IRST POINT
యుగయుగాల చరిత్రలో.. అవనిపై రమణులు తలవంచుకునే జీవితాలు వెళ్లదీస్తున్నారు. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాతా అన్నవాళ్లే.. కార్యేషు దాసి అంటూ అబలను చేశారు. లేడీస్ ఫస్ట్ అంటూనే నయాజమానాలో కూడా వాళ్లపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం కోసం వారితో ఉద్యోగాలు చేయిస్తూ.. ఆమె ఏటీఎం కార్డు మాత్రం తమ వద్దే ఉంచుకుంటున్నవారూ ఉన్నారు. ఆడ, మగ సమానం.. అయితే మగాడు కాస్త ఎక్కువ సమానం అనే వారున్నంత కాలం వనితలపై వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితి మారాలని ప్రపంచ మహిళ ఆకాంక్షిస్తోంది. వరల్డ్ విమెన్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఇందుకు గొంతుకయ్యింది. లింగవివక్ష రూపుమాపడమే ఫస్ట్ పాయింట్ అంటోంది. - సాక్షి, సిటీప్లస్
అమలు చేస్తేనే..
‘నేను ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. ఇట్ ఈజ్ అమేజింగ్! అల్ వరల్డ్ ఇక్కడ కొలువుదీరింది. 2017లో జరగబోయే విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌ను బ్రెజిల్ హోస్ట్ చేయనుంది. అందుకే హైదరాబాద్‌లో జరిగే ఈ కాన్ఫరెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. ఈ చర్చల సారాంశాన్ని మా దేశానికి తీసుకెళ్తాం. ఏ దేశంలో అయినా మహిళల పరిస్థితి ఒకేలా ఉంది. ఆర్థిక స్వాతంత్రం విషయంలో బ్రెజిల్‌లో మహిళలు కాస్త ముందున్నారు. ఇలాంటి సమావేశాల్లో పంచుకునే ఆలోచనలు.. తీసుకునే నిర్ణయాలు కచ్చితంగా అమలు చేసినపుడే మహిళలు వివక్షను అధిగమించగలరు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. వెరీ ఇంటరెస్టింగ్ ప్లేస్! హావ్ టు విజిట్ మెనీప్లేసెస్ హియర్... లైక్ గోల్కొండ ఫోర్ట్, చౌమొహల్లా ప్యాలెస్! జీవితంలోని అడ్డంకులను ఎదుర్కోవడంలో హైదరాబాదీ అమ్మాయిలు చేస్తున్న స్ట్రగుల్ రియల్లీ గ్రేట్.
- క్రిస్టినా వూల్ఫ్, బ్రెజిల్
మార్పు రావాల్సిందే
‘భారతీయ మహిళలు కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యంలో సగం కూడా తమకు ఇచ్చుకోరు. అందుకే మహిళ తన స్థానాన్ని, హక్కుల్ని, స్వేచ్ఛను కోల్పోతున్నానన్న విషయం గ్రహించలేకపోతోంది’ అంటూ సగటు ఇండియన్ విమెన్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది అమెరికాలోని రుట్‌గర్స్ యూనివర్శిటీ విద్యార్థిని సరాస్టెర్న్. భారత మహిళలు లింగ వివక్ష నుంచి బయటపడాలంటే మీడియా ప్రధాన పాత్ర పోషించాలి. ఇక్కడ సినిమా, టీవీ వీక్షకుల సంఖ్య ఎక్కువ. మహిళల గురించి మాట్లాడే విధానం.. వారిని తెరపై చూపించే తీరు మారాలి. నేను ఇండియాకు రావడం ఇది రెండోసారి. హైదరాబాద్ గురించి, చార్మినార్ గురించి చాలా సార్లు విన్నాను. అక్కడ దొరికే గాజుల గురించి. రిటర్న్ అయ్యేలోపు షాపింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాను.
మదర్ రోల్ కీలకం
నాది ఘనా. అమెరికాలో సెటిల్ అయ్యాను. నార్త్ కెరొలినాలోని విన్‌స్టన్ సేలం స్టేట్ యూనివర్శిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. నేను ఇండియా రావడం ఇది నాలుగోసారి. హైదరాబాద్‌కు మాత్రం మొదటిసారే రావడం. హైదరాబాద్ చారిత్రక సంపద గురించి చాలా విన్నాను. బిర్లామందిర్, చార్మినార్ చూడాలని ఉంది. హైదరాబాదీ బిర్యానీ పేరు అమెరికాలో కూడా వినిపిస్తుంది. మహిళలపై హరాజ్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. వైవాహిక వ్యవస్థను గట్టిగా నమ్ముతాను. భార్యభర్తలిద్దరూ సమానం అనుకున్నప్పుడు అది బాగుంటుంది. నా మ్యారేజ్ బ్రేక్ అయింది. నాకిద్దరు ఆడపిల్లలు. నా భర్త వదిలేనాటికి చిన్నమ్మాయికి మూడునెలలు. భర్త వదిలేశాడని బాధపడితే నేనీరోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. పిల్లలిద్దర్నీ ప్రయోజకుల్ని చేశాను. వాళ్లిద్దరూ అమెరికాలోని డిఫరెంట్ యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. సొసైటీలో మదర్‌రోల్ చాలా కీలకమైంది. తల్లి ఆడపిల్లలకు ధైర్యాన్ని నేర్పాలి. మగపిల్లలకు ఆడపిల్లల పట్ల ఎలా మసలాలో నేర్పాలి. అప్పుడే సమాజంలో మార్పు
మొదలవుతుంది.
- రోజ్ సకీఫ్యో, అమెరికా