అంకాపూర్ (ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ రైతులు, మహిళలు ఆధునిక పద్ధతులలో చేపడుతున్న సేద్యం అపూర్వం, అద్భుతమని నల్లగొండ జిల్లా రైతులు పేర్కొన్నారు. భువనగిరి డివిజన్‌లోని చౌటుప్పల్ మండలానికి చెందిన లక్కా రం, పెద్ద కొండూరు గ్రామాల నుంచి 50 మం ది రైతులు, మహిళా సంఘాల సభ్యులు, నోడల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌వో) ఆధ్వర్యంలో ఆదివారం అంకాపూర్‌కు వచ్చారు. పసుపు, మొక్కజొన్న, చిక్కుడు, సోయా, కూరగాయల పంటలను, పొలాలలో నిర్మించుకున్న నీటి కుండీలను పరిశీలించారు. మార్కెట్‌లో పచ్చి మక్క బుట్టల క్రయవిక్రయాల గురించి తెలుసుకున్నారు. గ్రామంలో పంటలను చక్క గా పండిస్తున్నారని అభినందించారు. సారవంతమైన నేలలు, నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా నీటి సరఫరాతో భూగర్బజలాలు బాగా ఉన్నట్లు అంకాపూర్ గురడికాపు సంఘం మాజీ కార్యదర్శి కేకే బాజన్న చెప్పారు. వ్యవసాయం లో మహిళలు కష్టపడి పని చేస్తారని తెలిపారు.
నల్లగొండ జిల్లాకు చెందిన నీటి వినియోగదారుల సంఘం చైర్మన్‌లు కె. వెంకట్‌రెడ్డి, జి. వెం కట్‌రెడ్డి మాట్లాడుతూ భువనగిరి డివిజన్‌లో నీటి సదుపాయాలు లేక భూగర్బజలాలు అడుగంటి పోయాయని పేర్కొన్నారు. దీంతో పొలాలలో బోర్లను వెయ్యి నుంచి 1500 గజాల లోతు వరకు వేస్తారన్నారు. వర్షధారంపై ఒక పంటనే పండిస్తారని చెప్పారు. తమ ప్రాం తంలో పత్తి, కంది, ఆముదం, మొక్కజొన్న పంటలను అధికంగా పండిస్తారన్నారు. అంకాపూర్‌లో పంటలు పండించే విధానం, పంటలలో కలుపు లేకుండా చూడడం, నీటిని నిల్వ చేసే పద్ధతులు ఆకట్టుకున్నాయని వారు తెలి పారు. గ్రామం పట్టణాలకు తలపించే విధంగా ఉందన్నారు. అనంతరం గురడికాపు సంఘం లో గ్రామ రైతులతో సమావేశమయ్యారు. ఎన్‌ఎస్‌వో సిబ్బంది బాల నర్సయ్య, అర్చన, బాలన్, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
అంకాపూర్ సేద్యం అపూర్వం
Published Mon, Aug 12 2013 2:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement