వర్గల్: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జగదేవ్‌పూర్ మండలంలోని తన ఫాంహౌస్‌కు వస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సోమవారం ఉదయం 10 గంటల నుంచే గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వర్గల్ క్రాస్‌రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసులు రాకపోకలను నియంత్రించారు.
మరోవైపు వర్గల్ క్రాస్‌రోడ్డు నుంచి గౌరారం స్టేజీ, పాములపర్తి క్రాస్‌రోడ్డు వరకు పోలీసు అధికారులు వాహనాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షించారు. సిబ్బందికి తగు సూచనలందించారు. సీఎం రాక సందర్భంగా అడ్వాన్స్ పెలైట్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో గౌరారం చేరుకున్నాయి. సీఎం ఇప్పుడొస్తున్నారు..అప్పుడొస్తున్నారంటూ గంటకోసారి సమాచారం అందడంతో పోలీసులంతా దాదాపు 12 గంటల పాటు రోడ్డుపైనే నిల్చున్నారు. మరోవైపు సాయంత్రం నుంచి జల్లులు కూడా కురవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే సీఎం రాకకోసం నిరీక్షించి నీరపడిన పోలీసులకు రాత్రి 10 గంటల సమయంలో కేసీఆర్ టూర్ రద్దయినట్లు సమాచారం అందింది. దీంతో వారు ఉసూరుమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఐపీఎస్‌ల పడిగాపులు
మరోవైపు సీఎం రాకకోసం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ఫాంహౌస్ వద్ద వేచి చూసిన జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, మెదక్-నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, ఐజీ మహేశ్ భగవత్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌లు రాత్రి 10 గంటల తర్వాత సీఎం పర్యటన రద్దయినట్లు సమాచారం రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సీఎం రాక కోసం పడిగాపులు
Published Tue, Aug 5 2014 12:01 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement