నీళ్ల పండుగకు తరలుదాం
వర్గల్:ఈ నెల 7న జరిగే నీళ్ల పండుగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లి జయప్రదం చేద్దామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వర్గల్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రజాప్రతినిధి, కార్యకర్త మహోత్సవంలా సాగే సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. మండలం నుంచి ఏడు వేలకు తగ్గకుండా ప్రజలను సభకు తరలించాలన్నారు.
ప్రతి గ్రామానికి అవసరమైన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ కలల స్వప్నం మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవ సంబరాలు ప్రజల సమక్షంలో ఘనంగా జరిపించుకుందామన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ, జెడ్పీటీసీ పోచయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ వేలూరి వెంకట్‌రెడ్డి, నాయకులు తోట ముత్యాలు, విద్యాకుమార్‌గౌడ్, సుల్తాన్, బాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అజీజ్, కనకయ్య, జింక మల్లేషం తదితరులు పాల్గొన్నారు