
రెండు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: రెండు విమానాలకు బుధవారం బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. ఈ రెండు విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో రెండు విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.
భద్రతా కారణాలతో ఖాట్మాండుకు వెళ్లాల్సిన 9డబ్ల్యూ260 విమానాన్ని నిలిపివేసినట్టు జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. 122 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది విమానాశ్రయంలో వేచి చూస్తున్నారని వెల్లడించింది.