకు కూడా ఉంటాయి. ఒక తమిళపత్రికలో నాటకరంగానికి సంబంధించిన వ్యాసం ఒకటి చదివింది జ్ఞానం బాలసుబ్రమణియన్. ఒకాయన తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు: ‘తమిళ నాటకరంగంలో రాసే మహిళలు, నటించే మహిళలు లేరు. ఎంతో సామర్థ్యం ఉంటేగానీ ఇది సాధ్యం కాదు అనుకోండి’ ఆయన మాటలను సవాలుగా తీసుకుంది జ్ఞానం. వరకట్న రక్కసిపై నాటిక రాసింది. నిజానికి అంతవరకు తనకు రచన, నాటకరంగంలో ఎలాంటి అనుభవం లేదు. తాను రాసిన నాటికను ఆకాశవాణికి పంపించింది. వారు తిరస్కరించారు. చిన్న నిరాశ! జ్ఞానం భర్త పెద్ద అధికారి. ఆయన బాంబేకు బదిలీ అయ్యాడు. భర్తతో పాటు బాంబేకు వెళ్లింది జ్ఞానం. ఒకానొక రోజు వరకట్న సమస్యపై తాను రాసిన నాటికను బాంబేలో ప్రదర్శించారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. తన మీద తనకు నమ్మకం ఏర్పడడానికి ఆ స్పందనే కారణం అయింది. ఈ నమ్మకమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ శ్రీకారం చుట్టడానికి నాంది అయింది. నాటకరంగంలో స్త్రీ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఏర్పాటయిందే ఈ డ్రామా గ్రూప్. అయితే...రకరకాల భయాల వల్ల ఈ డ్రామా గ్రూప్‌లో చేరడానికి మహిళలు సంకోచించేవారు. ‘ప్రయత్నిస్తే ఫలించనిదేముంది’ అనే నానుడిని మరింత గట్టిగా నమ్మింది జ్ఞానం. ఒకటికి పదిసార్లు వారితో మాట్లాడి ఒప్పించింది. మొదట్లో ఇద్దరు చేరారు. ఆ ఇద్దరు ఆరుగురు ఆయ్యారు... అలా పెరుగుతూ పోయారు. అలా చేరిన వాళ్లు గతంలో ఎన్నడూ నాటకాల్లో నటించలేదు. నటన మీద ప్రేమ తప్ప నటనలో ఓనమాలు తెలియని వాళ్లే. సాధారణంగా నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరిస్తారు. కానీ ‘మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్’లో పురుష పాత్రలను స్త్రీలే ధరిస్తారు. మొదట్లో ఇది చాలామందికి వింతగా అనిపించేది. ఇది ఆ నాటక సంస్థకు చెందిన ‘ప్రత్యేకత’గా కూడా మారింది. ఈ ఆల్–వుమెన్ డ్రామా గ్రూప్ నుంచి కాలక్షేప నాటకాలు రాలేదు. కనువిప్పు కలిగించే నాటకాలు వచ్చాయి. వర్నకట్నం, వర్కింగ్ ఉమెన్స్ ఎదుర్కొనే సమస్యలు, బాల్యవివాహాలు...మొదలైన వాటితో పాట ఆధ్యాత్మిక విషయాలను కూడా ఇతివృత్తాలుగా ఎంచుకుంది ఈ నాటకసమాజం. స్టేజీ ఎక్కడానికి ముందు ఒక్కో నాటకాన్ని ఇంచుమించు 30 సార్లు రిహార్సల్స్ చేస్తారు. కట్ చేస్తే....ఇది సోషల్ మీడియా కాలం. ఒక ఊళ్లో నాటకం వేస్తే ఆ ఊరే చూస్తుంది. అదే నాటకం డిజిటల్ స్పేస్‌లోకి వస్తే ఊరూ, వాడ ఏమీ ఖర్మ...ప్రపంచమే చూస్తుంది. అలా అని.. రంగస్థలాన్ని తోసిరాజనాలనేది వారి ఉద్దేశం కాదు. ఒకవైపు రంగస్థలానికి ప్రాధాన్యం ఇస్తూనే అదనపు వేదికను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనేది వారి నిర్ణయం వెనక కారణం. తొలిసారిగా ‘ఎందరో మహానుభావులు’ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మూడు లక్షల మందికి పైగా వ్యూయర్స్ చూడడం నాటక సంస్థకు ఎంతో ఉత్సాహం, ధైర్యాన్ని ఇచ్చింది. ‘మహాలక్ష్మీ...ఎందరో మహిళల కలలకు రెక్కలు ఇచ్చింది’ అంటోంది సుదీర్ఘ కాలంగా ఈ నాటకరంగ సంస్థతో అనుబంధం ఉన్న కమల ఈశ్వరీ. నాటక సంస్థ మొదలైనప్పుడు...సమస్యలు కొన్నే ఉండవచ్చు. ఇప్పుడు ఎటు చూసినా ఏదో ఒక సమస్య. మాధ్యమాలు కూడా పెరిగాయి. ఆ మాధ్యమాల వేదికగా, రకరకాల ఆధునిక సమస్యలపై పోరాడడమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ లక్ష్యం. -
ఆమెను కొత్త స్వెటర్ కొనుక్కోనిద్దాం..
చలికాలం పిల్లలు నిద్ర లేవరు. వారికి ఆ హక్కు ఉందట. భర్త గారు ‘కాసేపు నిద్రపోనీ’ అంటుంటారు. ఆయనగారిని ఏం అనగలం. కాని స్త్రీలు లేవాల్సిందే. వంట చేయాల్సిందే. అన్నీ సిద్ధం చేయాల్సిందే. వారెప్పుడు రుతువులను ఎంజాయ్ చేయాలి? భార్యకు కొత్త స్వెటర్ కొనివ్వాలంటే టైమ్ ఉండదు. పోనీ ఆమెను కొనుక్కోనివ్వము. అమ్మకు చెవులకు స్కార్ఫ్ ఎప్పుడూ పాతదే. చలికి ఆడవాళ్ల పాదాలకు సాక్సులు అవసరం అని కూడా అనుకోము. ఈ కాలంలో స్త్రీలకు ఏం కావాలో వారిని తెచ్చుకోనివ్వండి. పని ఒత్తిడి తగ్గించండి. టీ తాగుతూ చలిని వారినీ ఆస్వాదించనివ్వండి. చలికాలం బద్దకం కాలం. వెచ్చగా ముసుగుతన్నమని చెప్పేకాలం. కాని ఆ లగ్జరీ ఇంటి మగవారికి, పిల్లలకి ఉన్నట్టుగా ఆడవారికి ఉండదు. బయట ఎంత చలి ఉన్నా తెల్లారే ఆరుకు వాళ్లు లేవాల్సిందే. బయట ఎంత మంచు కురుస్తున్నా తొంగి చూడక వంట గదిలో దూరాల్సిందే. వరండాలోనో, బాల్కనీలోనో, ముంగిలి లోనో కుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ మంచుతో తడిసిన బంతిపూల మొక్కను చూడాలని వారికీ ఉంటుంది. కాని వారికి కాఫీ తెచ్చిచ్చేవారు ఎవరూ ఉండరు. వారి కాఫీ వాళ్లే పెట్టుకోవాలి. చలికాలమైనా హిమ ఉదయమైనా. ఇంకా ద్వితీయశ్రేణి పౌరులేనా? చలికాలం వస్తే భర్త బజారు నుంచి వస్తూ వస్తూ రోడ్డు మీద అమ్మే ఒక జర్కిన్నో, స్వెటర్నో కొనుక్కుంటాడు. బండి నడుపుతాడు కదా మంకీ క్యాప్ కొనుక్కుంటాడు. పిల్లలు చలికి ఎక్స్పోజ్ అయితే ఎలా? వారి కోసం తప్పక స్వెటర్లు కొంటాడు. కాని భార్యకు ఎందుకనో వెంటనే కొనడు. కొనాలన్నా ఉంది కదా అనిపిస్తుంది. ఆమే కొనుక్కుంటుందిలే మన సెలక్షన్ నచ్చదు అనుకుంటాడు. ఆమె కొనుక్కునేది లేదు. ఆమెకు ఆ వీలూ చిక్కదు. చాలా ఇళ్లల్లో స్త్రీలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. స్త్రీలకు రకరకాల స్వెటర్లు అమ్ముతారు. హాఫ్ స్వెటర్లు ఇంట్లో వేసుకోవచ్చు. ఫుల్స్వెటర్లు బయటకు వెళ్లేప్పుడు. కొనే స్తోమత ఉన్నా ‘ఇన్ని ఎందుకు’ అనే ప్రశ్న ఆమెకు ఎదురవుతుంది. స్త్రీలు సౌందర్య ప్రియులు అని తెలుసు. ఈ శీతాకాలం రెండు మూడు నెలలు ఒకే ఒక్క స్వెటర్‌తో వాళ్లు ఎందుకు గడిపేయాలి. అక్కర్లేదు అని వారూ అనుకోరు. ఇంటి మగవారూ చెప్పరు. అమ్మ సంగతి ఏమిటి? ఇంట్లో అమ్మ ఉంటే శీతాకాలం ఆమెకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకు బడ్జెట్ కేటాయించాలి. ఒక మంచి షాల్ కప్పుకుని ఆమె కూచుంటే ఎంత బాగుంటుంది. ఆమెకు నచ్చిన రంగుల్లో రెండు మూడు స్కార్ఫులు ఉంటే ఎంత బాగుంటుంది. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు, సాక్సులు ఆమెకు తప్పనిసరి. ఒక కొత్త రగ్గు కొని ఇస్తే ఆ ఉత్సాహమే వేరు. అమ్మ ఆ ఇంట్లో కొడుకు, కోడలు మీద ఆధారితమైతే ఆమెను చిన్నబుచ్చకుండా ఇవన్నీ లేదా వీటిలో కొన్నయినా ఈ శీతాకాలపు ప్రారంభంలోనే ఆమెకు కొనిస్తే నోరు తెరిచి అడగాల్సిన అవస్థ తప్పుతుంది. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. ఆ డబ్బును చాలా ఇళ్లల్లో ఆ అమ్మలు, అత్తలు కొడుకు చేతుల్లోనో కోడలు చేతుల్లోనో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ‘ఈ నెల డబ్బు మీ కోసం మీ చలికాలపు అవసరాల కోసం ఉంచుకోండి’ అని చెప్పలేమా? వంట బాధ రోజూ ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నా ఒక్కపూట బజారు నుంచి తెచ్చుకోండి అంటే ‘బజారు టిఫినా’ అని విసుక్కుని రోజు మూడ్‌ని పాడు చేసే భర్తలు ఉంటారు. రోజూ టిఫిన్ చేసే బాధ వేరే ఏ కాలంలో అయినా ఓకే కాని చలికాలం చాలా కష్టం. చలికి పని చేయబుద్ధి కాదు. ఎవరైనా చేసిపెడితే బాగుండు అని భర్తలకు సదా అనిపించినట్టే భార్యలకు అప్పుడప్పుడైనా అనిపిస్తుంది. భోజనం తిప్పలు ఎలాగూ తప్పవు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఎలా ఆ శ్రమ కాస్తంత తగ్గించవచ్చో ప్రతి ఇంటి పురుషులు, పిల్లలు ఆలోచించాలి. ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు, ఆమె చేయకపోయినా మనం చేసుకు తినగలిగే అల్పాహారాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. మనం ఇల్లు కదలకపోయినా తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. వారంలో ఒకటి రెండు రోజులైనా ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి ఆమెను విముక్తి చేస్తే ఆమెకు కలిగే సంతోషం ఆలోచించారా ఎవరైనా? ఆమె సౌందర్యం అవును. చక్కగా ఉండే హక్కు, సౌందర్యాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మగవాళ్లు దీనిని లెక్క చేయొచ్చు చేయకపోవచ్చు. కాని శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... అదనపు ఖర్చే. ఆ ఖర్చు వారు సంపాదించే దాని నుంచైనా భర్త సంపాదన నుంచైనా చేసే వాతావరణం ఇంట్లో ఉండాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధపడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. ఈ కాలంలో జలుబు, త్రోట్ ఇన్ఫెక్షన్లు సహజం. వాటి నుంచి కాపాడేలా ఆమెను వెచ్చని వాతావరణంలో విశ్రాంతంగా ఉంచడం కోసం ఏం చేయొచ్చో ఆలోచించాలి. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. హ్యాపీ వింటర్. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. -
ట్యాంక్‌బండ్‌పై కలకలం: ఒకే రోజు ఐదుగురు మహిళలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ సందర్శకులను ఆకర్షిస్తుండగా ఇప్పుడు బలవన్మరణాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా ఒకేరోజు ఐదుగురు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న లేక్ పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. భర్త వేధింపులు తాళలేక డిప్రెషన్‌తో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. మరో మహిళ ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి ప్రయత్నించగా, ప్రేమ విఫలమైందని ఓ యువతి సాగర్‌లో దూకేందుకు ప్రయత్నించింది. ఇక మద్యానికి బానిసైన ఓ మహిళ కుటుంబ సమస్యలతో కూడా బాధపడుతుండడంతో హుస్సేన్‌సాగర్‌లో దూకింది. ఆత్మహత్యలు నివారించేందుకు అక్కడే గస్తీ కాస్తున్న లేక్ పోలీసులు వారిని వెంటనే కాపాడారు. గజ ఈతగాళ్ల సాయంతో సాగర్‌లో వారిని గాలించి బయటకు తీసుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని లేక్ పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒకే రోజు ఐదుగురు మహిళలు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం హైదరాబాద్‌లో కలకలం రేపింది. -
కోవిడ్ వేళ.. అండగా ఆమె
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ... బాధితులకు మీరు అండగా ఉంటున్నారా? ఉచితంగా..ఉదారంగా సేవలందిస్తున్నారా? ఐసోలేషన్ పేషెంట్లకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నారా? ఆక్సిజన్ అవసరమైన వారికి సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అందించారా? అవసరమైన రోగులకు అంబులెన్స్ వసతి కల్పించారా? మీ సేవలు ఏ రూపంలో ఉంటున్నాయి..మాతో పంచుకోండి. మీకు తెలిసిన వాళ్లు కానీ..మీకు సాయం చేసిన వాళ్లు కానీ ఉంటే స్పందించండి ఆ మనసున్న మారాజుల వివరాలు మాకు ఫొటోలతో సహా పంపించండి ‘సాక్షి’లో ప్రచురిస్తాం. దిగువ తెలిపిన నంబర్లకు వాట్సాప్/మెయిల్ చేయండి. Satyasakshi@gmail.com ( ph.no.. 9912199485 ), Hanumadris@gmail.com ( ph.no ..9160666866 ) నగరానికి చెందిన 7 రేస్ ఫౌండేషన్ సామాన్యులకు ఆసరాగా నిలుస్తోంది. కరోనా సోకిన పేదవారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నట్లు సంస్థ ఫౌండర్ శారద పేర్కొన్నారు. ఈసీఐఎల్, ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి, యాప్రాల్, నేరేడ్మెట్, ఆర్కేపురం తదితర ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 7రేస్‌ని సంప్రదించిన బాధితుల ఇంటి వద్దకే ఆహారం అందిస్తున్నారు. బస్తీల్లో రైస్ కిట్ అందజేస్తున్నారు. ఇందులో పప్పు దిçనుసులు, వంట నూనెతో పాటు నిత్యావసర సరుకులు ఉంటున్నాయి. 99080 88258ను సంప్రదిస్తే ఆదుకుంటామని శారద సూచించారు. నేనున్నాననీ.. స్వచ్ఛంద సంస్థలతో పాటు కొంతమంది వ్యక్తిగతంగానూ ముందుకొచ్చి ఔదార్యం కనబరుస్తున్నారు. వీరిలో నగరానికి చెందిన నవత ఒకరు. కరోనా బాధితులకు నేనున్నాననే భరోసానిస్తున్నారు. 63042 19659ను సంప్రదించిన వారికి నెగెటివ్ వచ్చేంత వరకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. నిమ్స్, గాంధీ, టిమ్స్ తదితర ప్రాంతాల్లో 3500 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశామని నవత తెలిపారు. తనకున్న పరిచయాలతో రక్తదానం కూడా చేయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోనా బాధితులు, పోస్ట్ కోవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా సేవలను అందిస్తోంది హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్. ఈ ఐసోలేషన్ సెంటర్లను 80 బెడ్ల సామర్థ్యంతో మూసాపేట్, అల్వాల్‌లో ప్రారంభించినట్లు సంస్థ ఫౌండర్ హిమజ తెలిపారు. నగరవాసులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. రోగులకు అవసరమైన చికిత్స అందించడానికి డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అవసరమైన మందులు, ఆహారం అందిస్తారు. దిశా ఫౌండేషన్, అభయం ఫౌండేషన్లు సహకారం అందిస్తున్నాయి. అనాథాశ్రమాలకూ అండగా.. నగరంలోని అనాథ, వృద్ధాశ్రమాలకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిసిన్ మాస్క్‌లు, న్యాప్కిన్లు, శానిటైజర్లను అందిస్తున్నారు. ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. సేవలను పొందాలనుకునే వారు 91827 35664ను సంప్రదించవచ్చు. చదవండి: కరోనాతో అనాథలైన చిన్నారులకు చేయూత -
‘రాహుల్‌కు పెళ్లి కాలే.. గర్ల్స్ మీరు వెళ్లొద్దు’
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కేరళలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఈ సమయంలో వ్యక్తిగత దూషణలకు తెర లేచింది. ఈ క్రమంలోనే ఓ మాజీ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మాయిలు రాహూల్ వద్దకు వెళ్లకండి. అతడికి ముందే పెళ్లి కాలేదు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఓ సభలో మాజీ ఎంపీ జోయెస్ జార్జ్ ఆయన మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. ‘‘రాహుల్ గాంధీకి అసలే పెళ్లి కాలేదు. అతడి వద్దకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ కార్యక్రమాలన్నీ మహిళల విద్యాలయాల్లోనే జరుగుతాయి. అక్కడకు వెళ్లి రాహుల్ అమ్మాయిలకు ఎలా వంగాలి?, ఎలా నిలబడాలి? అని నేర్పుతాడు. అందుకే నా ప్రియమైన అమ్మాయిలు రాహుల్ వద్దకు వెళ్లి ఇలాంటి పనులు చేయవద్దు. అతడికి పెళ్లి కాలేదు’ అని జోయెస్ జార్జ్ పేర్కొన్నాడు. రాహుల్ గాంధీ.. సోమవారం కేరళ ప్రచారంలో పాల్గొన్నారు. కొచ్చిలో ఏర్పాటుచేసిన సభలో కొంతమంది అమ్మాయిలకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ మెలకువలను స్వయంగా నేర్పారు. దీన్నిటార్గెట్ చేస్తూ జోయెస్ జార్జ్ మాట్లాడటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు ధర్నా చేపట్టారు. జోయెస్ జార్జ్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. This is also Kerala..!! EX-MP Joyce George said “Rahul Gandhi's programme is such that he will only visit women colleges. He will go there and teach girls to bend. My dear children, please don't bend and stand in front of him. He is not married.”@RahulGandhi #Kerala #Election pic.twitter.com/TaENHud6Xy — Raam Das (@PRamdas_TNIE) March 30, 2021 -
మెట్రో రైలు మహిళా లోకో పైలట్లతో నటుడు సందీప్ కిషన్ స్పెషల్ చిట్ చాట్
-
డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు : ఎక్కడ దాచారంటే..
సాక్షి, ముంబై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కేటుగాళ్లు ఆరితేరిపోతున్నారు. డ్రగ్స్ వ్యాపారాన్ని, దొంగ రవాణాను అడ్డుకునేందుకు నిఘా వర్గం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ దానికి పై ఎత్తులు వేస్తూ మాఫియా ముఠా చెలరేగిపోతోంది. రకరకాల మార్గాల్లో మత్తు పదార్థాలను సునాయాసంగా దేశంలోకి పారిస్తూ, కోట్లరూపాయల దండుకుంటోంది. తాజాగా హెరాయిన్‌ను తరలించేందుకు ముఠా పన్నిన పన్నాగం చూసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులే షాకయ్యారు. మత్తు పదార్థాలను మహిళల గౌన్లకు కుట్టిన బటన్లలో దాచి పెట్టి మరీ ఇంటిలిజెన్స్ అధికారుల కన్ను గప్పాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చివరకు అధికారులకు చిక్కారు. ఈ సందర్భంగా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా రాకెట్‌ను డీఆర్ఐ అధికారులు ఛేదించారు. మహిళల గౌన్లకు అమర్చిన బటన్స్‌లో హెరాయిన్ దాచి కొరియర్ ద్వారా దేశంలోకి తరలిస్తున్న ముఠాను గుర్తించిన అధికారులు 396 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.దక్షిణాఫ్రికా నుండి ముంబైకి కొరియర్ ద్వారా దీన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు వెల్లడించారు. Directorate of Revenue Intelligence (DRI) busted an inter-continental racket of drug smuggling and seized 396 grams of Heroin ingeniously concealed in buttons sewn into women’s gowns sent in a courier consignment from South Africa to Mumbai: DRI pic.twitter.com/JgMuGIphi8 — ANI (@ANI) November 28, 2020 -
ముంబై చూపిన సిగ్నల్
ట్రాఫిక్ సిగ్నల్ మీద ఎవరు ఉంటారు? ఎర్రలైట్ వెలిగినా పచ్చలైట్ వెలిగినా ఆ దీపాల మీద పురుషుడి బొమ్మే ఉంటుంది. మరి స్త్రీలు? స్త్రీలు రోడ్ల మీదకు రారా? పబ్లిక్ స్పేసెస్ మీద వారికి హక్కు ఉండదా? ట్రాఫిక్ సిగ్నల్ విధానం పురుష కేంద్రకంగా ఎందుకు ఉండాలి? ఈ ఆలోచన ఇదివరకే ఇతర దేశాలలో వచ్చింది. మీరు పురుషుణ్ణి ప్రతినిధిగా తీసుకుంటే మేము స్త్రీని తీసుకుంటాం అని జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా తమ ట్రాఫిక్ సిగ్నెల్స్‌లో స్త్రీ సంకేతాన్ని తీసుకోవడం ప్రారంభించాయి. అయితే దీని మీద చర్చలు జరిగాయి. పూర్తిగా పురుషుణ్ణి తీసుకోవడం ఎలా సరికాదో పూర్తిగా స్త్రీని తీసుకోవడం కూడా సరికాదని వ్యాఖ్యానాలు వినిపించాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ‘జెండర్ న్యూట్రల్’గా ఉండటం గురించి అందరూ ఆలోచించాలన్న వాదనలూ వచ్చాయి. అయితే పురుషుడి సంకేతానికి బదులు స్త్రీ సంకేతాన్ని తీసుకోవడం గురించి మెచ్చుకునే వారు ఎక్కువగానే ఉన్నారు. పబ్లిక్ ప్లేసులు స్త్రీలవి కూడా అని ఈ సిగ్నలింగ్ వల్ల చెప్పినట్టయ్యిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా దేశంలో మొదటిసారి ముంబైలో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు పురుషుడి సంకేతం కాకుండా స్త్రీ సంకేతం వాడటం మొదలైంది. ముంబైలో సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న సిద్దివినాయక గుడి నుంచి మహిమ్ వరకు ఉన్న రోడ్డులో అన్ని ట్రాఫిక్ సిగ్నెల్స్లోనూ పురుషులకు బదులు స్త్రీ సంకేతాలను వాడుతున్నారు. వచ్చేపోయేవారు ఈ మార్పును ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఒక కొత్తదృష్టి కలిగినవారై చూస్తున్నారు. అంతా మెదడులోనే ఉంటుంది. దానికి మెల్లమెల్లగా సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళితే పురుషులు తాము జరిగి స్త్రీలకు దక్కవలసిన సమాన భాగం కొరకు ఆలోచిస్తారు. అందుకు ఇలాంటి ప్రయత్నాలు తప్పనిసరి. -
మహమ్మా...చైతన్యం భేషమ్మా!
కేరళ అంటేనే సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. ఆ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లా మహమ్మా గ్రామంలో మహిళల్లో చైతన్యం చూస్తే నగర యువతులు ఎంత వెనుకబడ్డారో అర్థమవుతుంది. మహిళల్లో నెలనెల వచ్చే రుతుస్రావం గురించి బహిరంగంగా మాట్లాడటానికే సంకోచించే సమాజం మనది. అలాంటిది ఆ గ్రామం మాత్రం రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రం గురించి, ప్లాస్టిక్ శానిటరీ న్యాప్కిన్స్ వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి గొంతెత్తి మాట్లాడుతోంది. ఆ గ్రామంలో 700 మంది వరకు మహిళలు ఉంటారు. వారిలో 500 మంది హ్యాపీ పీరియడ్ గురించి ఆలోచన చేస్తున్నారు. శానిటరీ న్యాప్‌కిన్స్‌కి బదులుగా మెనుస్ట్రల్ కప్స్, క్లాత్ ప్యాడ్స్ వాడితే ఎంత సౌకర్యంగా ఉంటుందో తెలుసుకొని తమ అలవాట్లను మార్చుకున్నారు. ఆ ఊరు గ్రామ పంచాయతీ మహమ్మోద్యమం పేరుతో రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన పెంచుతోంది. ఇలా ఆ గ్రామాన్ని మార్చడానికి బెంగళూరుకు చెందిన ఏటీఆర్ఈఈ చొరవ కూడా చాలా ఉంది. అరటి చెట్టు వ్యర్థాలు, పత్తి వంటివి వినియోగించి ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు తయారు చేసిన ఈ రీ యూజబుల్ ప్యాడ్స్‌ను ఆ గ్రామంలో పంచిపెట్టారు. మన యువత ఏ ఆవిష్కరణలోనైనా గో గ్రీన్ అన్న కాన్సెప్ట్‌ని చూస్తూ ముందుకు సాగుతోంది. -
అసమాన అందం
అసమానం అంటే సమానంగా లేకపోవడం. ఇది డిజైనర్ దుస్తులకు బాగా నప్పే విషయం. ధరించే డ్రెస్ డిజైన్ ఎంత హెచ్చు తగ్గులుగా ఉంటే ఆ స్టైల్ అంత ఆకర్షణీయంగా కనిపిస్తుందనేది నేటితరం ఆలోచన. ఆ ఆసక్తిని బట్టి పాశ్చాత్య ఫ్రాక్ డిజైన్స్ మాత్రమే కాదు మన దేశీయ సంప్రదాయ దుస్తుల్లోనూ ఈ స్టైల్‌ని చూపిస్తున్నారు డిజైనర్లు. ఈ అసమాన స్టైల్స్ క్యాజువల్ వేర్‌గానే కాదు సంగీత్, రిసెప్షన్ వంటి పార్టీలకూ కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. సేమ్ కలర్ కట్ పువ్వుల బుటీస్ వచ్చేలా ఎంబ్రాయిడరీ చేసిన గులాబీ రంగు రాసిల్క్ టాప్‌కి, నెటెడ్ మెటీరియల్‌ని జత చేసి డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. స్కర్ట్ పార్ట్‌ని అసిమెట్రిక్స్టైల్లో డిజైన్ చేశారు. లేయర్డ్ స్టైల్ మూడు సమాన లేయర్స్ తీసుకొని అసమానంగా డిజైన్ చేశారు శారీని. ఇది కుచ్చులతో డిజైన్ చేసినది కాదు. అసిమెట్రిక్ కట్‌తో శారీ డిజైన్‌లో తెచ్చిన స్టైల్. కుచ్చులున్న లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్, నడుము దగ్గర బెల్ట్‌ను జత చేస్తే ఈ చీరకట్టు అసమానమైన అందంతో ఆకట్టుకుంటుంది. ఇండోవెస్ట్రన్ రా సిల్క్ పెప్లమ్ బ్లౌజ్‌కి చెక్స్ వచ్చేలా స్వీక్వెన్స్, గోల్డ్ బీడ్స్, జర్దోసీ మిక్సింగ్‌తో వర్క్ చేశారు. దీనికి బాటమ్‌గా శాటిన్ పెన్సిల్ ప్యాంట్(ధోతీ ప్యాంట్) ధరించడంతో ఇండోవెస్ట్రన్ స్టైల్ వచ్చింది. దీనికి జార్జెట్ అసిమెట్రిక్ స్టైల్లో దుపట్టా జత చేశారు. శారీ కట్టు పింక్ ఆరెంజ్ షేడ్ స్వీకెన్స్ శారీని బ్లాక్ బ్లౌజ్‌తో జత చేసి ఈ చీరకట్టులోనే అసిమెట్రిక్ స్టైల్ తీసుకువచ్చారు. బ్లౌజ్‌ని కాలర్ నెక్‌తో పాటు స్ప్రింగ్స్ ఇచ్చి కర్దానా స్టైల్లో డిజైన్ చేసి అంతా చమ్కీ వర్క్‌తో మెరిపించారు. ఎడమవైపు ఫుల్‌గా చీరతో కవర్ చేసి, కుడివైపు చేతికి కొంగును రోల్ చేశారు. సింగిల్ స్లీవ్ బ్లౌజ్ చీరకట్టు సాధారణమే. ప్లెయిన్ శారీ ఏదైనా సింగల్ షోల్డర్ వెల్వెట్ బ్లౌజ్ ఎంపిక ఆకర్షణీయంగా ఉంటుంది. వెల్వెట్ క్లాత్కి ఎంబ్రాయిడరీ చేసి ఒక చేతికి మాత్రమే ఫుల్ స్లీవ్ ఇవ్వడం ఈ బ్లౌజ్ ప్రత్యేకత. అలా ఒక చేతికి ఫుల్ స్లీవ్, మరో చేతికి స్లీవ్‌లెస్‌తో అసిమెట్రిక్ స్టైల్‌ను ఇచ్చారు. స్లీవ్‌లెస్ అసౌకర్యంగా ఉందని భావించేవారికోసం ప్లెయిన్ జార్జెట్ క్లాత్‌ని కుడివైపు నుంచి ఎడమవైపు బ్లౌజ్లోకి సెట్ చేశారు. దీంతో ఒక భిన్నమైన లుక్ వచ్చింది. చీరకట్టులో ఇదొక అసిమెట్రిక్ స్టైల్. అంచు చీరలను కూడా ఇలా డ్రేప్ బ్లౌజ్‌తో అందంగా కట్టుకోవచ్చు. సంగీత్, రెసిప్షన్, పుట్టిన రోజు వంటి వేడుకలకూ ఈ స్టైల్ బాగుంటుంది. కాంట్రాస్ట్ షేడ్స్ కాలర్‌నెక్ ఉన్న ఎల్లో ఆర్గాంజా, లైట్ బ్లూ, హాఫ్‌వైట్ షేడ్స్ ప్యాటర్న్‌తో అసిమెట్రిక్ స్టైల్ ప్యాటర్న్‌ని డిజైన్ చేశారు. ఇది గెట్ టు గెదర్ పార్టీలకు నప్పే డ్రెస్. – తులసి, డిజైనర్ లగ్జరీ కొచ్చర్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఇన్‌స్ట్రాగ్రామ్: tulasidesignofficial -
'అన్నింటికి మహిళలే కారణం'
పురుషులు పెట్టుకునే వివాహేతర సంబంధాల కన్నా, స్త్రీలు పెట్టుకునే వివాహేతర సంబంధాలు భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తాయని, ఆఖరికి.. పిల్లలు, భర్త ప్రాణాలను సైతం అలాంటి మహిళలు ఫణంగా పెడతారని తమిళ దర్శక దిగ్గజం కె.భాగ్యరాజ్ అనడంపై ఇప్పుడు పెద్ద వివాదమే రాజుకుంది. అభ్యంతరకరమైన అతడి వ్యాఖ్యలపై మహిళాలోకం మండిపడుతోంది. యావద్దేశాన్ని షాక్‌కి గురిచేసిన ఘటన ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులోని పొల్లాచ్చిలో బయటపడింది. ఇప్పుడు మళ్లీ దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి, ఆగ్రహావేశాలకు లోను చేసిన ఘటన ఒకటి నిన్న అదే తమిళనాడులోనే జరిగింది! రెండిటికీ ఉన్న సంబంధం.. ‘కరుత్తుగళై పదివు సెయ్’ అనే తమిళ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఈ సినిమా కథకు మూలం పొల్లాచ్చి ఘటన. ఒక గ్యాంగ్ గత రెండేళ్లుగా ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అమాయకులైన స్కూలు బాలికల్నీ, కాలేజీ అమ్మాయిల్నీ, మహిళా టీచర్లనీ వలపన్ని బ్లాక్మెయిల్ చేస్తూ లోబరుచుకోవడం పొల్లాచ్చి ఘటన అయితే, మంగళవారం చెన్నైలోని ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఒకప్పటి దర్శక దిగ్గజం కె. భాగ్యరాజ్.. మహిళలపై తీవ్రమైన ఆరోపణలు చేయడం తాజా ఘటన. ‘‘అసలు ఇలాంటి నేరాలు మహిళల వల్లే జరుగుతున్నాయి’’ అని ఆయన అన్నారు! స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లు అందుబాటులోకి వచ్చాక పెరిగిన అక్రమ సంబంధాలకు, అవినీతి వ్యవహారాలకు మహిళలే ప్రధాన కారణం అని కూడా భాగ్యరాజ్ అన్నారు. అంతేకాదు, పురుషులు పెట్టుకునే వివాహేతర సంబంధాల కన్నా, స్త్రీలు పెట్టుకునే వివాహేతర సంబంధాలు భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తాయని, ఆఖరికి.. పిల్లలు, భర్త ప్రాణాలను సైతం అలాంటి మహిళలు ఫణంగా పెడతారని అన్నారు! దీనిపై ఇప్పుడు పెద్ద వివాదమే రాజుకుంది. నిజానికి అది ఆడియో ఫంక్షన్‌లా లేదు. పనికట్టుకుని మహిళల్ని దూషించడానికి భాగ్యరాజా ఈ ఆడియో ఫంక్షన్‌ను అడ్డుపెట్టుకున్నారా అనే సందేహం కలిగించేలా ఆయన కామెంట్స్ చేశారు. ఒక తమిళ సామెతను కూడా ఈ సందర్భంగా చెప్పారు. ‘‘ఊసి ఇదమ్ కుడుకామ నూల్ నొనళాదు’’ (సూది కనుక సందు ఇవ్వకపోతే దారం అందులోకి దూరలేదు) అన్నారు. ‘‘ఆడవాళ్లు చనువిస్తేనే మగవాళ్లు చొరవ చూపుతారు. అలాంటప్పుడు మగవాళ్లనెందుకు తప్పు పడతాం? పురుషుడు తప్పు చేస్తే ఆ తప్పు అతడితోనే ఉండిపోతుంది. స్త్రీ తప్పు చేస్తే అది కుటుంబం మొత్తానికీ చుట్టుకుంటుంది.ఉదాహరణకు మగాడు ‘చిన్నింటి’ కోసం ఏదైనా చెయ్యనివ్వండి, ఎంతైనా ఖర్చుపెట్టనివ్వండి, తన భార్యకు ఏ కష్టమూ రానివ్వడు. ఏ ఇబ్బందీ కలిగించడు. అదే స్త్రీ ఒక అనైతిక సంబంధం పెట్టుకుంటే బిడ్డల్నీ, భర్తనీ చంపేస్తుంది’’ అని తీవ్రాతి తీవ్రమైన విమర్శలతో మహిళల్ని భాగ్యరాజ్ కించపరిచారు. 20 నిమిషాల తన ప్రసంగం మొత్తం మహిళల నైతికతను శంకించేందుకు ప్రోత్సహించేలా మాత్రమే సాగింది. ‘‘తండ్రి తన కూతురికి ఆమె భద్రత కోసం సెల్‌ఫోన్ కొనిస్తాడు. కూతురు ఆ సెల్‌ఫోన్‌తో చాటింగ్ చేస్తూ తనే స్వయంగా ప్రమాదంలోకి కూరుకుపోతుంది’’ అని ప్రసంగాన్ని ముగించారు. ఆడియో ఫంక్షన్లో భాగ్యరాజ్ మాట్లాడిన ప్రతి మాటకూ చప్పట్ల వర్షం కురిసింది. అయితే కొన్ని గంటల తర్వాత దేశవ్యాప్తంగా అతడిపై తిట్లు, చీత్కారాల వడగండ్లు మొదలయ్యాయి. భాగ్యరాజ్ ఉద్దేశాలను జీర్ణం చేసుకోడానికి అంత టైమ్ పట్టిందంటే అతడెంతగా ఒళ్లు మరిచి మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు. అన్నిటికన్నా దారుణాతిదారుణమైన మాట.. స్త్రీలే తమపై అఘాయిత్యానికి పురుషుల్ని ప్రేరేపిస్తారట!! భాగ్యరాజ్ తమిళంలో అన్న ఈ మాటలన్నీ సోషల్ మీడియాలో అన్ని భాషల్లోకీ నెమ్మది నెమ్మదిగా తర్జుమా అవుతున్న కొద్దీ ఆగ్రహజ్వాలలు అన్నివైపుల నుంచి ఆయన్ని చుట్టుముట్టడం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇప్పటికే తమిళనాడు మహిళా కమిషన్‌కు ఒక లేఖ రాశారు. ‘‘అతడి పురుషాహంకార, స్త్రీద్వేష వ్యాఖ్యలపై, ఆమోదయోగ్యం కాని అతడి ధోరణిపై తక్షణం చర్య తీసుకోవాలి’’ అని పద్మ ఆ లేఖలో కోరారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా భాగ్యరాజ్ కామెంట్లపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అసలు ఇలాంటి కామెంట్ల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారు’’ అని ఆమె ట్వీట్ చేశారు. సినీ దర్శకుడు, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, నిర్మాత అయిన కృష్ణస్వామి భాగ్యరాజ్‌కు మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన తీసిన ‘ముంధనై ముడిచ్చు’, ‘చిన్నవీడు’ వంటి చిత్రాలలో ఔన్నత్యం గల మహిళల పాత్రలు కనిపిస్తాయి. అలాంటిది 66 ఏళ్ల వయసులో భాగ్యరాజ్ ఇలా ఎందుకు మాట్లాడినట్లు?! దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. ఒక్క భాగ్యరాజ్ తప్ప. అయితే అతడు నోరు విప్పాలని ఎవరూ అనుకోవడం లేదు. చెప్పి చెప్పి అలసిపోయాం ‘‘రేప్ జరగడానికి కారణం స్త్రీలే’ అని స్త్రీలను నిందించడం మానేయమని పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లకు చెప్పి అలసిపోయాం. ‘సూది అనుమతిస్తేనే, దారం లోపలకి వచ్చింది’ అనే తరహాలో మాట్లాడటం దయచేసి మానేయండి ప్లీజ్. ఈ ఆలోచనా విధానం వల్ల చాలామంది అమ్మాయిలు చనిపోతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లే రేప్‌కి కారణం స్త్రీలు అంటున్నారు’’ అని గాయని చిన్మయి ట్వీట్ చేశారు. భాగ్యరాజా మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేసి, తన అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చారు. అలాగే భాగ్యరాజా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన కొందరి ట్వీట్లను కూడా చిన్మయి రీట్వీట్ చేశారు. - చిన్మయి, గాయని మనువాద ప్రతినిధి అతను ఈ రకమైన కామెంట్ చేయడం అవగాహన లేమి. మాతృ పరంపరను గుర్తించిన ద్రవిడ సంస్కృతిని అర్థం చేసుకోనితనం. అతను మనువాద, పితృస్వామ్య ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. కట్నంకోసం పురుషులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, కట్నం కోసం ఆడవాళ్లను చంపడం గురించి ఎందుకు మాట్లాడరు? నేరం ఎవరు చేసినా నేరమే! ఆడవాళ్ల మీద మగవాళ్లు వ్యవస్థీకృతంగా చేస్తున్న దారుణాలు, హింస గురించి ఎందుకు మాట్లాడరు? సెల్ఫోన్లు తప్పు అయితే మొత్తానికే తీసిపారేయండి అంతే కాని అది ఆడవాళ్ల దగ్గరుంటే తప్పు.. మగవాళ్ల దగ్గరుంటే కాదా? – దేవి, సామాజిక కార్యకర్త తప్పు వాళ్లది కాదు స్త్రీలు, పురుషులతో సమానంగా హక్కులు పొందడం, అన్ని రంగాల్లో వాళ్ల సమస్థాయిలో ఉండడం మగవాళ్లకు మింగుడుపడ్డంలేదు. తప్పు వాళ్లది కాదు.. మనువాద సంస్కృతిలో పుట్టి పెరిగి.. దాన్నే జీర్ణించుకున్నారు కాబట్టి ఇలాంటి మాటలే మాట్లాడ్తారు. మనువాద సంస్కృతి ప్రభావం వల్ల స్త్రీ ఎదుగుదల పరిస్థితులు వాళ్లకు అర్థంకావు.అర్థమయ్యేలా చేయాల్సిన పాలక, పోలీస్, న్యాయ వ్యవస్థలూ తమ పాత్ర సరిగ్గా పోషించట్లేదు.సెల్‌ఫోన్.. అందరికీ అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టూల్. పెరిగిన అవసరాల్లో అది అందరికీ అత్యంత అవసరం. దానికి, స్త్రీల ప్రవర్తనకు లింక్ పెట్టడమేంటి? ఆయన అజ్ఞానం, అహంకారం బయటపడ్డం తప్ప ఇంకేం లేదు. ఈ దుస్థితి పోవాలంటే సమాజంలో సమూలమైన మార్పు రావాలి. స్త్రీ, పురుష సమానత్వం గురించి రాజ్యాంగం చెప్పిన విషయాలను.. అసలు ఆ మాటకొస్తే రాజ్యాంగం కచ్చితంగా అమలయ్యేలా చూస్తే చాలు.. ఇలాంటి అభిప్రాయాలు, మాటలు వినిపించవు. – గెడ్డం ఝాన్సీ నేషనల్ కన్వీనర్, దళిత స్త్రీ శక్తి -
బురఖాతో లేడీస్ టాయ్లెట్లోకి...అరెస్ట్
పనాజీ : బురఖా ధరించి మహిళల టాయ్లెట్లోకి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ సంఘటన పనాజీ సెంట్రల్ బస్టాండ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... విర్గిల్ ఫెర్నాండేజ్ (35) ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్ టాయ్లెట్లోకి వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతగాడిపై సెక్షన్ 419 కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు ఈ చర్యకు ఎందుకు పాల్పడాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
స్త్రీలోక సంచారం
♦ దేశంలోని హైకోర్టులలో మహిళా జడ్జీలు 9 శాతమే. మొత్తం 24 హైకోర్టులకు 1,221 మంది జడ్జీల నియామకం జరగగా ప్రస్తుతం 891 మంది జడ్జీలు మాత్రమే విధుల్లో ఉన్నారు. వాళ్లలో మహిళా జడ్జీల సంఖ్య కేవలం 81. ♦ వారం రోజులుగా ఈజిప్ట్‌లో జరుగుతున్న వరల్డ్ యూత్ ఫోరమ్ ఫెస్టివల్ భారత కాలమానం ప్రకారం శనివారం ముగిసింది. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న దేశీ వనిత, ఆల్ లేడీస్ లీగ్ (ఏఎల్ఎల్), విమెన్ ఎకనమిక్ ఫోరమ్‌ల వ్యవస్థాపకురాలు, ఆ సంస్థల గ్లోబల్ చైర్పర్సన్ డాక్టర్ హర్‌బీన్ అరోరా ప్రెసిడెన్షియల్ ఆనర్ పొందారు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతే అల్ సిసి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ప్రెసిడెన్షియల్ ఆనర్ పొందిన మొదటి భారతీయురాలిగా డాక్టర్ హర్‌బీన్ అరోరా అరుదైన మరో గౌరవానికీ పాత్రులయ్యారు. ♦ ‘‘ప్రస్తుతం మనకున్న టెక్నాలజీ, అవకాశాలను ఉపయోగించుకొని క్షేమంగా మనిషిని అంతరిక్షంలోకి పంపగలం.. అంతే సురక్షితంగా తిరిగి భూమికి రప్పించగలం’’ – ఇస్రోలోని హ్యూమన్ స్పేస్ ఫ్లయిట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వీఆర్ లలితాంబికా నోట ఆమె ఆత్మవిశ్వాసం పలికించిన మాట ఇది. మైసూరు పట్టణంలో శుక్రవారంనాడు స్వదేశీ విజ్ఞాన ఆందోళన కర్ణాటక సంస్థ నిర్వహించిన పదకొండో నేషనల్ విమెన్స్ కాంగ్రెస్ సదస్సులో ‘మేరీ క్యూరీ మహిళా విజ్ఞాన పురస్కారం’’ అవార్డుతో లలితాంబికను సత్కరించారు. ‘ఎనాబ్లింగ్ మదర్‌హుడ్ అండ్ ఎనేబ్లింగ్ విమెన్ ఫర్ లీడర్షిప్ ఇన్ సైన్స్’ థీమ్‌తో ఈ సదస్సు సాగింది. న్యాయస్థానాల్లో జడ్జీలుగా స్త్రీలు తొమ్మిది శాతమే ఉన్నా.. ఇంకోచోట హైరార్కీలో పన్నెండు శాతమే ఉన్నా.. స్పేస్ చాలెంజెస్లోనూ విజయం సాధిస్తామని చెప్పే ఆడవాళ్లూ తక్కువే అయినా.. అసలంటూ ఉన్నారు. ఆ ఉనికి చాలు.. మిగిలిన మహిళలు స్ఫూర్తిగా తీసుకొని రాశి పెరగడానికి... అవకాశాలు రావడానికి! -
మెట్రో: లేడీస్ సీట్లో కూర్చుంటే రూ.500 జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రో రైళ్లలో మహిళలకు కేటాయించిన సీట్లలో పురుషులు, ఇతరులు కూర్చుంటే వారికి రూ.500 జరిమానా తప్పదని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్లో మెట్రో అధికారులు, ఎల్ అండ్‌టీ ఉన్నతాధికారులతో జరిగిన సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే వారికి జరిమానా విధించాలని ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. ఈ విషయంలో ప్రతి మెట్రో బోగీలో ఎల్అండ్టీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు నిఘాను పెంచాలని ఆదేశించామన్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులు తమకెదురైన అసౌకర్యాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ వాట్సప్ నంబరు కేటాయించాలని ఎల్అండ్టీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లు, పరిసర ప్రదేశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటాలని, స్టేషన్ పరిసరాలను అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం మెట్రో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పోలీసు అధికారులతో ఒక ప్రత్యేక ఎన్ఫోర్స్ మెంట్ టీంను ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని అధికారులు ఎప్పటికప్పుడు మెట్రో ప్రయాణికులకు, పాదచారులకు ఎలాంటి అసౌకర్యం కలగనిరీతిలో కృషి చేయాలని అన్నారు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకూ, నాగోల్– అమీర్‌పేట్ వరకూ గల మెట్రోమార్గంలో మెట్రో స్టేషన్ల పరిసరాలలో ఇంకా మిగిలివున్న సివిల్ పనులన్నింటినీ వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే తగిన అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులను మెట్రో ఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్అండ్ టీ మెట్రోరైలు మేనేజింగ్ డైరక్టర్, కె.వి.పి.రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎల్అండ్టీ మెట్రోరైలు అనిల్ సహాని, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనందమోహన్, హైదరాబాద్ మెట్రోరైలు ఉన్నతాధికారులు విష్ణువర్థన్, బి.యన్.రాజేశ్వర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
లేడీస్ స్పెషల్ ప్లీజ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని బస్టాప్‌లలో ప్రయాణికులు తమ గమ్యం చేర్చే సిటీ బస్సు కోసం గంటల తరబడి ఎదురు చూస్తుంటారు.. అది ఎప్పుడు వస్తుందో ఎవరన్నా చెప్పగలరా..? వచ్చిన బస్సు బస్‌బేలో ఆగాలి.. అలా ఎప్పుడన్నా, ఎక్కడన్నా జరిగిందా? వస్తే బస్సులన్నీ ఒకేసారి వరుసకడతాయి.. లేదంటే ఒక్కటీ కనిపించదు. ఆలాంటప్పుడు విసిగిపోయిన ప్రయాణికులు ఏ ఆటోనో.. మరో ప్రవేట్ వాహనాన్నో నమ్ముకుంటారు. ఇది ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియందికాదు. ప్రయాణికుల నమ్మకం సంపాదించలేని సంస్థకు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? అయినా వారు పట్టించుకోరు. ఎందుకంటే సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా వారికి ప్రతినెలా జీతాలు వస్తాయి గనుక. ఇదే అంశాన్ని నిపుణల కమిటీ తేల్చి చెప్పింది. ప్రయాణికులకు నమ్మకమైన, సురక్షితమైన రవాణా సదుపాయాన్ని కల్పించినప్పుడే గ్రేటర్ ఆర్టీసీలో నష్టాలు తగుతాయని కమిటీ చెప్పింది. ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల రవాణా సదుపాయాలను విస్తృతం చేయాలని సూచించింది. అన్ని సమయాల్లోనూ తమ కోసం సిటీ బస్సు అందుబాటులో ఉందన్న భరోసాను కల్పించాలంది. ఉబర్, ఓలా వంటి క్యాబ్‌ల తరహాలో సిటీ బస్సులు సైతం మహిళా ప్రయాణికులకు అనుకూలమైన సేవలను అందజేయాలని చెప్పింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు, సరైన దిశానిర్దేశానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ప్రతినిధులు అన్ని రంగాల్లో ఆర్టీసీపై సమగ్రమైన అధ్యయనం చేశారు. కొద్ది రోజుల క్రితం బస్‌భవన్‌లో జరిగిన సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ నష్టాలపై కమిటీ దృష్టి సారించింది. ఆర్టీసీ స్థలాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను పెంపొందించడంతో పాటు, మెజారిటీ ప్రయాణికులైన మహిళల రవాణా సదుపాయాలకు అనుగుణంగా సిటీ సర్వీసులను విస్తరించాలని స్పష్టం చేశారు. ఇప్పటికి అరకొర సర్వీసులే.. గ్రేటర్ సిటీ బస్సుల్లో ప్రతిరోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 15 లక్షల మందికి పైగా మహిళలే. సొంత వాహనాల్లో ప్రయాణించేవారి సంఖ్య తక్కువే. మరోవైపు ఓలా, ఉబర్ వంటి క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాక వాటినికి వినియోగించుకొనే మహిళల సంఖ్య పెరిగింది. నమ్మకమైన, కచ్చితమైన సర్వీసులు క్యాబ్‌ల నుంచి లభించడమే ఇందుకు కారణమని కమిటీ అభిప్రాయపడింది. క్యాబ్‌ల తరహాలో సిటీ బస్సుల్లో కూడా మహిళలకు ప్రత్యేక సేవలు ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 59 ‘లేడీస్ స్పెషల్’ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఈ బస్సులు సైతం కేవలం ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం వేళల్లో తిప్పుతున్నారు. ఈసీఐఎల్, సికింద్రాబాద్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, కుషాయిగూడ, మిధాని, అల్వాల్, కూకట్పల్లి, తదితర ప్రాంతాల నుంచి సెక్రటేరియట్, నాంపల్లి, గాంధీభవన్, లక్డీకాపూల్ వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం7 నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వీటిని నడుపుతున్నారు. అలా కాకుండా అన్ని వేళల్లో, అన్ని ప్రధాన రూట్లలో లేడీస్ స్పెషల్స్‌ను పెంచాలి. తమ కోసం ప్రత్యేక బస్సులు ఉన్నాయనే నమ్మకాన్ని కలిగించాలి. పైగా ఈ బస్సుల్లో భద్రతా సదుపాయాలు ఉండాలని నిపుణులు సూచించారు. టిక్కెట్టేతర ఆదాయం పెంచాలి ఆర్టీసీ సొంత స్థలాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను అభివృద్ధి చేయడం ద్వారా టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకోవాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. నిపుణుల కమిటీ కూడా ఇదే అంశంపై ప్రధానంగా చర్చించింది. ప్రస్తుతం కోఠి, చార్మినార్, హయత్‌నగర్, ఈసీఐఎల్, కూకట్పల్లి, కాచిగూడలో ప్రయాణికుల ప్రాంగణాలు ఉన్నాయి. అక్కడ నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కూకట్పల్లి, ఈసీఐఎల్, హయత్‌నగర్ వంటి కొన్ని బస్స్టేషన్లలో ఆశించిన ఆదరణ లభించకపోవడం వల్ల కాంప్లెక్సులు ఖాళీగానే ఉన్నాయి. మరోవైపు జూబ్లీ, మహాత్మ గాంధీ బస్‌స్టేషన్‌లో ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలను పెంచాలని, మినీ థియేటర్ల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని ఆర్టీసీ మొదటి నుంచి భావిస్తోంది. కానీ వ్యాపార వర్గాల నుంచి పెద్దగా డిమాండ్ కనిపించకపోవడంతో ఇప్పటి దాకా కమర్షియల్ కార్యకలాపాలు మొదలు కాలేదు. నిపుణులు కమిటీ సైతం ఇటీవల ఇదే అంశంపై చర్చించింది. టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ స్థలాలపై అధ్యయనం చేపట్టింది. గ్రేటర్లో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. వాటిలో కనీసం 10 డిపోల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్ల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందవచ్చునని సూచించింది. ‘గ్రేటర్ ఆర్టీసీ ప్రస్తుతం రూ.430 కోట్లకు పైగా నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను అధిగమించేందుకు నిపుణుల కమిటీ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. లోతుగా అధ్యయనం చేస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. -
మహిళా కంటెస్టంట్లకు క్లాస్ పీకిన బిగ్‌బాస్
సాక్షి, చెన్నై: తమిళంలో గత ఏడాది ప్రారంభమైన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో ఇప్పుడు సీజన్-2 నడుస్తోంది. మొదటి భాగానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమలహాసన్‌నే ఈ సీజన్‌కు ఆ బాధ్యతను చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సీజన్లో బిగ్‌బాస్ కుటుంబసభ్యులుగా పాల్గొన్న వారిలో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని కమలహాసన్ ఖండించారు. ఆదివారం ఎపిసోడ్లో పాల్గొన్న కమలహాసన్ బిగ్‌బాస్ సభ్యుల్లో నటుడు మహత్ రాత్రివేళ మహిళల గదిలో పడుకోవడం, అతను, నటి యాషికా సన్నిహితంగా ఉండడం వంటి సంఘటనపై సహ కుటుంబ సభ్యుడు పొన్నంబళంని తీవ్రంగా ఖండించారు. మహిత్, యాషికా, ఐశ్వర్యదత్ల అసభ్య ప్రవర్తన ఆయనకు నచ్చలేదు. ఇక్కడ కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, అలా జరగకూడదని, ఈ షోను ఆబాలగోపాలం వీక్షిస్తున్నారని, మనకంటూ ఓ సంప్రదాయం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు పొన్నంబళం వ్యాఖ్యల్ని కమలహాసన్ సమర్థించారు. పొన్నంబళం, వైద్యనాథన్ బిగ్‌బాస్ హౌస్‌పై మర్యాద కలిగిన వారని పేర్కొన్నారు. మగవారు చేసే తప్పులను మహిళలు చెయ్యకూడదని, పురుషులు కంటే కూడా మంచి కార్యాలను చేసి స్త్రీలు వారిని మార్చవచ్చునని వారికి క్లాస్ పీకారు. సద్వినియోగం చేసుకోండి: మీరు ఇంకా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోలేదని కమల్‌హాసన్ అన్నారు. దీన్ని మీరు హితబోధ అనో, హెచ్చరికగానో, టిప్స్ అనో ఏదైనా అనుకోండని అన్నారు. మీకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సినిమాలో తానూ అలానే మంచి పేరు సంపాదించానని చెప్పారు. ఆరంభంలో తననెవరూ పట్టించుకోలేదన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు కే.బాలచందర్ దృష్టిలో పడేలా కొన్ని కార్యాలు చేసి పేరు తెచ్చుకున్నానని తెలిపారు. మీరు మీరుగా ఉంటూ ఇక్కడ తప్పులను సరిదిద్దుకోండని కమలహాసన్ హితవు పలికారు. -
రామప్పలో కచ్చడాల దురాచారం?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాంఘిక దురాచారాల్లో ఒకటిగా పరిగణించే ఇనుప కచ్చడాల దురాచారం కాకతీయుల కాలంలో అమలులో ఉందా? అంతః పుర కాంతల శీలం కాపాడేందుకు ఈ దుర్మార్గపు సంప్రదాయాన్ని వారేమైనా అమలు చేశారా? లేదా అమానవీయమైన ఈసంస్కృతి కాకతీ యు ల కాలంలోనే అంతరించిపోయిందా ? అంటే.. అవుననే చర్చకు తెరతీస్తున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపేశ్వరాలయంతోపాటు రామప్ప ఆలయంపై ఉన్న స్త్రీల శిల్పాలు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు కావడంతో నాటి పరిస్థితికి ఇవి అద్దం పడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయుల కాలంలో శిల్పకళ ఉన్నత స్థితిలో వర్ధిల్లింది. రామప్ప ఆలయమే ఇందుకు ఉదాహరణ. కాకతీయుల కాలంలో అనేక ఆలయాలను నిర్మించారు. వీటిలో రామ ప్ప, గణపురం కోటగుళ్లు ప్రముఖమైనవి. గణపు రం కోటగుళ్లలోని ప్రధాన ఆలయంలో శివుడు ఆరాధ్య దైవం. ఇక్కడ మొత్తం 22 ఆలయాలు ఉన్నాయి. వీటి చుట్టూ మట్టి కోట నిర్మాణం ఉంది. కాకతీయుల కాలంలో గణపురం కోటగుళ్లు ఉన్న ప్రదేశం గొప్ప సైనిక స్థావరంగా ఉండేది. ప్రస్తుతం ఆ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ నిత్యం పూజలు జరుగుతున్నాయి. పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ప్రధాన ఆలయం ఎడమ వైపు ఉన్న గోడపై వివిధ శిలాకృతులు ఉన్నాయి. ఇందులో రెండు స్త్రీ శిల్పాలు లోహ కచ్చడాలను ధరించినట్లుగా చెక్కారు. అలాగే రామప్ప ఆలయంపైన కూడా ఇలాంటి శిల్పాలే ఉన్నాయి. తేల్చాల్సిన విషయమే.. గణపేశ్వరాలయం ప్రధాన ఆలయం ఎడమవైపు గోడతోపాటు మట్టికోటలోనే హరిత హోటల్ వద్ద భద్రపరచిన శిల్పాల్లో మరొకటి ఇదే తరహాలో ఉంది. ఈ శిల్పం ఉన్న తీరులో ఎలాంటి లైంగిక భంగిమలకు ఆస్కారం లేదు. అంతేగాక శృంగారోద్దీపన లేదు. మిగతా శరీర వస్త్రాలను చూపించడం లేదు. కేవలం అంతవస్త్రంలాంటిది తొలగిస్తున్న మహిళగా ఈ శిల్పం ఉంది. ఈ వస్త్రాన్ని చెక్కిన తీరు అచ్చం ఇనుప కచ్చడాలను పోలి ఉండడంతో సరికొత్త చర్చ మొదలైంది. పూర్వ కాలంలో అంతఃపురం స్త్రీల విషయంలో ఇనుప కచ్చడాలను అమలు చేసే దురాచారం అమలులో ఉండేది. ఆ దిశగా శిల్పాన్ని పరిశీలించగా వివిధ దేశాల్లో, వివిధ కాలాల్లో ఉన్న ఇనుప కచ్చడాలకు ఈ శిల్పానికి సారుప్యతలు ఉన్నా యి. దీంతో ఇది ఇనుప కచ్చడమేనా అనే దిశగా చర్చ మొదలైంది. అయితే కాకతీయుల కాలంలో ఇనుప కచ్చడాల సంస్కృతి అమల్లో ఉన్నట్లుగా నాటి కావ్యాల్లోగానీ మరెక్కడా ఆధారాలు లభించలేదు. ఇప్పటి వరకు లభించిన శాసనాలు, ఆలయాల్లో ఈ తరహా శిల్పాలు లేవు. దీంతో ఈ విషయంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు ఈ శిల్పానికి కాలక్రమంలో మార్పులు చేసినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లభిం చడం లేదు. అందువల్ల గణపురంలో, రామప్ప ఆలయంలో వెలుగు చూసిన స్త్రీ శిల్పాల్లో ధరించింది అంగవస్త్రమా లేక ఇనుప కచ్చడమా తేలాల్సి ఉంది. మరిన్ని ఆధారాలు కావాలి :కట్టా శ్రీనివాస్, చరిత్ర పరిశోధకుడు గణపేశ్వరాలయం నిర్మాణ సమయంలో ఇనుప కచ్చడాల దురాచారం అమలులో ఉందా లేదా అనేది తెలియదు. ఒక వేళ ఉంటే ఆ సమయంలో ఎలాంటి ఉద్యమం నడిచిందో, ఎలాంటి విప్లవా త్మక రాజాజ్ఞ పనిచేసిందో తెలియదు. ఆడామగా సమానమనే కనీస స్పృహ లేకుండా ఆడవాళ్లను కేవలం వస్తువులుగా, పెంపుడు జంతువులుగా లేదా అంతకంటే హీనంగా పరిగణించే ఈ సంస్కృతిని తప్పుబడుతూ వీటిని ఉపయోగించడం నిషిద్ధంలాంటి ఆజ్ఞ వచ్చి ఉంటే ఆ చారి త్రాత్మక పరిణామాన్ని సూచించేందుకు ఈ శిల్పం చెక్కారేమో అని భావించేందుకు ఆస్కారం ఉంది. కాకతీయులకు సంబంధించి మరెక్కడ ఇలాంటి శిల్పాలు లేవు. కాబట్టి ఈ అంశంపై మనకు లభించిన ఆధారాలను క్రమంలో పేర్చుకుంటూ ఇలా అయి ఉండవచ్చు అనేది హైపో థిసీస్ అవుతుంది. ఇది నిజమా లేక అబద్ధమా అని నిర్ధారించేందుకు పటిష్టమైన ఆధారాలు లభించాలి. దురాచారం వచ్చిందిలా .. పూర్వకాలంలో తమ సంపదను దాచుకునే అనేక పద్ధతుల్లోనే అంతఃపుర కాంతల శీలం కాపాడటం లేదా కేవలం తమ అదుపాజ్ఞల్లో ఉంచడం అనే ఆలోచనలతో ఇనుప కచ్చడాలు అనే దురాచారం రాజులు అమలు చేసేవారు. వీటికి సంబంధించి ఓరగచ్చ, కక్షాపటం, కచ్చ, కచ్చ(డ)(ర)ము, కచ్చటిక, కచ్చము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గో(ణ)(ణా)ము, గోవణము, చీరము, తడుపు పుట్టగోచి, పొట్టము, పొటముంజి, బాలో పవీతం, బొట్టము, లంగోటి ఈ పేర్లన్నీ కూడా లోదుస్తులు అనే దానికి పర్యాయపదాలు. లోహలతో తాళం తీసి వేసేందుకు వీలుగా లో దుస్తులను రూపొందించారు. వీటిని ఇనుముతో చేస్తే ఇనుప కచ్చడాలు అని అని లోహంతో అయితే లోహకచ్చడాలు అని అనడం పరిపాటి. ఈ అంశంపై ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు ఇనుప కచ్చడాలు పేరుతో పుస్తకం రాశారు. కాలకృత్యాలకు అడ్డురాకుండా ఉంటూ లైంగిక కార్యకలాపం జరపడానికి వీలులేకుండా ఇనుము లేదా లోహంతో తయారు చేసిన కచ్చడాలను స్త్రీలు తమ మొల చుట్టూ ధరించడం ఈ దురాచారంలో భాగం. ఇవి శరీరానికి ఒరుసుకు పోకుండా లోపటి వైపు తోలు గుడ్డ వంటి మెత్తలను ఉంచేవారు. బహుశా కాలక్రమంలో ఈ సంస్కృతే సిగ్గుబిల్ల, మరుగు బిళ్లలుకు దారితీశాయనే వాదనలు ఉన్నాయి. సంస్కృతంలో పిప్పలదనము అని, ఆంగ్లంలో ఫిగ్ లీఫ్‌గా పేర్కొన్నారు. జపాన్‌లోనూ ఇలాంటి సంస్కృతి ఉన్నట్లు ఆధారాలున్నాయి. రావి ఆకు ఆకారంలో ఉండే ఈ కచ్చడాలకు నడుముపై వడ్డాణంతో బంధించేవారు. వీటికి తాళాల ను బిగించేవారు. ఎవరుగాని, ఎలాంటి మారుతాళంతోగాని వీటిని తెరవడానికి వీలులేకుండా ఉండే విధంగా కొత్త తాళాలు తయారుచేసేవారు. కాలక్రమంలో అమానవీయ దురాచారం కనుమరుగైంది. -
ఘనంగా గణ్‌గౌర్ పండుగ
ఎదులాపురం(ఆదిలాబాద్): ఆదిలాబాద్ పట్టణంలో గణ్‌గౌర్ పండుగను మార్వాడీ మహిళలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగ అనంతరం రెండో రోజు నుంచి 16 రోజుల వరకు మాంగల్య సౌభాగ్యం కోసం గణ్‌గౌర్ (శివ పార్వతుల) ప్రతిమలతో వ్రతాన్ని మహిళలు చేపట్టడం ఆచారం. ఇందులో భాగంగానే ఇక్కడి మార్వాడీ మహిళలు 16 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతాన్ని ఆచరించారు. చివరి రోజు పట్టణంలోని రాణిసతీజి మందిర్ నుంచి శోభయాత్రగా వెళ్లి స్థానిక ఖానాపూర్ చెరువులో ప్రతిమలను నిమజ్జనం చేశారు. రాజస్తానీ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలి అధ్యక్షురాలు రూప డోక్వాల్, ఉపాధ్యక్షురాలు ఆశ అగర్వాల్, మమత మకారియా, కాంత షాష, సీమ భగవత్, మార్వాడీ మహిళలు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువతుల వీరంగం
-
హ్యాపీ జర్నీ
అత్యవసర పనుల రీత్యా ఆడవారు దూర ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది. గబగబా సామాన్లు సర్దుకుని రైలు ఎక్కడానికి స్టేషన్‌కి వచ్చేస్తారు. తీరా అక్కడికి వచ్చాక అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆడవారికి నెలసరి సమస్య సహజం. ఆ సమయంలో అవసరమయ్యే న్యాప్కిన్లు మరచిపోతే ... ఆ ఇబ్బంది రెట్టింపవుతుంది. వారి అవసరాలకు అనుగుణంగా భోపాల్ రైల్వే స్టేషన్ శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మెషీన్‌ను ప్రారంభించింది. సాధారణంగా అన్ని రైల్వే స్టేషన్లలోనూ టికెట్ కౌంటర్, ప్యాసెంజర్ హెల్ప్ డెస్క్, తిండి పదార్థాల స్టాల్స్, వెయిటింగ్ రూమ్స్... కనిపిస్తాయి. భోపాల్ రైల్వే స్టేషన్ ఒక అడుగు ముందుకు వేసింది. అతి తక్కువ ధరకే శానిటరీ న్యాప్కిన్స్ అందించే మెషీన్‌ను రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసింది. ఒక శానిటరీ న్యాప్కిన్ ఐదు రూపాయలే. ఒక్కొక్కరు రెండు న్యాప్కిన్స్ తీసుకోవచ్చు. భోపాల్ రైల్వే మహిళా సంక్షేమ శాఖ ఈ మెషీన్‌కి ‘హ్యాపీ నారీ’ అని పేరుపెట్టింది. జనవరి 1, 2018 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రాజకీయ నాయకులు, అధికారులు కాకుండా, రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగి అంజలి థాంకూ ఈ మెషీన్ ను ప్రారంభించారు. ఈ సదుపాయం నచ్చడంతో ఎంతోమంది ముందుకు వచ్చి న్యాప్కిన్లను ఉచితంగా అందించారు. స్థానికంగా ఉన్న ఆరుషి అనే ఎన్జీవో ప్రతినిధులు 500 న్యాప్కిన్లను ఉచితంగా అందించారు. మెషీన్ ప్రారంభించిన పది గంటలలోపే 600 న్యాప్కిన్లను మహిళలు ఈ మెషీన్ నుంచి తీసుకున్నారు. ఈ మెషీన్‌ను తయారీకీ, సిబ్బందికీ అయిన ఖర్చు కేవలం రూ. 20 వేలు మాత్రమే. భోపాల్ డివిజన్ రైల్వే మేనేజర్ శోభన్ చౌదరి ఆలోచన నుంచి ఏర్పడినదే హ్యాపీ నారీ. ‘ఇది ఒక మంచి ఆలోచన. రైళ్లలో ప్రయాణం చేసే మహిళలు పీరియడ్స్ సమస్య వల్ల ఇబ్బంది పడకుండా ఈ మెషీన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ ప్రయాణికులకు సైతం అందుబాటలో ఉండేలా అతి తక్కువ ధరకు అందచేస్తున్నారు’ అంటున్నారు చౌదరి. కేవలం రైలు ప్రయాణికులు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న సామాన్యులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మెషీన్‌ను ఎలా ఉపయోగించాలి, న్యాప్కిన్స్ లోడ్ చేయడం, డబ్బులు వేయగానే బయటకు తీయడం... వంటి అంశాలలో రైల్వే ఉద్యోగులకు ఎన్జీవోలు శిక్షణ ఇస్తున్నారు. వారు ఇక్కడితో ఆగిపోవట్లేదు. మరొక కొత్త ఆలోచన చేస్తున్నారు. ఉపయోగించిన న్యాప్కిన్లను పారేయడానికి అనుగుణంగా మహిళలు వేచిచూసే గదుల దగ్గర, వీటిని కాల్చి బూడిద చేసే యంత్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ వెండింగ్ మెషీన్ విధానం విజయవంతమైతే కనుక, మరిన్ని న్యాప్కిన్ మెషీన్లను మధ్య ప్రదేశ్ అంతటా ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్జీవోలతో పాటు, కొన్ని కంపెనీల దగ్గరకు కూడా వెళ్లి, తక్కువ ధరలకు న్యాప్కిన్స్ను సరఫరా చేయమని అడగాలనే ఉద్దేశంతో ఉన్నారు. మహిళలకు అత్యవసరమైన న్యాప్కిన్లను ఈ విధంగా సరఫరా చేస్తున్న భోపాల్ రైల్వే అధికారులను ప్రశంసించడమే కాకుండా, వారిని స్ఫూర్తిగా తీసుకుని అన్ని రైల్వే స్టేషన్లలోనూ వీటిని ఏర్పాటుచేస్తే బావుంటుందని మహిళలు భావిస్తున్నారు. -
ఇద్దరు యువతుల వివాహం
సాక్షి, జమ్మలమడుగు: సాధారణంగా పెళ్లి అంటే యువతి, యువకుడికి జరుగుతుంది. కానీ విపరీత ధోరణుల కాలం కావడంతో ఓ యువతి మరో యువతిని వివాహమాడిన సంఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. మౌనిక, రమాదేవి అనే ఇద్దరు యువతులు వివాహం చేసుకున్నారు. రమాదేవి మగ అవతారమెత్తి మౌనిక అనే యువతిని వివాహం చేసుకుంది. విషయం తెలిసిన మౌనిక బంధువులు జమ్మలమడుగు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, గతంలోనూ రమాదేవికి మరో ఇద్దరు యువతులతో వివాహమైనట్లు తెలుస్తోంది. వింత పెళ్లి..పెద్ద లొల్లి -
ముద్రగడకు పెరుగుతున్న మద్దతు
కిర్లంపూడికి తరలివచ్చిన పలువురు నాయకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పద్మనాభం పిలుపు కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ స్వగృహానికి మంగళవారం తూర్పు ,పశ్చిమగోదావరి జిల్లాల నుండి భారీ సంఖ్యలో కాపు నాయకులు, మహిళలు, పలువురు అభిమానులు , ఎస్సీ, బీసీ కులాలకు చెందిన నాయకులు ముద్రగడ ఇంటికి భారీగా తరలివచ్చి ముద్రగడకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ముద్రగడ చేసే ఉద్యమానికి రిజర్వేషన్ సాధించే వరకు తమ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు కాపునాయకులు, మహిళా నాయకులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చిన కాపులను మహిళలను ఉద్ధేశించి ముద్రగడతో పాటు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, తోట రాజీవ్ , ఆరేటి ప్రకాశ్, గౌతు స్వామి, జీవీ రమణ, తుమ్మలపల్లి రమేష్ తదితరులు మాట్లాడుతూ కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల సమయంలోనూ, మేనిఫెస్టోలోనూ కాపులకు ఇచ్చిన హామీలనే తప్ప అదనంగా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ఇచ్చిన హామీలను గుర్తుచేయడం కోసం ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రను అడ్డుకోవడమే కాకుండా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ముద్రగడ పాదయాత్ర ఆగదని ఇచ్చిన హామీలను సాధించుకునే వరకు ఉద్యమం తీవ్రతరం చేయాలని కాపునాయకులకు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ముద్రగడను కలిసేందుకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, తణుకు, తూర్పు గోదావరి జిల్లా నుండి రాజోలు, కత్తిపూడి, గొల్లప్రోలు , రాయవరం , కొత్తపేట , కాకినాడ, కరప, ఉలిమేశ్వరం, విజయనగరం జిల్లా నుంచి భారీ సంఖ్యలో కాపు నాయకులు మహిళలు తరలివచ్చారు. ఆయన కలిసిన వారిలో మలకల చంటిబాబు, నర్సే సోమేశ్వరరావు, మాకా శ్రీనివాసరావు, గుండుబోగుల నాగు, మారిశెట్టి అజయ్, కొత్తపల్లి సుబ్బలక్ష్మి, పెన్నాడ సూరిబాబు, గౌతు సుబ్రహ్మణ్యం, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సంగిశెట్టి వెంకటేశ్వరరావు, గండేపల్లి బాబి, అడబాల శ్రీను, తోట బాబు, తూము చినబాబు, ఆడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
నిలదీస్తేనే నీళ్లిస్తారా?
గుండెపూడి మహిళల ఆగ్రహం రహదారిపై బైఠాయింపు ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టుకు తాళం వేసి నిరసన 144 సెక్షన్ అమల్లో ఉండగా ఆందోళనలు తగదన్న ఎస్సై ఆగమేఘాలపై వచ్చిన అధికారులకు సూచనలు సమస్య పరిష్కారానికి హామీతో ఆందోళన విరమణ అల్లవరం : శివారు ప్రాంతాల్లో జీవించడం మేము చేసుకున్న పాపమా.. చుక్క తాగునీటి కోసం రోజులు తరబడి వేచిచుడాలా.. ఓట్లు వేళ వంగి వంగి దండాలు పెట్టే నాయకుల్లారా మేము తాగునీటికి పడుతున్న కష్టాలు కనిపించడం లేదా అని మహిళలు ప్రశ్నించారు. ధర్నాలు చేస్తేనే సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగమేఘాల మీద వస్తారనేది గురువారం నిరూపణ అయింది. గుండెపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పోతులవారిపేట, పల్లిపాలేనికి చెందిన గ్రామస్తులు గుండెపూడి ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టు ఎదురుగా మెయిన్‌రోడ్డుపై గురువారం ధర్నాకు దిగారు. తొలుత ఆందోళనకారులు తాగునీటిని పంపింగ్ చేసే ప్రదేశంలో గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే ఓహెచ్‌ఆర్‌కు నీటిని మళ్లించకుండా మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి గేటుకు తాళాలు వేశారు. అనంతరం మెయిన్‌రోడ్డుపై బైఠాయించి ఐదు రోజులుగా తాగునీరు లేక ప్రజలు అల్లాడుతుంటే ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. మా పంచాయతీ పరిధిలో ఓహెచ్‌ఆర్ ట్యాంకు ఉన్నా మా దాహం తీర్చడం లేదని మండిపడ్డారు. మన నీరు మనకే కావాలి అనే నినాదాన్ని చేపట్టారు. గ్రామంలో అక్రమ కుళాయిలకు విద్యుత్ మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నారని, అధికారులు వచ్చి సమస్య పరిష్కారిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. దీనితో ఎస్సై డి.ప్రశాంత్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నాలు చేయరాదని, ధర్నాలు చేసినంత మాత్రానా సమస్య పరిష్కారం కాదని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇవ్వడంతో అందోళనకారులు రోడ్డును ఖాళీచేశారు. అనంతరం జెడ్పీటీసీ వేగిరాజు ప్రవీణ, సర్పంచ్ పినిపే ప్రకాశరావు సమక్షంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ నటరాజ్, జేఈలు రాజశేఖర్, శ్రీధర్, వేగిరాజు వెంకట్రాజు, సాధనాల వెంకట్రావులతో ఎస్సై చర్చించారు. శివారు ప్రాంతాలకు తాగునీరు సరఫరా కానప్పుడు లోపం ఎక్కడుందో గ్రహించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. గ్రామంలో అక్రమ కుళాయిలు ఉన్నప్పుడు పంచాయతీ తీర్మానం చేసి తొలగించాలని సూచించారు. దీనిపై డీఈ స్పందిస్తూ శివారు ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీచ్చారు. గుండెపూడి ప్రాజెక్టు పరిధిలో అక్రమ కుళాయిలను తొలగిస్తామని హామీచ్చారు. ఈ ధర్నాలో కందికట్ల సత్యవతి, జంగా సత్యవతి, నక్కా ధనలక్ష్మి, జంగా మంగాదేవి, పోతుల వెంకటలక్ష్మి, మాకే బాలరత్నం, పోతులు నరిసింహారావు, పోతుల అప్పారావు, వడ్డి రాంబాబు, కొపనాతి వెంకటేశ్వరారవు, కొపనాతి సద్గురుమూర్తి, గుంటూరి కృష్ణంరాజు, కాశిరాజు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
దేవుడిదగ్గరకు వెళ్లాలంటూ...
కరప(కాకినాడరూరల్): ఆర్థిక ఇబ్బందులు లేవు, ముందురోజు కుమారుడు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు..ఏం కష్టం వచ్చిందో ఏమో ముగ్గురు (అక్కా, చెల్లెలు, కుమార్తె) మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దేవుడు వద్దకు వెళ్లాలి, టైం అయిపోతోంది అంటూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అంటున్నారు. ప్రార్థనలు చేస్తామని లోపలికెళ్లిన వారు తనువు చాలిస్తారని అనుకోలేదని తల్లి చంద్రం ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కరపలోని నీలయ్యతోట వీధిలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కరపలోని నీలయ్యతోట వీధికి చెందిన కరెడ్ల చంద్రం కుమార్తెలు రాసంశెట్టి సత్యవేణి (48), సత్తి ధనలక్ష్మి (40), ధనలక్ష్మి కుమార్తె సత్తి వైష్ణవి (18). సత్యవేణి, ఇద్దరు కుమారులతో అదే వీధిలో సొంతిల్లు కట్టుకుని ఉంటున్నారు. తల్లి చంద్రం పెంకిటిల్లులో ఒక పోర్షన్లో ఉంటోంది. అదేఇంటిలో పక్కపోర్షన్లో ధనలక్ష్మి భర్త, ఇద్దరు కుమారులతో ఉంటోంది. వీరు క్రైస్తవ మతం తీసుకుని నాలుగేళ్లుగా చర్చికి వెళ్లి, ప్రార్థనలు చేసుకుని వస్తుంటారు. ఎవరితోను మాట్లాడరు, దైవభక్తి ఎక్కువగా ఉండటంతో వెళితే చర్చికి, లేకపోతే ఇంటివద్ద ప్రార్థన చేసుకోవడం వీరికి అలవాటు. ఈ నేప«థ్యంలో ధనలక్ష్మి కుమారుడు రఘువీర్ పుట్టిన రోజును ఆదివారం జరిపి, ఇంటివద్దనే అందరికీ భోజనాలు పెట్టి, పాస్టర్ నాగరాజు డాక్టర్‌తో ప్రార్థనలు చేయించారు. దేవుడు వచ్చేస్తున్నాడు, దేవుడి దగ్గరకు వెళ్లిపోవాలి అంటూ మాట్లాడుకోవడం, ప్రార్థనలు చేసుకోవడం జరుగుతోంది. ఆదివారం రాత్రి ముగ్గురు మహిళలు చర్చికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఉదయం పాస్టర్ నాగరాజు లేచిన తర్వాత ప్రార్థన చేసి, పండ్లుపెట్టగా సత్యవేణి, ధనలక్ష్మి, వైష్ణవిలు ఇంటికి వచ్చేశారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో తల్లి చంద్రంతో ఇంటిలో దుష్టశక్తులు తిరుగుతున్నాయి, అవి పోయేందుకు ప్రార్థనలు చేస్తామని ఒక గదిలోకి వెళ్లి, గడియపెట్టారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో ధనలక్ష్మి కుమారుడు రఘువీర్ తలుపు తట్టగా ఇంకా ప్రార్థన పూర్తవ్వలేదని లోపలనుంచే బదులిచ్చారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో రఘువీర్ తలుపులు కొట్టినా తీయలేదు. అనుమానంతో ఇంటి వెనుక వైపున తలుపుపైకెత్తి తీసి చూసేసరికి ఉరివేసుకుని ఉన్నారు.అక్క వైష్ణవిని కిందికి దింపితే చనిపోయి ఉంది. వెంటనే పాస్టర్ దగ్గరకెళ్లి ఇంటికి తీసుకొచ్చి చూపించాడు. పాస్టర్ కరప ఎస్సై మెల్లం జానకిరాంకు సమాచారం అందించారు. కాకినాడ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఇంటిలిజెన్స్ సీఐ నూనె రమేష్, కాకినాడ పోర్టు సీఐ రాజశేఖర్‌తో కల్సి క్లూస్‌టీంతో ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురు మహిళల ఆత్మహత్యకు కారణాలు దర్యాప్తు తేలాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కరప ఎస్సై జానకిరాం కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తామని వెళ్లిపోయారా.. ప్రార్థనలు చేస్తామని గదిలోకి వెళ్లి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతారను కోలేదంటూ ఇద్దరు కుమార్తెలు, మనుమరాలు మరణాలు తలుచుకుని చంద్రం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాకపోయింది. ఇలా జరుగుతుందంటే పనిలోకి వెళ్లేవాడినికాదు ఇలా జరుగుతుందని ముందుగా ఊహించి ఉంటే కాకినాడ పనిలోకి వెళ్లేవాడిని కాదని భార్య ధనలక్ష్మి, కుమార్తె వైష్ణవి మరణించడంపై సత్తి శ్రీనివాస్ గుండెలవిసేలా విలపించాడు. భార్య మృతదేహంపై పడి కొడుకుని, నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ బోరున విలపిస్తుంటే బంధువులు, ఇరుగు పొరుగువారు ఆపలేకపోయారు. -
దిగజారి నోరుజారి..!
-
అలరించిన అతివల అక్షరక్రీడ
కురిసిన పద్యాల సుమవర్షం రాజమహేంద్రవరం కల్చరల్ : ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదె ముద్దార నేర్పించినన్’.. అన్న చిలకమర్తి పదాలను సత్యమని అతివలు మరోసారి నిరూపించారు. నన్నయవాఙ్ఞ్మయ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఆదిత్య డిగ్రీ కళాశాలలో అతివల అష్టావధానం రసవత్తరంగా జరిగింది. పాతిక వసంతాలు పైబడిన శతావధాని ఫుల్లాభట్ల నాగశాంతిస్వరూప అందరినీ దీటుగా ఎదుర్కొని అక్షరక్రీడలో, సాహితీసమరాంగణంలో విజేతగా నిలిచారు. అడుగడుగునా నిషిద్ధాక్షరి నిషేధాలను దాటుకుంటూ, సమస్యల చిక్కుముడులు విప్పుతూ, వ్యస్తాక్షరి నియమాలను పాటిస్తూ, ఛందోనియమాలను తప్పకుండా నాగశాంతిస్వరూప చేసిన అష్టావధానం రసజ్ఞులను అలరించింది. విశ్రాంత ఆంధ్రయువతీసంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీఎస్ మహాలక్ష్మి అవధానానికి సంచాలకత్వం వహించారు. సమన్వయ శక్తి, ధారణ, సమయస్ఫూర్తి, భాషాపటిమ..అన్నీ కలిస్తేనే అవధానమని ఆమె పేర్కొన్నారు. అవధాని అని మగవారినీ, అవధానిని అని మహిళలను పేర్కొనవలసిన అవసరం లేదని, స్త్రీ,పురుషులిద్దరినీ అవధానిగా పేర్కొనడంలో వ్యాకరణరీత్యా అనౌచిత్యం లేదని ఆమె పేర్కొన్నారు. అవధాన కళాకాంతి నాగశాంతి ఫుల్లాభట్ల నాగశాంతిస్వరూప అవధానాన్ని ప్రారంభిస్తూ, తల్లి తండ్రులను, గరువులను స్మరిస్తూ పద్యాలను చెప్పారు. పృచ్ఛకులు సంధించిన అక్షరశస్త్రాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. *‘తన సూనున్కొని తెచ్చి కూర్పుమనియెన్ తన్వంగి కామార్తౖయె..’ఇదీ శాంతిస్వరూపకు పృచ్ఛకురాలు ఇచ్చిన సమస్య..కామార్త అయిన తన్వంగి తన సూనుని(కుమారుడిని) తీసుకురమ్మందిట.. ఈ సమస్యను అవధాని ఇలా పూరించారు..‘ వినయంబే తన రూపమై తనరుచున్ విన్నాణిౖయె వెల్గుచున్ తన నాథున్గని జాలినొంది మదిలో దాంపత్యధర్మంబునన్ అనయంబున్ తన పోషణార్ధమునకై అర్ధించె నా తల్లి ‘వే తన సూనున్’ కొనితెచ్చి కూర్పుమనియెన్ తన్వంగి కామార్తౖయె.. కామము అనే పదానికి మనం సాధారణంగా ఉపయోగించే భావంలో కాకుండా కోరిక అన్న అర్థం ఉందని అవధాని వివరించారు. సూనున్ అన్న పదాన్ని ‘వేతన సూనున్’ అని అభివర్ణించారు. *పెళ్లి, ప్రేమ, పబ్బు, క్లబ్బు పదాలతో దత్తపది పై పదాలతో పద్యం చెప్పమని పృచ్ఛకురాలు కోరినప్పుడు, అవధాని ఇలా పూరించారు.. ‘పెళ్లి’ ఒక్కటే స్త్రీలకు వేడుకటర? ‘ప్రేమౖ’మెకాన పడెనిట్టు భామలెల్ల భళిర! ముందు చూ‘పబ్బు’రపరిచె నేడు వెలది! వి‘క్లబ’త్వంబది వీడవలయు.. అలరించిన ఘంటావధానం విశ్రాంత ఆచార్యుడు, ప్రవచన రాజహంస ప్రవేశపెట్టిన ఘంటావధాన ప్రక్రియను ఎం.వెంకటలక్ష్మి నిర్వహించారు. సభకు హాజరైన సాహితీప్రియులు కాగితంపై రాసిచ్చిన పదాలకు అనుగుణంగా వెంకట లక్ష్మి కంచంపై గరిటెతో ఘంట వాయిస్తారు. అవధాని ఆ ఘంటానాదం విని, కాగితంపై రాసిందేమిటో వివరించడంతో సభలో కరతాళధ్వనులు మోగాయి. ద్విశతావధాని ఆకెళ్ల బాలభాను నిషిద్ధాక్షరి, ఆదిత్య తెలుగు ఉపన్యాసకురాలు బీవీ రమాదేవి సమస్య, విశ్రాంత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ దత్తపది, తెలుగు పండితురాలు డాక్టర్ సీఎస్వీ రమణీకుమారి వర్ణన, కవయిత్రి, గాయని డి.విజయలక్ష్మి వ్యస్తాక్షరి, ప్రభుత్వ అటానమస్ కళాశాల తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ ఎం.సుధామయి ఆÔవవు, సదనం విద్యార్థిని ఎం.వెంకటలక్ష్మి ఘంటావధానం, రామచంద్రుని మౌనిక అప్రస్తుత ప్రసంగాలను నిర్వహించారు. డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి అధ్యక్షత వహించారు. ఆదిత్య విద్యాసంస్ధల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అవధానంలో పాల్గొన్న అతివలను సత్కరించారు. -
ఒకే గడ్డ నుంచి ఒకే జట్టుగా..
-ఖోడినార్ నుంచి ‘సాయి’ జట్టుకి ఎంపికైన ఏడుగురు యువతులు -వాలీబాల్‌లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణింపు అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) : ఇప్పుడంతా చదువుల యుగం. చదువులు దెబ్బ తింటాయని పాఠశాల, కళాశాల స్థాయిలో బాలురనే ఆడించడం లేదు. కానీ ఆ గ్రామం అందుకు భిన్నం. ఆటలు ఆడితేనే బంగారు భవిష్యత్ ఉంటుందని నమ్మిన గ్రామస్తులు బాలురనే కాదు.. బాలికలను కూడా ఆటల్లో ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఆ గ్రామానికి చెందిన ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఏడుగురు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆ గ్రామమే గుజరాత్ రాష్ట్రంలోని సోమనా«ద్ జిల్లాలోని ఖోడినార్. ఈ గ్రామానికి చెందిన ఏడుగురు క్రీడాకారిణులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి)కి ఎంపికై గొల్లవిల్లిలో జరుగుతున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఒకే గ్రామం నుంచి ఏడుగురు ఒక జట్టుకు ఎంపిక కావడం, రాణించడం అరుదైన విషయం. కోచ్ వర్ధన్వాలా శిక్షణలో తామంతా వాలీబాల్‌లో రాణిస్తున్నామంటున్న వీరంతా ఇంటర్నేషనల్, నేషనల్ పోటీల్లో అవార్డులు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ పోటీల్లో ఆడా.. విద్యతో పాటు వాలీబాల్‌పై మక్కువ పెంచుకుని తర్ఫీదు పొందాను. రెండు పర్యాయాలు థాయ్‌లాండ్‌లో జరిగన ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొన్నాను. ఆర్ట్ స్టూడెంట్‌గా ఉన్నతవిద్యభ్యసించి స్థిరపడాలని, అంతర్జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నా స్నేహితులు క్రీడాకారులు కావడంఅదృష్టం. – చేతన్ గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నా.. నేషనల్ సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి, ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నా. ఖోడినార్ ప్రాంతం నుంచి నాతో పాటు ఏడుగురం వాలీబాల్లోనే రాణిస్తున్నాం. కోచ్ సూచనలు, సలహాలతో నిరంతర సాధన చేస్తున్నాం. అటు చదువు, ఇటు క్రీడ రెండింటిలో గుర్తింపు తెచ్చుకోవాలని టీం వర్క్ చేస్తున్నాం. – అస్మిత -
లేడీస్ రూంలోకి తొంగి చూడబోతే..
షార్జా: లేడిస్ రూంలోకి తొంగిచూడాలని ప్రయత్నించి, ప్రమదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన యూఏఈలోని షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలోని 8వ బ్లాక్‌లో చోటుచేసుకుంది. పక్క బిల్డింగ్‌లో ఉంటున్న ఓ అమ్మాయిని చాటుమాటున చూడాలని ప్రయత్నిస్తుండగా అదుపుతప్పి 28 ఏళ్ల యువకుడు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడు భారత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
పెట్టుబడి నిధులిస్తామని పత్రాలిస్తారా?
ఎమ్మెల్యేపై ఎస్సీపేట మహిళల ఆగ్రహం జనచైతన్య యాత్ర నుంచి వెనుదిరిగిన వైనం గిడజాం (రౌతులపూడి) : డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధికింద మంజూరైన సొమ్ములను ఇస్తామని చెప్పి పత్రాలు ఇవ్వడమేమిటని పలువురు మహిళలు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును నిలదీశారు. జన చైతన్య యాత్రలో బాగంగా మండలంలోని గిడజాం, కోడూరు, పారుపాక, డి.జే.పురం, ఎస్.అగ్రహారం గ్రామాల్లో మంగళవారం టీడీపీ శ్రేణులతో కలసి ఆయన పర్యటించారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించాల్సిన ఈ యాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కావడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ముందుగా గిడజాం పంచాయతీ కార్యాలయం వద్ద పెట్టుబడినిధికి సంభందించిన సొమ్ములుకోసం వచ్చిన మేడపాటి వెంకయమ్మ పెట్టుబడినిధి సొమ్ములు ఇస్తారంటే వచ్చాం. పత్రాలు చేతిలో పెట్టారేంటని ఆమె ఎమ్మెల్యేను నిలదీసింది. అలాగే గ్రామంలోని ఎస్సీ పేటలోని మహిళలను పెట్టుబడనిధిసొమ్ములు ఇస్తారని మభ్యపెట్టి ఇక్కడకు రప్పించారని ఉదయంనుంచి వేచివున్నా ఫలితం లేకపోవడంతో ఏదైనా ఇచ్చేదివుంటే ఎస్సీపేటలో ఇవ్వాలికాని ఇక్కడకు రమ్మనటమేమిటిని టీడీపీ శ్రేణులపై మండిపడి వెనక్కు వెళ్లిపోయారు. చేసేదిలేక ఎమ్మెల్యే వరుపుల, మిగిలిన టీడీపీ శ్రేణులంతా ఎస్సీపేటకు వెళ్లి పెట్టుబడినిధి సొమ్ములు బ్యాంకులో జమచేస్తారని కేవలం ఈ పత్రాలు మంజూరు పత్రాలు మాత్రమేనని మహిళలకు వివరించారు. అలాగే పారుపాక పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఉపాధి హామీ పథకంలో ఆరేళ్లుగా మామిడి, జీడిమామిడి మొక్కలు వేసుకొని సాగుచేసుకుంటే నేటికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని, ఎన్నిసార్లు అ«ధికారులను అడిగినా కనీసం పట్టించుకోలేదని గ్రామానికి చెందిన ఉర్లంకల బాబూరావు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.దీంతో సంభందిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్టుబడినిధి పత్రాలను పలువురు మహిళలకు అందించారు. అనంతరం డి.జే.పురం, ఎస్.అగ్రహారాల్లోని పార్టీ ముఖ్యనాయకులను కలసి జనచైతన్య యాత్రలను పూర్తిచేసారు. ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మిశివకుమారి, టీడీపీ సమన్వయ కర్త పర్వత రాజుబాబు, పార్టీనాయకులు పాల్గొన్నారు. -
పల్లె పడుచులే లక్ష్యం
– కొలువుల పేరుతో యువతుల తరలింపు – తిరుపతి కేంద్రంగా వ్యాపారం – నెల రోజుల కిందట 15 మంది సౌదీ అరేబియాకు.. పల్లె పడుచులే లక్ష్యం – వ్యభిచార ముఠాల గుప్పిట్లో చిక్కుకుని విలవిల – బాధిత కుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తం – తిరుపతి ఏజెంటు రాణిమ్మను అదుపులోకి తీసుకుని విచారణ వారానికోసారి పల్లెటూళ్లకు వెళతారు. బాగున్న యువతులను మాటల్లోకి దించుతారు. చదువుకున్నా, లేకున్నా విదేశాల్లో ఉద్యోగం అంటారు. నెలకు రూ.50 వేలకు పైగా సంపాదనంటారు. భవిష్యత్తు మీద బోలెడు ఆశలు రేపుతారు. ఎలాంటి భయం లేదని భరోసా ఇస్తారు. నమ్మకంగా విదేశాలకు తీసుకెళ్తారు. అక్కడున్న వ్యభిచార ముఠాలకు విక్రయిస్తారు. ఇదీ జిల్లాలో వెలుగు చూస్తోన్న దారుణాలు. నిన్నామొన్నటి వరకూ చిత్తూరు, సత్యవేడుల్లో వెలుగు చూసిన ఈ తరహా మోసాలు నేడు తిరుపతిలోనూ కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి : నిన్నా మొన్నటి వరకూ చిత్తూరు, సత్యవేడు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన రఫీ, పాండియన్‌లనే ఇద్దరు ఏజెంట్లు సుమారు 150 మంది మహిళలను విదేశాలకు పంపారు. సత్యవేడుకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు. రఫీ, పాండియన్‌లను అరెస్టు చేశారు. కాగా ఈ తరహా మోసాలు, మహిళల అక్రమ తరలింపులు తిరుపతిలోనూ వెలుగు చూశాయి. దీంతో అర్బన్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముఠాల కోసం గాలిస్తున్నారు. తిరుపతి నుంచి ఇలా... పూతలపట్టు మండలం డీ మిట్టూరుకు చెందిన వెంకట రమణ, తిరుపతికి చెందిన వెటశాల శ్రీనివాసరావులు మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తిరుపతికి చెందిన కొందరు మహిళల తరలింపు ఏజెంట్లు తమ తమ భార్యలను ఏ విధంగా విదేశాలకు తీసుకెళ్లారో వివరించి అక్కడి వ్యభిచార కూపాల్లో మహిళలు అనుభవిస్తోన్న నరక యాతనను వివరించారు. వారు తెలియజేసిన వివరాలు వారి మాటల్లోనే.... నా భార్యను రక్షించండి... మాది పూతలపట్టు మండలం డి. మిట్టూరు గ్రామం. కొన్నాళ్లుగా భార్యాపిల్లలతో తిరుపతి మంగళం రోడ్డులో ఉంటున్నాం. పక్కనే ఉన్న రాణిమ్మ పరిచయమైంది. దుబాయ్‌కి వెళితే నెలకు రూ.1 లక్ష సంపాదన ఉంటుందనీ, అక్కడి ఇళ్లల్లో పనిచేస్తే నెలవారీ జీతం వస్తోందని ఆశ చూపింది. ఇందుకోసం ఖర్చవుతుందని చెపితే రూ.50 వేలు చెల్లించాం. ఆగస్టు 12న నా భార్య అమతతో పాటు మరో 14 మంది మహిళల్ని తీసుకుని రేణిగుంటలో రైలెక్కారు. మూడ్రోజులు ముంబయి హోటల్లో ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత ఎటు నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. 15 రోజుల తర్వాత సౌదీకి తీసుకెళ్తున్నారని ఫోన్లో చెప్పింది. తిరిగి ఈ నెల 17న మళ్లీ ఫోన్లో మాట్లాడింది. అక్కడ తనను హింసిస్తున్నారనీ, వ్యభిచారం చేస్తేనే ఉంటావనీ, లేకుండా ప్రాణాలతో ఉంచబోమని బెదిరిస్తున్నారని ఏడ్చింది. ఏం చేయాలో తెలియక ఆదివారం సాయంత్రం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు రాణిమ్మను పట్టుకొచ్చారు. విచారణ చేస్తున్నారు. ఎలాగైనా నా భార్యను రక్షించండి. == పీ వెంకట రమణ, తిరుపతి. –––––––––––––– నా భార్యను రూ.2 లక్షలకు అమ్మేశారట... మేం తిరుపతిలోని మంగళం రోడ్డులో ఉంటాం. మేం కూడా రాణిమ్మ చేతిలోనే చిక్కాం. నా భార్య క్రిష్ణకుమారి కూడా సౌదీ అరేబియా ముఠా చేతుల్లో చిక్కుకుంది. ఆగస్టు 24న ఢిల్లీలో విమానం ఎక్కించారు. నన్ను కూడా విదేశాలకు తీసుకెళ్తామని నమ్మించిన ముఠా సభ్యులు ఢిల్లీ వెళ్లాక నన్ను వెనక్కి పంపి నా భార్యను మాత్రమే విమానం ఎక్కించారు. వీసా ఆలస్యం కాబట్టి రెండ్రోజుల తరువాత నన్ను పంపుతామన్నారు. నేను వెనక్కి తిరిగొచ్చాను. ఈ నెల 17న నా భార్య నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ తాను చాలా ఇబ్బందుల్లో ఉందని తెల్సింది. తనను రూ.2 లక్షలకు అమ్మేశారని చెప్పింది. ఆ డబ్బులు తెచ్చి ఇస్తేనే వదులుతారని చెప్పింది. ఇల్లుగానీ, బంగారం గానీ ఏదో ఒకటి అమ్మి తనను కాపాడాలని ఏడుస్తూ ప్రాథేయపడింది. నా భార్యతో పాటు ఆరోజు సుమతి, అమత, ఇంకా 13 మందిని తీసుకెళ్లారు. తమిళనాడుకు చెందిన ముఠా సభ్యుడు మీరాభాయ్ కూడా వెంట వెళ్లాడు. ఇక్కడున్న రాణిమ్మను విచారిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. == వీ. శ్రీనివాసరావు, తిరుపతి. –––––––––––––––– విచారణ జరుపుతున్నాం మహిళల రవాణా గురించి తెల్సింది. ఎక్కడెక్కడ ఎంత మందిని విదేశాలకు పంపారో గుర్తిస్తున్నాం. అసలు మహిళల్ని ఎలా ట్రాప్ చేశారో, బాధితులు, ముఠా సభ్యుల మధ్య పరిచయాలు ఎలా మొదలయ్యాయే తెల్సుకుంటున్నాం. ఇటీవలనే ఈ తరహా కేసు మరొకటి నమోదైంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాం. ఎవర్నీ వదలం. == జయలక్ష్మి, అర్బన్ ఎస్పీ, తిరుపతి. -
మహిళల విక్రయ ముఠా అరెస్ట్
మహిళల విక్రయ ముఠా అరెస్ట్ సత్యవేడు: విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మహిళలను వ్యభిచార గహాలకు తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళలను అక్రమంగా రవాణా చేసే ముఠాపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ నెల 14వ తేదీన సత్యవేడులోని శ్రీకాళహస్తి బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా, పి.గన్నవరం మండలం, తాటికాయలవారిపాళెంకు చెందిన ఎస్.నగ సోమేశ్వరరావు అలియాస్ బాబు(33)ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విచారణలో అతను మహిళలను ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపించి అక్కడ వ్యభిచార కేంద్రాలకు విక్రయించే ముఠా ఏజెంట్‌గా తేలిందని తెలిపారు. ఇతను పెయింటర్‌గా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మహిళలకు ఎరవేస్తున్నట్టు పేర్కొన్నారు. చెన్నైలోని రఫి, పాండియన్, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ఏరియా ఏజెంటుగా ఉన్న ఏసుప్రేమ తదితరులు నెల్లూరు, గుంటూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం తదితర పాంతాలకు చెందిన మహిళలను విదేశాలకు తరలించారని తెలిపారు. ఎస్.నగ సోమేశ్వరరావు అలియాస్ బాబు ఇప్పటి వరకు 10మంది మహిళలను మలేషియాకు పంపించాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
తలాపునే గోదారి.. తాగేందుకు నీరేది?
తాగునీటి కోసం గ్రామస్తుల రాస్తారోకో మెట్పల్లి ప్రధాన రహదారిపై గంటకుపైగా బైఠాయింపు బాదన్‌కూర్తి(ఖానాపూర్) : చుట్టూ గోదావరి, బావుల్లో పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నా పాలకుల పట్టింపులేని ధోరణి, అధికారుల నిర్లక్ష్యంతో తాగడానికి గుక్కెడు నీరందించేవారు కరువయ్యారని మహిళలు నినదించారు. మండలంలోని బాదన్‌కూర్తి పంచాయతీ పరిధిలోని చింతల్‌పేట గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని కోరుతూ మెట్పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై మహిళలు గంటకుపైగా రాస్తారోకో చేశారు. నీటి సరఫరాకు ముందస్తు ప్రణాళిక లేకే తాగడానికి నీరు కరువయ్యిందని, దీంతో దూర ప్రాంతం నుంచి బిందెల్లో నీటిని మోసుకోవాల్సి వస్తుందని మహిళలు తెలిపారు. మండు వేసవిలోను భూగర్బ జలాలు లేని సమయంలో ట్యాంకర్లతో నీటి సరఫరా చేసినప్పటికీ ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. ఎంపీడీవో, తహసీల్దార్ రావాలంటు గంటపాటు రాస్తారోకో చేసినప్పటికీ ఎవరు రాలేదు. దీంతో ఎస్ఐ అజయ్‌బాబు చొరవ తీసుకొని ప్రయాణికుల ఇబ్బందులను దష్టిలో పెట్టుకొని ఆందోళన విరమించాలని కొరడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుడాల రాజన్నతో పాటు గ్రామస్తులు, జీ శంకర్, కొండ శంకర్, మదు, గంగరెడ్డి, బండి రాజు, సునీత, ఆశమ్మ, శ్యామల, లక్ష్మి, అమీనా, రాజలక్ష్మి, గౌరు, రజిత, చంద్రకళ తదితరులున్నారు. -
ఉల్లాసంగా...ఉత్సాహంగా
కరీంనగర్ సిటీ : కరీంనగర్‌లోని ఉజ్వల పార్క్ ఆదివారం చిన్నారుల కేరింతలు.. మహిళల ఆటలు..పురుషుల నృత్యాలతో హోరెత్తింది. ఎల్లాపి కులస్తులు ఏర్పాటుచేసుకున్న వనమహోత్సవం కన్నులపండువగా సాగింది. దాదాపు 300 కుటుంబాలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. రన్నింగ్, కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, మ్యూజికల్ చైర్, డ్యాన్స్ తదితర విభాగాల్లో పోటీపడ్డారు. కరీంనగర్ యూనిట్ అధ్యక్షుడు వి.గణేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి లక్కాకుల సురేందర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు, ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్ పారువెల్ల హన్మంతరావు, తుల అనూషను ఘనంగా సన్మానించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కరాలు అందించారు. ఎల్లాపి సంఘం మాజీ అధ్యక్షుడు లక్కాకుల మనోహర్‌రావు, కార్పొరేటర్ తాటి ప్రభావతి, వేల్ముల వెంకటేశ్వర్రావు, ఆది జలపతిరావు, తాటి వేణుగోపాల్‌రావు, బాలసంకుల అనంతరావు, వి.బాలకిషన్‌రావు, గందె కల్పన విశ్వేశ్వర్రావు, లక్కాకుల మోహన్‌రావు, ఆది కొండాల్‌రావు, భాస్కర్‌రావు, ఆది రమణారావు, సర్పంచ్‌లు ఆది మధుసూదన్‌రావు, జి.లత శ్రీనివాస్‌రావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో బోనాలు
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లిలో ఆదివారం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాల జాతర నిర్వహించారు. మున్సిపాలిటీలోని 14, 15 వార్డుల పరిధిలో ఉన్న అంబేద్కర్ రడగంబాలబస్తీలో మహా బోనాల జాతరలో మహిళలు, మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి బో నమెత్తుకొని పోచమ్మ దేవాలయం వరకు ప్రదర్శన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లంగా చూడాలని గ్రామ దేవతను వేడుకున్నారు. తదనంతరం కోళ్లు, మేకలను బలిచ్చారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో.. పట్టణంలోని కన్నాలబస్తీ రైల్వేఫై ్లఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, బజార్ ఏరియా, కాంటా చౌరస్తా, బెల్లంపల్లిబస్తీ మీదుగా పోశమ్మ గడ్డ వరకు మహిళలు బోనాలతో ప్రదర్శన సాగించారు. పోచమ్మ దేవాలయానికి చేరుకుని మహిళలు పూజలు నిర్వహించారు. అక్కడనే వంటవార్పు చేసుకొని విందు భోజనాలు ఆరగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు పిట్టల రాజమల్లు, మహిళలు, కుల పెద్దలు , యువకులు పాల్గొన్నారు. కాసిపేట : మండలంలోని సోమగూడెంలో ఆదివారం భక్తులు పోచమ్మ బోనాలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో గ్రామస్తులు బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలివెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. వీధి వీధిన కలిసికట్టుగా నిర్వహించడంతో గ్రామంలో పండగా వాతవరణం నెలకొంది. -
గోరింటా పూచింది..
-
అరచేతిలో అందాల పంట
‘గోరింటా పూసింది కొమ్మాలేకుండా..మురిపాల అరచేత మొగ్గాతొడిగింది...’వంటి పాటలు వినగానే..ఎర్రగా పండిన చేతులతో సందడి చేసే యువతులు, మహిళలే గుర్తుకొస్తారు. మిగతా కాలాల్లో ఏమో కానీ ఆషాఢ మాసంలో మాత్రం గోరింటాకు పెట్టుకోవాల్సిందే.æ సాయంత్రం వేళ సామూహికంగా కూర్చుని అరచేతులకు గోరింటా పెట్టుకుంటున్న మహిళలు మనకు ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటారు. –విశాఖ–కల్చరల్ ఆషాఢంతో అనుబంధం తెలుగునాట ఆషాఢ మాసానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. చెమటలు కక్కించిన గ్రీష్మం వెనక్కి తగ్గగా, వరుణుడి కటాక్షంతో పుడిమి తల్లి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. చిరుజల్లులకు తనువు, మనసు పులకరిస్తుండగా..ఆత్మీయ బంధాల వైపు అందరి ప్రాణం లాగుతుంది. దీంతో కొత్తగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిన కూతుళ్లను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకొస్తారు. ఇంకేముందు ఆ వెంటనే కొత్తగా చిగురించిన గోరింటాకు చేతులకు పెట్టుకుని ఆ కూతురు మురిసిపోతుంటే తల్లిదండ్రులు పడే ఆనందం అంతా ఇంతా కాదు. అందుబాటులో కోన్లు గోరింటాకు కోసం వెతకకుండా రెడీమేడ్ కోన్లు కూడా సిటీలో లభిస్తున్నాయి.అలాగే ఆషాఢంలో వినియోగదారులు ఆకట్టుకునేందుకు సీఎంఆర్ వంటి కొన్ని కార్పొరేట్ సంస్థలు కొత్తగా పెళై ్లన యువతులను గుర్తించి చక్కటి డిజైన్లతో మెహందీ పెడుతున్నారు. శాస్త్రియ ఆధారాలు గోరింటాకు పెట్టుకోవాల్సిన కారణాలు, పెట్టకుంటే కలిగే లాభాలపై శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వర్షకాలం, ఆషాఢం కలిసే వస్తాయి. దీంతో బురదలో ఎక్కువగా తిరిగే వారితోపాటు పొలాల్లో నాట్లు వేసే మహిళల పాదాలు దెబ్బతింటాయి. ఇళ్లలో ఉండే మహిళల పాదాలు కూడా నీటిలో నానుతాయి. ఈ మేరకు పాదాలకు గోరింటాకు పెట్టుకుంటే దానిలోని ఔషధ గుణాల వల్ల బాధతీవ్రత తగ్గుతుంది. నీటి తడికి చెడిపోతాయనే కారణంతో చేతులకు కూడా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల్లో గోరింటాకు పెట్టే అరచేతులు, పాదాలు బాగా పండాలని మహిళలు, యువతలు కోరుకుంటారు. ఏమంటే భాద్రపద శుద్ధ తదియ రోజున సాక్షాత్తు పార్వతీదేవి మగువలకు ప్రసాదించిన అయిదోతనం సంపూర్ణమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక పెళ్లికాని యువతుల చేతులు గోరింటాకు మందార వర్ణంలో పండితే మంచి మొగుడొస్తాడనే పెద్దల చమత్కరిస్తుంటారు. పాఠశాలల్లో పోటీలు భారతీయ సంస్క తికి భావితరాలకు అందించేందుకు ముగ్గులు పోటీలను ఎన్నో సంస్థలు కొంత కాలంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కొన్ని కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థునులకు మెహందీ పోటీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవలే మిత్రమండలి, సజన వంటి కొన్ని సంస్థలు పాఠశాలల్లో విద్యార్థులకు మెహందీ పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశాయి. ఆషాఢంలో రెండుసార్లు గోరింటాకు పెట్టుకుంటే చేతులు అందంగా కనిపించడమే కాదు ఆరోగ్యానికి మంచిది. అందుకే నేను ఆషాఢం ప్రారంభంతో పాటు చివరలో రెండుసార్లు పెట్టుకుంటా. కొత్తగా పెళ్లయి తల్లిగారి ఇంటికొచ్చిన వారు తప్పక పెట్టుకోవాలని పెద్దలు చెప్పేవారు. –సుచిత్ర, విశాలాక్షినగర్ -
అతివల రక్షణకు వాట్సాప్ 94932 06334
షీటీమ్‌లు, వాట్సాప్ నంబర్ ప్రారంభం ∙ త్వరలో 6వేల మంది పోలీసుల రిక్రూట్మెంట్ డీజీపీ జేవీ రాముడు మధురపూడి : మహిళల రక్షణ, వారి సమస్యల పరిష్కారానికి గాను రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు అధికారులు రెండు షీ టీమ్‌లు, ఒక హెల్ప్ డెస్క్, వాట్సాప్ నంబర్ 94932 06334ను ఏర్పాటు చేశారు. వీటిని విశాఖపట్నం, కాకినాడ నుంచి మధురపూడి ఎయిర్‌పోర్టుకు వచ్చిన డీజీపీ జేవీ రాముడు బుధవారం ఆవిష్కరించారు. జెంట్ పోలీసులకు తమ సమస్యలు చెప్పుకోలేని మహిళలు షీటీమ్‌ను, వాట్సాప్ నంబర్‌ను ఆశ్రయించవచ్చని డీజీపీ సూచించారు. మహిళల భద్రత నిమిత్తం రెండు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతానికి ఏడుగురు మహిళా పోలీసులతో కూడిన రెండు మహిళా భద్రతాకమిటీలు, ఒక హెల్ప్‌డెస్క్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి టీమ్‌కు ఏఎస్సై బాధ్యురాలు కాగా, మరో ఆరుగురు మహిళా పోలీసులుంటారు. త్వరలో ఆరు వేల మంది పోలీసుల రిక్రూట్మెంట్.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం త్వరలో ఆరువేల మంది పోలీసులను రిక్రూట్మెంట్ చేసుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ జేవీరాముడు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు అకాడమీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రశాంత వాతావరణం గల గోదావరి తీరప్రాంతంలో నేరాల నివారణ, మహిళల గొలుసు దొంగతనాల కమిటీలు అరికడతాయన్నారు. కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, డీఎస్పీలు భరత్‌మాతాజీ, ప్రసన్నకుమార్, త్రినాథ్, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ
శంషాబాద్: మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఐదో తరగతి వరకు చదువుకున్న మహిళలు అర్హులని చెప్పారు. శిక్షణ కాలంలో శంషాబాద్ నుంచి రవాణా సౌకర్యంతో పాటు మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు చిన్మయ విద్యాలయ క్యాంపస్‌లోని వరలక్ష్మి ఫౌండేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కోడిపందేలకు తాము సైతం అంటున్న మహిళలు!!
-
ఓనం.. మనోహరం
-
నేడు వరలక్ష్మీ వ్రతం
-
ఆడబాస్లే పవర్ఫుల్!
లండన్: ఆడవాళ్లు మగవారికంటే ఏ విషయంలోనూ తీసిపోరనేది ఎన్నోసార్లు రుజువైంది. అన్ని రంగంల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. చాలా సంస్థల్లో ఉన్నతోద్యోగులుగా మహిళలే ఉంటున్నారు. టీమ్‌ను నడిపించడంలో, వృత్తి విషయంలో కచ్చితంగా వ్యవహరించడంలో మగవారికంటే మహిళలే ముందుంటున్నట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది. తాజాగా జరిపిన సర్వేలో మహిళా బాస్‌లకు సంబంధించి మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. సరైన ప్రవర్తన లేని, విపరీత బుద్ధి గల మగ ఉద్యోగులపై మహిళా బాస్‌లు కఠినంగా వ్యవహరిస్తున్నారట. ఈ విషయంలో మగ సూపర్వైజర్ల కంటే వీరే కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. ఆడబాస్ల పర్యవేక్షణలో పనిచేస్తున్న మగ ఉద్యోగులు వారి శక్తిసామర్థ్యాలకు ఇబ్బందులు పడుతున్నట్లు మిలాన్‌లోని బొకోని యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తెలింది. మగ ఉద్యోగుల విషయంలో ఆడబాస్లు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో మగవారు ఆందోళన చెందుతున్నారని అధ్యయనం తెలిపింది. ‘‘సమాజంలో లింగ వివక్ష తగ్గుతోంది. అనేక మంది మహిళలు తమ కుటుంబాల్ని పోషించేలా ఎదుగుతున్నారు. అనేక కుటుంబాలకు స్త్రీలే ఆధారంగా నిలుస్తున్నారు. ఇది మహిళలు మరింతగా రాణించేందుకు దోహదపడుతోంది. అయితే పురుషులు ఈ స్థితి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీ, పురుష సమానత్వాన్ని సమర్థిస్తున్న మగవారు సైతం ఈ విషయంలో ఆందోళన ఎదుర్కొనే అవకాశం ఉంది’’అని ఎకటెర్నియా అనే పరిశోధకుడు తెలిపారు. -
నీటికోసం రోడ్డెక్కిన మహిళలు
కరీంనగర్ (వేములవాడ): వేసవికాలం ఇంకా రానేలేదు తెలంగాణలో నీటి కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. కరీనంగర్ జిల్లా వేములవాడలోని 9వ వార్డులో మహిళలు తాగునీటికోసం తంటాలు పడుతున్నారు. నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ఏంచేయాలో తోచక ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చారు. ఖాళీ బిందెలతో తమ సమస్యలను తెలిపేందుకు మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. -
విశాఖలో కీచక ఫిట్నెస్ ట్రైనర్
-
అందమైన మహిళకు.. ఉచిత భోజనం!
-
మగువలు... మహరాణులు
మగువలు మల్టీ టాస్కింగ్ రాణులు అంటున్నారు బ్యూటీ క్వీన్ రుచికాశర్మ. వంట చేయడంలోనే కాదు.. కుటుంబాన్ని నడపడంలోనూ మహిళలు ది బెస్ట్ అని చెబుతున్నారు. స్త్రీలు ఎంపవర్ అయితేనే దేశం సూపర్ పవర్ అవుతుందంటున్నారు. మిసెస్ సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ 2014కు ఎన్నికైన తర్వాత తన కు, తన మాటకూ వెయిట్ పెరిగిందంటున్న ఈ బ్యూటీ క్వీన్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. విశేషాలు ఆమె మాటల్లోనే.. 18 ఏళ్లుగా నేను వంట చేస్తున్నాను. బ్యూటీ క్వీన్ కిరీటం దక్కటం చాలా ఫెంటాస్టిక్ ఫీలింగ్. ఇది నా లైఫ్‌కి సెకండ్ ఇన్నింగ్స్. ఇప్పుడు చాలామంది నన్ను గుర్తుపడుతున్నారు. బ్యూటీ క్వీన్ అంటే కేవలం కిరీట ధారణ మాత్రమే కాదు. దాన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఈ అందాల పోటీలో నా ప్లాట్‌ఫాం విమెన్ ఎంపవర్మెంట్. దాని కోసమే నా జీవితం అంకితం చేయాలనుకుంటున్నాను. పది పనులు చేయగలం.. మహిళలు పుట్టుకతోనే మల్టీ టాలెంటెడ్. ఏకకాలంలో పది పనులు చేయగలం. టైం మేనేజ్మెంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. మా బాబు ఇంటికి రాగానే వాడికి హోం వర్క్ చేయిస్తూ, వంట పని చేసుకుంటాను. ఫోన్లు వస్తే ఆన్సర్ చేస్తాను. మళ్లీ మా వాడి డౌట్లు కూడా తీరుస్తుంటాను. అలా మహిళలకు ఉన్న అపురూపమైన వరం మల్టీ టాస్కింగ్. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఏ రంగంలో అయినా సక్సెస్ కావొచ్చు. సీన్ మారింది.. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అయ్యేవారు. కాలక్రమంలో కుటుంబ బాధ్యతతో భర్తతో పాటు ఆర్థిక భారాన్ని పంచుకున్నారు. కొంతకాలం వరకు సెకండ్ ఎర్నర్గా ఉన్న స్త్రీలు ఇప్పుడు ఓన్లీ ఎర్నర్ అవుతున్నారు. ఏ పనైనా క్రియేటివ్‌గా చేయడంలో మహిళలు ముందుంటారు. అలాంటి స్త్రీలకు ఏదైనా కళలో కొంత శిక్షణ ఇవ్వగలిగితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. దక్షిణాసియా, ఇండియాలో అందరు స్త్రీలు 9-6 ఉద్యోగాలకు వెళ్లలేరు. వాళ్లు ఇంటి నుంచే ఏదైనా తయారు చేసి, వ్యాపారం చేసుకోగలిగితే ఆ కుటుంబ పరిస్థితే మారిపోతుంది. అదే లక్ష్యం జీఎంఆర్ ఫౌండేషన్ వాళ్లు మూడు గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలకు ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. అందులో నేను కూడా పాలుపంచుకుంటున్నాను. వచ్చే మూడేళ్లలో వీలైనంత మంది మహిళలను ఆర్థిక శక్తిగా తయారు చేయడం నా లక్ష్యం. ఎక్కువ పెట్టుబడి అవసరం లేని చాక్లెట్ మేకింగ్, క్యాండిల్ తయారీ నేర్పుతున్నాను. ఇక్కడ తయారైన చాక్లెట్స్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విక్రయిస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్‌ని నామినేట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ కోసం ఎంకరేజ్ చేస్తున్నాం. 5 వేల పుస్తకాలు రూరల్ ప్రభుత్వ పాఠశాలల్లో పంచాలని నిర్ణయించుకున్నాం. శ్రీశైలం దగ్గర కునుకూరులోని జిల్లా పరిషత్ స్కూల్లో 500 పుస్తకాలు డొనేట్ చేశాను. ఆధ్యాత్మికతతో ఆత్మవిశ్వాసం ట్రెడిషనల్ కుటుంబంలో నుంచి వచ్చాను. నా జీవితంలో స్ట్రగుల్స్ చాలానే ఉన్నాయి. మంచి చెడు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి స్పిరిట్యువాలిటీ హెల్ప్ అవుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఉంటే సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ఆత్మవిశ్వాసం వస్తుంది. - ..:: ఓ మధు ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
మహిళలూ.. ఉగ్రవాదులయ్యారిలా!!
-
బిలీవ్ యువర్సెల్ఫ్
సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలు పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలని బాలీవుడ్ నటి (ద ఎక్స్పోజ్ ఫేం), మాజీ మిస్ ఇండియా జోయా అఫ్రోజ్ సూచిస్తోంది. నగరానికి చెందిన మార్వెల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్ సాఫ్ట్ ఎన్ షైన్ అందాల పోటీని గురువారం ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో తన మనోభావాలను పంచుకుంది... టాలీవుడ్‌లోని కొన్ని సంఘటనల నేపథ్యంలో హీరోయిన్లు కాల్‌గాళ్స్ అవుతున్నారని నన్ను అడిగితే దానికి నేనేం చెప్పగలను? నాకు తెలిసినంతవరకూ సినీ రంగంలోని అమ్మాయిలకు ‘ఆ’ దారి తప్ప మరో దారి లేని పరిస్థితి ఎప్పుడూ రాదు. నేనైతే డబ్బు కోసం నటించడం లేదు. చిన్నప్పటి నుంచి నటించిన అనుభవం, ఇష్టం మాత్రమే నన్ను నటిగా మార్చాయి. సినిమాలు లేకపోయినా హాయిగా బతకగలిగినంత స్థితిమంతులైన కుటుంబం మాది. అవ్మూరుులకు నేనిచ్చే సలహా ఒకటే. తమని తాము నమ్మాలి. భయం వదలాలి. ఏ రంగంలోనైనా స్ట్రగుల్ తప్పదు. బ్యూటీ కాంటెస్ట్‌లోకి వచ్చే అమ్మాయిలకు మరింత ఆత్మవిశ్వాసం అవసరం. ఎలాంటి పరిస్థితిలోనైనా చిరునవ్వు చెదరకుండా ఉండడం నేర్చుకోవాలి. ‘ఐటమ్’ అనొద్దు... టాలీవుడ్లో మంచి ఆఫర్ వస్తే నటించడానికి సిద్ధం. హీరో మహేష్‌బాబుతో పాటు నచ్చే హీరోలెందరో ఇక్కడ ఉన్నారు. ఐటమ్‌సాంగ్ చేయడానికి నో అబ్జెక్షన్. అయినా దాన్ని ఐటమ్ అని ఎందుకంటారో అర్థం కాదు. దాన్ని ఒక మంచి డ్యాన్స్ నంబర్ అనొచ్చుగా. - ఎస్బీ -
IRST POINT
యుగయుగాల చరిత్రలో.. అవనిపై రమణులు తలవంచుకునే జీవితాలు వెళ్లదీస్తున్నారు. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాతా అన్నవాళ్లే.. కార్యేషు దాసి అంటూ అబలను చేశారు. లేడీస్ ఫస్ట్ అంటూనే నయాజమానాలో కూడా వాళ్లపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం కోసం వారితో ఉద్యోగాలు చేయిస్తూ.. ఆమె ఏటీఎం కార్డు మాత్రం తమ వద్దే ఉంచుకుంటున్నవారూ ఉన్నారు. ఆడ, మగ సమానం.. అయితే మగాడు కాస్త ఎక్కువ సమానం అనే వారున్నంత కాలం వనితలపై వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితి మారాలని ప్రపంచ మహిళ ఆకాంక్షిస్తోంది. వరల్డ్ విమెన్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఇందుకు గొంతుకయ్యింది. లింగవివక్ష రూపుమాపడమే ఫస్ట్ పాయింట్ అంటోంది. - సాక్షి, సిటీప్లస్ అమలు చేస్తేనే.. ‘నేను ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. ఇట్ ఈజ్ అమేజింగ్! అల్ వరల్డ్ ఇక్కడ కొలువుదీరింది. 2017లో జరగబోయే విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌ను బ్రెజిల్ హోస్ట్ చేయనుంది. అందుకే హైదరాబాద్‌లో జరిగే ఈ కాన్ఫరెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. ఈ చర్చల సారాంశాన్ని మా దేశానికి తీసుకెళ్తాం. ఏ దేశంలో అయినా మహిళల పరిస్థితి ఒకేలా ఉంది. ఆర్థిక స్వాతంత్రం విషయంలో బ్రెజిల్లో మహిళలు కాస్త ముందున్నారు. ఇలాంటి సమావేశాల్లో పంచుకునే ఆలోచనలు.. తీసుకునే నిర్ణయాలు కచ్చితంగా అమలు చేసినపుడే మహిళలు వివక్షను అధిగమించగలరు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. వెరీ ఇంటరెస్టింగ్ ప్లేస్! హావ్ టు విజిట్ మెనీప్లేసెస్ హియర్... లైక్ గోల్కొండ ఫోర్ట్, చౌమొహల్లా ప్యాలెస్! జీవితంలోని అడ్డంకులను ఎదుర్కోవడంలో హైదరాబాదీ అమ్మాయిలు చేస్తున్న స్ట్రగుల్ రియల్లీ గ్రేట్. - క్రిస్టినా వూల్ఫ్, బ్రెజిల్ మార్పు రావాల్సిందే ‘భారతీయ మహిళలు కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యంలో సగం కూడా తమకు ఇచ్చుకోరు. అందుకే మహిళ తన స్థానాన్ని, హక్కుల్ని, స్వేచ్ఛను కోల్పోతున్నానన్న విషయం గ్రహించలేకపోతోంది’ అంటూ సగటు ఇండియన్ విమెన్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది అమెరికాలోని రుట్గర్స్ యూనివర్శిటీ విద్యార్థిని సరాస్టెర్న్. భారత మహిళలు లింగ వివక్ష నుంచి బయటపడాలంటే మీడియా ప్రధాన పాత్ర పోషించాలి. ఇక్కడ సినిమా, టీవీ వీక్షకుల సంఖ్య ఎక్కువ. మహిళల గురించి మాట్లాడే విధానం.. వారిని తెరపై చూపించే తీరు మారాలి. నేను ఇండియాకు రావడం ఇది రెండోసారి. హైదరాబాద్ గురించి, చార్మినార్ గురించి చాలా సార్లు విన్నాను. అక్కడ దొరికే గాజుల గురించి. రిటర్న్ అయ్యేలోపు షాపింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాను. మదర్ రోల్ కీలకం నాది ఘనా. అమెరికాలో సెటిల్ అయ్యాను. నార్త్ కెరొలినాలోని విన్స్టన్ సేలం స్టేట్ యూనివర్శిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. నేను ఇండియా రావడం ఇది నాలుగోసారి. హైదరాబాద్‌కు మాత్రం మొదటిసారే రావడం. హైదరాబాద్ చారిత్రక సంపద గురించి చాలా విన్నాను. బిర్లామందిర్, చార్మినార్ చూడాలని ఉంది. హైదరాబాదీ బిర్యానీ పేరు అమెరికాలో కూడా వినిపిస్తుంది. మహిళలపై హరాజ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. వైవాహిక వ్యవస్థను గట్టిగా నమ్ముతాను. భార్యభర్తలిద్దరూ సమానం అనుకున్నప్పుడు అది బాగుంటుంది. నా మ్యారేజ్ బ్రేక్ అయింది. నాకిద్దరు ఆడపిల్లలు. నా భర్త వదిలేనాటికి చిన్నమ్మాయికి మూడునెలలు. భర్త వదిలేశాడని బాధపడితే నేనీరోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. పిల్లలిద్దర్నీ ప్రయోజకుల్ని చేశాను. వాళ్లిద్దరూ అమెరికాలోని డిఫరెంట్ యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. సొసైటీలో మదర్రోల్ చాలా కీలకమైంది. తల్లి ఆడపిల్లలకు ధైర్యాన్ని నేర్పాలి. మగపిల్లలకు ఆడపిల్లల పట్ల ఎలా మసలాలో నేర్పాలి. అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుంది. - రోజ్ సకీఫ్యో, అమెరికా -
లవ్లీ.. లంగా ఓణీ
పదహారేళ్ల పడుచు నుంచి నాలుగు పదులు దాటిన నడివయసు మహిళల వరకు ఏ చిన్న అకేషన్ అయినా ఇటీవల ఎంచుకుంటున్న హాట్ డ్రెస్ లంగా ఓణీ. కనువిందు చేసే లంగా ఓణీలు నగర వనితలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రావణమాసం నోములు, వ్రతాలతో ప్రతి గడప పచ్చని తోరణాలతో సింగారించుకుంటుంది. ఇంటికి మరింత కళ తెచ్చేలా లంగా ఓణీలతో ప్రతి పడతి అలంకరించుకుంటుంది. ప్రజెంట్ ట్రెండ్‌లో ఉన్న హాఫ్‌శారీస్ సెలక్షన్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మీ రూపం మరింత ట్రెండీగా కనిపిస్తుంది. ఒకప్పుడు లంగా ఓణీలను పట్టు, జార్జెట్, షిఫాన్‌తో డిజైన్ చేసేవారు. కానీ ప్రస్తుతం టిష్యూ నెట్, బెనారస్ ఫ్యాబ్రిక్‌తో లంగా ఓణీలను రూపొం దిస్తున్నారు. ఈ ఫ్యాబ్రిక్ వల్ల లుక్ కూడా చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. సాధారణంగా లెహంగా అంచు కలర్ ఓణీ, మధ్య కలర్ బ్లౌజ్ ఉండాలనుకునేవారు. ఇప్పుడు లంగా, బ్లౌజ్, ఓణీ... అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్‌నే ఇష్టపడుతున్నారు. చాలా మంది గ్రాండ్‌గా అలంకరించిన బ్లౌజ్లనే ఎంచుకుంటున్నారు. అందుకే వీటిలో వైవిధ్యమైన డిజైన్లు ఎన్నో వచ్చాయి. ఈ మాసం మొత్తం పండుగ వాతావరణమే ఉంటుంది కాబట్టి వ్రతాలు, నోములకు మగువలు అంతా ఒక చోట చేరుతుంటారు. ఇలాంటప్పుడు ఎక్కువగా బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ లంగా ఓణీలను ఎంచుకుంటారు. వీటిలో రెడ్, పింక్, ఎల్లో.. డార్క్ కలర్స్ ముందు వరుసలో ఉంటున్నాయి. లంగా ఓణీ పైకి యాంటిక్ జ్యువెలరీ బాగా నప్పుతుంది. లంగా హెవీగా ఉంటే లైట్ జ్యువెలరీ వేసుకుంటే చాలు. లాంగ్ యాంటిక్ చెయిన్స్ మంచి కాంబినేషన్. కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలు ఈ నెలలో ఎక్కువగా జరుగుతుంటాయి. అమ్మాయిలు సంప్రదాయంలోనే ఆధునికంగా కనిపించాలంటే లంగా ఓణీ ధరించినప్పుడు జ్యువెలరీని తక్కువగా ప్రిఫర్ చేయాలి. హెవీ డ్రెస్ వేసుకుంటే చెవులకు హెవీగా జుంకాలు పెట్టుకోవాలి. మెడలో ఇంకే తరహా ఆభరణాలూ వేసుకోనక్కర్లేదు. - కమలాక్షి, ఫ్యాషన్ డిజైనర్, శ్రీహిత బొటిక్స్, బంజారాహిల్స్ -
హామీలిచ్చి డబ్బుల్లేవంటే ఎలా?
* పశ్చిమ గోదావరిలో సీఎం చంద్రబాబును నిలదీసిన మహిళలు * నా వద్ద మంత్రదండం లేదు.. అయినా రుణమాఫీకి కట్టుబడి ఉన్నానన్న బాబు * డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, అయితే టైం పడుతుందని వెల్లడి * రైతులతో ముఖాముఖిలోనూ రుణ మాఫీపై ప్రశ్నించిన అన్నదాతలు * డబ్బులు చెట్లకు కాయడంలేదు. సమస్య పరిష్కారానికి చూస్తా’ అంటూ సీఎం అసహనం సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘మీరే కదా రుణ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవంటే ఎలా’ అని పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. గురువారం నరసన్నపాలెం, బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం గ్రామాల్లో రైతులు, మహిళలతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. ఆయన ఆగిన ప్రతిచోట గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. సీతంపేటలో అనిశెట్టి పుణ్యవతి, మంగరాజు గంగారత్నం, తోటవరపు సీత తదితరులు బాబు కాన్వాయ్‌కు ఎదురుపడి రుణ మాఫీపై ప్రశ్నిం చారు. ‘కొంచెం సమయం ఇవ్వండి. ప్రస్తుతానికి రీషెడ్యూల్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఆదాయం లేదు. అప్పులే ఉన్నాయ్. నావద్ద మంత్రదండం లేదు’ అని అన్నారు. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో జరిగిన ముఖాముఖిలో కూడా మహిళలు రుణ మాఫీపైనే ప్రశ్నించారు. వారికి బాబు సమాధానమిస్తూ.. ‘మీ కష్టాలు మీకుంటే నా కష్టాలు నాకున్నాయ్. అందరికీ న్యాయం చేద్దాంలే’ అని అన్నారు. ‘ఎన్నికల సమయంలో మీరే కదా హామీలు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లేవం టే ఎలా’ అని నోముల దుర్గమ్మ గట్టిగా నిలదీసింది. కొయ్యలగూడెంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ డ్వాక్రా రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నానని, ఇప్పటికే కట్టిన వారికి, కట్టని వారికి మాఫీ చేస్తానని, అయితే టైం పడుతుందని చెప్పారు. రాజధాని సంగతి తర్వాత.. రైతుల విషయం చూడండి జంగారెడ్డిగూడెంలో జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష అనంతరం చంద్రబాబు నరసన్నపాలెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. హైదరాబాద్ వంటి నగరాలు మూడు, నాలుగు నిర్మించే శక్తి ఉందంటూ సీఎం చెప్తుండగా.. టిడిపికే చెందిన మాజీ ఎంపీటీసీ కట్టా సత్యనారాయణ, మరికొందరు రైతులు కల్పించుకొని.. ‘రాజధాని సంగతి తర్వాత. ముందు మీరన్న రుణ మాఫీ, పొగాకు గిట్టుబాటు ధరల గురించి మాట్లాడండి’ అని అన్నారు. ఏపీలో సరుకు రవాణా విప్లవం జంగారెడ్డిగూడెం: ఏపీలో సరుకు రవాణా విప్లవం రానుందని, వాణిజ్యపరంగా రాష్ట్రాన్ని ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా మారుస్తామని చంద్రబాబు చెప్పారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘సముద్ర తీరానికి దూరంగా ఉన్న 50 శాతం ప్రాంతాలను రాష్ట్రంలో నిర్మించే పోర్టులకు అనుసంధానం చేయడమే నా లక్ష్యం. నవ్యాంధ్రలో లాజిస్టిక్స్ (సరుకు రవాణా) విప్లవంతో ముందుకు సాగడానికి ప్రణాళికలు చేస్తున్నా. కాలువల ద్వారా జల రవాణాను పునరుద్దరిస్తాం. కాకినాడ నుంచి విజయవాడ మీదుగా పాండిచ్చేరి వరకు విస్తరిస్తాం. ఉత్పత్తిదారు, వినియోగదారుల రాజ్యం సృ ష్టించేలా ప్రణాళికలు తయారుచేస్తాం’’ అని బాబు తెలిపారు. హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా.. నరసన్నపాలెంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో గంగరాజు అనే రైతు కరెంటు సమస్యను ప్రస్తావించారు. ‘గవర్నర్ పాలనలోనే 4 గంటలు కరెంట్ వచ్చేది. మీరు వచ్చిన తర్వాత రోజుకు 2 గంటలే ఉంటోంది’ అని ప్రశ్నించారు. దీంతో బాబు ఆగ్రహిం చారు. ‘ఏం మాట్లాడుతున్నావ్. కథలు చెప్పొద్దు’ అంటూ గదమాయించారు. ‘సార్ నేను చెబుతోంది నిజమే’ అని ఆ రైతు అనగా.. బాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. ‘ఏయ్ నువ్ ఊరికే అరవొద్దు. నేను ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడతా. నీకు సమస్యలు వస్తాయ్. నీ అడ్రస్ కనుక్కుని హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా’ అని ఒకింత బెదిరింపు ధోరణితో మాట్లాడారు. గంగరాజు మళ్లీ స్పందిస్తూ.. ‘రెండు రోజులుగా కరెంట్ సరఫరా సరిగా లేదు. మంగళవారం అయితే గంట కూడా రాలేదు’ అని తెగేసి చెప్పారు. ఇందుకు సంఘీభావంగా పక్కనున్న రైతులు పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. దీంతో బాబు ‘సరే.. నాకు పనుంది. డ్వాక్రా మహిళలతో కొయ్యలగూడెంలో సమావేశం ఉంది. నువ్వు అక్కడికి రా. నీ విషయం అక్కడ తేలుస్తా’ అంటూ ముందుకు సాగారు. కేసీఆర్ పిచ్చి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు విద్యార్థుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పిచ్చి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం, బయ్యన్నగూడెం గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ కేసీఆర్ తీరును తప్పుబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లేనిపోని సమస్యలు సృష్టిస్తోంది. అక్కడి ముఖ్యమంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు ఇండియా, పాకిస్థాన్ కాదు’ అని బాబు అన్నారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. -
నేటి ‘ప్రాదేశిక’ పోరులో సగానికిపైగా నారీమణులే
వర్గల్, న్యూస్‌లైన్: గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వర్గల్ మండలం ఏడు చోట్ల సర్పంచులుగా, 8 చోట్ల ఉపసర్పంచులుగా ఎన్నికై తామేమిటో తెలియచెప్పిన మహిళలు ఎంపీటీసీ ఎన్నికలలో మరోసారి తమ సత్తా ప్రదర్శిస్తామంటున్నారు. తాము వంటింటికే పరిమితం కామని, పోటీలో దిగి పురుషులకు దీటుగా ఇంటింటి ప్రచారం జరిపారు. మండల పరిషత్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ చేసిన వర్గల్ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో 8 ఎంపీటీసీ స్థానాలలో 24 మంది మహిళలు పోటీ పడుతున్నారు. సంఖ్యాపరంగా 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 42 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో సగానికి పైగా 24 మంది మహిళలే. రిజర్వ్ చేసిన స్థానాలు పక్కన పెడితే అన్‌రిజర్వుడ్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడుతున్నారు. మీనాజీపేట స్థానం బీసీ జనరల్‌కు కేటాయించగా ఇక్కడ పురుషులు పోటీ చేసే అవకాశమున్నప్పటికీ మహిళలనే పోటీలో దింపారు. కాంగ్రెస్ నుంచి కీసరి నాగమణి, టీడీపీ నుంచి జాలిగామ లక్ష్మి, టీఆర్ఎస్ నుంచి జనగామ మంజులను ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గౌరారం అన్‌రిజర్వుడ్ స్థానంలో టీడీపీ నుంచి కడపల బాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి పాశం శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉండగా కాంగ్రెస్ తరపున గుండు భాగ్యమ్మ పోటీ పడుతున్నారు. ఇలా రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ అనే తేడా లేకుండా మహిళలు మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తూ తమ శక్తిని, రాజకీయ చిత్రపటంలో తమ స్థాయిని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే హోరాహోరీ ప్రచారం చేసిన మహిళలు శుక్రవారం జరగనున్న ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలలో 42 మంది అభ్యర్థులు, ఒక జెడ్పీటీసీ స్థానం కోసం నలుగురు బరిలో ఉన్నారు. వివిధ ఎంపీటీసీ స్థానాలలో పోటీపడుతున్న మహిళలు ఎంపీటీసీ స్థానం రిజర్వేషన్ సంఖ్య 1. పాములపర్తి బీసీ-మహిళ ఐదుగురు 2. గౌరారం జనరల్ ఒకరు 3. తున్కిఖాల్సా జనరల్-మహిళ ముగ్గురు 4. అంబర్‌పేట బీసీ-జనరల్ ముగ్గురు 5. వేలూరు జనరల్-మహిళ ముగ్గురు 6. మైలార ం జనరల్-మహిళ ముగ్గురు 7. నాచారం ఎస్సీ-మహిళ ముగ్గురు 8. వర్గల్-1 బీసీ-మహిళ ముగ్గురు మొత్తం 24 మంది మహిళలు -
మహిళలు.. మధ్యలోనే కెరీర్‌కు గుడ్‌బై!
న్యూఢిల్లీ: చాలా మంది మహిళలు తమ ఉద్యోగాలను మధ్యలోనే వదిలేస్తున్నారని నిపుణులంటున్నారు. పనిచేసే చోట లింగ వివక్షకు తావులేదంటూ ప్రచారం హోరెత్తిపోతున్నప్పటికీ, 60 శాతం మంది మహిళలు మధ్యలోనే తమ కెరీర్‌కు మంగళం పాడేస్తున్నారని వారంటున్నారు. మహీంద్రా గ్రూప్‌కు చెందిన బ్రిజిల్‌కోన్, గ్లోబల్ హంట్, పీడబ్ల్యూసీ ఇండియా, తదితర సంస్థల నిపుణుల అభిప్రాయాల ప్రకారం... చాలా కంపెనీలు ఎంట్రీ లెవల్లో మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకొని, వారికి తగిన శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఈ విషయంలో అవి వంద శాతం విజయం సాధిస్తున్నాయి. అయితే సమస్య అంతా వారు మధ్య స్థాయి నిర్వహణ ఉద్యోగాల్లోకి వచ్చేటప్పటికి ఉత్పన్నమవుతోంది. ఈ స్థాయికి వచ్చేటప్పటికి చాలా మంది మహిళలకు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. మరో వైపు కంపెనీల్లో మరింతగా ఎదగటానికి తగిన తోడ్పాటు లభించడం లేదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళ, పురుష ఉద్యోగులకు సమాన అవకాశాలు ఇవ్వడం, లింగ వివక్షతకు తావులేని విధానాలు అనుసరించడం తదితర చర్యల ద్వారా ఈ సమస్య నుంచి కొంత వరకూ గట్టెక్కవచ్చు. అయితే మహిళలకు సాధికారత కల్పించడం సమాజానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ విషయంలో టాటా స్టీల్ తేజస్విని పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద గతంలో పురుషులకే పరిమితమైన ఉద్యోగాలకు మహిళలను తీసుకొని, వారికి తగిన శిక్షణనిస్తోంది. -
తప్పతాగి డ్రైవ్ చేసారు...పోలీసులకు పట్టుబడ్డారు
-
మహిళలకే ముఖ్యం.. ప్లానింగ్
సామాజికంగా... ఆరోగ్యపరంగా... కుటుంబ బాధ్యతలపరంగా... ఏ రంగానైనా సరే! మహిళలకు ప్రత్యేకమైన రిస్కులుంటాయి. పరిస్థితులతో పాటు మహిళల ఆర్థిక అవసరాలూ మారుతున్నాయి. అయితే, వారు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నప్పటికీ.. ఆర్థిక ప్రణాళికల్లో ఇంకా వెనుకబడే ఉన్నారు. బ్యాంకు ఖాతాలు చూసుకోవడం, బిల్లులు కట్టుకోవడం కాకుండా మహిళలు తమ ఆర్థిక పరిస్థితుల గురించి, డబ్బు గురించి అర్థం చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా డబ్బు పొదుపు చేయడం, పెట్టుబడులు పెంచుకోవడం, వాటిని కాపాడుకోవడం, వీలైతే తర్వాత తరానికి అందించగలగటం వంటి ప్రయత్నాలు చేయాలి. ఆదాయంతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఖర్చుల గురించి అంచనా వేయాలి. అలాగే రిస్కు సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, దానికి అనుగుణమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. సాధ్యమైనంత వరకూ తొలిసారి ఉద్యోగంలో చేరినప్పటి నుంచే రిటైర్మెంట్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడులపై చక్రవడ్డీ ప్రయోజనాలు పొందవచ్చు. అర్థం కాని పెట్టుబడి సాధనాలకు దూరంగా ఉండటంతో పాటు అన్ని వేళలా తమ ఆర్థిక పరిస్థితులపై నియంత్రణ ఉండేలా చూసుకోవాలి. పెళ్లయిన తర్వాత కుటుంబ ఆర్థిక బాధ్యతలను పంచుకోవాలి కూడా. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక వేసుకోవటం... తొలుత వాస్తవికంగా సాధించగలిగే ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అది ఇల్లైనా, రిటైర్మెంట్నిధి, కారు కొనుగోలు వంటి ఏ లక్ష్యమైనా కావచ్చు. ఒక్కో దానికి ఎంత డబ్బు కావాలి? ఎన్నాళ్లలో కావాలి? అన్నది లెక్కలు వేసుకోవాలి. ఎన్నాళ్లలో కావాలన్నదానిపైనే దేన్లో పెట్టుబడి పెట్టాలన్నది ఆధారపడి ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే దానికి కావల్సిన నిధిని ఏర్పాటు చేసుకోవాలి. వీటికి సరైన ఇన్వెస్ట్మెంట్ సాధనం ఎంచుకోవడం ముఖ్యమే. దీనికి అడ్వైజర్ల సలహా తీసుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడం.. ఏ ఆర్థిక ప్రణాళికైనా విజయవంతం కావాలంటే.. పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో ఉండటం కీలకం. ప్రస్తుతం ఆన్లైన్లోనే ఇన్వెస్ట్ చేసే విధానం ప్రాచుర్యం పొందుతోంది. అయితే, ఎందులో ఇన్వెస్ట్ చేసినా.. ఆయా సాధనాల్లో ఉండే రాబడులు, రిస్కుల గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాకే చేయాలి. సమీక్షించుకోవడం.. పెట్టుబడులు మొదలెట్టాక... లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెడుతున్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఆదాయ వ్యయాలు పెరిగినా, కొత్తగా ఆస్తులు కొన్నా, అప్పుల భారం పడినా, మార్కెట్ పరిస్థితులు మారిపోయినా... మీ ఇన్వెస్ట్మెంట్ విధానాలను తదనుగుణంగా సవరించుకోవాలి. మీరు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువవుతున్న కొద్దీ.. అందుకోసం చేపట్టిన పెట్టుబడులను నగదు కింద మార్చుకోవడం మొదలుపెట్టాలి. బీమా విషయం తీసుకుంటే.. మెచ్యూరిటీ డబ్బు పొందాలంటే ఏయే పత్రాలను ఇవ్వాల్సి ఉంటుందో ఆరా తీయడం మొదలైనవి చేయాలి. అలాగే, మీ పెట్టుబడుల డబ్బును తిరిగి పొందేటప్పుడు పన్నులేవైనా కట్టాల్సి ఉంటుందేమో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌తో మాట్లాడాలి. సరైన దుస్తులు, గృహోపకరణాలు, హాలిడే ప్యాకేజెస్ గురించి తెలుసుకునేందుకు గంటల తరబడి ఎలాగైతే కూర్చుంటామో.. జీవితంలో వివిధ దశల్లో పాటించాల్సిన ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలను గురించి కూడా అంతే శ్రద్ధ చూపాలి. ఆర్థికపరమైన అంశాల్లో అవగాహన పెంచుకునేందుకు పర్సనల్ ఫైనాన్స్ ఆర్టికల్స్ లాంటివి చదవడం అలవాటు చేసుకోవాలి. ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆయా సాధనాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఏదైతేనేం..మీ ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలో మీరే నిర్దేశించుకోవాలి. జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా ఎదుర్కొనేందుకు కావాల్సిన ఆత్మ విశ్వాసాన్ని ఇది అందిస్తుంది. -
మహిళలకు రిజర్వేషన్ కల్పించిన విషయం
పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అయితే యాభైశాతం మించి మహిళలే పాలకులు కావడం విశేషం. అన్నింటికన్నా ఎక్కువగా 56 శాతంతో జార్ఖండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఊరిపెద్ద మహిళైతే ఉండే ప్రయోజనం గురించి ఇప్పటికే అక్కడి గ్రామాల్లోని ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. రిజర్వేషన్లోనే కాదు.. పాలనలో కూడా పర్ఫెక్ట్ అక్కడి మహిళాపాలకులు. అందులో ఒకరే - దొరోథియా దయామణి. జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో ‘అర’ గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్న దయా మణి ఒకప్పటి లక్ష్యం - లాయర్ కావాలని. ఊళ్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పడగానే ఆమె దృష్టి మరలింది. ఎప్పటి నుంచో ‘మహిళా రిజర్వేషన్’ కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఆ వార్త చెవిలో పడగానే కడుపు నిండిపోయింది. మహిళ సర్పంచ్ అయితే ఊళ్లో ఆడవాళ్ల కష్టాలు తీరతాయన్నది వారి ఆశ. అయితే వారు కోరుకున్న మహిళ చదువుకున్న మహిళ అని స్పష్టం చేయడంతో అందరి నోటా ‘దయామణి’ పేరు వినిపించింది. ‘‘ఎంచక్కా లా చదువుతున్నావు... మహిళలకు ఏం కావాలో నీకన్నా ఎవరికి తెలుస్తుంది చెప్పు..’’ అంటూ తోటి స్త్రీలంతా నచ్చజెప్పి ఒప్పించారు. పాతికేళ్ల వయసుకే ఊరి సర్పంచ్ అవడమేమిటి? అంటూ విమర్శించిన మగవారిని పక్కనపెట్టి దయామణి నామినేషన్ వేసింది. అందరూ కోరుకున్నట్టుగానే సర్పంచ్ అయింది. ఆ ఊళ్లో పది వార్డులకు తొమ్మిది వార్డులలో ఆడవాళ్లే సభ్యులు కావడం ఈ సర్పంచ్ అమ్మాయికి మరింత కలిసొచ్చింది. పాలన కాదు పోరాటం... అయితే, తాను చేయవలసింది పాలన కాదు..పోరాటం అని సర్పంచ్కుర్చీలో కూర్చున్న మూడురోజులకే దయా మణికి అర్థమైంది. ‘‘అవును... గ్రామాభివృద్ధికి నిధులను ఖర్చు చేయడంతోనే నా బాధ్యత తీరిపోదు కదా! ఒక మహిళా సర్పంచ్‌గా తోటి మహిళల క్షేమం కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అర్థమైంది. ఉపాధి లేని మహిళలపైన ముందుగా నా దృష్టి పెట్టాను. వ్యవసాయ పనులు, పాడి, పౌల్ట్రీ వంటి వాటిల్లో మహిళల పాత్ర చాలా కీలకమైంది. ఈ విషయంపై పోరాటం చేయదలచుకున్నాను. ఆ రంగాల్లోని యజమానులకు కౌన్సెలింగ్ చేసి మహిళలకు పనులిప్పించే పని చేశాను. మగవారనుకోండి.. పక్క ఊరికి వెళ్లయినా పని చేసుకోవచ్చు. ఆడవాళ్లకలా కుదరదు కాబట్టి ఊరి పనుల్లో వారికి అవకాశం కల్పించాలని పట్టుబట్టా. మొదట్లో కొందరు మగవాళ్ళు వ్యతిరేకించినా తర్వాత మెల్లగా అర్థం చేసుకున్నారు’’ అని దయామణి చెప్పారు. ఆమె ఆలోచనలోని అంతరార్థమేమిటంటే, మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం వస్తేనే మిగతా స్వాతంత్య్రాలన్నీ వస్తాయని. ఉపాధి తర్వాత... మహిళలకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడంలో విజయం సాధించిన ఈ లాయరమ్మ సర్పంచ్ పదవి రాగానే తన చదువుకు స్వస్తి చెప్పలేదు. పదవి చూసుకుంటూనే మరో పక్క ప్రయివేటు డిగ్రీ చేస్తోంది. చుట్టుపక్కలున్న మహిళా సర్పంచ్‌లతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. గ్రామాభివృద్ధితో పాటు మహిళాభివృద్ధికి మహిళా సర్పంచ్‌లంతా కృషి చేయాలనే ఆలోచనను రేకెత్తించింది. ఆ భావన అందరిలో కలగడంతో ఆ రాష్ర్టంలోని 31 వేల మహిళా గ్రామపాలకులంతా కలిసి మొన్నీమధ్యనే ఒక ప్రదర్శన కూడా చేశారు. స్త్రీల పురోభివృద్ధికి కృషి చేస్తున్న దయామణి ‘‘ఆడది సంతోషంగా లేనిచోట అభివృద్ధికి తావులేదు’’ అంటారు. ఆమె మాటలు అక్షరసత్యాలు -కదూ! -
పెరుగుతున్న పెళ్ళి వయసు
పద్ధెనిమిదేళ్ళ వయసుకే పెళ్లిని ఇష్టపడే అమ్మాయిలు తగ్గిపోయారు. పోనీ 20 ఏళ్లకు పెళ్ళంటే చదువంటున్నారు. పాతికేళ్లకు చేసుకోమంటే ఉద్యోగం అంటున్నారు. ముప్ఫై ఏళ్లు నిండితే గాని పెళ్లి మాట ఎత్తొద్దని ఇంట్లోని పెద్దలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. అమెరికాలో హర్ క్యాంపస్ డాట్‌కామ్ వాళ్లు ‘డెడ్ లైన్’ పేరుతో చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మొత్తం 2,600 కళాశాలలు, 677 యూనివర్సిటీలలో చదువుకుంటున్న అమ్మాయిలందరి అభిప్రాయాలు సేకరించి ఈ అధ్యయనం చేశారు. అందులో తేలింది ఏమిటంటే, 85 శాతం కాలేజి అమ్మాయిలు ముప్ఫై ఏళ్ల వయసులో పెళ్లిని ఇష్టపడుతున్నారు. ఈ విషయం గురించి హర్కాంపస్ సిఇఓ స్టెఫిన్ కప్లేన్ మాట్లాడుతూ, ‘‘ఈ అధ్యయనంలో వ్యక్తమైన అమ్మాయిల అభిప్రాయాన్ని మేం ముందుగానే ఊహించాం. చదువు, ఉద్యోగం, బాధ్యతలు, ప్లానింగ్...అన్నీ సక్రమంగా చేసుకోడానికి చదువు తర్వాత అమ్మాయికి కొంత సమయం అవసరమవుతుంది. జీవితం పట్ల కచ్చితమైన ప్లానింగ్ ఉన్న ప్రతి అమ్మాయికీ లక్ష్యం చేరుకోడానికి ఈ మాత్రం సమయం పడుతుంది మరి’’ అని అన్నారామె. ఈ అధ్యయనానికి ‘డెడ్‌లైన్’ అనే పేరెందుకు పెట్టారంటే... ‘‘పెళ్లికి ముందు తను చేరుకోవాల్సిన లక్ష్యాలను చేరుకోవాలి. ఫలానా సమయం లోగా పనులన్నీ పూర్తిచేసుకోవాలనే డెడ్‌లైన్ పెట్టుకుంటేనే అన్నీ సక్రమంగా పూర్తిచేసుకోగలరు. ఆ సమయాన్నే మేం ‘డెడ్‌లైన్’ అంటున్నాం’’ అంటారు ఈ అధ్యయన నిర్వాహకులు. -
లగ్జరీ బైక్‌లూ నడిపేస్తాం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లీ డేవిడ్సన్, ట్రయంఫ్, హ్యోసంగ్, కవాసాకి నింజా, డ్యుకాటీ... ఈ పేర్లు వినగానే లగ్జరీ బైకులని ఠక్కున చెప్పేస్తాం. అయితే ఇప్పుడివి మగవారికి మాత్రమే సొంతం కాదండోయ్!!. ‘మేము కూడా దూసుకుపోతాం’ అంటున్నారు మహిళలు. అవును.. లగ్జరీ, సూపర్ బైకుల రైడింగ్‌పై మహిళల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. వీరి ఆసక్తి తగ్గట్టే మహిళల కోసం ప్రత్యేకమైన లగ్జరీ బైకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి వాహన సంస్థలు. దేశవ్యాప్తంగా ఏటా 10 వేల లగ్జరీ బైకులు అమ్ముడవుతుండగా ఇందులో మహిళ వాటా 10 శాతంగా ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. మెట్రో నగరాల్లో మహిళల జీవన శైలి, ఆలోచన విధానాల్లో అనూహ్యమైన మార్పులొస్తున్నాయి. దీంతో మగవారితో సమానంగా వారు కూడా లగ్జరీ, సూపర్ బైకులను నడపాలని కోరుకుంటున్నారు. అయితే మనదేశంలో మహిళా బైక్ రైడింగ్ విభాగం చాలా చిన్నది. అందుకే మహిళా కస్టమర్లను ఆకర్షించడం ఇక్కడ సులువైన పని కాదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ‘‘ప్రతి నెలా లగ్జరీ బైక్స్ కొనేందుకు మా షోరూమ్‌కు వచ్చే 15 మంది కస్టమర్లలో ఇద్దరు మహిళా కస్టమర్లు ఉంటున్నారు’’ అని హార్లీ డేవిడ్సన్ ఏపీ డీలర్ జయ్‌రామ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ‘స్ట్రీట్ 750’ ‘సూపర్’లో లగ్జరీ బైకులు మహిళలకు సరిగ్గా సరిపోతాయన్నారు. ‘‘ఎందుకంటే వీటి ఎత్తు, బరువు మిగతా లగ్జరీ బైకులకంటే తక్కువగా ఉంటాయి. దీంతో నాలుగు ఫీట్లుండే మహిళలు ఈ బైకులపై కూర్చున్నా కూడా వారికి బ్రేకులు, గేర్లు అందుతాయి’’ అని వివరించారు. దేశ వ్యాప్తంగా హార్లీ డేవిడ్సన్ బైకులకు 2 వేల మంది మహిళా కస్టమర్లున్నారని ఆయన చెప్పారు. ‘‘లాంగ్ డ్రైవ్ కోసమే లగ్జరీ బైకులు. ఇతర బైకులు గనక 80 కి.మీ. వేగాన్ని దాటితే నియంత్రించలేం. కానీ, లగ్జరీ బైకులు 150 కి.మీ. దాటినా సులువుగా నియంత్రించొచ్చు. అందుకే హ్యోసంగ్ నుంచి 250 సీసీ క్రూజర్ బైకును ప్రత్యేకంగా మహిళల కోసమే మార్కెట్లోకి విడుదల చేశాం’’ అని చెప్పారు హోయోసంగ్ ఏపీ డీలర్ వంశీ కృష్ణ. 170 కిలోల బరువుండే ఈ బైకుపై ఆగకుండా వెయ్యి కి.మీ ప్రయాణించినా నడుం నొప్పి రాదని వంశీ కృష్ణ చెప్పుకొచ్చారు. అయితే మగవారిని ఆకర్షించినంత సులువుగా మహిళా కస్టమర్లను ఆకర్షించలేమని ఆయనన్నారు. కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు, సమాజ కోణం వంటి ఎన్నో కారణాలున్నాయన్నారు. 250 సీసీ నుంచి 1,800 సీసీ గల లగ్జరీ, సూపర్ బైకులు దేశవ్యాప్తంగా ఏటా 10 వేలు అమ్ముడవుతుండగా... వీటిలో మహిళల వాటా 10 శాతం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే రెండేళ్లలో లగ్జరీ బైకుల కొనుగోళ్లలో మహిళల వాటా 20-30% పెరిగే అవకాశముందన్నది వారి అంచనా. ఎత్తు, బరువు తక్కువుంటేనే..: సాధారణంగా మహిళలు నడిపే స్కూటీ పెప్ వాహనాల పొడవు 1,735 ఎంఎం, వెడల్పు 590 ఎంఎం, సీటు ఎత్తు 740 ఎంఎం ఉంటుంది. కానీ లగ్జరీ, సూపర్ బైక్స్ భిన్నమైనవి. మహిళలు వీటి ని నియంత్రించడం కొంచెం కష్టం. అందుకే మహిళల కోసం లగ్జరీ బైకుల తయారీలో బండి బరువు, ఎత్తు తగ్గింపు వంటి చిన్న మా ర్పులు చేస్తున్నారు. దీంతో మగాళ్లతో సమానంగా మహిళలూ లగ్జరీ, సూపర్ బైక్స్‌పై దూసుకుపోతున్నారు. సర్వేలు శిక్షణ కూడా... కోట్లు వెచ్చించి తయారు చేసిన వాహనాలు తీరా మార్కెట్లోకి విడుదలయ్యాక మహిళలు స్వాగతించకపోతే కంపెనీలకు నష్టమే. అందుకే మహిళలు ఎలాంటి బైకులు ఇష్టపడతారో సర్వేలు చేసి మరీ విడుదల చేస్తున్నాయి. హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసే ముందు మహిళలు, మగవారు ఇద్దరిలో ఈ బైక్ ఎవరికి కరెక్ట్‌గా సరిపోతుందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే చేశాకే ప్రవేశపెట్టింది. బరువెక్కువగా ఉండే లగ్జరీ, సూపర్ బైకులను ఎలా నియంత్రించాలో మహిళల కోసం ప్రత్యేకమైన శిక్షణ తరగతులూ నిర్వహిస్తున్నాయి ట్రయంఫ్ వంటి కొన్నికంపెనీలు. -
కిచిడీ: పెప్పర్ స్ప్రే గురించి నిజాలు!
స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు తమను తాము రక్షించుకునే ఆయుధంగా ఇటీవల పెప్పర్ స్ప్రే మంచి ఆదరణ పొందుతోంది. పార్లమెంటులో దీని ప్రస్తావన వచ్చాక ఇది ఒక్కసారిగా విపరీతమైన ప్రచారం పొందింది. ఈ నేపథ్యంలో పెప్పర్ స్ప్రే గురించి కొన్ని వాస్తవాలు.. పెప్పర్ అంటే మిరియాలు. పేరు పెప్పర్ స్ప్రే అయినా అందులో పెప్పర్ ఉండదట. ఇందులో ఉండే పదార్థం ఘాటు మిరపకాయల నుంచి తీసినది గాని లేక మిరప జాతికి చెందిన కొన్ని ఇతర రకాల వాటి నుంచి సేకరించినది గాని అయిఉంటుంది. సుమారు పది అడుగుల నుంచి ప్రయోగించినా కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అత్యాచార ప్రమాదం గ్రహించినపుడు స్త్రీలు దీనిని ప్రయోగిస్తే నిందితుడు కనీసం ఓ గంట పాటు తేరుకోలేడు. పెప్పర్ స్ప్రే ప్రయోగిస్తే సరిగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. దగ్గు వస్తుంది. తట్టుకోలేని కళ్ల మంట, గొంతులో విపరీతమైన ఇరిటేషన్ వస్తుంది. అంటే నిందితుడు కోలుకునే లోపు మహిళలు ఈజీగా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. పెప్పర్ స్ప్రే వాడకం మొదలై చాలారోజులు అయినా ఇది మార్కెట్లో ఆదరణ పొందింది మాత్రం ఢిల్లీలో నిర్భయ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాతే. ఇటీవలి కాలంలో హైదరాబాదులో ఓ అమ్మాయి దీనిని ఉపయోగించి ప్రమాదం నుంచి తప్పించుకుంది. వీటి ధర 200-500 వరకు ఉంది. పెప్పర్ స్ప్రే ఆధారంగా దేశంలో పదికోట్ల వ్యాపారం జరుగుతోందట. ఇక నుంచి ఇది పుంజుకునే అవకాశం కూడా ఉండొచ్చు. -
వీరింతే!
విజయనగరం జిల్లాలో 2011లో వెయ్యి మంది పురుషులకు.. 981 మంది స్త్రీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 957కి తగ్గింది. మరికొంత కాలం ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఆ సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. జిల్లాలో లింగనిర్ధారణ చట్టం ఎంత శ్రద్ధగా అమలు చేస్తున్నారో ఈ గణాంకాలే తేల్చి చెబుతున్నాయి. జిల్లాలో ఆడపిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయినా అధికారుల్లో చలనం రావడం లేదు. లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని తెలిసినా చాలా ప్రైవేటు క్లినిక్‌లు పట్టించుకోవడం లేదు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ‘డెకాయ్ ఆపరేషన్లు’ పూర్తి స్థాయిలో జరగడం లేదు. లక్ష్యంలో సగం కూడా చేరుకోలేకపోతున్నారు. 2013-14కు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు 49 డెకాయ్ ఆపరేషన్లు చేయాలని నిర్దేశించింది. అయితే అధికారులు 24 ఆపరేషన్లు మాత్రమే చేశారు. ఇంకా 25 ఆపరేషన్లు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నెల రోజుల్లో 25 డెకాయ్ ఆపరేషన్లు చేయడం కష్టమే. డెకాయ్ ఆపరేషన్‌లో అధికారులు తమకు తెలిసిన గర్భిణిని స్కానింగ్ సెంటర్‌కు పంపిస్తారు. ఆమెతో పాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు అక్కడే చాటుగా ఉంటారు. స్కానింగ్ సెంటర్లోకి వెళ్లిన గర్భిణి తనకు లింగ నిర్ధారణ వెల్లడించాలని, అందుకు ఫీజు చెల్లిస్తానని చెబుతుంది. అప్పుడు అధికారులు నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. దీన్నే డెకాయ్ ఆపరేషన్ అంటారు. ఈ ఆపరేషన్‌లో ఏ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడైనా పట్టుబడితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేస్తారు. లింగ నిర్ధారణ వెల్లడిని అడ్డుకోవడం ద్వారా తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను అరికట్టాలన్నది డెకాయ్ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. కాని అది పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల ఆడపిల్లలను చెత్తకుండీల్లోనూ, ఆస్పత్రుల్లోనూ వదిలేయడం, భ్రూణ హత్యలు వంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. -
.‘పోపులపెట్టె’ గుర్తుందా!
ఆడవాళ్ల డబ్బంతా పోపులపెట్టెలో ఉంటుందనే మాట గుర్తుందా! మన ముందుతరం మహిళలంతా డబ్బు విషయంలో ఎంతో ముందు జాగ్రత్తగా ఉండేవారనడానికి ‘పోపులపెట్టె’ పెద్ద నిదర్శనం. ఎలాంటి ఆదాయంలేని రోజుల్లో ఆడవాళ్లు పోపులపెట్టెలో ఎంతోకొంత డబ్బు దాచుకునేవారు. ఇంట్లో ఖర్చులకిచ్చిన సొమ్ములో నుంచి నాలుగు ైపైసలు పక్కనపెట్టి ఆపదొచ్చినపుడు, అత్యవసరమైనపుడు మగవారికి సాయపడ్డ జ్ఞాపకాలు...మన ముందుతరంవారిని ఎవరినడిగినా చెబుతారు. పాలమ్ముకున్న డబ్బులు, కోళ్లమ్ముకున్న డబ్బులు...అంటూ పల్లెల్లో ఆడవాళ్లందరికీ ఉండే పర్సనల్ ఎకౌంట్ ఇప్పటికీ కొనసాగుతోంది. మరి నెలొచ్చేసరికి వేలకు వేలు సంపాదిస్తున్న నేటి తరం మహిళలు ఎంత డబ్బుని దాచుకుంటున్నారు అంటే... అందరూ తెల్లమొహాలు వేస్తారు. సంపాదనతో పాటు వేగంగా పెరుగుతున్న ఖర్చుల చిట్టాకే పట్టం కడుతున్న మహిళలు డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ సంపాదన పది వేలయితే ఖర్చు కూడా దానికి సమానంగా ఉంటోంది. కారణం ఏమంటే ధరలంటారు. నూటికి కనీసం ఇరవైశాతం డబ్బు పక్కన పెట్టకపోతే భవిష్యత్తు విసిరే సవాళ్లకు మీ దగ్గర సమాధానం ఉండదు. ముందుగానే మీ ఖర్చులకు కళ్లెం వేయకపోతే ఎంత సంపాదనైనా నీళ్లలా ఖర్చయిపోతుంది. తోటివారితో సంపాదనలో పోటీ పడాలి కాని ఖర్చులో కాదన్న విషయాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. లేదంటే... ఇంట్లో, ఆఫీసులో క్షణం తీరికలేకుండా కష్టపడే మీ శ్రమకు ఫలితం ఏంటి? ఉద్యోగులైన మీరు ఆర్థికంగా మరొకరిపై ఆధారపడకూడదు. అలా ఆధారపడ్డారంటే ఖర్చుల విషయంలో మీ లెక్కలు తప్పని అర్థం. నేటితరం మహిళలు సంపాదన, ఖర్చు సమానంగా ఉంటోందనడానికి కారణం...ప్లానింగ్ లేకపోవడమే. పాతికవేల జీతం ఉన్నప్పుడు స్కూటర్‌పై వెళ్లేవాళ్లు మరో పదివేలు జీతం పెరగ్గానే కారు కావాలని ఆశపడడమే మీ ఆదాయం మాయమవడానికి కారణం. సంపాదనలకు తోడు రోజురోజుకీ పెరుగుతున్న షాపింగ్ మిమ్మల్ని మరింత గందరగోళంలో పడేస్తుంది. షాపింగ్ విషయంలో పరిమితులు పెట్టుకోకపోతే నెలాఖరులోగా పర్సు ఖాళీ అయిపోవడం ఖాయం.మన ముందుతరం మహిళల ‘పోపులపెట్టె’ సూత్రం నేటితరం మహిళలు గొప్ప ఆదర్శం. ఆ సూత్రాన్ని పాటించకపోతే కష్టపడుతూ కూడా కష్టాలు కొనితెచ్చుకున్నవాళ్లమవుతాం. - సుజాత బుర్లా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండ్ ఫండ్ మేనేజర్ -
మూలనపడ్డ బాండ్లు
మున్సిపాలిటీ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలు జనశ్రీ పథకంలో సభ్యత్వం తీసుకున్న వారి పిల్లల చదువుల కోసం ఉపకార వేతనాలు.. ఎదైనా ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి జనశ్రీ పథకం ద్వారా రుణాలు మంజూరవుతాయి. ఏడాది నుంచి వాటికి సంబంధించిన బాండ్లు అధికారులు ఇవ్వడంలేదు. బాండ్లు మాత్రం కార్యాలయంలో అధికారులు మూలనపడేశారు. అధికారులు స్పందించి బాండ్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. - పులివెందుల అర్బన్ -
అమ్మాయిలకంటే అబ్బాయిలే త్వరగా ప్రేమలో పడతారు!
మగ ‘నిజాలు’ స్త్రీ కంటే పురుషుడు తక్కువగా మాట్లాడతాడు! స్త్రీ కంటే తక్కువసార్లు దువ్వెన వాడతాడు. ఎక్కువసార్లు కోపం తెచ్చుకుంటాడు కానీ గంటల లెక్కన చూస్తే, ఒక జీవిత కాలంలో స్త్రీ కంటే మగాడు కోపంగా ఉండే కాలం చాలా తక్కువ! స్త్రీ కంటే తక్కువ వస్త్రాలు కొంటాడు. ఒక డ్రెస్సును ఆమెకంటే ఎక్కువసార్లు ధరిస్తాడు! స్త్రీ-పురుషుల మధ్య ఎత్తులో ఉండే తారతమ్యం... మిగతా దేశాల కంటే రష్యాలో కాస్త తక్కువ! అత్యధిక దేశాల్లో సగటున మగాడు స్త్రీల కంటే తక్కువ కాలం బతుకుతాడు! అమ్మాయిల కంటే అబ్బాయిలే త్వరగా ప్రేమలో పడతారు! -
అరచెయ్యిలో వైకుంఠం
తెనాలిఅర్బన్/రూరల్, న్యూస్‌లైన్: ఇలా పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్న మహిళలు తెనాలిలోని ప్రతి వార్డులో తారసపడుతుంటారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా పింఛన్లు మంజూరు చేయించాం. సంక్షేమ పథకాలు అర్హులకు అందటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు తెలుసుకోవాలి. ఆ ఫలాలను కచ్చితంగా అనుభవించాలి. ఇటీవల కాలంలో అధికార పక్షం నేతలు, అధికారులు చేస్తున్న ప్రకటన తీరిది. అర్హులమే నంటూ అధికారులు ధృవీకరించారు. ప్రజా ప్రతినిధులు ఆర్భాటంగా సభలు సమావేశాలు నిర్వహించి మంజూరు పత్రాలను అందించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఫించన్లు రావటల్లేదని ప్రజలు మొత్తుకుంటున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలంటూ మూడు విడతలుగా రచ్చబండ కార్యక్రమం ఆర్బాటంగా నిర్వహించారు. మొదటి విడతలో స్వీకరించిన దరఖాస్తులకు రెండో విడత రచ్చబండలో, రెండో విడత రచ్చబండలో స్వీకరించిన దరఖాస్తులకు మూడో విడత రచ్చబండలో మంజూరు పత్రాలను అందించారు. ఇవి కాక మెగా గ్రీవెన్స్, జన సందర్శన పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ అర్జీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే వీటిలో అధికశాతం రేషను కార్డు, నివేశన స్థలం, వృద్ధాప్య, వితంతు పింఛన్లకు సంబంధించినవే. అర్హులుగా గుర్తించి మంజూరు పత్రాలు ఇచ్చినా, పింఛన్లు అందటంలేదని ప్రజలు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం మంజూరు పత్రం ఇచ్చిన తరువాత కచ్చితంగా లబ్ధి చేకూరుతుందని, మంజూరు పత్రం ఇచ్చిన తేదీ నుంచి వారికి ప్రతిఫలం అందుతుందని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. -
కలర్పుల్గా మారిన హైదరాబాద్ ఎగ్జిబిషన్
-
అస్త్ర తంత్ర : ఒంటరి ప్రయాణమా... జాగ్రత్త!
ఆఫీసు పని మీదో, వ్యక్తిగత పని మీదో... కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వెళ్లేది బస్సులో అయినా, రైల్లో అయినా కానీ, జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. అందుకు ఏం చేయాలంటే... వాహనంలో ఆడవాళ్లు ఎవరూ లేకపోతే, వీలైనంతవరకూ వేరేదానిలో వెళ్లేందుకు ప్రయత్నించడం మంచిది. లేదంటే కనీసం మెయిన్‌డోరుకు దగ్గరలో ఉన్న సీట్లో కూర్చోవడం ఉత్తమం! కొందరు కావాలని మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. అస్సలు మాట్లాకుండా ఉండనక్కర్లేదు. ఆచితూచి మాట్లాడండి. వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు! నా ఫోన్ చార్జింగ్ అయిపోయింది, మీదోసారి ఇవ్వమని ఎవరైనా అడిగితే... నిర్మొహమాటంగా ‘నో’ అనండి. వాళ్లు మీ నంబర్ సేవ్ చేసుకుని తర్వాత విసిగించే ప్రమాదం ఉంది! ఎవరైనా ఏదైనా పెడితే తినవద్దు. వాళ్లు ఫీలవుతారు అనుకుంటే, అది మీరు తినకూడదనో, ఒంటికి పడదనో చెప్పి తప్పించుకోండి! రైలు కంపార్ట్మెంట్లో మీరొక్కరే ఆడవాళ్లయితే... బాగా పై బెర్తులోనే పడుకోండి. అలాగే టాయిలెట్‌కు వెళ్లినప్పుడు సెల్‌ఫోన్, ఏవైనా సేఫ్టీ వెపన్స్ ఉంటే వాటిని కూడా తప్పక తీసుకెళ్లండి! ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినా, మీమీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనో లేక మిమ్మల్ని ఎక్కువగా పరిశీలిస్తున్నారనో అనుమానం వచ్చినా... రైలయితే కంపార్ట్మెంట్ మారండి. బస్సయితే సీటు మారండి. టీసీకో లేక బస్సు డ్రైవరుకో విషయం తప్పక చెప్పండి! వీలైనంతవరకూ నిద్రపోకుండా ఉండేందుకు ట్రై చేయండి. మరీ దూర ప్రయాణం అయితే ఎలాగూ తప్పదు కదా! అలాంటప్పుడు నిద్రపోయినా మరీ మొద్దు నిద్రపోవడం అంత మంచిది కాదని గుర్తుంచుకోండి! -
మహిళలకు ‘సాక్షి’ అభయాస్త్రం
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ : ‘సాక్షి’ సహకారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘సాక్షి అభయ’యాప్ ఆపదలో ఉన్న మహిళలకు బ్రహ్మాస్త్రంలాంటిదని అడిషనల్ ఎస్పీ రవి శంకర్‌రెడ్డి అన్నారు. మహిళలపై జరుగుతు న్న దాడులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ ఎస్పీ హాజరయ్యారు. ఆధునిక టెక్నాలజీని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చన్నారు. సాక్షి అభయ యాప్ ద్వారా బాధితురాలు ఆపదలో ఉన్న ప్రదేశం సులభంగా తెలిసిపోతుందన్నారు. అప్పుడు సాయం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చట్టాలు ఎన్నివచ్చినా మహిళలపై దాడులు తగ్గకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులకు వారి సబ్జెక్టులతోపాటు నైతిక విలువలు, మానవతావిలువలను బోధించాలన్నారు. మహిళలు సైతం స్వీయరక్షణ చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా సాక్షి, వైఎస్ఆర్సీపీ రూపొందించిన సాక్షి అభయ యాప్ బాగా ఉపయోగపడుతుందన్నారు. వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డిగారి రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటర్నెట్తో పనిలేకుండా పనిచేసే ఈ యాప్‌ను విద్యార్థినులు, మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లైఫ్ హోమియోపతి వైద్యురాాలు డాక్టర్ శిరీషారెడ్డి, వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి, స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మహేశ్వరరెడ్డి, అనిల్, పవన్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, రామిరెడ్డి, అశోక్‌రాజు పాల్గొన్నారు.