బురఖాతో లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి...అరెస్ట్‌ | man wears burkha, enters ladies toilet, booked | Sakshi
Sakshi News home page

బురఖా వేసుకొని లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి...అరెస్ట్‌

Published Sun, Feb 17 2019 10:33 AM | Last Updated on Sun, Feb 17 2019 11:50 AM

 man wears burkha, enters ladies toilet, booked - Sakshi

పనాజీ : బురఖా ధరించి మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్‌ అయ్యాడు. ఈ సంఘటన పనాజీ సెంట్రల్‌ బస్టాండ్‌లో శనివారం చోటుచేసుకుంది.  పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... విర్గిల్‌ ఫెర్నాండేజ్‌ (35) ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతగాడిపై సెక్షన్‌ 419 కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు ఈ చర్యకు ఎందుకు పాల్పడాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement