
స్వామి వారి సన్నిధిలో సినీనటి మాధవీలత
వర్గల్(గజ్వేల్) : నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రాన్ని మంగళవారం సాయంత్రం సినీ నటి, హీరోయిన్ మాధవీలత సందర్శించారు. గర్భగుడిలో కొలువుదీరిన నృసింహస్వామివారిని, లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అర్చకులు మాధవీలత పేరిట అర్చన జరిపి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేశారు.
‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ సినిమాల్లో మాధవీలత హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ప్రజలకు సేవలందించాలనే భావనతో తాను బీజేపీలో చేరానని, సినీరంగంలో ఉంటూనే రాజకీయ రంగంలో కొనసాగుతానని ఆమె చెప్పారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యవేత్త వేణుస్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment