ప్రభుత్వ అసమర్ధతతో దేశంలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా బుడగజంగం సంఘం అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక గణేష్ నగర్‌లోని ఆ సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ప్రభుత్వ అసమర్ధతతో దేశంలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా బుడగజంగం సంఘం అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక గణేష్ నగర్‌లోని ఆ సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో పలు ప్రాంతాల్లో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. ముంబాయిలో విధి నిర్వహణకు వెళ్లిన మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహికంగా అత్యచారం చేయడం దారుణమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకుడు ఎల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
కొవ్వొత్తుల ప్రదర్శన
ఎమ్మిగనూరు టౌన్: ముంబైలో మహిళ ఫొటో జర్నలిస్టుపై జరిగిన లై ంగిక దాడిని నిరసిస్తూ శనివారం రాత్రి దళిత ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. దేశంలో రోజురోజుకు మహిళలకు రక్షణలేకుండా పోతోందని దళిత ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ దేవసహాయం ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటో జర్నలిస్టుపై లైంగికదాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. మరో మారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కదిరికోట ఆదెన్న, డి.నరసింహులు, ఎస్.రాజు, ఎండీ.శ్రీనివాసులు, ఆనంద్ చైతన్య, పెద్దయ్య, కె.ప్రసాద్, ఉసేని, భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు.