ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను మభ్యపెట్టి, వ్యభిచార ముఠాకు విక్రయించిన ఇద్దరు మహిళలను సోమవారం అరెస్టు చేసినట్టు అడ్డతీగల సీఐ వి.పుల్లారావు తెలిపారు.
అడ్డతీగల, న్యూస్‌లైన్ : ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను మభ్యపెట్టి, వ్యభిచార ముఠాకు విక్రయించిన ఇద్దరు మహిళలను సోమవారం అరెస్టు చేసినట్టు అడ్డతీగల సీఐ వి.పుల్లారావు తెలిపారు. అడ్డతీగల మం డలంలోని గొండోలుకి చెందిన ఇద్దరు వివాహితలు వారి ఉచ్చులో చిక్కుకున్న ట్టు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజవొమ్మంగి మండలంలోని కొండ లింగంపర్తికి చెందిన బసవా వీరవెంకటరత్నం, దబ్బా రామలక్ష్మిలకు గొండోలుకి చెందిన ఇద్దరు మ హిళలతో పరిచయం ఏర్పడింది. వీరి భర్తలకు సరైన ఉపాధి, ఆదాయం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. ఈ క్రమంలో వారికి హైదరాబాద్‌లోని జూట్ మిల్లులో కూలీపని ఇప్పిస్తామని వీరవెంకటరత్నం, రామలక్ష్మిలు నమ్మించారు. నెలకు రూ.8 వేల జీతం లభిస్తుందని ఆశ పెట్టారు. ఒకొక్కరు ప్రయాణ ఖర్చుల కోసం రూ.2,500 వం తున తెచ్చుకోవాలని చెప్పారు.
ఇందుకు ఆ మహిళలు అంగీకరించారు. తొలుత హైదరాబాద్‌కు తీసుకువెళ్లి, అక్కడ వీరవెంకటరత్నం ఇంట్లో నాలుగు రోజులు ఉంచారు. ఇక్కడ మిల్లులో పని లేదని చెప్పి, ముంబైలో ఎక్కువ జీతం వస్తుం దని మహిళలకు నమ్మించారు. అందుకు వారు సమ్మతించడంతో ముంబైకి తరలించారు. అక్కడికి వెళ్లాక మధు అనే తెలుగమ్మాయికి ఒక్కొక్కరిని రూ.10 వేల వంతున విక్రయించారు. సొమ్ము తీసుకుని వీరవెంకటరత్నం, రామలక్ష్మి లు వెళ్లిపోయారు. రెండు వారాలు తర్వాత బాధితులు ఆత్మహత్య చేసుకుం టామని అక్కడి వారిని బెదిరించారు. దీంతో వారి వద్ద ఉన్న కాళ్ల పట్టీలు తీసుకుని, రైలు ఎక్కించి పంపించేశారు. స్వగ్రామం చేరిన బాధితులు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యా ప్తు చేపట్టిన పోలీసులు నిందితులు వీరవెంకటరత్నం, రామలక్ష్మిలను గొంటువానిపాలెం వద్ద సోమవారం అరెస్టు చేశారు. ఇలాంటి మహిళల మాయమాటలు నమ్మి ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని సీఐ హెచ్చరించారు