
జర్మనీ విమానానికి బాంబు బెదిరింపు
జర్మనీకి చెందిన ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో అత్యవసరంగా దాన్ని ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
విమానంలో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దింపేసి, తనిఖీలు చేపట్టారు. బెర్లిన్ నుంచి ఈజిప్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.