సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ... బాధితులకు మీరు అండగా ఉంటున్నారా? ఉచితంగా..ఉదారంగా సేవలందిస్తున్నారా? ఐసోలేషన్ పేషెంట్లకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నారా? ఆక్సిజన్ అవసరమైన వారికి సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు అందించారా? అవసరమైన రోగులకు అంబులెన్స్ వసతి కల్పించారా? మీ సేవలు ఏ రూపంలో ఉంటున్నాయి..మాతో పంచుకోండి. మీకు తెలిసిన వాళ్లు కానీ..మీకు సాయం చేసిన వాళ్లు కానీ ఉంటే స్పందించండి ఆ మనసున్న మారాజుల వివరాలు మాకు ఫొటోలతో సహా పంపించండి ‘సాక్షి’లో ప్రచురిస్తాం. దిగువ తెలిపిన నంబర్లకు వాట్సాప్/మెయిల్ చేయండి. Satyasakshi@gmail.com ( ph.no.. 9912199485 ), Hanumadris@gmail.com ( ph.no ..9160666866 )
నగరానికి చెందిన 7 రేస్ ఫౌండేషన్ సామాన్యులకు ఆసరాగా నిలుస్తోంది. కరోనా సోకిన పేదవారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నట్లు సంస్థ ఫౌండర్ శారద పేర్కొన్నారు. ఈసీఐఎల్, ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి, యాప్రాల్, నేరేడ్‌మెట్, ఆర్‌కేపురం తదితర ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 7రేస్‌ని సంప్రదించిన బాధితుల ఇంటి వద్దకే ఆహారం అందిస్తున్నారు. బస్తీల్లో రైస్ కిట్ అందజేస్తున్నారు. ఇందులో పప్పు దిçనుసులు, వంట నూనెతో పాటు నిత్యావసర సరుకులు ఉంటున్నాయి. 99080 88258ను సంప్రదిస్తే ఆదుకుంటామని శారద సూచించారు.
నేనున్నాననీ..
స్వచ్ఛంద సంస్థలతో పాటు కొంతమంది వ్యక్తిగతంగానూ ముందుకొచ్చి ఔదార్యం కనబరుస్తున్నారు. వీరిలో నగరానికి చెందిన నవత ఒకరు. కరోనా బాధితులకు నేనున్నాననే భరోసానిస్తున్నారు. 63042 19659ను సంప్రదించిన వారికి నెగెటివ్ వచ్చేంత వరకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. నిమ్స్, గాంధీ, టిమ్స్ తదితర ప్రాంతాల్లో 3500 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశామని నవత తెలిపారు. తనకున్న పరిచయాలతో రక్తదానం కూడా చేయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
రోనా బాధితులు, పోస్ట్ కోవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా సేవలను అందిస్తోంది హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్. ఈ ఐసోలేషన్ సెంటర్లను 80 బెడ్‌ల సామర్థ్యంతో మూసాపేట్, అల్వాల్‌లో ప్రారంభించినట్లు సంస్థ ఫౌండర్ హిమజ తెలిపారు. నగరవాసులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. రోగులకు అవసరమైన చికిత్స అందించడానికి డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అవసరమైన మందులు, ఆహారం అందిస్తారు. దిశా ఫౌండేషన్, అభయం ఫౌండేషన్‌లు సహకారం అందిస్తున్నాయి.
అనాథాశ్రమాలకూ అండగా..
నగరంలోని అనాథ, వృద్ధాశ్రమాలకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిసిన్ మాస్క్‌లు, న్యాప్‌కిన్‌లు, శానిటైజర్లను అందిస్తున్నారు. ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. సేవలను పొందాలనుకునే వారు 91827 35664ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment