Vargal
-
బాలిక ఉసురుతీసిన వాటర్ హీటర్
సాక్షి, వర్గల్(గజ్వేల్): పాఠశాలకు వెళ్లాలనే ఆతృత.. చలివేళ వేడి నీళ్ల తాపత్రయం.. అదే బాలిక పాలిట శాపంగా మారింది. స్నానానికి బాత్రూమ్లోకి వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక అనూష కరెంట్ హీటర్‌తో కూడిన నీటిని తాకింది. విద్యుత్ షాక్‌తో అసువులు బాసింది. కన్నవారికి కడుపుకోత మిగిలి్చన ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం వర్గల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో జరిగింది. విద్యార్ధిని మృతి సమాచారంతో సంతాప సూచకంగా వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండా పాఠశాలలు మూసివేశారు. గ్రామస్తులు, ఉపాధ్యాయుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం వివరాలివి... సీతారాంపల్లి గ్రామానికి చెందిన చిల్ల రవీందర్–జ్యోతి దంపతులకు అనూష(13), జశ్వంత్ ఇద్దరు పిల్లలు. గ్రామ సమీపంలోని వేలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అనూష ఎనిమిదో తరగతి, జశ్వంత్ ఆరో తరగతి చదువుతున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు సకాలంలో చేరే ఆలోచనతో కాలకృత్యాలకు సిద్ధమైంది. స్నానం కోసం బాత్రూమ్లోకి వెళ్లి ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ ఉన్న నీళ్లను తాకి విద్యుత్ షాక్‌కు గురైంది. స్నానానికి వెళ్లిన అనూష 15 నిమిషాలు దాటినా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తలుపులు తీసి చూడగా అప్పటికే కరెంట్‌షాక్‌తో బాలిక అపస్మారక స్థితిలో గుర్తించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేటప్పటికి బాలిక మృతి చెందినట్లు తెలిసి బోరుమన్నారు. అలుముకున్న విషాదం పాఠశాలకు వెళ్లాల్సిన బాలిక అనూహ్యంగా మృత్యువు పాలవడంతో తల్లిదండ్రులు పెనువిషాదంలో కూరుకుపోయారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వేలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ సహవిద్యారి్థని అనూష మృతి చెందిన సమాచారం తెలిసి కన్నీటి పర్యంతమయ్యాయి. హెచ్ఎమ్ కనకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల వద్ద సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాల మూసేసి అంత్యక్రియలలో పాల్గొన్నారు. బాలిక తల్లిదండ్రులకు సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా బాలిక సొంత గ్రామమైన సీతారాంపల్లి ప్రాథమిక పాఠశాలను, అదే పంచాయతీ పరిధిలోని సీతారాంపల్లి తండా పాఠశాలలను సంతాప సూచకంగా మూసేశారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు బాలిక తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. ఈ విషాద ఘటన పట్ల ఎంఈఓ వెంకటేశ్వర్‌గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండాలలో విషాదం అలుముకున్నది. చదవండి : చదవాలని మందలిస్తే..యాసిడ్ తాగి ఆత్మహత్య -
పెళ్లి వ్యాను బోల్తా
సాక్షి, గజ్వేల్: టాటా ఏస్ వాహనం బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో శుక్రవారం చోటుచేసుకుంది. తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన మమత వివాహం శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో తూప్రాన్‌లో శుక్రవారం నిశ్చయించారు. ఉదయం పెళ్లి కూతురు ముందుగానే ఫంక్షన్‌హాల్‌కు చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లి సామగ్రితో టాటా ఏస్ వాహనంలో హాలుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నాచారం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద వారి వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పెళ్లి కూతురు తల్లి లక్ష్మి, చిన్మమ్మ రాణి, పెద్దమ్మ యాదమ్మ, బంధువులు మల్లమ్మ, సత్తయ్యలతో పాటు డ్రైవర్ సుధాకర్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
బావిలో నక్కల జంట
సాక్షి, గజ్వేల్: ఎవరైనా తరిమారో.. లేదా ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడ్డాయో? తెలియదుగాని బిక్కుబిక్కుమంటు ఓ మూలన నక్కిన నక్కల జంటను అటవీ అధికారుల బృందం రక్షించింది. వన్యప్రాణులు బావిలో పడిన ఈ ఘటన వర్గల్ మండలం సింగాయపల్లిలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్తులు, అటవీ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ తెలిపిన ప్రకారం.. సింగాయపల్లి గ్రామ సమీపంలోని టేకులపల్లి మల్లారెడ్డికి చెందిన నీళ్లు లేని పాడుబడిన వ్యవసాయ బావిలో ఆడ, మగ నక్కల జంట పడిపోయాయి. వాటిని గమనించిన రైతులు, ఈ సమాచారాన్ని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్‌కు అందించారు. ఆయన సాయంత్రం 4 గంటల వరకు ముట్రాజ్‌పల్లి బీట్ ఆఫీసర్ వెంకన్న, డ్రైవర్ ఫరూక్, గజ్వేల్ అటవీ పార్క్‌లో పనిచేస్తున్న ఆర్కిటెక్ట్ రఘులతో కలిసి వలలు, తాడు నిచ్చెన, ఫస్ట్‌ఎయిడ్ కిట్‌తో కూడిన రెస్క్యూ వ్యాన్‌తో సింగాయపల్లి చేరుకున్నారు. రఘు, వెంకన్నలు బావిలోకి దిగి వల సహకారంతో నక్కలను పట్టుకుని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వాటిని గజ్వేల్–వర్గల్ సరిహద్దు సంగాపూర్ అడవిలో వదిలిపెట్టారు. ఆడ, మగ నక్కలు వాటంతట అవే పడ్డాయా లేదా ఎవరైనా తరిమితే పడ్డాయో తెలియదుకాని ఆరేడు గంటలు బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపాయి. జంట నక్కలు సురక్షితంగా వదిలేయడంతో బతుకుజీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీశాయి. నక్కల జంట సమాచారం సకాలంలో అందించి వాటిని రక్షించడంలో సహకరించిన గ్రామస్తులను అటవీ అధికారి వేణుగోపాల్ అభినందించారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
సిద్దిపేటటౌన్ : వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగను గజ్వేల్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సోమవారం కమిషనరేట్‌లో నిందితుడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, గజ్వేల్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, ఎస్సై ప్రసాద్, సిబ్బందితో కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు టీంను ఏర్పాటు చేసామన్నారు. స్పెషల్ టీం సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంతో కొంత మంది ఫోటోలు సేకరించి వారికోసం గాలిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వర్గల్ కమాన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అంతర్రాష్ట్ర దొంగ అయిన బింగి మాధవరావు(55) పోలీసులను చూసి పారిపోబోయాడు. అది గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకొని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఇతన్ని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను గతంలో కామారెడ్డి, జహీరాబాద్, షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 25 కేసులలో నిందితుడిగా ఉన్నట్లు సీపీ తెలిపారు. నిందితుడు అద్దెకు ఉంటున్న ఇంటిలో 22 తులాల బంగారం, కిలోన్నర వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడి వద్ద దొంగతనాలకు ఉపయోగించిన వస్తువులు లభ్యమయ్యాయి. అందులో ఒక కత్తి, ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్, మిరపపొడి పాకెట్ లభించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కేసును చేధించిన గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, గౌరారం ఎస్సై ప్రసాద్, సిబ్బంది బాబు, హోంగార్డు విష్ణువర్దన్, సిట్ టీం యాదగిరి, రాంచంద్రారెడ్డి, ఉపేందర్, రామక్రిష్ణలను పోలీస్ కమిషనర్ అభినందించడంతో పాటు నగదు బహుమతి అందించారు. -
నాచగిరీశుని సన్నిధిలో సినీనటి మాధవీలత
వర్గల్(గజ్వేల్) : నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రాన్ని మంగళవారం సాయంత్రం సినీ నటి, హీరోయిన్ మాధవీలత సందర్శించారు. గర్భగుడిలో కొలువుదీరిన నృసింహస్వామివారిని, లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అర్చకులు మాధవీలత పేరిట అర్చన జరిపి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేశారు. ‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ సినిమాల్లో మాధవీలత హీరోయిన్గా నటించిన విషయం తెల్సిందే. ప్రజలకు సేవలందించాలనే భావనతో తాను బీజేపీలో చేరానని, సినీరంగంలో ఉంటూనే రాజకీయ రంగంలో కొనసాగుతానని ఆమె చెప్పారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యవేత్త వేణుస్వామి ఉన్నారు. -
నీళ్ల పండుగకు తరలుదాం
వర్గల్:ఈ నెల 7న జరిగే నీళ్ల పండుగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లి జయప్రదం చేద్దామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వర్గల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రజాప్రతినిధి, కార్యకర్త మహోత్సవంలా సాగే సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. మండలం నుంచి ఏడు వేలకు తగ్గకుండా ప్రజలను సభకు తరలించాలన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ కలల స్వప్నం మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవ సంబరాలు ప్రజల సమక్షంలో ఘనంగా జరిపించుకుందామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ, జెడ్పీటీసీ పోచయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ వేలూరి వెంకట్‌రెడ్డి, నాయకులు తోట ముత్యాలు, విద్యాకుమార్‌గౌడ్, సుల్తాన్, బాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అజీజ్, కనకయ్య, జింక మల్లేషం తదితరులు పాల్గొన్నారు -
బాబోయ్.. మాటగాళ్లు
వర్గల్: సెల్‌ఫోన్ ద్వారా ఆ యువకునితో మాటలు కలిపారు. కారు చవకకే ఖరీదైన సెల్‌ఫోన్ అంటూ ముగ్గులో దింపారు. మాటల గారడీతో నమ్మించారు. పోస్టులో పార్సిల్ ద్వారా ఫోన్ పంపుతున్నాం..డబ్బులు కట్టి విడిపించుకో అని సూచించారు. తీరా పార్సిల్ విప్పితే అందులో ఫోన్ లేదు..పనికిరాని కాగితాలు, ఓ స్టీల్ గొలుసు, లాకెట్ తప్ప.. ఈ మోసపూరిత సంఘటన శనివారం వర్గల్ మండల కేంద్రంలో వెలుగు చూసింది. బాధితుడు వర్గల్‌కు చెందిన కిష్టనోల్ల షాదుల్లా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం షాదుల్లా సెల్‌ఫోన్‌కు హెచ్‌టీసీ కంపెనీ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేశారు. తమ కంపెనీకి చెందిన రూ.12,500 విలువైన సెల్‌ఫోన్‌ను లాటరీ ద్వారా నీకు రూ. 3,500 లకే లభిస్తుందని చెప్పారు. మాటల గారడీతో అతనిలో ఆశలు కలిగించారు. ఆ వ్యక్తులు పోస్టు ద్వారా సెల్‌ఫోన్‌ను పార్సిల్‌గా పంపుతామని అడ్రసు తీసుకున్నారు. పార్సిల్ రాగానే రూ. 3,500 చెల్లించి విడిపించుకోవాలని సూచించారు. ఈ మేరకు షాదుల్లా పేరిట ఓ పార్సిల్ వచ్చింది. వర్గల్ పోస్టాఫీసుకు శుక్రవారం వెల్లిన షాదుల్లా డబ్బు కట్టేసి పార్సిల్‌ను అక్కడే తెరచి చూశాడు. ఖరీదైన ఫోన్‌కు బదులు అందులో నుంచి పనికిరాని కాగితాలు, ఓ స్టీల్ లాకెట్, గొలుసు బయటపడ్డాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు శనివారం గౌరారం పోలీసులకు బాధితుడు షాదుల్లా ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ మోసగాళ్లే కాదు..మాటగాళ్లూ ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వర్గల్ (మెదక్) : ఫెన్సింగ్ వైర్ రూపంలో పొంచి ఉన్న మృత్యువు.. పొలం పనికి వెళ్తున్న ఓ పేద రైతును కబళించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం పాములపర్తిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తులు, గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బొమ్మ శంకరయ్య(45) తనకున్న ఎకరంతోపాటు మరో ఎకరంన్నర కౌలుకు తీసుకుని సాగు చేశాడు. ఆ భూమి ఫెన్సింగ్ స్తంభానికి తాగు నీరందించే బోరు ప్యానల్‌ను బిగించారు. అయితే ఈ తీగ లోపలి వైర్లు బయటకు తేలి ఫెన్సింగ్ ఇనుప తీగలకు తగిలి విద్యుత్ సరఫరా అవుతోంది. కాగా మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన శంకరయ్య ఫెన్సింగ్ తీగను తాకడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కొద్ది దూరంలో ఉన్న కొడుకు గమనించి పరుగెత్తుకొచ్చి వైరును తొలగించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మెదక్ : ఆరుగాలం శ్రమించి పొలాన్నే నమ్ముకుని... అప్పు చేసి సాగు చేసిన ఓ రైతు చివరికి ఆ పొలంలోనే తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం మీనాజీపేటలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన డి.యాదగిరి(35) అనే వ్యక్తి కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఆలుగడ్డ సాగు చేశాడు. అందుకోసం అప్పు చేసి రూ.70వేలు పెట్టుబడి పెట్టగా... చివరికి దిగుబడి రాక పూర్తిగా నష్టమే మిగిలింది. ప్రస్తుతం ఎకరం భూమిలో సాగు చేసిన వరి కూడా ఎండిపోయింది. రూ.4 లక్షల వరకూ అప్పులు మిగలడంతో మనస్తాపానికి గురైన యాదగిరి శనివారం ఉదయం పొలానికి వెళ్లొస్తానని భార్యతో చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. పొలానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. (వర్గల్) -
లేగదూడల పెంపకంలో జాగ్రత్తలు
వర్గల్ పశుసంపద అభివృద్ధికి దూడల పోషణే ప్రధానం. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ నాణ్యమైన మేత అందించినప్పుడే ఇవి మంచి పాడి ఆవులుగా ఎదుగుతాయి. పశు పోషకుల నిర్లక్ష్యం, అవగాహనలేమి వల్ల పుట్టిన ప్రతీ 100 దూడల్లో 30 నుంచి 40 వరకు మృత్యువా త పడుతున్నాయి. ఈ సమస్యను అధిగమిం చేందుకు లేగదూడల పెంపకంలో తీసుకోవాల్సిన మెలకువలపై వర్గల్ మండల పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్‌బాబు (సెల్ : 9849457404) అందించిన సలహాలు, సూచనలు... దూడ పుట్టగానే ముక్కు రంధ్రాల మీద ఉన్న పొరలు తుడిచి శుభ్రం చేయాలి. శ్వాస ఆడనట్లయితే రొమ్ము భాగం మీద సున్నితంగా మర్దన చేయాలి. దూడ పుట్టగానే తల్లి దాన్ని నాలుకతో నాకేలా చూడాలి. తద్వారా తల్లి-దూడకు అనుబంధం పెరగడంతోపాటు, దూడ శరీరం మీద తడి ఆరిపోతుంది. పుట్టిన దూడ అరగంట, గంటలోపే లేచి నిలబడి జున్నుపాలు తాగుతుంది. దూడ లేవలేని స్థితిలో బలహీనంగా ఉన్నట్లయితే దానిని లేపి నిలబెట్టి పాలు తాగేలా చూడాలి. జున్నుపాలు తాగిస్తే అజీర్తి చేస్తుందనుకోవడం అపోహ మాత్రమే. జున్నుపాలలో తేలి కగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్-ఏ, కెరోటిన్ ఎక్కువ శాతంలో ఉంటాయి. మలబద్ధకం లేకుండా ఇవి దోహదపడతాయి. జున్నుపాలు తాగని లేగలు, దుడ్డెలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తల్లి దగ్గర దూడకు సరిపడా జున్నుపాలు లభించకుంటే అరచెంచా ఆముదం, గ్లాసు గోరు వెచ్చని నీళ్లు, కోడి గుడ్డు పచ్చ సొన, రెండు గ్లాసుల వేడి పాలు మూడు రోజులపాటు తాగించవచ్చు. తరువాత పోతపాలు అలవాటు చేయాలి. ఈనిన వెంటనే తల్లి పశువు, దూడను చూడకుండా జాగ్రత్త పడాలి. దూడకు జున్నుపాలు జాగ్రత్తగా తాగించాలి. పాలు గోరు వెచ్చగా శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉండాలి. చల్ల టి పాలు తాగిస్తే పారుడు రోగం వస్తుంది. దూడ పుట్టిన మొదటి మూడు రోజులలో రోజుకు మూడు సార్లు జున్నుపాలు తాగించాలి. ఆ తరువాత రోజుకు రెండు సార్లు తాగించాలి. మొదటి నెలలో ప్రతిరోజు దూడ బరువులో పదోవంతుకు సమానంగా పాలు తాగిం చాలి. రెండో నెలలో పదిహేనో వంతుకు, మూడో నెలలో ఇరవయ్యో వంతుకు సమానంగా పాలు తాగించాలి. పారుడు వ్యాధి లక్షణాలు కన్పిస్తే పాలు తగ్గించి పశు వైద్యుని సలహా తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే దూడ ప్రాణాలకే ప్రమాదం. టీకాలు మరవద్దు... దూడ పుట్టగానే టింక్చర్ అయోడిన్ దూదిలో ముంచి బొడ్డుకు అద్దాలి. ధనుర్వాతం రాకుండా ఏటీఎస్ ఇంజక్షన్ వేయించాలి. పుట్టిన 10-15 రోజులలో ఏలిక పాముల మందు వేయాలి. తరువాత నెలకు ఒకసారి చొప్పున నాలుగు నెలల వయస్సు వరకు ఈ మందు కొనసాగించాలి. 6-8 వారాల వయస్సులో గాలికుంటు వ్యాధి నివారణకు టీకా ఇప్పించాలి. 35 రోజుల తరువాత బూస్టర్ డోస్,ఆ తరువాత 4 నెలలకోసారి ఈ టీకా వేయించాలి. చీడ పారుడు వ్యాధి రాకుండా 4-6 నెలల వయసులో టీకా మందు వేయించాలి. తిరిగి సంవత్సర వయస్సులో మళ్లీ టీకా వేయించాలి. ఆరు మాసాల వయసులో గొంతు వాపు నివారణ టీకా వేయించాలి. 6-12 మాసాల వయసులో జబ్బవాపు వ్యాధి నివారణకు టీకా మందు ఇప్పించాలి. షెడ్ల బయట 15 రోజులకోసారి సున్నం చల్లి కాక్సిడియోసిస్ వ్యాధి రాకుండా అదుపు చేయవచ్చును. మూడు మాసాల వయసు దాటిన తరువాత రెండు నెలలకోసారి దూడ వెంట్రుకలు కత్తిరిస్తే గోమార్లు, పేలు పట్టకుండా ఉంటాయి. -
సీఎం రాక కోసం పడిగాపులు
వర్గల్: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జగదేవ్‌పూర్ మండలంలోని తన ఫాంహౌస్‌కు వస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సోమవారం ఉదయం 10 గంటల నుంచే గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వర్గల్ క్రాస్‌రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసులు రాకపోకలను నియంత్రించారు. మరోవైపు వర్గల్ క్రాస్‌రోడ్డు నుంచి గౌరారం స్టేజీ, పాములపర్తి క్రాస్‌రోడ్డు వరకు పోలీసు అధికారులు వాహనాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షించారు. సిబ్బందికి తగు సూచనలందించారు. సీఎం రాక సందర్భంగా అడ్వాన్స్ పెలైట్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో గౌరారం చేరుకున్నాయి. సీఎం ఇప్పుడొస్తున్నారు..అప్పుడొస్తున్నారంటూ గంటకోసారి సమాచారం అందడంతో పోలీసులంతా దాదాపు 12 గంటల పాటు రోడ్డుపైనే నిల్చున్నారు. మరోవైపు సాయంత్రం నుంచి జల్లులు కూడా కురవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే సీఎం రాకకోసం నిరీక్షించి నీరపడిన పోలీసులకు రాత్రి 10 గంటల సమయంలో కేసీఆర్ టూర్ రద్దయినట్లు సమాచారం అందింది. దీంతో వారు ఉసూరుమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఐపీఎస్‌ల పడిగాపులు మరోవైపు సీఎం రాకకోసం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ఫాంహౌస్ వద్ద వేచి చూసిన జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, మెదక్-నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, ఐజీ మహేశ్ భగవత్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్‌లు రాత్రి 10 గంటల తర్వాత సీఎం పర్యటన రద్దయినట్లు సమాచారం రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పంటకు రక్షణ...సోలార్ దీపపు ఎర
వర్గల్: పంటచేనులో పైరును నష్ట పరిచే పురుగుల ఉధృతిని అంచనా వేసేందుకు రైతులు పొలాల్లో విద్యుత్ బల్బులతో కూడిన దీపపు ఎరలు ఏర్పాటు చేస్తారు. ఎరలో చిక్కిన పురుగుల సంఖ్య ఆధారంగా తగు సస్యరక్షణ చేపడుతుంటారు. లేదా వ్యవసాయాధికారుల సలహా తీసుకుంటారు. కోతల కాలం..కరెంటు ఎపుడుంటుందో, ఎపుడుపోతుందో, ఎన్ని సార్లు పోతుందో, అసలు ఆ రోజు వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి గడ్డు కాలంలో కరెంటు ఆధారంగా ఏర్పాటు చేసిన దీపపు ఎరలు చతికిలపడతాయనడంలో సందేహం లేదు. కరెంటు అవసరం లేకుండా కేవలం సూర్య కాంతి ఆధారంగా స్వయం ఇంధనం సమకూర్చుకుని పనిచేసే ‘సోలార్ దీపపు ఎర’లు అందుబాటులోకి వచ్చాయి. చక్కని పనితీరుతో రైతుకు ఉపయుక్తంగా నిలిచిన ఈ సోలార్ ఎరలకు ప్రభుత్వం సబ్సిడీలను సైతం ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వర్గల్ మండలం అంబర్‌పేటలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శన కోసం వ్యవసాయ శాఖ (ఆత్మ) ఈ సోలార్ దీపపు ఎరను ఏర్పాటు చేయించింది. మంగళవారం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన కార్యక్రమంలో విద్యుత్ అవసరం లేని ఈ ఎర ప్రయోజనాన్ని, ధర తదితర వివరాలను గజ్వేల్ ఏడీఏ శ్రవణ్ కుమార్, ఆత్మ బీటీఎం శ్రీధర్ రావులు వివరించారు. విద్యుత్ కోతలకు ప్రత్యామ్నాయం పగటివేళ సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకునే సోలార్ ప్లేట్, దీపపు స్టాండ్ పైన బిగించి ఉంటుంది. దిగువన సోలార్ దీపం అమరి ఉంటుంది. దాని కింద ఇనుప తొట్టె (దాదాపు 8 లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం) ఉంటుంది. దీంట్లో నీటిని నింపి నాలుగు చుక్కలు కిరోసిన్ వేయాలి. పగలు సోలార్ శక్తిని స్వీకరించిన ఈ దీపం చీకటి పడగానే ప్రకాశవంతంగా వెలుగుతుంది. పొలంలో ఉన్న రెక్కల పురుగులు ఈ దీపం వెలుతురుకు ఆకర్షితమై ఎరతో కూడిన ఇనుప తొట్టె ద్రావణంలో పడి చనిపోతాయి. ఎరలో పడిన పురుగుల సంఖ్య ఆధారంగా వాటి ఉధృతి అంచనా వేయవచ్చు. పురుగుల దాడి తీవ్రత ఆధారంగా తగు సస్యరక్షణ చేపట్టి భారీ నష్టం వాటిల్లకముందే తగు సస్యరక్షణతో పంటను కాపాడుకునే అవకాశముంటుంది. విద్యుత్‌కు ప్రత్యమ్నాయంగా నిలిచే ఈ ఎరలను రైతులకు సబ్సిడీపై ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది కార్యరూపం దాల్చితే 50 శాతం సబ్సిడీ (సగం ధర)కే వీటిని రైతులు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని ధర రూ.2,800. ఒక ఎకరం చేలో రెండు సోలార్ ట్రాప్‌లు ఏర్పాటు చేసుకోవాలని, వీటిని సులువుగా ఎక్కడికైనా తీసుకెల్లవచ్చని అధికారులు వివరించారు. వీటికి సంబంధించిన సమాచారం కోసం రైతులు ఏడీఏగజ్వేల్-సెల్ నంబర్ 8886614286లో సంప్రదించవచ్చు. -
శాకంబరీ నమోస్తుతే
వర్గల్: విద్యాధరిలో సరస్వతీ అమ్మవారి జన్మ నక్షత్రం మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతి అమ్మవారు శుక్రవారం శాకంబరీ దేవి అలంకారంలో సాక్షాత్కరించారు. నేత్రపర్వంగా సాగిన మూలా మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న భక్తులు శాకంభరీ మాత దివ్య మంగళ రూపంతో దర్శనమివ్వడంతో అశేషజనం భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. చదువుల తల్లి జన్మ నక్షత్రం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజతో మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు అనంతగిరి శర్మ, శశిధర శర్మ, బాల ఉమామహేశ్వర శర్మల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం క్వింటాళ్ల కొద్దీ కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. దేశం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆషాఢ మాసంలో శాకంభరీగా కొలువుదీరిన అమ్మవారిని స్తుతిస్తూ సప్తశతీ పారాయణాలు చేసారు. మరోవైపు వేద విద్యార్థులు లలితా సహస్ర పారాయణాలు జరిపారు. ఆలయ యాగ మండపంలో చండీహోమం నిర్వహించారు. ఓ వైపు శాకంబరీ దేవిగా అమ్మవారి దివ్యమంగళ రూపం, మరోవైపు విశేష అర్చనలు, యాగాది కార్యక్రమాలతో భక్తులు పరవశించిపోయారు. నేత్రపర్వంగా సాగిన మూల మహోత్సవ వేడుకలు తిలకించేందుకు స్థానిక జిల్లా భక్తులతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వర్గల్ క్షేత్రానికి తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ మేనేజర్ రఘుపవన్ పర్యవేక్షించారు. -
రేపు మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కే.చంద్రశేఖరరావు(కేసీఆర్) తొలిసారి మెదక్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. రేపు ఉదయం11గంటలకు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత 12.45 గంటలకు కేసీఆర మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వర్గల్ గ్రామంలోని సరస్వతీ ఆలయంలో కేసీఆర్ పూజలు చేస్తారు. ఆర్వాత 2.30 గంటలకు గజ్వేల్‌లో నిర్వహించే భారీ బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. బహిరంగ సభ తర్వాత 3.30 నుంచి రాత్రి 7గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. -
నేటి ‘ప్రాదేశిక’ పోరులో సగానికిపైగా నారీమణులే
వర్గల్, న్యూస్‌లైన్: గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వర్గల్ మండలం ఏడు చోట్ల సర్పంచులుగా, 8 చోట్ల ఉపసర్పంచులుగా ఎన్నికై తామేమిటో తెలియచెప్పిన మహిళలు ఎంపీటీసీ ఎన్నికలలో మరోసారి తమ సత్తా ప్రదర్శిస్తామంటున్నారు. తాము వంటింటికే పరిమితం కామని, పోటీలో దిగి పురుషులకు దీటుగా ఇంటింటి ప్రచారం జరిపారు. మండల పరిషత్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ చేసిన వర్గల్ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో 8 ఎంపీటీసీ స్థానాలలో 24 మంది మహిళలు పోటీ పడుతున్నారు. సంఖ్యాపరంగా 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 42 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో సగానికి పైగా 24 మంది మహిళలే. రిజర్వ్ చేసిన స్థానాలు పక్కన పెడితే అన్‌రిజర్వుడ్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడుతున్నారు. మీనాజీపేట స్థానం బీసీ జనరల్‌కు కేటాయించగా ఇక్కడ పురుషులు పోటీ చేసే అవకాశమున్నప్పటికీ మహిళలనే పోటీలో దింపారు. కాంగ్రెస్ నుంచి కీసరి నాగమణి, టీడీపీ నుంచి జాలిగామ లక్ష్మి, టీఆర్ఎస్ నుంచి జనగామ మంజులను ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గౌరారం అన్‌రిజర్వుడ్ స్థానంలో టీడీపీ నుంచి కడపల బాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి పాశం శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉండగా కాంగ్రెస్ తరపున గుండు భాగ్యమ్మ పోటీ పడుతున్నారు. ఇలా రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ అనే తేడా లేకుండా మహిళలు మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తూ తమ శక్తిని, రాజకీయ చిత్రపటంలో తమ స్థాయిని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే హోరాహోరీ ప్రచారం చేసిన మహిళలు శుక్రవారం జరగనున్న ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలలో 42 మంది అభ్యర్థులు, ఒక జెడ్పీటీసీ స్థానం కోసం నలుగురు బరిలో ఉన్నారు. వివిధ ఎంపీటీసీ స్థానాలలో పోటీపడుతున్న మహిళలు ఎంపీటీసీ స్థానం రిజర్వేషన్ సంఖ్య 1. పాములపర్తి బీసీ-మహిళ ఐదుగురు 2. గౌరారం జనరల్ ఒకరు 3. తున్కిఖాల్సా జనరల్-మహిళ ముగ్గురు 4. అంబర్‌పేట బీసీ-జనరల్ ముగ్గురు 5. వేలూరు జనరల్-మహిళ ముగ్గురు 6. మైలార ం జనరల్-మహిళ ముగ్గురు 7. నాచారం ఎస్సీ-మహిళ ముగ్గురు 8. వర్గల్-1 బీసీ-మహిళ ముగ్గురు మొత్తం 24 మంది మహిళలు -
ఊరంతా షాక్
భీతిల్లిన మైలారం వాసులు ‘సింగిల్ ఫేజ్’ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ లోపమే కారణం పలువురికి గాయాలు వర్గల్, న్యూస్‌లైన్: వర్గల్ మండలం మైలారం గ్రామం ఆది వారం విద్యుత్ షాక్‌కు గురైంది. ఇంట్లో స్విచ్ బోర్డులు, సిమెంట్ గోడలు, టీవీ స్విచ్‌లు ఇలా వేటిని తాకినా షాకిచ్చాయి. పలువురికి గాయాలయ్యాయి. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీ ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. గ్రామస్థులు తెలి పిన వివరాల ప్రకారం... మజీద్ సమీప సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే ఇళ్లల్లో ఆదివారం హైఓల్టేజీ సరఫరా అయ్యింది. దీంతో గోడలు, స్విచ్‌లు తాకినా కాలనీ వాసులు షాక్‌కు గురయ్యారు. ఇదే పరిస్థితిలో దండు లక్ష్మి, సింగారం నాగరాజు, నరేష్‌గౌడ్, అశోక్ తదితరులు షాక్ తగిలి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ట్రాన్స్‌కో క్యాజువల్ సిబ్బంది స్వామికి స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో ఆయన వెంటనే గ్రామానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపేసి ఎర్తింగ్ లోపాన్ని సరిచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్‌కు నీటి తడి తగ్గడంతో హైఓల్టేజీ సరఫరా జరిగిందని స్వామి తెలిపారు.