ఫెన్సింగ్ వైర్ రూపంలో పొంచి ఉన్న మృత్యువు.. పొలం పనికి వెళ్తున్న ఓ పేద రైతును కబళించింది.
వర్గల్ (మెదక్) : ఫెన్సింగ్ వైర్ రూపంలో పొంచి ఉన్న మృత్యువు.. పొలం పనికి వెళ్తున్న ఓ పేద రైతును కబళించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం పాములపర్తిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తులు, గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బొమ్మ శంకరయ్య(45) తనకున్న ఎకరంతోపాటు మరో ఎకరంన్నర కౌలుకు తీసుకుని సాగు చేశాడు.
ఆ భూమి ఫెన్సింగ్ స్తంభానికి తాగు నీరందించే బోరు ప్యానల్‌ను బిగించారు. అయితే ఈ తీగ లోపలి వైర్లు బయటకు తేలి ఫెన్సింగ్ ఇనుప తీగలకు తగిలి విద్యుత్ సరఫరా అవుతోంది. కాగా మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన శంకరయ్య ఫెన్సింగ్ తీగను తాకడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కొద్ది దూరంలో ఉన్న కొడుకు గమనించి పరుగెత్తుకొచ్చి వైరును తొలగించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.