తుల్‌తులీ ఎన్‌కౌంటర్‌ మృతులు 38 మంది | Chhattisgarh Police claims 38 Naxals killed in encounter in Narayanpur | Sakshi
Sakshi News home page

తుల్‌తులీ ఎన్‌కౌంటర్‌ మృతులు 38 మంది

Published Sat, Oct 19 2024 5:36 AM | Last Updated on Sat, Oct 19 2024 5:36 AM

Chhattisgarh Police claims 38 Naxals killed in encounter in Narayanpur

తొలిరోజు 31 మృతదేహాలు స్వాధీనం

35మంది చనిపోయినట్లు మావోయిస్టుల ప్రకటన

38మందితో తాజాగా జాబితా విడుదల చేసిన పోలీసులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌ చరిత్ర లోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్న తుల్‌తులీ ఎన్‌కౌంటర్‌లో రోజులు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్రంలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఈనెల 4న నారాయణపూర్‌ జిల్లా పరిధిలోని తుల్‌తులీ, గవాడీ గ్రామాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో తొలి రోజు 31మంది చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.

అందులో 22మందిని గుర్తించగా మిగిలిన వారిని గుర్తించలేకపోయారు. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత మావో యిస్టులు లేఖ విడుదల చేస్తూ ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం 35మంది చనిపోయినట్లు వెల్లడించారు. ఇక్కడితోనే మృతుల సంఖ్య ఆగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే దంతెవాడ ఎస్పీ గౌరవ్‌రాయ్‌ శుక్రవారం ఈ ఎన్‌కౌంటర్‌పై మరిన్ని వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం తుల్‌తులీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 38మంది చనిపోయారని వెల్లడించారు. మృతులపై ఉన్న రివార్డు మొత్తం రూ.2.60 కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement