ఇది పాదయాత్రల సీజన్.దేశంలో అనేక యాత్రలు సాగుతున్నాయి. వాటి మతలబు వేరు. కాని కర్ణాటకలో ఫిబ్రవరి 23న 200 మంది పల్లెటూరి యువకులు పా దయాత్ర చేయనున్నారు. దాని పేరు ‘బహ్మచారిగళ పా దయాత్రె’ అంటే ‘బ్రహ్మచారుల పా దయాత్ర’ మాండ్య జిల్లాలో గతంలో ఆడపిల్ల భ్రూణ హత్యలు జరిగాయి. ఇవాళ యువకులకు అక్కడ వధువు కరువైంది. బ్రహ్మచారులంతా డిప్రెషన్ బారిన పడ్డారు. వారికి ఆశ కల్పించడానికి దేవుని కొండ వరకూ పా దయాత్ర చేయిస్తున్నారు. ఆడపిల్ల ఎంత విలువైనదో సిరి సమానమైనదో తెలుసుకోవాల్సిన వాళ్లు ఇంకా ఉన్నారు. వారికి కనువిప్పు ఈ కథ.
ఇవాళ అనేక ఇళ్లల్లో అబ్బాయిలు ఈసురోమంటూ ఒంటరిగా ఉంటున్నారు. సంబంధం ఒక పట్టాన కుదరడం లేదు. అమ్మాయిలు అంత సులువుగా దొరకడం లేదు.
2003లో హిందీలో ‘మాతృభూమి’ అనే సినిమా వచ్చింది. మనీష్ ఝా దర్శకుడు. బిహార్‌లో ఆడపిల్ల పుడితే పా లల్లో ముంచి ్రపా ణాలు తీసే దురాచారం ఉంది. అలాంటి ఆచారం పా టించిన ఒక ఊరు కొన్నాళ్లకు అసలు ఒక్క అమ్మాయి కూడా లేక అందరూ మగవాళ్లతో నిండిపో యే స్థితికి చేరుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? పెళ్లి కాని యువకులు ఎంత నిస్పృహకు లోనవుతారు? దొరక్క దొరక్క ఒక వధువు దొరికి ఆ ఊరికి కోడలిగా వస్తే ఏమవుతుంది? దర్శకుడు షాకింగ్‌గా ఈ సినిమా కథను అధివాస్తవిక దృష్టితో చూపిస్తాడు. దీనికి బోలెడన్ని అవార్డులు వచ్చాయి. ఇలాంటి స్థితి ఇప్పుడు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఇంకా దేశంలో మరికొన్ని చోట్ల నెలకొని ఉన్నదంటే ఆ దర్శకుడు ఊహించిందే నిజమైంది.
లింగ నిష్పత్తికి విఘాతం
1970, 80, 90... ఈ మూడు దశాబ్దాలు మన దేశం అనేక భ్రూణ హత్యలను, ఆడపిల్ల అయితే శిశు హత్యలను చూసింది. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించడం మధ్యతరగతి వారికి కట్నాలు, కానుకలు తప్పించుకునే ఒక మార్గం అయ్యింది. ఆ కాలంలో లింగ నిష్పత్తికి కలిగిన విఘాతం ఆ సమయంలో పుట్టిన ముఖ్యంగా 1990లలో పుట్టిన అబ్బాయిలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. 2000 సంవత్సరం తర్వాత ప్రభుత్వం మేల్కొని లింగ నిర్థారణ, భ్రూణ హత్యలపై కఠిన చట్టాలు తెచ్చినా 2005 నాటికి ప్రతి 1000 మంది అబ్బాయిలకు 876 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. 2018–20 నాటికి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 907 ఉంది. ఇది జాతీయ సగటు. కాని కొన్ని రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి చాలా ప్రమాదకరంగా ఉంది.
సోలాపూర్ పెళ్లికొడుకులు
మొన్నటి డిసెంబర్‌లో మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 50 మంది బ్రహ్మచారులు పెళ్లికొడుకుల వేషాలు కట్టి, గుర్రాలు ఎక్కి, మేళ తాళాలతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ‘తగిన వధువు’ను వెతకమని మెమొరాండం ఇచ్చారు. కొందరు ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసి మొర పెట్టుకున్నారు. మహారాష్ట్రలో కొన్ని ్రపా ంతాల్లో నీటి వసతి లేదని అమ్మాయిని ఇవ్వడం లేదు. మరికొన్ని చోట్ల అమ్మాయిలు లేక దొరకడం లేదు. అక్కడ ప్రస్తుతం ప్రతి 1000 మంది అబ్బాయిలకు 889 మంది అమ్మాయిలే అందుబాటులో ఉన్నారు. దాంతో పెళ్లిళ్లు జరక్క అబ్బాయిలు ఆవేదన చెందుతుంటే, వాళ్ల తల్లిదండ్రులు మనోవేదనతో హార్ట్ ఎటాక్‌లు తెచ్చుకుని మరణిస్తున్నారు.
కర్ణాటక పాదయాత్ర
ఇప్పుడు కర్ణాటకలోని మాండ్య ్రపా ంతం వార్తల్లోకి వచ్చింది. అక్కడ గత కొన్నేళ్లుగా బలవంతపు బ్రహ్మచర్యాన్ని అబ్బాయిలు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు మాండ్య ్రపా ంతంలో సాగిన భ్రూణ హత్యలు ఇపుడు పెళ్లి కాని యువకుల పట్ల శాపంగా మారాయి. దాంతో చదువు, యోగ్యత, ఉద్యోగాలు ఉన్నా సరే జంట లేక కుర్రాళ్లు డిప్రెషన్‌లోకి వెళుతున్నారు. వీరు ఇదే విధంగా ఉండటం సరి కాదని అక్కడ కొంతమంది సామాజిక కార్యకర్తలు వారి ఓదార్పుకై, దైవశక్తి తోడుకై ‘బ్రహ్మచారి పా దయాత్ర’ను ప్రతిపా దిస్తే ప్రకటన వెలువడిన వెంటనే వందకు పైగా రిజిస్ట్రేషన్‌లు వచ్చాయి.
ఫిబ్రవరి 23న 30 ఏళ్ల వయసు దాటిన 200 మంది బ్రహ్మచారులు మాండ్యాలోని మద్దూరు నుంచి పొరుగు జిల్లా చామరాజనగర్‌లోని ప్రఖ్యాత మాలె మహదేశ్వర గుడికి మూడు రోజుల పా టు 105 కిలోమీటర్ల మేరకు ఈ పా దయాత్ర సాగనుంది. ఆశ్చర్యంగా మాండ్యా జిల్లా నుంచే కాక మైసూరు, బెంగళూరు నుంచి కూడా నిర్వాహకులకు ఫోన్లు వస్తున్నాయి. 200కు పరిమితం చేశారు కాని ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ‘బ్రహ్మచారులకు బతుకు మీద ఆశ కల్పించడానికి ఈ పా దయాత్ర కొంతైనా ఉపకరిస్తే అదే పదివేలు’ అని నిర్వాహకులలో ఒకరు వ్యాఖ్యానించారు.
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయి. 1970లలో 80లలో అబ్బాయిలు కట్నం కోసం అమ్మాయిలను కాల్చుకుతిన్నారు. వయసుకొచ్చిన యువకుడు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఎంతో డిమాండ్ ఉండేది. ఇవాళ అనేక ఇళ్లల్లో అబ్బాయిలు ఈసురోమంటూ ఒంటరిగా ఉంటున్నారు. సంబంధం ఒక పట్టాన కుదరడం లేదు. అమ్మాయిలు అంత సులువుగా దొరకడం లేదు.ఆడపిల్ల దేశానికి ఆయువు. ఈ వార్తలు చూసైనా ప్రతి ఇంటా ఆడపిల్లను సంతోషంగా ఆహ్వానించాలి.
Comments
Please login to add a commentAdd a comment