వరంగల్ జిల్లా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి. గురువారం అర్థరాత్రి అనుమానాస్పదంగా కనిపించిన వాహనం ఇన్నోవాను పోలీసులు అడ్డుకున్నారు.
వరంగల్: వరంగల్ జిల్లా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి. గురువారం అర్థరాత్రి అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అప్రమత్తమన మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారు.
వివరాల్లోకి వెళితే ...పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల్లో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలు ఇన్నోవాను అటకాయించారు. దీంతో వాహనాన్ని వదిలేసిన మావోయిస్టులు, అక్కడినుంచి తప్పించుకుని పారిపోయారు. ఏటూరు నాగారం వైపు వారు పారిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఆచూకీ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.