
పాదయాత్రలో మార్వాడీ మహిళలు
ఎదులాపురం(ఆదిలాబాద్): ఆదిలాబాద్ పట్టణంలో గణ్‌గౌర్ పండుగను మార్వాడీ మహిళలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగ అనంతరం రెండో రోజు నుంచి 16 రోజుల వరకు మాంగల్య సౌభాగ్యం కోసం గణ్‌గౌర్ (శివ పార్వతుల) ప్రతిమలతో వ్రతాన్ని మహిళలు చేపట్టడం ఆచారం. ఇందులో భాగంగానే ఇక్కడి మార్వాడీ మహిళలు 16 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతాన్ని ఆచరించారు.
చివరి రోజు పట్టణంలోని రాణిసతీజి మందిర్ నుంచి శోభయాత్రగా వెళ్లి స్థానిక ఖానాపూర్ చెరువులో ప్రతిమలను నిమజ్జనం చేశారు. రాజస్తానీ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలి అధ్యక్షురాలు రూప డోక్వాల్, ఉపాధ్యక్షురాలు ఆశ అగర్వాల్, మమత మకారియా, కాంత షాష, సీమ భగవత్, మార్వాడీ మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment