కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ :
‘సాక్షి’ సహకారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘సాక్షి అభయ’యాప్ ఆపదలో ఉన్న మహిళలకు బ్రహ్మాస్త్రంలాంటిదని అడిషనల్ ఎస్పీ రవి శంకర్‌రెడ్డి అన్నారు. మహిళలపై జరుగుతు న్న దాడులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ ఎస్పీ హాజరయ్యారు. ఆధునిక టెక్నాలజీని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చన్నారు. సాక్షి అభయ యాప్ ద్వారా బాధితురాలు ఆపదలో ఉన్న ప్రదేశం సులభంగా తెలిసిపోతుందన్నారు. అప్పుడు సాయం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చట్టాలు ఎన్నివచ్చినా మహిళలపై దాడులు తగ్గకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులకు వారి సబ్జెక్టులతోపాటు నైతిక విలువలు, మానవతావిలువలను బోధించాలన్నారు. మహిళలు సైతం స్వీయరక్షణ చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా సాక్షి, వైఎస్‌ఆర్‌సీపీ రూపొందించిన సాక్షి అభయ యాప్ బాగా ఉపయోగపడుతుందన్నారు. వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డిగారి రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటర్‌నెట్‌తో పనిలేకుండా పనిచేసే ఈ యాప్‌ను విద్యార్థినులు, మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లైఫ్ హోమియోపతి వైద్యురాాలు డాక్టర్ శిరీషారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి లీగల్ సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి, స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మహేశ్వరరెడ్డి, అనిల్, పవన్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, రామిరెడ్డి, అశోక్‌రాజు పాల్గొన్నారు.