ఇటీవల కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ మంచిదికాదని స్టీల్ లేదా రాగి వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ ఉంటే ఒక రకమైన వాసన రావడమే గాక ఆరోగ్యానికి పర్యావరణానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో విరివిగా మార్కెట్లోకి వస్తున్న స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్స్ వాడుతున్నారు చాలామంది. ఇలాంటి పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌ని ఉపయోగించేటప్పుడ తగు జాగ్రత్తుల తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయం. అందుకు నెట్టింట వైరల్ అవుతున్న.. యూఎస్‌ఏకి చెందిన మహిళ ఉదంతమే ఉదహారణ. ఆమె ఈ పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌తో ఎలా అనారోగ్యం పాలైందో టిక్‌టాక్‌లో వివరించింది. మీరు కూడా ఆమెలానే చేస్తున్నట్లయితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకన్నట్లే అవుతుంది. అందువల్ల ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో సదరు మహిళ.. ఇలాంటి పునర్వినయోగ స్టెయిన్ లెస్ బాటిల్స్‌నే తాను వాడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తనకు ఒక రోజు ఉన్నట్లు జలుబు చేసిందిని, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నాక తగ్గింది మళ్లీ రెండు రోజులకే జలుబు, దగ్గు రెండు విపరీతంగా వచ్చాయి. దీంతో డాక్టర్లను సంప్రదించి యాంటీబయోటిక్ మందులు వాడింది. త్వరితగతినే కోలుకుంది కూడా. అయితే మళ్లీ వారం రోజులకే మళ్లీ సైనస్ వంటి లక్షణాలతో జలబు రావడం జరిగింది. తనకు జలుబు చేయడం అన్నదే చాలా అరుదు అలాంటిది ఇలా తరచుగా ఒక నెలలోనే రెండు మూడు సార్లు జలుబున బారిన పడుతున్నానేంటీ ఏమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నాయా అని భయపడింది.
దీంతో సమస్య ఎక్కడ ఉందా అని చెక్‌చేసుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర నుంచి తీసుకునే ఆహార పదార్థల వరకు ఎక్కడ తలెత్తుంది ఈ సమస్య, దేనివల్ల తనకు ఇలా అయ్యిందని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా..తాగే వాటర్ సురక్షితంగా ఉందా లేదా అన్న ఆలోచన తట్టింది. వెంటనే బాటిల్స్ అన్ని చెక్‌చేయగా ఆమె తాగే వాటర్ బాటిల్ అడుగున నాచులా ఆకుపచ్చిన బూజు(శిలింధ్రం) ఉండటం చూసి అవాక్కయ్యింది. అన్ని శుభ్రంగా ఉంచే నేను బాటిల్స్ మాత్ర అస్సలు క్లీన్ చేయడం లేదని తెలిసింది. బహుశా దీని వల్ల ఇన్నిసార్లు జలుబు బారిన పడ్డానని అర్థమయ్యే తక్షణమే వాటిని క్లీన్ చేసినట్లు వివరించింది.
ఈ విషయాన్నే వైద్యులకు తెలపగా, వారు కూడా ఇలాంటి ఆకుపచ్చ నాచు కారణంగా ఫుడ్ పాయిజినింగ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి పలు రకాల ఇన్పెక్షన్లు వస్తాయని చెప్పారు. తాగే నీరు, తీసుకునే ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని సూచించారని పేర్కొంది. ఈ స్టీల్ బాటిల్స్ పర్యావరణానికి హితమైనప్పటికీ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే తనలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని చెబుతోంది సదరు మహిళ.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
- ఏ బాటిల్ అయినా దానిలో వాటర్ అలానే ఉండిపోతే కచ్చితంగా కింద బాటిట్ అడుగుభాగన జిగురులాంటి సిలికాన్ మాదిరి పదార్థం ఏర్పడుతుంది. కొద్దిరోజులక ఆకుపచ్చని బూజులాంటి శిలిధ్రం ఫామ్ అయ్యిపోతుంది. మనం అందులో ఉన్న నీటిని అలాగే తాగితే ముందుగా గొంతునొప్పి, జలుబు వంటి అనారోగ్యాల బారిన పడతాం.
- తరుచుగా జలుబుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
- బాటిల్స్‌ని కనీసం మూడు లేదా ఐదు రోజుల కొకసారి వేడినీటితో క్లీన్ చేసుకోవాలి
- లోపల జిగురు వంటి సిలాకాన్‌లాంటి పదార్థం రాకుండా మార్కెట్లో దొరికే బ్రెష్‌తో క్లన్ చేసుకోవాలి.
- తాగే బాటిల్ బాగుందో లేదో కూడా చెక్‌చేసుకుని తాగండి
- ఏ బాటిల్‌లోనైన నీరు నిశ్చలంగా మూడు నుంచి నాలుగు రోజులు ఉండిపోతే ఒక విధమైన వాసన వస్తుంది. ఇలాంటి వాటర్ అత్యంత ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు బాటిల్‌లో ఎక్కువకాలం నిల్వ ఉండే వాటర్‌ని తాగొద్దు, వాటిని ఎప్పిటికప్పుడూ లేదా కనీసం మూడు నుంచి నాలుగురోజుల కొకసారి క్లీన్ చేసుకుని తాగేందుకు యత్నించండి.
(చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?)
Comments
Please login to add a commentAdd a comment