హైదరాబాద్: జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని నర్రిగూడ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. ఖాళీబిందెలతో తమ నిరసనని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదన్నారు. రెండేళ్లుగా ఈ సమస్య ఉందని, ప్రతినిత్యం బోరుమోటరు చెడిపోతుండటంతో నీటిసమస్య తలెత్తుతుందన్నారు. మోటారును బాగుచేయించే వారే లేకుండా పోయారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. సత్వరమే గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు.
నీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
Published Mon, Feb 9 2015 5:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM
Advertisement
Advertisement