ఛత్తీస్గఢ్లో మంగళవారం నక్సల్స్, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మృతిచెందాడు.
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బాసగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టుమ్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మద్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. నక్సల్స్ జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందగా, మరొక జవాన్ తీవ్రంగా గాయపడ్డట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ 168వ బెటాలియన్ కు సాయుధ నక్సల్స్ ఎదురుపడి విచక్షణా రహితంగా కాల్పులకుదిగారని పేర్కొన్నారు. చనిపోయిన జవాన్ పేరు సునీల్ రామ్ అని, గాయపడిన జవాన్ పేరు ధర్మేందర్ సింగ్ భదోరియా అని తెలిపారు.