పెద్దతిప్ప సముద్రం (చిత్తూరు) : వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నించిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం బూచిపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం పొలం వద్ద కరెంట్ సరఫరా నిలిచి పోవడంతో..ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నిస్తూ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతానికి రైతు బలి
Published Mon, Dec 21 2015 6:54 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement