భువనేశ్వర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఘటన జరిగిన ప్రాంతం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది
ఘటనా స్థలం నుంచి హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఈ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో మూడు జిల్లాల నుంచి భద్రతా బలగాలు పాల్గొన్నాయి.
బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల నుంచి సుమారు 1200 మంది DRG, STF, COBRA, CRPF సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. అగ్రశ్రేణి నక్సల్స్ నేతలు ఉన్నారన్న సూచనతో ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బస్తర్ ఐజీ, మూడు జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఎన్‌కౌంటర్‌పై నిఘా పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment