
లేడీస్ రూంలోకి తొంగి చూడబోతే..
షార్జా: లేడిస్ రూంలోకి తొంగిచూడాలని ప్రయత్నించి, ప్రమదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన యూఏఈలోని షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలోని 8వ బ్లాక్లో చోటుచేసుకుంది. పక్క బిల్డింగ్లో ఉంటున్న ఓ అమ్మాయిని చాటుమాటున చూడాలని ప్రయత్నిస్తుండగా అదుపుతప్పి 28 ఏళ్ల యువకుడు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు స్విమ్మింగ్పూల్లో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడు భారత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.