బిలీవ్ యువర్‌సెల్ఫ్
సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలు పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలని బాలీవుడ్ నటి (ద ఎక్స్‌పోజ్ ఫేం), మాజీ మిస్ ఇండియా జోయా అఫ్రోజ్ సూచిస్తోంది. నగరానికి చెందిన మార్వెల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్ సాఫ్ట్ ఎన్ షైన్ అందాల పోటీని గురువారం ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో తన మనోభావాలను పంచుకుంది...
టాలీవుడ్‌లోని కొన్ని సంఘటనల నేపథ్యంలో హీరోయిన్లు కాల్‌గాళ్స్ అవుతున్నారని నన్ను అడిగితే దానికి నేనేం చెప్పగలను? నాకు తెలిసినంతవరకూ సినీ రంగంలోని అమ్మాయిలకు ‘ఆ’ దారి తప్ప మరో దారి లేని పరిస్థితి ఎప్పుడూ రాదు. నేనైతే డబ్బు కోసం నటించడం లేదు. చిన్నప్పటి నుంచి నటించిన అనుభవం, ఇష్టం మాత్రమే నన్ను నటిగా మార్చాయి. సినిమాలు లేకపోయినా హాయిగా బతకగలిగినంత స్థితిమంతులైన కుటుంబం మాది. అవ్మూరుులకు నేనిచ్చే సలహా ఒకటే. తమని తాము నమ్మాలి. భయం వదలాలి. ఏ రంగంలోనైనా స్ట్రగుల్ తప్పదు. బ్యూటీ కాంటెస్ట్‌లోకి వచ్చే అమ్మాయిలకు మరింత ఆత్మవిశ్వాసం అవసరం. ఎలాంటి పరిస్థితిలోనైనా చిరునవ్వు చెదరకుండా ఉండడం నేర్చుకోవాలి.
‘ఐటమ్’ అనొద్దు...
టాలీవుడ్‌లో మంచి ఆఫర్ వస్తే నటించడానికి సిద్ధం. హీరో మహేష్‌బాబుతో పాటు నచ్చే హీరోలెందరో ఇక్కడ ఉన్నారు. ఐటమ్‌సాంగ్ చేయడానికి నో అబ్జెక్షన్. అయినా దాన్ని ఐటమ్ అని ఎందుకంటారో అర్థం కాదు. దాన్ని ఒక మంచి డ్యాన్స్ నంబర్ అనొచ్చుగా.
- ఎస్బీ