Empty pots
-
బాలయ్యకు ఝలక్
సాక్షి, హిందూపురం: ఎన్నికల ప్రచారంలో అధికార టీడీపీ అభ్యర్థులను ప్రజలు అడగడుగునా నిలదీస్తున్నారు. ఐదేళ్లు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలయ్యకు స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి ఎందుకొచ్చారని నిలదీశారు. దీంతో కంగుతిన్న బాలకృష్ణ స్థానిక టీడీపీ నాయకులపై చిందులు తొక్కారు. ఇన్ని రోజులుగా సమస్య ఎందుకు పరిష్కరించలేదని మండిపడ్డారు. నియోజకవర్గానికి అతిథిలా వచ్చిపోయే బాలయ్య తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. కాగా, జర్నలిస్టులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేసి బాలకృష్ణ ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్నారు. నిత్యం వివాదాలతో సావాసం చేసే బాలకృష్ణకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
సుల్తానాబాద్(కరీంనగర్): మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో గత రెండు రోజులుగా తాగు నీరు సరఫరా కాకపోవడంతో.. ఆగ్రహించిన మహిళలు ఆదివారం ఉదయం ఖాళీ బిందెలతో తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని డిమాండ్ చేస్తూ.. రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. -
నీటికోసం రోడ్డెక్కిన మహిళలు
కరీంనగర్ (వేములవాడ): వేసవికాలం ఇంకా రానేలేదు తెలంగాణలో నీటి కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. కరీనంగర్ జిల్లా వేములవాడలోని 9వ వార్డులో మహిళలు తాగునీటికోసం తంటాలు పడుతున్నారు. నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ఏంచేయాలో తోచక ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చారు. ఖాళీ బిందెలతో తమ సమస్యలను తెలిపేందుకు మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. -
ఖాళీ బిందెలతో నిరసన
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని కోనరావుపూట మండలంలోని మల్కపేటకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గురువారం నిరసనకు దిగారు. కొంతకాలంగా తాగునీటి కోసం గ్రామంలో ఇబ్బంది పడుతుండటంతో మహిళలంతా కలిసి సర్పంచ్ ఇంటి ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. గ్రామ సర్పంచ్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. (కోనరావుపేట) -
నీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
హైదరాబాద్: జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని నర్రిగూడ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. ఖాళీబిందెలతో తమ నిరసనని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదన్నారు. రెండేళ్లుగా ఈ సమస్య ఉందని, ప్రతినిత్యం బోరుమోటరు చెడిపోతుండటంతో నీటిసమస్య తలెత్తుతుందన్నారు. మోటారును బాగుచేయించే వారే లేకుండా పోయారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. సత్వరమే గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు.