
నీటికోసం రోడ్డెక్కిన మహిళలు
కరీంనగర్ (వేములవాడ): వేసవికాలం ఇంకా రానేలేదు తెలంగాణలో నీటి కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. కరీనంగర్ జిల్లా వేములవాడలోని 9వ వార్డులో మహిళలు తాగునీటికోసం తంటాలు పడుతున్నారు. నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ఏంచేయాలో తోచక ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చారు. ఖాళీ బిందెలతో తమ సమస్యలను తెలిపేందుకు మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు.