two planes
-
రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి..
సింగపూర్: సింగపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అతి సమీపంగా ఎదురెదురుగా వచ్చి చిన్న ప్రమాదానికి గురయ్యాయి. ఈ సంఘటనతో రెండు విమానాల్లోని వందల మంది ప్రయాణీకుల వణికిపోయారు. స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి చైనాలోని టియాంజిన్‌కు చాంగి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సి ఉంది. అదే విమానాశ్రయంలో ఎమిరేట్స్‌కు చెందిన విమానం ఈకే 405 ఉంది. ఇది దుబాయ్‌కు చెందిన విమానం. ఈ రెండు విమానాలు ఎయిర్‌పోర్ట్‌లో ఒకదానికి ఒకటి అనూహ్యంగా ఎదురెదురు వచ్చిన క్రమంలో స్కూట్ విమానానికి చెందిన ఎడమ రెక్క స్వల్పంగా ఈకే 405కి తాకింది. ఈ సమయంలో ఈ రెండు విమానాల్లో 303మంది ప్రయాణీకులు, 11మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనను చాంగి ఎయిర్పోర్ట్ కూడా ధ్రువీకరించింది. -
రెండు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: రెండు విమానాలకు బుధవారం బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. ఈ రెండు విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో రెండు విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. భద్రతా కారణాలతో ఖాట్మాండుకు వెళ్లాల్సిన 9డబ్ల్యూ260 విమానాన్ని నిలిపివేసినట్టు జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. 122 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది విమానాశ్రయంలో వేచి చూస్తున్నారని వెల్లడించింది. -
చైనాలో రెండు విమానాలు ఢీ
బీజింగ్: రెండు విమానాల్లోని ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చైనాలోని గ్వాంగ్ఝో బైయున్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డాంగ్ ప్రావిన్స్‌లో మంగళవారం రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఓ విమానం రెక్క మాత్రం పాక్షికంగా దెబ్బతింది. చైనా సౌతర్న్, ఈస్టర్న్ ఎయిర్లైన్ప్ ఈ విమానాలను నడుపుతున్నాయి. సౌతర్న్ ఎయిర్‌లైన్స్ విమానం పాక్షికంగా దెబ్బతింది.