శంషాబాద్: మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఐదో తరగతి వరకు చదువుకున్న మహిళలు అర్హులని చెప్పారు. శిక్షణ కాలంలో శంషాబాద్ నుంచి రవాణా సౌకర్యంతో పాటు మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు చిన్మయ విద్యాలయ క్యాంపస్‌లోని వరలక్ష్మి ఫౌండేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.