వర్గల్, న్యూస్‌లైన్: గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వర్గల్ మండలం ఏడు చోట్ల సర్పంచులుగా, 8 చోట్ల ఉపసర్పంచులుగా ఎన్నికై తామేమిటో తెలియచెప్పిన మహిళలు ఎంపీటీసీ ఎన్నికలలో మరోసారి తమ సత్తా ప్రదర్శిస్తామంటున్నారు. తాము వంటింటికే పరిమితం కామని, పోటీలో దిగి పురుషులకు దీటుగా ఇంటింటి ప్రచారం జరిపారు. మండల పరిషత్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ చేసిన వర్గల్ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి.
ఇందులో 8 ఎంపీటీసీ స్థానాలలో 24 మంది మహిళలు పోటీ పడుతున్నారు. సంఖ్యాపరంగా 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 42 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో సగానికి పైగా 24 మంది మహిళలే. రిజర్వ్ చేసిన స్థానాలు పక్కన పెడితే అన్‌రిజర్వుడ్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడుతున్నారు. మీనాజీపేట స్థానం బీసీ జనరల్‌కు కేటాయించగా ఇక్కడ పురుషులు పోటీ చేసే అవకాశమున్నప్పటికీ మహిళలనే పోటీలో దింపారు. కాంగ్రెస్ నుంచి కీసరి నాగమణి, టీడీపీ నుంచి జాలిగామ లక్ష్మి, టీఆర్‌ఎస్ నుంచి జనగామ మంజులను ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గౌరారం అన్‌రిజర్వుడ్ స్థానంలో టీడీపీ నుంచి కడపల బాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి పాశం శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉండగా కాంగ్రెస్ తరపున గుండు భాగ్యమ్మ పోటీ పడుతున్నారు. ఇలా రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ అనే తేడా లేకుండా మహిళలు మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తూ తమ శక్తిని, రాజకీయ చిత్రపటంలో తమ స్థాయిని చెప్పకనే చెబుతున్నారు.
ఇప్పటికే హోరాహోరీ ప్రచారం చేసిన మహిళలు శుక్రవారం జరగనున్న ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలలో 42 మంది అభ్యర్థులు, ఒక జెడ్పీటీసీ స్థానం కోసం నలుగురు బరిలో ఉన్నారు.
వివిధ ఎంపీటీసీ స్థానాలలో పోటీపడుతున్న మహిళలు
ఎంపీటీసీ స్థానం రిజర్వేషన్ సంఖ్య
1. పాములపర్తి బీసీ-మహిళ ఐదుగురు
2. గౌరారం జనరల్ ఒకరు
3. తున్కిఖాల్సా జనరల్-మహిళ ముగ్గురు
4. అంబర్‌పేట బీసీ-జనరల్ ముగ్గురు
5. వేలూరు జనరల్-మహిళ ముగ్గురు
6. మైలార ం జనరల్-మహిళ ముగ్గురు
7. నాచారం ఎస్సీ-మహిళ ముగ్గురు
8. వర్గల్-1 బీసీ-మహిళ ముగ్గురు
మొత్తం 24 మంది మహిళలు
నేటి ‘ప్రాదేశిక’ పోరులో సగానికిపైగా నారీమణులే
Published Fri, Apr 11 2014 12:10 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement