Police
-
‘అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు’.. హైకోర్టులో పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ హైకోర్టులో (telangana highcourt) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (brs mla padi kaushik reddy)కి ఊరట దక్కింది. సుబేదారి పీఎస్‌లో నమోదైన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.50లక్షలు ఇవ్వాలంటూ క్వారీ యజమాని మనోజ్‌ను పాడి కౌశిక్‌రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయంపై మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే,ఈ నేపథ్యంలో తనపై నమోదైనే కేసును కొట్టి వేయాలని కోర్టుతో పాడికౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పాడికౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్..2023 అక్టోబర్25న 25లక్షల రూపాయలు కౌశిక్ రెడ్డికి మనోజ్ చెల్లించినట్లు వాంగ్మూలం ఉంది కదా అని ప్రభుత్వం తరుఫు న్యాయవాది (public prosecutor) హైకోర్టు ప్రశ్నించింది.అందుకు పాడికౌశిక్ రెడ్డి బెదిరించారు కాబట్టే రూ.25 లక్షలను కౌశిక్‌రెడ్డికి మనోజ్ చెల్లించారని పీపీ కోర్టుకు తెలిపారు. ఇప్పుడు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 2023లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పీపీని ప్రశ్నించిన హైకోర్టు..కౌశిక్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ 28వ తేదీకి విచారణ వాయిదా వేసింది. -
ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
ములుగు, సాక్షి: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) మూడో రోజు కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ధర్మతాళ్లగూడెం వద్ద అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇప్పటిదాకా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఇద్దరు జవాన్లు గాయపడగా.. బీజాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ సెర్చ్ ఆపరేషన్ ఆధారంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెంది ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. గాలింపు చర్యల్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, మూడు రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు వేల మంది మాత్రమే కర్రెలగుట్టను రౌండప్ చేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ మాత్రం ఆ సంఖ్య పదివేల దాకా ఉండొచ్చని చెబుతోంది. సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టిట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా మూడు హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో డ్రోన్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్ కొనసాగుతోంది. మాకేం సంబంధం లేదుకర్రిగుట్టలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కూంబింగ్‌కు తమకు సంబంధం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఛత్తీస్‌గఢ్- కేంద్ర బలగాలు చూసుకుంటున్నాయని, తమకు ఎలాంటి సమాచారం కూడా లేదని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రకటించారు. కూబింగ్‌లో పాల్గొంటున్న కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. ఛత్తీస్గడ్ వైపు నుంచి ఊసూర్ బ్లాక్‌లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. గుట్టల్లోకి ఎవరు రావొద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా, హీడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుద బలగాలకు ఉప్పందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.కూంబింగ్ సరికాదుఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్ డైలాగ్ కమిటీ(పీడీసీ) చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు. -
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
సాక్షి, సంగారెడ్డి: చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్‌లోనూ ఉంచలేమంటూ అధికారులు తేల్చి చెప్పారు. అఘోరీని తిరిగి పంపించిన సంగారెడ్డి జైలు అధికారులు.. లింగ నిర్థారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. మరో వైపు, సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న సమయంలో అఘోరీ అరుపులతో హడావుడి చేశాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టాడు.పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో మోకిలా పోలీసులు.. అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్- మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నగరానికి తీసుకువచ్చారు. మోకిలా పోలీసులు. అఘోరీతో పాటు వర్షిణిని కూడా నగరానికి తరలించారు. ఏపీకి చెందిన వర్షిణి.. అఘోరీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే, ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరించిన ఈ జంట.. ఓ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది. -
ఏపీ పోలీసుల తీరుపై హైకోర్ట్ మరోసారి తీవ్ర ఆగ్రహం
-
PSR ఆంజనేయులుని అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు
-
మావోయిస్టుల లొంగు‘బాట’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వరుస ఎన్కౌంట ర్లు, తీవ్ర నిర్బంధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు లొంగుబాటు వ్యూహాన్ని ఎంచుకున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో బతికి ఉండాలంటే ప్రభుత్వానికి లొంగిపోవటం ఒక్కటే మార్గమని భావిస్తున్నారా? తాజా పరిణామాలు గమనిస్తే ఇది నిజమే నని అంటున్నారు విశ్లేషకులు. నెల రోజులుగా మావో యిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యులు, జనమిలీషియా, చేతన నాట్య మండలికి చెందిన వారు భారీ ఎత్తున లొంగిపోతున్నారు. ఓవైపు శాంతి చర్చల అంశంపై స్పష్టత రాకముందే లొంగుబాట్లకు మావోయిస్టులు ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. అష్టదిగ్బంధనం.. మావోయిస్టులకు కేంద్రస్థానమైన బస్తర్ అరణ్యంపై ప్రభుత్వ దళాలు ఆపరేషన్ కగార్ పేరుతో విరుచుకుపడుతున్నాయి. వరుసగా చోటుచేసుకున్న ఎన్కౌంటర్లతో ఇప్పటివరకు 400 మందికి పైగా తమ సభ్యులు మరణించినట్టు మావోయిస్టులే ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతితోపాటు కీలక నేతలైన రేణుక, ఊర్మిళ, మాచర్ల ఏసోబు వంటి అగ్రనేతలు మృతిచెందడం ఆ పార్టీకి భారీ నష్టాన్ని కలిగించింది. అడవుల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా దళాలు బేస్ క్యాంప్ ఏర్పాటు చేయటంతో మావోయిస్టుల కదలికలు పరిమితమయ్యాయి. లొంగిపోవాలని నేతల పిలుపు..! నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు ముఖ్య నాయకులు, సాయుధ దళాలు ఒకటిరెండు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. భద్రత దృష్ట్యా కీలక నేతలు కిందిస్థాయి కేడర్‌ను కలిసే అవకాశం దక్కడం లేదు. దీంతో పార్టీ విస్తరణ, జనతన సర్కార్ నిర్వహణ కష్టంగా మారాయి. మరోవైపు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నాయకులకు వైద్యసాయం అందించడం కత్తి మీద సాములా మారింది. దీంతో మావోయిస్టు పార్టీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఓవైపు శాంతి చర్చలకు పిలుపునివ్వడంతోపాటు కింది స్థాయి కేడర్‌ను ప్రభుత్వానికి లొంగిపొవాలని సూచించినట్టు తెలుస్తోంది. తిరిగి అనుకూల సమయం వచ్చినప్పుడు పార్టీని విస్తరించుకుందామని చెబుతున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ నుంచి బయటకు.. లొంగుబాటుకు ప్రయత్నిస్తున్న నక్సల్స్‌లో చాలామంది బస్తర్ ఎన్కౌంటర్లలో చనిపోతుండడంతో అక్కడ లొంగుబాటు ప్రక్రియకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో లొంగుబాటు సేఫ్ కాదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వైపునకు తరలివస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 203 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతేడాది ఈ సంఖ్య 36 మాత్రమే. గత మార్చి 15న ఒకేసారి 64 మంది లొంగిపోగా, ఏప్రిల్ 5న రికార్డు స్థాయిలో 86 మంది లొంగిపోయారు. ఈ నెల 12న ములుగులో 22 మంది లొంగిపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఏపీలోని అల్లూరి జిల్లాలో ఈ నెల 5న 11 మంది లొంగిపోయారు. రూటు మార్చిన ఛత్తీస్‌గఢ్ లొంగిపోయే మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఏప్రిల్ 10న కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు రూ.50 వేల ఆర్థిక సాయాన్ని 120 రోజుల్లోగా అందిస్తామని పేర్కొంది. అదే విధంగా ప్రతీ మూడు నెలలకు ఒకసారి రూ.10 వేల వంతున స్టైఫండ్ అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యవసాయ భూమి, పట్టణ ప్రాంతాల్లో అయితే ఇంటి స్థలాలు ఇస్తామని ప్రకటించింది. -
ఇంద్రవెల్లి పోరాటం
ఏప్రిల్ 20వ తేదీ ఆదివాసీ పోరాట చరిత్రలో చెరVýæని జ్ఞాపకం. 70వ దశకం చివరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసులు భూమి పట్టాలు, శిస్తు వసూలు, తూకంలో మోసం, షావుకారీ వ్యవస్థ తదితర తీవ్ర సమ స్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీలకు ‘గిరిజన రైతుకూలీ సంఘం’తో పరిచయం ఏర్పడింది. గోండు, కోలం, కోయ తెగల రైతులు అందులో చేరారు. పోడు భూములకు పట్టాలు, దళారీ షావుకారుల అధిక వడ్డీ వ్యాపా రంలో మోసాలు తదితర అంశాలపై గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను 1991 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ చేయాలని నిర్ణయించారు. ముందుగా సభ నిర్వహణ అనుమతికై స్థానిక ఆదివాసీలు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోగా, మొదట అనుమతి మంజూరు చేశారు. కానీ సభ జరిగే రోజు అను మతి రద్దుచేసి 144 సెక్షన్ విధించారు. అప్పటి విప్లవ పార్టీ పీపుల్స్‌వార్ సైద్ధాంతిక మద్దతును గిరిజన రైతుకూలీసంఘం కలిగివుందనే అనుమానంతో అధి కారులు ఈ పనికి పూనుకున్నారు. అను మతి రద్దయిన సంగతి తెలియక, 144 సెక్షన్ గురించిన సమాచార లోపంతోఇంద్రవెల్లి చుట్టుపక్కల గ్రామాల ఆదివా సులతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ గూడేల ఆదివాసులు పెద్ద సంఖ్యలోఇంద్రవెల్లి సభాస్థలికి వెళ్లారు. పోలీసులు చెట్లపై మాటువేసి ఆదివాసీలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 17 మంది ఆదివాసులు మరణించారు. వందల మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనను పాఠ్యాంశం చేయాల్సిన అవసరముంది. – సిడం జంగుదేవ్,ఆదివాసీ విద్యార్థి సంఘంతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
మురికివాడ ప్రజలు వర్సెస్ పోలీసులు
రూర్కేలా: ఒడిశా రాష్ట్రంలోని సుందర్ ఘర్ జిల్లాలో మురికివాడల్లో నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృత్యువాత పడగా, 19 మంద గాయపడ్డారు. గాయపడిన వారిలో అదనపు తహసీల్దార్ కూడా ఉన్నారు. సుందర్ ఘర్ జిల్లాలోని బర్కానీ ఏరియాలో నివాసముండే మురికివాడ నిర్వాసితులను ఖాళీ చేయించే క్రమంలో అధికారులు అక్కడ వచ్చారు. ఈ క్రమంలోనే వారు ఖాళీ చేసేది లేదని తేల్చిచెప్పడంతో అటు పోలీసులకు మురికివాడ నిర్వాసితులకు ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జీ చేయగా, దాన్ని వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం మీదుగా రైల్వే లైన్ మంజూరు కావడంతో అక్కడ ఉండే వారిని ఖాళీ చేయించేందుకు అధికారులు పూనుకున్నారు. దీనిలో భాగంగా పోలీసుల్ని తీసుకునిన అక్కడకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది. -
వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోతే వ్యభిచారం కేసు పెడతారా?
-
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్ కనిపించడం లేదంటూ అతని భార్య, బంధువులు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో మిస్ అయిన కానిస్టేబుల్ నంద్యాల–కడప ఘాట్రోడ్లో శుక్రవారం శవమై కనిపించాడు. సేకరించిన వివరాల మేరకు నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, తోటకందుకూరు గ్రామానికి చెందిన ఫారుక్ (30) ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా మంగళగిరి ఆక్టోపస్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి పట్టణంలోనే ఉంటున్నాడు. ఏప్రిల్ 8న ట్రైనింగ్ ఉందంటూ వెళ్లిన ఫారుక్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో 12న భార్య బషీరున్ తన బంధువులతో కలిసి ఆక్టోపస్ కార్యాలయానికి వెళ్లింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఫారుక్ సెలవు పెట్టాడని అక్కడి అధికారులు చెప్పడంతో మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఈనెల 14న ఫిర్యాదు చేశారు. మంగళగిరి పట్టణ పోలీసులు మిస్సింగ్‌గా కేసు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన నిజాలు ఫారుక్ ఫోన్ స్విచ్చాఫ్‌గా ఉండడంతో ఆక్టోపస్ అధికారుల ఆదేశాల మేరకు అతని కాల్ డేటాను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఫారుక్ ఫోన్ లొకేషన్ నంద్యాలలో ఉన్నట్లు తేలడంతో చివరగా ఫోన్ చేసిన వారిని నంద్యాల జిల్లా పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు చెందిన అనీషను కూడా విచారణ చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఫారుక్‌కు పెళ్లికాక ముందు నుంచి అనీషతో పరిచయముంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అనీష కుమార్తెతో కూడా ఫారుక్ సన్నిహితంగా ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఈ విషయమై ఫారుక్‌తో తరచూ గొడవ పడేది. ఫారుక్ నంద్యాలలోని తెలిసిన వ్యక్తి ద్వారా అనీషకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో అనీష కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఫారుక్‌ను అడ్డు తొలగిస్తేనే పెళ్లికి అంగీకరిస్తానని అనీష చెప్పింది. పథకం ప్రకారం.. ఫారుక్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం పన్నారు. అతనికి ఫోన్ చేసి కొన్ని రోజులు సెలవు పెట్టుకుని రావాలని అనీష కోరింది. ఫారుక్ మంగళగిరి నుంచి నంద్యాలకు ఏప్రిల్ 8న సాయంత్రం బయలు దేరాడు. 9న అక్కడకు చేరుకున్న ఫారుక్ తనకు పరిచయమున్న వ్యక్తిని కలిశాడు. అక్కడి నుంచి బయటకు వెళ్దామంటూ ఆ వ్యక్తి మరో ఇద్దరిని తీసుకుని ఫారుక్‌తో కారులో బయలుదేరారు. మద్యం సేవించిన అనంతరం నంద్యాలలో కారులో వెళుతుండగా ఎదురు సీట్లో కూర్చున్న ఫారుక్‌ను వెనుక ఉన్న వ్యక్తి ఓ వైర్‌తో మెడకు గట్టిగా బిగించాడు. దీంతో ఊపిరి ఆడక ఫారుక్ అక్కడికక్కడే మరణించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వీరు మృతదేహాన్ని ఒక కవర్లో చుట్టి నంద్యాల శివారు ప్రాంతంలో ఉన్న ఓ చెరువులో పడవేశారు. కొంత సమయం తరువాత వచ్చి చూడడంతో మృతదేహాన్ని కవర్‌తో చుట్టడం వల్ల చెరువులో తేలుతూ కనబడింది. మరుసటి రోజు ఎవరూ లేని సమయంలో వచ్చి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి నంద్యాల – కడప ఘాట్రోడ్లో ఫారెస్ట్ ప్రాంతంలో పైనుంచి కిందకు పడవేశారు. నంద్యాల సీసీఎస్ పోలీసులు అనీషను, మరో ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకోగా, మరో యువకుడు పరారయ్యాడు. ఆ ముగ్గురిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితులు తెలిపిన వివరాలతో ఫారుక్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫారుక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
పల్నాడు జిల్లా,సాక్షి: దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ తనను బాగా ఇబ్బంది పెట్టారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి గురజాల కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పోలీసులు గురువారం గురజాల కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో పాలేటి కృష్ణవేణి అరెస్టుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. ‘దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. నిన్న సాయంత్రం హైదరాబాదులో ఐదు గంటల పది నిమిషాలకు నన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. రాత్రి తినడానికి నాకు ఆహారం కూడా ఏమి పెట్టలేదు. మూడున్నరకి కొంత ఆహారం పెట్టారు. మేం చెప్పినట్టు వినకపోతే సీఐ భాస్కర్ కేసులు పెడతామని బెదిరించారు.నా భర్త రాజ్ కుమార్‌పైన గంజాయి కేసు పెడతామని సీఐ భాస్కర్ బెదిరించారు. నీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అని సీఐ భాస్కర్ నన్ను వేధించాడు. నీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అని టార్చర్ చేశారు. ఈ పోస్టులు వెనక పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారో చెప్పమని ఇబ్బంది పెట్టారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని బలవంతం చేశారు’ అని అన్నారు. అయితే తాను పెట్టిన పోస్టులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కృష్ణవేణి న్యాయమూర్తికి చెప్పారు. అనంతరం మిమ్మల్ని పోలీసులు ఎలా చూసుకున్నారని కృష్ణవేణిని న్యాయమూర్తి ప్రశ్నించారు. నన్ను బాగా ఇబ్బంది పెట్టారని కృష్ణమూర్తి చెప్పగా.. పోలీసులు పైన కంప్లైంట్ ఇస్తారా? అని న్యాయమూర్తి కృష్ణవేణిని అడిగారు. అందుకు తాను పోలీసులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.ఈ సందర్భంగా.. కృష్ణవేణి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆమె తరుఫు న్యాయవాది.. న్యాయమూర్తిని కోరారు. వాదన సందర్భంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్ గేట్లకు బేడీలతో తాళాలు వేసిన విజువల్స్ న్యాయమూర్తిగా చూపించారు. అనంతరం, కృష్ణవేణికి 14 రోజులు పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను గుంటూరు కోర్టుకు తరలించారు. కృష్ణవేణి కస్టోడియల్ టార్చర్‌పై దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌కు కోర్టు మెమో జారీ చేసింది. -
తెలంగాణలో ప్రతీ లక్ష మందికి 233 మంది పోలీసులు
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులది అత్యంత కీలకపాత్ర. నేరాలు జరగకుండా చూడడంతోపాటు నేరస్తులను చట్టం ముందు నిలబెట్టేలా దర్యాప్తు చేయడం వీరి ప్రధాన విధి. అయితే దేశవ్యాప్తంగా పోలీసుల సంఖ్యకు నానాటికీ పెరుగుతున్న జనాభాకు పొంతన లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది జనాభాకు కేవలం 155 మంది పోలీసులు మాత్రమే ఉన్నట్టు ఇటీవల విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్)–2025 నివేదిక వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్⇒ జాతీయ స్థాయిలో సరాసరిన చూస్తే ప్రతి లక్ష మంది జనాభాకు మంజూరైన పోలీసుల సంఖ్య 197 కాగా, కేవలం 155 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ⇒ తెలంగాణ విషయానికి వస్తే ప్రతి లక్ష మంది జనాభాకు ఇక్కడ 233 మంది పోలీసులు అందుబాటులో ఉన్నారు. ⇒ ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ప్రతి లక్ష మందికి బిహార్‌లో అత్యల్పంగా కేవలం 75 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.మహిళా పోలీసుల సంఖ్య అంతంతే..⇒ పోలీస్ బలగాల్లో మహిళా అధికారులు, సిబ్బంది సంఖ్య సైతం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ⇒ జాతీయ స్థాయిలో పోలీస్ విభాగాల్లో మహిళా సిబ్బంది సంఖ్య 8 శాతంగా ఉండగా..మహిళా అధికారుల సంఖ్య 10 శాతానికి పరిమితమైంది. ⇒ తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ మహిళల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. అయితే ఐజేఆర్ 2025 నివేదిక ప్రకారం తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది 8.7 శాతంగా, మహిళా అధికారుల సంఖ్య 7.6 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ⇒ దేశవ్యాప్తంగా అత్యధికంగా తమిళనాడు పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 20.7 శాతంగా, మహిళా అధికారుల సంఖ్య 20.1 శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. -
మహిళననీ చూడకుండా లాఠీలతో కొట్టారు
తిరుపతి సిటీ: ఒక భూమి విషయంలో అబద్ధాలు చెప్పాలంటూ తనను తిరుచానూరు స్టేషన్‌కు ఈడ్చుకెళ్లిన పోలీసులు లాఠీలతో కుళ్లబొడిచారని స్థానిక సుందరయ్య నగర్‌కు చెందిన ఇ.హేమలత అనే మహిళ విలపించింది. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటి పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్న తనను మంగళం కృష్ణవేణి యాదవ్ కాలనీకి సంబంధించిన భూమి విషయమై మాట్లాడాలని తిరుచానూరు పోలీసులు బూతులు తిడుతూ స్టేషన్‌కు లాక్కెళ్లారని తెలిపింది. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయినాథ్‌చౌదరి, మహిళా కానిస్టేబుల్ సునీత, ఇతర సిబ్బంది తనవద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.23 వేల నగదు, చేతి వేలి ఉంగరం లాక్కున్నారని ఆరోపించింది. ఆ తరువాత ఎస్ఐ సాయినాథ్ చౌదరి సమక్షంలో కానిస్టేబుల్ సునీత జుట్టు పట్టుకుని ఈడ్చి మెడపై బలంగా గుద్దుతూ బూతులు తిడుతూ కొట్టిందని ఆరోపించింది. తన ఎడమ చేతిని వెనక్కి తిప్పి లాఠీతో అతి దారుణంగా కొట్టారని, కుడి చేయి తిప్పి రబ్బరు టైరులాంటి వాటితో విపరీతంగా కొట్టి గాయపరిచారని విలపించింది. ఆ భూమిని కొనుక్కున్న వాళ్లు తనకు డబ్బులు ఇవ్వలేదని చెబితే తనను వదిలేస్తామని, లేదంటే తనపై బ్రోతల్ కేసు, తన కుమారుడిపై గంజాయి కేసు పెడతామని బెదిరించారని పేర్కొంది. ఈ వ్యవహరమంతా మంగళం వార్డు మెంబర్ నాగయ్య సమక్షంలో జరిగిందని తెలిపింది. అనంతరం ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు సాయిలక్ష్మి, జయంతి మాట్లాడుతూ మహిళ అని కూడా చూడకుండా అతికిరాతకంగా కొడుతూ కులం పేరుతో దూషించిన ఎస్ఐ సాయినాథ్ చౌదరి, మహిళా కానిస్టేబుల్ సునీతను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే మహిళా సంఘాలు ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ఎస్పీకి వినతిపత్రం అందజేస్తామన్నారు. -
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
లక్నో: మాటలు, వినికిడి లోపం ఉన్న 11ఏళ్ల బాలికపై మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో బాలికపై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ (uttar pradesh)రామ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఆ దారుణం జరిగిన తీరును చూసి వైద్యులే కనీరు పెడుతున్నారు. తాము చూసిన అత్యంత ఘోరమైన లైంగిక నేరాల్లో ఇది ఒకటి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రామ్‌పూర్ (rampur district) జిల్లాలో ఓ గ్రామానికి చెందిన బాలిక మంగళవారం సాయంత్రం కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఆ మరునాడే (బుధవారం)బాధితురాలి ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉన్న చెట్ల పొదల్లో అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని ఓ వ్యక్తి గమనించాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు,స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నేను చూసిన అత్యంత భయంకరమైన లైంగిక నేరాలలోవైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అంజు సింగ్ బాలికపై జరిగిన దారుణాన్ని చూసి కంట తడిపెట్టారు. ‘నేను చూసిన అత్యంత భయంకరమైన లైంగిక నేరాలలో ఇది ఒకటి. బాలికపై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు అత్యాచారం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అంతర్గత అవయవాల్ని సిగరెట్‌తో కాల్చారు. పంటి గాట్లు కూడా ఉన్నాయి. బలమైన వస్తువుతో ముఖం మీద కొట్టారు. ముఖం మీద తీవ్రగాయాలయ్యాయి. జరిగిన దారుణంతో షాక్‌కి గురైంది. భయపడుతోంది’ అని గద్గద స్వరంతో చెప్పారు.పోలీసులపై నిందితుడు కాల్పులుబాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అడిషనల్ ఎస్పీ అతుల్ కుమార్ శ్రీవాత్సవ నిందితుడి కోసం గాలింపు చర్యల్ని చేపట్టారు. మూడు పోలీసు బృందాల్ని రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. నిందితుడిది అదే గ్రామానికి చెందిన డాన్ సింగ్ (24) అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించారు. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు. ఎదురు కాల్పుల్లో డాన్ సింగ్ గాయపడ్డాడని నిర్ధారించారు. బాలికకు మాయ మాటలు చెప్పిరామ్పూర్ పోలీస్ చీఫ్ విద్యా సాగర్ మిశ్రా మాట్లాడుతూ ..నిందితుడిని పట్టుకోవడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశాం. అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా.. ఈ కాల్పుల్లో అతనికి బుల్లెట్ గాయమైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక ఇంటి బయట నిందితుడు బాలికతో మాట్లాడాడు. అనంతరం, మాయ మాటలు చెప్పి ఇంటి సమీపంలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం.. హైకోర్టు తీర్పుతో దంపతులకు షాక్!
లక్నో: ‘మీరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి (love marriage) చేసుకున్నారు. అలాంటప్పుడు మీకెందుకు పోలీస్ భద్రత ఇవ్వాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేం. మీ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉందని మేం భావిస్తే అప్పుడు మీకు పోలీసులు భద్రత కల్పిస్తారు’ అంటూ అలహాబాద్ హైకోర్టు (allahabad high court) కీలక తీర్పును వెలువరించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రేమవివాహం చేసుకున్న దంపతుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 4న ఓ కీలక తీర్పును వెలువరించింది. ‘తాము ప్రేమవివాహం చేసుకున్నామని, తల్లిదండ్రుల నుంచి భయాందోళనలు ఉన్నాయంటూ శ్రేయా కేసర్వాని అనే మహిళ తన భర్తతో కలిసి తమకు పోలీసు రక్షణ కల్పించాలని’ కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి సౌరభ్ శ్రీవాస్తవ విచారణ చేపట్టారు. విచారణలో.. మీ జీవితానికి, మీ స్వేచ్ఛకు భంగం కలిగించేలా బెదిరింపులు వస్తే పోలీసులు రక్షణ కల్పించవచ్చు. అలాంటి బెదిరింపులు లేకుండా, కేవలం తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పి రక్షణ కోరడం తగదని స్పష్టం చేసింది.దంపతులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాలను పరిశీలించిన అనంతరం, దంపతులకు ప్రాణ భయమేమీ లేదని, వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, పైగా వారి బంధువులు ఎటువంటి మానసిక లేదా శారీరక హానిని కలిగించే అవకాశం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.అలాగే, తమకు బెదిరింపులు వస్తున్నాయని సంబంధిత పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయకపోవడం కూడా పరిగణనలోకి తీసుకుంది. అయితే, చిత్రకూట్ జిల్లా ఎస్పీకి రక్షణ కోరుతూ వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తించింది. పోలీసులు అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సామాజికంగా ఎదురయ్యే సమస్యలను దంపతులు ఎదుర్కొని, పరస్పరం అండగా ఉండడం నేర్చుకోవాలి’ అని కోర్టు సూచించింది.అంతేకాదు..ప్రేమ పెళ్లి చేసుకున్న యువతకు న్యాయస్థానాలు కేవలం రక్షణ కల్పించేందుకు మాత్రమే లేవు’ అంటూ గతంలో ఈ తరహా పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (supreme court of india) చేసిన వ్యాఖ్యల్ని ఉదహరించింది. -
పాస్టర్ ప్రవీణ్ కేసుపై కేఏ పాల్ సంచలన నిజాలు
-
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
వికారాబాద్: మనిషి జీవితంలో సెల్‌ఫోన్ భాగమైపోయింది. నేడు మొబైల్ ఫోన్ లేని ఇళ్లంటూ లేదు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణాల వరకు వీటి వాడకం భారీగా పెరిగిపోయింది. 90 శాతం మంది స్మార్ట్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. ఒక్కో మొబైల్ కోసం రూ.10 వేల నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చిస్తున్నారు. ఇదే సమయంలో ఫోన్ల దొంగతనాలు కూడా ఎక్కువైపోయాయి. ఐదేళ్లుగా పోలీసులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన కేంద్ర టెలీకామ్ మంత్రిత్వ శాఖ నూతన టెక్నాలజీ (సీఈఐఆర్ పోర్టల్)ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా జిల్లా పోలీసు విభాగం మంచి పురోగతి సాధించింది. భారీగా రికవరీ గత ఏడాది జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధి లో 3,647 ఫోన్లు చోరీకి గురయ్యాయి. కొన్ని చోట్ల బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా.. మరికొన్ని చోట్ల సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మోమిన్‌పేట్, కుల్కచర్ల, తుంకిమెట్ల, మర్పల్లి ప్రాంతాల్లో సంతలు నిర్వహించే సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. జిల్లాలో చోరీకి గురైన ఫోన్ల రికవరీ బాధ్యతను ఎస్పీ.. సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సీఈఐఆర్ టెక్నాలజీని వినియోగించి దాదా పు రూ.2 కోట్ల విలువ చేసే 1,250 సెల్ ఫోన్లను రికవ రీ చేశారు.తెలంగాణ జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి వీటిని స్వాదీనం చేసుకున్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన కొందరు జిల్లాలో సెల్ ఫోన్లను చోరీ చేస్తు న్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం మైనర్లేనని పోలీసులు గుర్తించారు. ఫోన్ పోతే ఏం చేయాలి? సెల్‌ఫోన్ పోయినా.. చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మూడు పద్ధతులు ఉంటాయి. బాధితులు తమ ఫోన్ ద్వారా www.ceir.gov.in వెబ్ సైట్లో నేరుగా నమోదు చేసుకోవచ్చు. లేదా మీసేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రెండూ కాకుండా ఫోన్ ఎక్కడ పోయిందో అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఐఎంఈ నంబర్, ఫోన్ నంబర్, మొబైల్ కొన్న సమయంలో పొందిన బిల్, అడ్రస్ తదితర వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. మనం ఈ పోర్టల్‌లో నమోదు చేస్తే చోరీకి గురైన ఫోన్ స్టేటస్ చూసుకోవటానికి వీలుంటుంది. దాన్ని ఎవరు.. ఎక్కడ వాడుతున్నారు. అసలు వాడుతున్నారా..? లేదా..? అదే నంబర్‌ను వినియోగిస్తున్నారా..? వేరే నంబర్ వాడుతున్నారా..? లాంటి వివరాలు తెలుసుకునేందుకు వీలుపడుతుంది. పోలీసులు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారు. ఏడాది క్రితం వరకు చోరీకి గురైన ఫోన్ల రికవరీ పోలీసులకు పెద్ద సవాల్‌గా ఉండేది.. దొంగ దొరికితే తప్ప కేసులు కొలిక్కి వచ్చేవి కాదు.. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కేసుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.. నేరం చేసిన వారితోపాటు.. చోరీకి గురైన కోట్ల రూపాయల విలువ చేసే సెల్ఫోన్లను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కడున్నా దొరికిపోతాయిసీఈఐఆర్ టెక్నాలజీతో దొంగిలించన ఫోన్లు ఎక్కడున్నా కనిపెట్టవచ్చు. కొందరు చోరీ చేసిన మొబైల్స్‌ను గుర్తించకుండా స్పేర్ పార్ట్స్‌గా మార్చి విక్రయిస్తున్నారు. అయినా దొరికిపోతారు. ఫోన్ ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా గుర్తించడాని సీఈఐఆర్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంత ఆలస్యం కావచ్చు అంతే.. – నారాయణరెడ్డి, ఎస్పీ -
హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. ఆ రాష్ట్ర మాజీ సీఎస్ కుమారుడు అరెస్ట్
హైదరబాద్,సాక్షి: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలి పరిధిలోని శరత్ సిటీ మాల్ వద్ద పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మాదకద్రవ్యాలతో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతను ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకువచ్చాడు.ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న దానిపై అధికారుల ఆరా తీస్తున్నారు. -
వైఎస్ జగన్ హెలికాప్టర్ ఘటనపై పోలీసుల విచారణ
-
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసుల షాక్
-
మన పోలీసింగ్ అదుర్స్..
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. అత్యుత్తమ పోలీసింగ్‌కు సంబంధించి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ –2025 ర్యాంకింగ్‌లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. ఏపీ రెండో స్థానంలో ఉంది. అత్యుత్తమ పోలీసింగ్‌కు 10 మార్కుల ప్రాతిపదికన తెలంగాణ 6.48 మార్కులతో టాప్‌లో నిలవగా, 3.36 మార్కులతో పశ్చిమ బెంగాల్ అట్టడుగున నిలిచింది. పోలీస్, న్యాయవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్ ఎయిడ్ పనితీరుపై ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) 2019 నుంచి ప్రతి ఏటా నివేదిక విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజా రిపోర్టు మంగళవారం విడుదలైంది. అత్యుత్తమ పోలీసింగ్‌లో తొలి స్థానాన్ని దక్కించుకున్న తెలంగాణ..పోలీస్, న్యాయవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్ ఎయిడ్ తదితర అంశాలన్నీ కలిపి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో కలిపి గత నివేదికలో 11 స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ ఏడాది మూడో స్థానానికి ఎగబాకడం గమనార్హం. కాగా అన్ని అంశాల్లో కలిపి 2025లో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో న్యాయవ్యవస్థస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, కేరళ, తమిళనాడు నిలిచినట్టు నివేదిక వెల్లడించింది. 50 శాతం పెరిగిన ఖైదీల సంఖ్య జాతీయ స్థాయిలో పోలీస్–పౌరుల నిష్పత్తి పరిశీలిస్తే.. ప్రతి లక్ష మంది పౌరులకు 155 మంది పోలీసులు ఉన్నట్టు నివేదిక తెలిపింది. బిహార్‌లో అతి తక్కువగా ప్రతి లక్షమంది పౌరులకు 81 మంది మాత్రమే పోలీసులు ఉన్నట్టు పేర్కొంది. కాగా గత దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంఖ్య 50 శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. ఇందులో అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య గతంతో పోలిస్తే 66 శాతం నుంచి 76 శాతానికి చేరినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బడ్జెట్లలో క్రిమినల్ జస్టిస్ సిస్టంకు ఇస్తున్న కేటాయింపులలో అత్యధిక భాగం జీతభత్యాలకే ఖర్చవుతుండగా, అతికొద్ది మొత్తం మాత్రమే మౌలిక వసతుల కేటాయింపునకు ఖర్చు చేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా పోలీస్‌శాఖలో మహిళల సంఖ్య 8 శాతం మాత్రమే ఉన్నట్టు తెలిపింది. మహిళా అధికారుల సంఖ్య 10 శాతానికే పరిమితం అయినట్టు వివరించింది. తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 8.7 శాతం కాగా, మహిళా అధికారుల సంఖ్య 7.6 శాతంగా ఉందని ఐజేఆర్ తెలిపింది. -
నీరు లేదు... నిప్పు లేదు.. అడవిలో ఆ నలుగురు
తెలిసిన అడవే. కాని ఉరుములు మెరుపులతో చీకటి పడిపోయింది. దారి తప్పారు. ఊరి వైపు కాకుండా అడవిలోకి వెళ్లిపోయారు. నలుగురు స్త్రీలు... తునికాకు కోసం వెళ్లి రాత్రంతా అడవిలో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడారు. వారి కథ గగుర్పాటు కలిగించేలా ఉంది. ధైర్యాన్ని నూరిపోసేలా కూడా. చిత్రమేమిటంటే తిరిగి వచ్చేప్పుడు పోలీసులు కూడా దారి తప్పారు. అంత మాయలమారి అడవి అది.‘రాధ ఆడ నీ పక్కకున్న కట్టెలందుకోయే..’‘ఏంటికే లింగవ్వ.. కట్టెలకు మంట పెడదమంటే మన తాన అగ్గిపుడక కూడ లేదు గదనే..’ ‘లేదే.. ఏదో సప్పుడైతుంది. గుడ్డెలుగులో, అడివిపందులో చీకట్ల తెలుస్త లేదే. కట్టె పట్టుకుని సప్పుడు చేస్తే దూరం పోతయని...’ చెట్టు మొదట్లో కాళ్లు ముడుచుకుని, చుట్టూ ఉన్న చీకట్లను భయంగా చూస్తూ చెబుతోంది లింగవ్వ. ‘ఈ చిమ్మచీకట్లల్ల ఆడోళ్లం ఏం చేస్తం. ఏదచ్చినా ఏం చేయలేం. ఇగ మనకు దేవుడే దిక్కు. తెల్లారితేనే మన బతుక్కు ఏమన్న తోవ దొరుకతదేమో..’అని రాధతో పాటు సరోజ, లక్ష్మి మాట కలిపారు. రోజూ రాత్రి ఏడింటికే నిద్రపోయే ఆ నలుగురు.... ఆ రాత్రిపూట కనీసం కనురెప్ప వాల్చలేదు. ఏ దిక్కు నుంచి ఏమొస్తుందోనన్న ఆందోళనతోనే రాత్రంతా గడిపారు. తమ జీవితంలో ఇలాంటి ఓ రాత్రి వస్తుందని వారు కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. తెల్లారిన తర్వాతే వాళ్ల జీవితాలకు వెలుగొచ్చింది.అడవిలో చిక్కుకున్నారునిర్మల్ జిల్లా మామడ మండలం కప్పన్ పల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, గట్టుమీది లక్ష్మి, కంబాల లింగవ్వ, బత్తుల సరోజ అనే నలుగురు మహిళలు ఈనెల 10న తునికాకు సేకరణ కోసం అటవిప్రాంతానికి వెళ్లి దారి తప్పారు. దాదాపు 15 గంటలపాటు దట్టమైన అడవిలోనే చిక్కుకుపోయారు. రాత్రంతా భయంకరమైన చీకటిలో అటవీ జంతువుల మధ్య గడిపారు. ఆ నలుగురూ సాదాసీదా కుటుంబాలకు చెందిన మహిళలే. ఈ సీజన్ లో తునికాకు సేకరించి పెట్టుకుంటే నాలుగు పైసలు ఎక్కువొస్తయనుకునే చిన్నపాటి ఆశలున్నవాళ్లే. అందుకే ఈ నెల 10న కప్పన్ పల్లిలో రోజంతా కూలి పనులు చేసుకుని, మధ్యాహ్నం 3.30 గంటలప్రాంతంలో నలుగురు కలిసి గ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి వెళ్లారు.తునికాకు ఏరుతూ ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లిపోయారు. ఇకచాలు ఇంటికెళ్దాం అనుకునే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం వారిని కంగారు పెట్టాయి. ఇళ్లకు వెళ్లాల్సిన దారి తప్పిపోయారు. తాము ఊరివైపు కాకుండా అడవిలోనే మరోవైపు వెళ్తున్నట్లు గ్రహించారు. కానీ అప్పటికే రాత్రి ఎనిమిదైంది. నలుగురిలో ఒకరైన రాధ దగ్గర సెల్‌ఫోన్ ఉన్నా అక్కడ సిగ్నల్స్ లేవు.ఇక తప్పని పరిస్థితుల్లో రాత్రంతా చిమ్మచీకట్లో దట్టమైన అడవి ఒడిలో బిక్కుబిక్కుమంటూ మంటూ ఉండిపోయారు. మరోవైపు చీకటి పడుతున్నా తమవాళ్లు ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కంగారుపడ్డారు. సమీప అటవీప్రాంతాలన్నీ గాలించారు. ఇక లాభం లేదనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.రంగంలో పోలీసులుసమాచారం అందిన క్షణం నుంచి ఎస్పీ జానకీ షర్మిల అలర్ట్ అయ్యారు. నలుగురు మహిళలు, అదీ లోయలు, గుట్టలతో ఎలుగుబంట్లు, అడవి పందులు ఉండే దట్టమైన అడవిలో తప్పిపోవడంతో వారికేం కాకుండా వీలైనంత త్వరగా తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కొందరు గ్రామస్తులతో కలిసి బృందాలుగా వెళ్లాలంటూ తమవాళ్లకు సూచించారు. రాత్రంతా ప్రయత్నం చేసినా దట్టమైన అడవిలో మహిళల జాడను కనుక్కోలేకపోయారు.ఆ చెట్టే దిక్కనుకుని..మరోవైపు అడవిలో ఆ చీకట్లో సెల్‌ఫోన్ టార్చిలైట్ ఆన్ చేసుకుని ఆ నలుగురు చాలా దూరమే నడిచారు. అలా ఎంతసేపు నడిచినా లాభం లేదనుకుని ఓ పెద్దచెట్టును చూసుకుని దాని దగ్గరే కూర్చున్నారు. వారందరికీ ఆ చెట్టు ఆసరా ఇచ్చింది. గాలివాన రాని, ఏ జంతువూ రాని ఏమైనా కానీ పొద్దున వరకు ఈ చెట్టు దగ్గర నుంచి కదలొద్దని నిశ్చయించుకున్నారు. ఏవైనా జంతువులు వస్తే చప్పుడు చేసి చెదరగొట్టడానికి తలో కట్టె చేతిలో పట్టుకుని కూర్చున్నారు. ఒకరికొకరు పైకి ధైర్యం చెప్పుకుంటున్నారు కానీ మనసుల్లో మాత్రం ఏదో తెలియని భయం. నాలుగు గోడల మధ్య పిల్లాపాపలతో గడిపేవాళ్లకు ఆ రాత్రి ఓ నరకంలా గడిచింది. ఎప్పుడూ వినని జంతువుల చప్పుళ్లు, కళ్లు పొడుచుకుని చూసినా కానరానంత చీకట్లో కంటి మీద కునుకు లేకుండా జాగారం చేశారు.తెల్లారితేనే..ఆ నలుగురు కొన్ని గంటల వ్యవధిలో పగలు, రాత్రిని కళ్లారా చూశారు. శుక్రవారం ఉదయం తెల్లవారగానే సమీపంలో ఉన్న గుట్టపైకి వెళ్తే ఏమైనా ఊళ్లు కనిపిస్తాయేమోనన్న ఆశతో ఆ గుట్ట ఎక్కారు. కనుచూపు మేరలో ఊళ్లు కనిపించలేదు గానీ.. తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్ లో సిగ్నల్స్ కనిపించడంతో కొండంత ధైర్యం వచ్చింది. ⇒ వెంటనే తమ వాళ్లకు ఫోన్లు చేశారు. ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. తమ వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ట్రాక్టర్లను తెప్పించి అడవి లోపలికి వెళ్లారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సాయంతో వారిని చేరుకున్నారు. అయితే తిరిగి వచ్చేటప్పుడు పోలీసులు కూడా తప్పిపోయారు. ఆఖరుకు డ్రోన్‌ను ఫాలో అవుతూ గమ్యాన్ని చేరారు. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్⇒ మాకు తిండి, నీళ్లు లేవు. దారి తప్పాక అట్లనే రెండు మూడు గంటలు నడుసుకుంట అరుసుకుంటనే తిరిగినం. చివరికి నీరసంతో అరవడానికి శక్తి లేకుండా అయిపోయింది. – బత్తుల సరోజ⇒ ఇన్నేళ్లలో ఇట్లా ఎప్పుడు కాలేదు. తిరిగి వచ్చేటప్పుడు ఎట్ల దారి తప్పిపోయినమో కూడా గుర్తుకొస్తలేదు. రాత్రికి ఏమన్న జంతువులస్తయేమోనని నేను కొంచెంసేపు చెట్టెక్కి కూసున్న. ఆ రాత్రిని చూసినంక ఇగ తిరిగొస్తమనుకోలేదు. ఇప్పటికీ మనసుల నుంచి దడుకు పోతలేదు. – కంబాల లింగవ్వ -
హైదరాబాద్ చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్ నిర్వాకం
-
హిందూపురంలో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(సోమవారం) ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు బేడీలు వేసి నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైఎస్సార్సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.ధర్మవరం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలుమరో వైపు, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్న బాబ్జన్పై దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలు కాడంతో కదిరి ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో ఘటన జరిగింది. ఫోన్లో దూషించిన టీడీపీ నేతలు.. అనంతరం దాడి చేశారు. -
యువతిని వేధించి.. ఆపై పోలీస్ స్టేషన్లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్ అవార్డ్ పక్కా’
లక్నో: యువతి,యువకుడిపై అల్లరి మూకలు తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో నిందితులు తాము అనారోగ్యంతో ఉన్నామంటూ పోలీసులకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగింది?ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో అల్లరి మూకలు వీరంగం సృష్టించారు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడి అనంతరం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అదిగో అప్పుడే నిందితులు తమలోని నటులను బయటపెట్టారు. ఫిర్యాదు దారులే తమపై దాడి చేశారంటూ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. బలహీన స్థితిలో ఉన్నామంటూ నటించేందుకు ప్రయత్నించారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తూ, యాక్టింగ్ చేస్తున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వచ్చేస్తుంది కావాలంటే ట్రై చేయండి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆస్కార్ అవార్డ్ రేంజ్ యాక్టింగ్‌తో పోలీస్ స్టేషన్లో అల్లరిమూకలు చేసిన స్టంట్ మీరూ చూసేయండి. These men from UP's Muzaffarnagar misbehaved with a woman. They were caught by @Uppolice and took them to their acting class and were asked to perform in front of cameras.@Uppolice, you've become a joke! pic.twitter.com/vKLV3oxOM7— Congress Kerala (@INCKerala) April 14, 2025 -
పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగారా?తాగలేదా? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు
-
అంబేద్కర్ ఆశయాలకు తూట్లు: దళిత రైతు దారుణ హత్య.. ఏడుగురు అరెస్ట్
ప్రయాగ్‌రాజ్: అంబేద్కర్ జయింతి(Ambedkar Jayanti)కి ముందురోజు ఆ మహనీయుని ఆశయాలకు తూట్లు పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. దేశంలోని కొన్ని గ్రామాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి నేటికీ దళితులు బలవుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకున్న దళితుని హత్య కలకలం రేపుతోంది. జిల్లాలోని కర్చన తహసీల్‌లోని ఇసోటా లోహగ్పూర్ గ్రామంలో దళిత రైతు దేవీ శంకర్ (35) హత్యకు గురయ్యాడు. గ్రామానికి సమీపంలోని ఒక తోటలో అతని మృతదేహం సగం కాలిన స్థితిలో లభ్యమయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవీ శంకర్‌ను అగ్రవర్ణానికి చెందిన ఏడుగురు హత్య చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక(Postmortem report)లో దేవీప్రసాద్ ఊపిరాడక మృతిచెందినట్లు నిర్థారణ అయ్యింది. అతని శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఒక మహిళతో జరిగిన వివాదం ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ చంద్ర యాదవ్ మాట్లాడుతూ, అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నామని, స్థానికుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నామని తెలిపారు.దేవీ శంకర్ భార్య ఐదేళ్ల క్రితం మరణించగా, అతని ముగ్గురు పిల్లలు అతను కలిసివుంటున్నారు. దేవీప్రసాద్ సోదరుడు శ్యామ్‌జీ పోలీసులతో మాట్లాడుతూ తన సోదరునిపై కుట్రపన్ని హత్యచేశారని ఆరోపించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. గ్రామస్తులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి(Mayawati) ఈ హత్యను అత్యంత విచారకరం, ఆందోళనకరమని పేర్కొంటూ రాష్ట్రంలో పటిష్టమైన చట్ట వ్యవస్థను స్థాపించాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తూ సంఘటనా స్థలంలో మద్యం సీసా దొరికిందని, హత్యకు ముందు నిందితులు, బాధితుడు కలిసి మద్యం సేవించివుంటారన్నారు. నిందితులు దేవీ శంకర్‌ను ఇటుకతో కొట్టి, గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలను నాశనం చేసేందుకు, నిందితులు దేవీశంకర్ మృతదేహాన్ని దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ఆలయంలో దౌర్జన్యం.. గేటు తీయలేదని పూజరిపై దాడి -
రెడ్ బుక్ రాజ్యాంగానికి మరో 11 మంది పోలీసులు బలి
-
హనుమజ్జయంతి వేడుకల్లో ఉద్రిక్తత
గునా: మధ్యప్రదేశ్‌లోని గునాలో జరిగిన హనుమజ్జయంతి వేడుకల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. హనుమాన్ రథయాత్ర ఉత్సాహంగా సాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గునాలో శనివారం సాయంత్రం 7:30 గంటల సమయంలో హనుమాన్ రథయాత్ర ఒక ప్రార్థనా స్థలం సమీపంలో కొనసాగుతుండగా, రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న పోలీసులు , స్థానిక అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొంది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది భద్రతను కొనసాగిస్తున్నారు. మీడియాతో మాట్లాడిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ సిన్హా.. స్థానికులు ఎలాంటి వదంతులపై దృష్టి పెట్టకూడదని కోరారు. ఇది కూడా చదవండి: ఎన్ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు -
విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ?
కారేపల్లి: హత్య కేసులో విచారణ పేరుతో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని..దీంతో వృద్ధుడైన ఓ గిరిజనుడి కాలు విరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రూప్లాతండాకు చెందిన బధిరుడైన భూక్యా హరిదాస్ గత ఏడాది డిసెంబర్ 6న గ్రామంలోని జీపీ బోరు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో బావ్సింగ్తోపాటు విశ్రాంత సింగరేణి ఉద్యోగి శంకర్, హరిదాస్ కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శంకర్ ఆచూకీ పోలీసులకు లభించలేదు.ఐదు నెలల తర్వాత శుక్రవారం శంకర్‌ను అదుపులోకి తీసుకొని కామేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా శంకర్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతో ఆయన కాలు విరిగిందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆరోపించారు. అయితే వాహనంపై నుంచి కిందపడటంతో శంకర్ కాలు విరిగిందని బుకాయిస్తూ, బాధిత కుటుంబం మీడియా ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు.శంకర్‌ను చికిత్స నిమిత్తం ఖమ్మంకు, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కారేపల్లి ఎస్సై రాజారామ్‌ను వివరణ కోరగా.. శంకర్ కొద్దినెలలుగా పరారీలో ఉన్నాడని, శనివారం కనిపించడంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ క్రమంలో బైక్‌పై వేగంగా వెళుతూ కింద పడ్డాడని చెప్పారు. గాయపడిన శంకర్‌ను తమ వాహనంలోనే ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించామని పేర్కొన్నారు. థర్డ్‌డిగ్రీ ప్రయోగించినట్టు చెబుతున్న విషయంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. -
వామ్మో.. అంత ఫీజులా!
సాక్షి, హైదరాబాద్: పోలీసుల పిల్లల కోసం ప్రభుత్వం మంచిరేవులలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్)లో అడ్మిషన్లు నత్తనడకన సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలు, విద్యతోపాటు ఆటలు, ఇతర కోకరికులర్ యాక్టివిటీలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నా.. పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపటం లేదు. ఈ స్కూల్లో పోలీసుల పిల్లలకు 100 సీట్లు, సాధారణ పౌరుల పిల్లలకు 100 సీట్ల చొప్పున మొత్తం 200 సీట్లతో ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటివరకు పోలీసుల పిల్లలు 82 మంది, సాధారణ పౌరుల పిల్లలు ఐదుగురు మాత్రమే చేరారు. ప్రభుత్వ జీవోకే తూట్లు ఈ స్కూల్లో పోలీసుల పిల్లలకు వారి తల్లిదండ్రుల ర్యాంకు ఆధారంగా ఫీజులు నిర్ణయించారు. అమరవీరుల పిల్లలకు ఏడాదికి రూ.40 వేలు, హోంగార్డు నుంచి ఏఎస్సై స్థాయి వరకు రూ.50 వేలు, ఎస్సై నుంచి డీఎస్పీ వరకు రూ.95 వేలు, ఎస్పీ ఆపై ర్యాంకు అధికారుల పిల్లలకు రూ.1.4 లక్షల ఫీజు ఉంది. సాధారణ పౌరుల పిల్లలకు ఏడాదికి రూ.1.6 లక్షలుగా ఫీజు నిర్ణయించారు. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు ఉండడంతో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. సాధారణ పౌరుల పిల్లల కోటాలో ఇప్పటివరకు ఐదు సీట్లు మాత్రమే భర్తీ కావడమే ఇందుకు నిదర్శనం. ఈ స్కూల్లో అడ్మిషన్ ఫీజు రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. 2009లో ప్రభుత్వం జారీచేసిన జీవో 91 ప్రకారం అడ్మిషన్ ఫీజు రూ.5 వేలు మించరాదు. ఈ జీవో ఏ ప్రైవేటు పాఠశాలలోనూ అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన వైఐపీఎస్లోనూ ఆ జీవోను తుంగలో తొక్కటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా మ్యాజిక్ బాక్స్ పేరిట విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, ఇతర స్టేషనరీ వస్తువులు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించడం కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొంటున్నారు. అడ్మిషన్లు పూర్తికాకపోవటంతో అధిక ఫీజులపై స్కూల్ నిర్వాహకులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. స్కూల్ ప్రారంబోత్సవం సమయంలోనే ఫీజుల తగ్గింపుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించటం గమనార్హం. -
మూడు చోట్ల పాస్టర్ ప్రవీణ్ కు యాక్సిడెంట్లు అయ్యాయి
-
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సాయినగర్‌లోని శ్రీసాయిరామ్ అపార్ట్మెంట్లో స్వప్న, నవనీత అనే మహిళలు ఫ్లాట్ అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం ఫ్లాట్‌పై దాడిచేసి స్వప్న, నవనీతతో పాటు ఆకుల తనీష్ పెనుమల కళ్యాణ్బాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2,930 నగదు, 8 సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. చోరీ కేసులో నిందితుడి రిమాండ్ ఘట్కేసర్: ఓ ఇంట్లో వెండి వస్తువులు చోరీచేసిన పాత నేరస్తుడిని ఘట్కేసర్ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మేడపాటినగర్‌లో నివసించే సునీత ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వెండి వస్తువులు అపరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. పోలీసుల దర్యాప్తులో మేడపాటినగర్కు చెందిన మహమ్మద్ మొయిన్ షరీఫ్ (23)గా తేలింది. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన వస్తువులను తిరిగి స్వా«దీనం చేసుకున్నారు. అతడు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడని, పలుసార్లు జైలుకు కూడా వెళ్లొచి్చనట్లు పోలీసులు తెలిపారు. -
MLC మేరిగ మురళికి గూడూరు రూరల్ పోలీసుల నోటీసులు
-
వివాహితపై జైలర్ వేధింపుల కేసు వివరాలు వెల్లడించిన విశాఖ సీపీ
-
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేసిన రామగిరి పోలీసులు
-
పోసానిపై 111 సెక్షన్.. పోలీసులపై హైకోర్టు ఫైర్..
-
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి, సాక్షి: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూళ్లూరుపేట పోలీసులు పోసానిని విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపురి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది. సూళ్ళూరు పేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసులో విచారణ అధికారిగా ఉన్న సీఐ మురళీ కృష్ణపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను మీరి దర్యాప్తు అధికారి(IO) వ్యవహరించారని, కేసులో అదనంగా 111 సెక్షన్ పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేశారని పేర్కొంది. అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐ మురళీ కృష్ణకు ఫాం-1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 24కి పోసాని పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. -
పోసాని కృష్ణమురళీపై ఆగని కక్షసాధింపు చర్యలు
-
యంగ్ ఇండియా పోలీసు స్కూల్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పోలీసు స్కూల్ (వైఐపీఎస్) సిద్ధమైంది. దీన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, ప్రస్తుతం ఏడు ఎకరాల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ స్కూల్లో మొత్తం 200 సీట్లు ఉంటాయి. వీటిలో 100 పోలీసు అధికారులు, ఉద్యోగుల పిల్లలకు, మరో 100 సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. ప్రస్తుతానికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలు జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చిన వైఐపీఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేశారు. ఒక్కో తరగతిలో 40 మంది చొప్పున ఐదు క్లాసుల్లో కలిపి మొత్తం 200 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటి వరకు 83 మంది పోలీసు, నలుగురు సాధారణ పౌరుల పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చారు. భవిష్యత్తులో 5 వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. విద్యార్థుల కోసం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,750 పడకలతో హాస్టల్‌ను నిర్మిస్తారు.ప్రతిభగల ప్రైవేట్ టీచర్ల ఎంపికఈ స్కూల్లో పని చేయడానికి ప్రతిభ గల ప్రైవేట్ టీచర్లను ఎంపిక చేసుకున్నారు. విద్యాభ్యాసంతోపాటు విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి యంగ్ ఇండియా పోలీసు స్కూల్ (Young India Police School) కృషి చేస్తుంది. త్వరలో ఉత్తమ క్రీడా శిక్షకులను ఎంపిక చేయనున్నారు. ఏడుగురు సభ్యులతో కూడిన గవర్నింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వైఐపీఎస్ నడుస్తుంది. దీనికి రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రెసిడెంట్‌గా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) వైస్ ప్రెసిడెంట్‌గా, గ్రేహౌండ్స్ విభాగం అదనపు డీజీ ఎం.స్టీఫెన్ రవీంద్ర సెక్రటరీగా ఉంటారు. మరో నలుగురు సభ్యులు ఉన్నారు. విద్యార్థుల కోసం మూడు డిజైన్లతో కూడిన యూనిఫామ్స్ ఖరారు చేశారు.వైఐపీఎస్ నుంచి ప్రతి విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వంతో బయటకు వెళ్తాడు. అందుకే విద్య, క్రీడలతోపాటు అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పోలీసు విభాగంలో కిందిస్థాయి ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా తమ పిల్లల బాగోగుల కోసం సమయం ఇవ్వలేరు. పెద్దపెద్ద స్కూళ్లలో చేర్చాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని సీట్ల రిజర్వేషన్, ఫీజులు నిర్ధారించాం. – సీవీ ఆనంద్, పోలీసు కమిషనర్, హైదరాబాద్ -
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడికి బెయిల్
వైఎస్సార్,సాక్షి: కూటమి కుట్రలో భాగంగా అరెస్టయిన ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా బెయిల్‌పై విడుదలయ్యారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. మరో కేసులో పోలీసులు వేసిన పీటీ వారెంట్ డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది.గతంలో ఓ వివాదంలో కడప తాలూకా స్టేషన్లో అహ్మద్ భాషపై కేసు నమోదైంది. ఆ సమయంలోనే అహ్మద్ బాషా రాజీ పడ్డారు. అయితే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్న కేసులు తిరగదోడింది. కక్షపూరితంగా అహ్మద్ భాషాపై పలు సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసింది.లుక్ అవుట్ నోటీసులిచ్చి ముంబై ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేసింది. అయితే,కేసుపై బుధవారం విచారణ చేపట్టిన కడప కోర్టు అహ్మద్‌బాషాకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.కోర్టు తీర్పుతో కడప సెంట్రల్ జైలు నుంచి అహ్మద్ భాషా విడుదలయ్యారు. సెంట్రల్ జైలు వద్ద అహ్మద్ భాషాకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష,పార్టీ నాయకులు,కార్యకర్తలు స్వాగతం పలికారు. -
ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట
-
ఏకంగా పోలీసు వాహనంతోనే రీల్!
సోషల్ మీడియాలో రీల్స్ మోజులో విచక్షణ మర్చిపోతున్నారు. కంటెంట్ కోసం, వ్యూస్ కోసం వాళ్లు సృష్టించా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఒక పిచ్చి పనికి లక్షల కొద్దీ వ్యూస్ రావడంతో ఇక అందరూ అదే బాటపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ ఈ రీల్స్ పురాణం చాలా పెద్దదే. తాజాగా నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు యువకులు పోస్ట్ చేసిన రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్‌తోనే రీల్స్ చేశారా యువకులు. ఇద్దరు యువకులు పోలీసు వాహనం నడుపుతూ.. రీల్స్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వివాదా స్పద మయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంటలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాలోని ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇన్నోవా టీఎస్ 09 పీఏ 4622 వాహనాన్ని మంగళవారం ఇద్దరు యువకులు నడుపుతూ రీల్స్ చేశారు. ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ అధికారి బంధువులే.. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన రీల్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. -
‘కిరణ్ రాయల్‌పై చర్యలేవి’
సాక్షి,విశాఖ: పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటే హోంమంత్రి అనిత ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తట్టడానికి అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి సమయం ఉంటుంది. కానీ కామాంధులు చేతిలో బలైన బాధితులను పరామర్శించేందుకు సమయం ఉండదు.సొంతం నియోజకవర్గంలో మహిళపై దాడులు జరిగితే హోం మంత్రి అరికట్ట లేకపోయారు.పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటే అనితకు ఉలికెందుకు. వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. క్రిమినల్ అని ఎన్టీఆర్ ఎవరిని అన్నారో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు.ఐఏఎస్ అధికారులను పేరు పెట్టి తిట్టిన ఘనత చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది. ఐపీఎస్ అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర టీడీపీ నేతలది. దళిత ఐఏఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం వేధిస్తోంది.మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. ఎమ్మెల్యే ఆదిమూలం, కిరణ్ రాయల్ మహిళలను వేధిస్తే మీరు ఏం చర్యలు తీసుకున్నారు’ అని కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. -
ఏపీ పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్..
-
మోహన్ బాబు ఫ్యామిలీలో మళ్లీ వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం మొదలైంది. ఆయన కుమారుడు, హీరో మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తాను లేని సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురి బర్త్ డేకు రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు తన వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. జల్పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.గతంలోనూ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన తర్వాత వరుసగా కేసులు నమోదయ్యాయి. మంచు విష్ణు, మనోజ్‌కు మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సైతం వీరి మధ్య గొడవ మొదలైంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలోనే మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్లో మరోసారి చర్చ మొదలైంది. -
వడ్డీతో సహా తిరిగిస్తాం గుర్తుపెట్టుకోండి, ఏపీ పోలీసులకి జగన్ వార్నింగ్..
-
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు. .. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా బాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్ జగన్ ఘాటుగానే హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరీ ఇంతటి ఘోరాలా? ప్రజల్లారా.. ఆలోచించుకోండి -
ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై కత్తితో దాడి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో మరో దారుణం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న నడిరోడ్డుపై 19 ఏళ్ల యువతిపై కత్తితో ఒక వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది.ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాడికి పాల్పడిన నిందితుడు గతంలో బాధితురాలికి పరిచయం అయిన వ్యక్తి అయివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని సేకరించడంతోపాటు స్థానికులను విచారిస్తున్నారు.ఈ ఘటన ఢిల్లీలో మహిళల భద్రత(Women's safety)పై మరోసారి అనుమానాలను లేవనెత్తింది. ఈ ఘటన దరిమిలా సామాజిక మాధ్యమాల్లో ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆమె చికిత్స పొందుతోందని తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా -
ఆట నేర్పడు.. బాలికలతో ఆడుకుంటాడు
కర్ణాటక: ఓ క్రీడా శిక్షకుడు కామాంధునిగా మారి కటకటాలు లెక్కిస్తున్నాడు. మైనర్ బాలికపై దారుణానికి పాల్పడిన కేసులో బ్యాడ్మింటన్ కోచ్‌ను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితడు సురేశ్ బాలాజీ (26), వివరాలు.. ఇటీవలే టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన బాలిక సెలవులు రావడంతో హుళిమావులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలిక 2 ఏళ్లుగా సురేశ్ బాలాజీ అనే బ్యాడ్మింటన్ కోచ్ వద్ద ఆట నేర్చుకుంటోంది. తమిళనాడుకు చెందిన ఇతడు బెంగళూరులో స్థిరపడ్డాడు. ఆట నేర్పించే నెపంతో అతడు బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడేవాడు, ఎవరికై నా చెబితే హత్య చేస్తానని బెదిరించేవాడు.ఇలా గుట్టురట్టుఇటీవల బాలిక అమ్మమ్మ మొబైల్ ద్వారా నిందితునికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపుతోంది. అమ్మమ్మ గమనించి బాలికను నిలదీయడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని అరెస్టు చేశారు. అతని మొబైల్ఫోన్ని పోలీసులు తనిఖీ చేయగా 8 మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. దీంతో వారి మీద కూడా అత్యాచారాలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కోచ్ తనను కనీసం 25 సార్లు అతని గదికి తీసుకెళ్లాడని బాలిక విచారణలో తెలిపింది. బాలికల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఇతడు దురాగతాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుని విచారణలో మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది. -
MMTS Train: రైల్వే భద్రత కట్టుదిట్టం!
సికింద్రాబాద్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటన రైల్వే పోలీసుల డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. ఘటన జరిగి 15 రోజులు గడిచినా ఈ కేసు మిస్టరీ వీడనేలేదు. అధునాతన సాంకేతికతను సొంతం చేసుకున్నామంటూ గొప్పలు చెప్పే నగర పోలీసులు.. అత్యాచార యత్నం కేసు గుట్టు విప్పలేకపోయారు. కాగా.. ఈ ఘటన రైల్వే పోలీసులకు కనువిప్పు కలిగించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఇటు జీఆర్పీ, అటు ఆర్పీఎఫ్ పోలీసు బాస్‌లు మహిళలే ఉండడంతో ఎంఎంటీఎస్ రైళ్లు, రైల్వేస్టేషన్లలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తనపై లైంగిక దాడికి యత్నించడంతో ఓ యువతి బోగీ నుంచి కిందకు దూకిన ఘటనతో ఎంఎంటీఎస్ రైళ్లలో నిరంతర పోలీసు భద్రత అందుబాటులోకి వచి్చంది. ఉదయం 5 మొదలు అర్ధరాత్రి 12 గంటల వరకు రైల్వే పోలీసులు ఎంఎంటీఎస్ రైళ్లలో పహారా కాసేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని అన్ని మార్గాల్లో రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ రైళ్లలో ఒక్కో రైలుకు ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసిన ఆర్పీఎఫ్ ఆఫీసర్లు ఏ రూటు ఎంఎంటీఎస్‌లో ఎవరు డ్యూటీలో ఉన్నారు? ఆ రైలులో మహిళల బోగీల పరిస్థితి ఏంటన్న విషయాన్ని వీడియో కాల్స్, ఫోటోల పోస్టింగ్‌ల ద్వారా ఆరా తీస్తున్నారు. రైలు బోగీల్లో సీసీ కెమెరాలు.. నగరంలో నడుస్తున్న నాలుగైదు ఎంఎంటీఎస్ రైళ్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సత్వరమే అన్ని ఎంఎంటీఎస్‌లలోని మహిళల బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు. మహిళలు వారికి కేటాయించిన బోగీల్లో మాత్రమే ఎక్కాలని అవగాహన కలిగిస్తున్నారు. స్టేషన్లలో భద్రత పెంపు.. 30 స్టేషన్ల నుంచి సుమారు 92 వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 40 నుంచి 60 వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్టు అంచనా. అత్యాచార ఘటనకు ముందు కేవలం 9 ఎంఎంటీఎస్ స్టేషన్లలో మాత్రమే ఒక్కో స్టేషన్లో ఒక్కో కానిస్టేబుల్ చొప్పున విధుల్లో ఉండేవారు. ఘటన అనంతరం ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే 15 రైల్వేస్టేషన్లలో ఆర్పీఎఫ్ పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్ పోలీసుల్లో కూడా సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో జీఆర్పీ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమేణా అన్ని స్టేషన్లలో పోలీసు పహారా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో రైల్వే పోలీసులు తీసుకుంటున్న రక్షణ చర్యల పట్ల మహిళా ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైలు బోగీల్లోనే కాకుండా ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ భద్రత పెంచాలని చెబుతున్నారు. ఇది నిరంతర కొనసాగించాలని కోరుతున్నారు.ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం రైల్వే ప్రయాణికులకు రక్షణ కలి్పంచడం కోసం ప్రత్యేక మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని జీఆర్పీ సికింద్రాబాద్ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. మహిళలు ప్రమాదకర పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో 139 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు ఒక్కో రైలుకు ఇద్దరేసి గార్డులను ఎస్కార్టు డ్యూటీలో నియమించామని ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యురిటీ ఆఫీసర్ దేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు. -
నేను డీఎస్పీని..పదండి పోలీస్‌స్టేషన్‌కు..
హైదరాబాద్: నంబర్ ప్లేట్ లేని కారుకు పోలీస్ స్టిక్కర్ తగిలించుకుని వెళ్లిన ఆగంతకులు గదిలో ఉన్న ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన యువకులను కిడ్నాప్ చేసి అచ్చంపేటకు తీసుకువెళ్లి చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి కిషోర్‌రెడ్డి టీవీ నటులు ఇంద్రాణి, మేఘనలకు పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. టీవీ సీరియళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తున్న సందీప్‌రెడ్డి, ఓ తెలుగు ఛానల్లో కాస్ట్యూమర్‌గా పనిచేస్తున్న పల్లె శివ ముగ్గురూ కలిసి శ్రీకృష్ణానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. అచ్చంపేట సమీపంలోని బీకే ఉప్పనూతల గ్రామానికి చెందిన శివ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు సోహెల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గురువారం రాత్రి కిషోర్‌రెడ్డి గదికి వచ్చారు. తాము పోలీసులమని, శివ ఆచూకీ చెప్పాలని అతడిని చితకబాదారు. తమకు ఏమీ తెలియదని చెప్పినా వినిపించుకోకపోగా, తాము పోలీసులమంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పదండి అంటూ కిషోర్, సందీప్‌లను కారులో ఎక్కించుకుని తక్కుగూడకు తీసుకెళ్లి మళ్లీ కొట్టి, ఫోన్లు లాక్కున్నారు. అక్కడి నుంచి ఉప్పనూతల గ్రామానికి తీసుకెళ్లడంతో అప్పటికే అక్కడ అప్పటికే రెండు కార్లలో సిద్ధంగా ఉన్న మరో 10 మంది యువకులతో కలిసి వారిని మరోసారి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. టీవీ నటి ఇంద్రాణికి కిషోర్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించింది. బాధితులు కూడా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయాన్ని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసుల నగరానికి తిరిగి వచ్చిన కిషోర్, సందీప్ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోహెల్, ఇబ్బూతో పాటు ప్రియురాలి పెదనాన్న, వారి బంధుమిత్రులపై కేసు నమోదు చేశారు. కిషోర్, సందీప్‌లను కిడ్నాప్ చేసింది నకిలీ పోలీసులని తేల్చారు. అమ్మాయి అడ్రస్ కనుక్కునేందుకు వారిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. పోలీసుల కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు సీఎస్ నివేదిక ఇచ్చారు. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికపై సమావేశంలో చర్చించారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రజా సంఘాలతో భేటీ తర్వాత పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ భూ వివాదంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకుండా స్టే విధించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల అంశాన్ని అమికస్ క్యూరీ పరమేశ్వర్ గురువారం ఉదయం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం.. వారాంతం సెలవులను సద్విని యోగం చేసుకుని అధికారులు చెట్లను నరికివేయడంలో తొందరపడ్డారని అభిప్రాయపడింది. -
ఇన్‌స్టా క్వీన్.. ఉద్యోగం ఊడింది
సోషల్ మీడియాలో ఇన్‌స్టా క్వీన్(Insta Queen)గా పేరున్న సీనియర్ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ను పంజాబ్ పోలీస్ శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాదు.. ఇంతకాలం ఆమె విలాసాలకు కారణం ఏంటన్న గుట్టు కూడా ఎట్టకేలకు వీడింది. పంజాబ్‌లో మాదకద్రవ్యాల కట్టడికి అక్కడి ఆప్ ప్రభుత్వం యుధ్ నాశేయన్ విరుధ్ డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో పక్కా సమాచారంతో.. బాదల్ ఫ్లైఓవర్ వైపు వేగంగా వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అందులో మరో వ్యక్తితో పాటు అమన్‌దీప్ కౌర్(Amandeep Kaur) కూడా ఉండగా.. వాళ్ల వద్ద 17 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రాథమిక చర్యల కింద మాన్సా పీఎస్ నుంచి బథిండా పోలీస్ లైన్స్‌కు ఎటాచ్ చేశారు. View this post on Instagram A post shared by Kaur deep (@police_kaurdeep) అయితే.. దర్యాప్తులో డ్రగ్స్ రవాణాలో ఆమె పాత్ర ఉందని తేలడంతో గురువారం డిస్మిస్ చేస్తూ పంజాబ్ పోలీస్ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. police_kaurdeep పేరిట ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంది. థార్ కారులో కూర్చుని.. ఖరీదైన వాచీలను ధరించి పాటలు పాడుతూ ఐఫోన్లలో రీల్స్ చేస్తూ వస్తోంది. ఫాలోవర్స్ తక్కువే అయినా ఆమె ఇచ్చే బిల్డప్లకు ఇన్‌స్టా క్వీన్‌గా ఆమెకు ఓ పేరు అయితే ముద్రపడింది. అయితే.. View this post on Instagram A post shared by Kaur deep (@police_kaurdeep) అమన్‌దీప్ కౌర్ ఇంతకు ముందు కూడా వార్తల్లోకి ఎక్కారు. గుర్మీత్ కౌర్ అనే మహిళ ఆమెపై గతంలో సంచలన ఆరోపణలు చేసింది. అమన్‌దీప్ దగ్గర రూ.2 కోట్ల విలువైన బంగ్లా.. లక్షలు విలువ చేసే ఖరీదైన వాచీలు, కార్లు ఉన్నాయని ఆరోపించింది. ఆంబులెన్స్ డ్రైవర్ అయిన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ ఆంబులెన్స్‌లోనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోందని ఫేస్బుక్లో ఆరోపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే అప్పట్లో ఆ ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరికి రవాణా చేశారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. -
పరిధి దాటొద్దని పోలీసులను హెచ్చరించిన సుప్రీం కోర్టు
-
పోలీసు పహారాలో హెచ్‌సీయూ
గచ్చిబౌలి/రాయదుర్గం: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ అట్టుడుకిపోతోంది. క్యాంపస్ మొత్తం పోలీసు పహారాలో ఉంది. మరోవైపు ఆందోలనలు కొనసాగిస్తున్న విద్యార్థులు, మంగళవారం నుంచి పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టబోమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు..క్యాంపస్‌లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.ప్రధాన రహదారి నుంచి క్యాంపస్ ప్రధాన ద్వారం వరకు స్టాపర్స్ అమర్చారు. ప్రధాన ద్వారం వద్ద యూనివర్సిటీ హస్టళ్ల ముందు గచ్చిబౌలి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ బందోబస్తును మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల రిమాండ్ పనులను అడ్డుకోవడం, తోపులాటకు దిగడంతో పోలీసు అధికారికి గాయాలయ్యాయంటూ టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు హెచ్సీయూకు చెందిన ఇద్దరు పీహెచ్‌డి విద్యార్థులపై కేసు నమోదు చేశారు. పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, హెచ్‌సీయూ స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్ఎఫ్ఐ) ఎర్రం నవీన్, కంప్యూటర్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, ఏబీవీపీ నాయకులు రోహిత్ బొండుగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించారు. వీరిపై బీఎన్ఎస్ 329 (3), 118(1), 132, 191(3), 351(3), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేటి నుంచి తరగతుల బహిష్కరణ హెచ్‌సీయూలో భూముల పరిరక్షణ కోసం మంగళవారం నుంచి తరగతులు బహిష్కరించి క్యాంపస్ లోని పరిపాలనా భవనం ముందు నిరవధిక నిరసన చేపట్టాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపునకు ఏఐఎస్ఏ, ఏఐఓబీసీఎస్ఏ, ఏఎస్ఏ, బీఎస్ఎఫ్, డీఎస్‌యూ, ఫ్రటర్నిటీ, ఎంఎస్ఎఫ్, పీ డీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఎస్ఐఓ, టీఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం శవయాత్ర హెచ్‌సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో సోమవారం సాయంత్రం రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి శవయాత్రను నిర్వహించారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలీసు ఆంక్షల నడుమ.. లింగమయ్య అంత్యక్రియలు
సాక్షి, పుట్టపర్తి/రామగిరి: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య (58) అంత్యక్రియలను పోలీసుల ఆంక్షల నడుమ ఆయన స్వగ్రామంలో సోమవారం నిర్వహించారు. పాపిరెడ్డిపల్లిలో స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు రమేష్, సురేష్, వారి కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో లింగమయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు, కురుబ సంఘం నాయకులు ఆస్పత్రి వద్దకు వెళ్లి లింగమయ్య మృతదేహానికి నివాళులర్పించారు. పోలీసు బందోబస్తుతో మృతదేహం తరలింపు పోస్టుమార్టం అనంతరం లింగమయ్య మృతదేహాన్ని పోలీస్ బందోబస్తు మధ్య ఆయన స్వగ్రామం పాపిరెడ్డిపల్లికి తరలించారు. అనంతపురం నుంచి రామగిరి వెళ్లే మార్గంలోని రాప్తాడు, ఎన్ఎస్ గేట్, చెన్నేకొత్తపల్లి సర్కిళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. మృతుడి కుటుంబ సభ్యులను మాత్రమే పాపిరెడ్డిపల్లికి వెళ్లేలా అనుమతించారు. లింగమయ్య మృతదేహం గ్రామానికి చేరిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని వెంటనే శ్మశానవాటికకు తరలింపజేశారు. మృతుడి భార్య రామాంజినమ్మ, కుమారులు మనోహర్, శ్రీనివాసులు, వారి కుటుంబ సభ్యుల చేత అంత్యక్రియలు త్వరత్వరగా పూర్తి చేయించారు. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అనంతపురంలోని ఆయన ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని శ్రీ సత్యసాయి జిల్లాలోకి రాకుండా పోలీసులు కాపు కాశారు. దీంతో కేవలం మృతుడి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచి్చంది. హత్య చేయించి.. పరామర్శకు వస్తారా?టీడీపీ ఎంపీ బీకే పార్థసారథిపై కురుబ లింగమయ్య తనయుడు మనోహర్ ఆగ్రహం ‘పరిటాల సునీత మా నాన్నను హత్య చేయించారు. మీ (టీడీపీ) పార్టీ వాళ్లే హత్య చేయిస్తే... ఖండించకుండా పరామర్శకు ఎలా వస్తారు?’ అని హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథిని కురుబ లింగమయ్య కుమారుడు మనోహర్ నిలదీశారు. కురుబ లింగమయ్య మృతదేహాన్ని సోమవారం అనంతపురం నుంచి పాపిరెడ్డిపల్లికి తీసుకువెళుతుండగా మార్గంమధ్యలో ఎంపీ బీకే పార్థసారథి పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రిని హత్య చేసిన, చేయించిన టీడీపీలో ఉన్న పార్థసారథి తమను పరామర్శించేందుకు ఎలా వస్తారని మనోహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిటాల సునీత నుంచి మాకు హాని ఉందిమాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కురుబ మనోహర్ కోరారు. బీసీ కులాలకు చెందిన వారెవరూ రాజకీయంగా ఎదగకూడదన్న ఉద్దేశంతో పరిటాల కుటుంబం ఉందని చెప్పారు. అందువల్లే వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న తమతో పరిటాల బంధువులు లేనిపోని గొడవలకు దిగి.. తన తండ్రిని హత్య చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. -
హెచ్‌సీయూ రణరంగం
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం ఉగాది రోజున జేసీబీలతో వందల సంఖ్యలో పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి భూములను చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసి వందలమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో అందరినీ ఈడ్చుకెళ్లి లారీల్లో పడేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. అరుపులు.. కేకలు.. అరెస్టులు ఆదివారం సెలవు దినం, ఉగాది పర్వదినం కూడా కావటంతో క్యాంపస్‌లో ఉదయం వాతావరణం ప్రశాంతంగానే మొదలైంది. కొద్ది సేపటికే పోలీసులు తండోప తండాలుగా వచ్చి క్యాంపస్‌లోని అన్ని అంతర్గత రోడ్లను ఆ«దీనంలోకి తీసుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. వర్సిటీ ప్రహరీ లోపలి భూములను జేసీబీలతో చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసిన విద్యార్థులు రోడ్లపైకి దూసుకొచ్చారు.దీంతో పోలీసులకు, విద్యార్థులకు తోపులా జరిగింది. విద్యార్థుల నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. పోలీసులు ఏమాత్రం ఉపేక్షించకుండా కనిపించిన విద్యార్థిని కనిపించినట్లే వాహనాల్లోకి ఎక్కించి మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థినులను కూడా ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లలో పడేశారు. మొత్తం 52 మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళికతో హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని విక్రయించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతకాలంగాక్యాంపస్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసనను అణచివేసేందుకు ప్రభుత్వం కూడా పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నట్లు ఆదివారం నాటి ఘటనను బట్టి తెలుస్తోంది. శనివారం రాత్రి నుంచే పోలీసులు క్యాంపస్‌లో కొద్దిమొత్తంలో మకాం వేశారు. ఆదివారం ఉగాది సందర్భంగా చాలామంది విద్యార్థులు స్వగృహాలకు వెళ్లే అవకాశం ఉందని గురించి క్యాంపస్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లోకి బయటి వారు రాకుండా ముందు జాగ్రత్తగా మెయిన్ గేటుకు తాళం వేశారు. లోపలివారిని బయటకు కూడా వెళ్లనీయలేదు. శనివారం రాత్రే విద్యార్థులకు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో చాలామంది గాయపడ్డారు. గతంలో ఎన్నడూ లేని«విధంగా హెచ్‌సీయూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
2023-24లో శభాష్... పోలీస్
సాక్షి, అమరావతి: అమ్మో...! పోలీస్...! అని ప్రస్తుతం రాష్ట్రం హడలెత్తిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెడ్‌బుక్ కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు సాగిస్తున్న అరాచకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, పోలీసు స్టేషన్లో చిత్రహింసలు... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వసాధారణ దృశ్యాలు అయిపోయాయి. కానీ, ఇదంతా ఈ 10 నెలల్లో రాష్ట్ర పోలీసు శాఖ ఒంటికి పూసుకున్న కళంకం.ఏడాది క్రితం వరకు ఏపీ పోలీసు శాఖ పనితీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. శభాష్... ఏపీ పోలీస్... అని జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందిందని ‘సెంటర్ ఫర్ ద స్డడీ డెవలపింగ్ సొసైటీ’ (సీఎస్డీఎస్) సర్వే వెల్లడించింది. కామన్ కాజ్ సంస్థతో కలసి లోక్‌నీతి సంస్థకు చెందిన సీఎస్డీఎస్ దేశంలో పోలీసుల పనితీరుపై సమగ్ర సర్వే నిర్వహించింది. 2023–24లో దేశంలో 17 ప్రధాన రాష్ట్రాల్లో పోలీసుల పనితీరుపై నిర్వహించిన సర్వే నివేదికను ‘ద స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2025’ అనే పేరుతో తాజాగా వెల్లడించింది. పోలీసు విధులు సక్రమంగా నిర్వహించడంలో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆ నివేదిక పేర్కొనడం విశేషం.అదీ పోలీసింగ్ అంటే..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ చట్టానికి లోబడి సమర్థంగా విధులు నిర్వర్తించింది. ప్రధానంగా ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిబంధనల మేరకు అరెస్టులు, అల్లర్లను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు అత్యంత మెరుగైన పనితీరును కనబరిచారని సీఎస్డీఎస్ సంస్థ సర్వే వెల్లడించింది. దేశంలో అత్యంత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేరళ పోలీసు శాఖ మొదటిస్థానం సాధించగా... చివరి మూడు స్థానాల్లో బిహార్(15), కర్ణాటక(16), జార్ఖండ్(17) నిలిచాయి.అప్పుడు నిబంధనల మేరకే అరెస్టులు..⇒ బాధితుల ఫిర్యాదులపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు స్పందన మెరుగ్గా ఉండేదని సీఎస్డీఎస్ సర్వే నివేదిక వెల్లడించింది.⇒ ఫిర్యాదు రాగానే సత్వరం స్పందించి తగిన చర్యలు చేపట్టేవారు. అదే సమయంలో నిందితులను అరెస్టు చేయడంలోనూ నిబంధనలను అతిక్రమించకుండా చట్టానికి లోబడే వ్యవహరించేవారని ఆ సర్వే స్పష్టం చేసింది.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిందితులను అరెస్టు చేయడంలో ఎల్లప్పుడూ కచ్చితంగా నిబంధనలను పాటించేవారని 57శాతం మంది చెప్పారని ఆ సర్వే వెల్లడించింది. తద్వారా రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిందితులను అరెస్టులు చేయడంలో పోలీసులు నిబంధనల మేరకు వ్యవహరించేవారని తేల్చి చెప్పారు. అందుకే ఉత్తమ పోలీసింగ్‌లో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.⇒ 2023–24లో అత్యధికంగా 32% అరెస్టులు దొంగతనాలు, దోపిడీ కేసులకు సంబంధించినవే ఉన్నాయి. అరెస్టుల్లో 17% మహిళలపై నేరాల కేసుల్లో, 12% అల్లర్ల కేసుల్లో, 12%హత్యలు, దాడుల కేసుల్లో, 4%పబ్లిక్ న్యూసెన్స్ కేసుల్లో చేశారు. అంటే దాదాపు అన్ని అరెస్టులు కూడా సరైన కేసుల్లోనే చేశారని నివేదిక పేర్కొంది. అక్రమ కేసులతో వేదింపులకు పాల్పడేవారు కాదని స్పష్టంగా తెలిపింది.⇒ ఆందోళనలు, ధర్నాల విషయంలో 51% కేసుల్లో పోలీసులు సంయమనం పాటించారని కూడా వెల్లడించింది. చిన్నచిన్న సంఘటనలకు కేసుల్లో కౌన్సిలింగ్ ద్వారానే 49% కేసులను పరిష్కరించారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసుల సెల్యూట్
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలిని ఎత్తుకెళ్లిన టీడీపీ నేతలను వదిలేసి.. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ కీలక నేతలపై ఎస్సైతో కేసు పెట్టించడం చర్చనీయాంశమైంది. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక రోజున వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు భారతిని టీడీపీ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారు.టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకపోగా.. చివరకు పోలీసులతోనే ఫిర్యాదు చేయించి వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఓ దళిత మహిళను టీడీపీ నేతలు కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశి్నంచిన వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఎస్ఐ ఫిర్యాదుతో.. ఉప ఎన్నిక రోజున వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బాగేపల్లి టోల్‌ప్లాజా నుంచి రామగిరి తీసుకెళ్లాల్సిన పోలీసులు.. మార్గంమధ్యలోని చెన్నేకొత్తపల్లి నుంచి తిరుగు పయనమయ్యారు. ఎంపీటీసీ సభ్యులను సకాలంలో సమావేశ మందిరానికి తీసుకురాలేకపోవడానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కారణమంటూ చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుకొండలో కిడ్నాప్‌నకు గురైన ఎంపీటీసీ సభ్యురాలు రామగిరిలోనే తప్పిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి ఎస్సై ఫిర్యాదు మేరకు పెనుకొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. 25 మందిపై ఎఫ్ఐఆర్ శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి సహా రాప్తాడుకు చెందిన శేఖర్, మరూరు వెంకటేశ్, డోలా రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, యలక్కుంట్ల అమర్నాథ్రెడ్డి, నరసింహారెడ్డి, కురుబ నాగిరెడ్డి, రామాంజినేయులు, ఓబుగారి హరినాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మీనుగ నాగరాజు, బాబురెడ్డి, ఎం.గోవిందరెడ్డి, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, మాధవరాజు, రఘునాథరెడ్డి, సుబ్బిరెడ్డి, ఎస్టీడీ శ్రీనివాసరెడ్డి, నీరుగంటి నరసింహులు, చీమల కేశవయ్య, ఎస్.రవీంద్రరెడ్డిపై కేసు నమోదు చేశారు. వీరందరిపైనా బీఎన్ఎస్ సెక్షన్లు 192, 132, 125, 351 (2), 79, 223 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ ఎస్పీ ఎదుట 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఆరుగురిపై రూ.8లక్షల, 13మందిపై రూ.68లక్షల రివార్డ్ ఉంది.మావోయిస్టు సిద్ధాంతాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకువడం, వారి సీనియర్ కేడర్ స్థానిక గిరిజనుల్ని దోచుకోవడం, అంతర్గత విభేదాల కారణంగా లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి పునరావసం కల్పిస్తామని చెప్పారు.అయితే, మార్చి 31, 2026లోపు నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఆ దిశగా మావోయిస్టులను ఏరిపారేస్తుంది. శనివారం శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలు రెండు ప్రాంతాల్లో జరిపిన ఎదురుకాల్పుల్లో 18 మావోయిస్టులను మట్టుబెట్టాయి. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఆ భారీ ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలో మావోయిస్టులు లొంగిపోయారు.#Chhattisgarh: 50 Maoists have surrendered in Bijapur district. Out of these, 13 Maoists had a reward of Rs. 68 lakhs declared on their heads.For the first time in the state, such a large number of Maoists have surrendered together.Bijapur district's Superintendent of Police… pic.twitter.com/aAfakC1FJA— All India Radio News (@airnewsalerts) March 30, 2025కాగా,ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 134 మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. వీరిలో 118 మంది బస్తర్ డివిజన్‌లోనే మృతి చెందారు.2024లో, బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో కలిపి మొత్తం 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. -
ఏపీ పోలీసులకు హైకోర్టు మొట్టికాయలు
-
రెండేళ్ల తరువాత కేసు నమోదు చేయడమేంటి!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి విస్మయం వ్యక్తం చేసింది. 2023లో ఘటన జరిగితే.. రెండేళ్ల తరువాత ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయడమేకాక నిందితులంటూ ఇద్దరు వ్యక్తులను ఇప్పుడు అదుపులోకి తీసుకోవడాన్ని కూడా ప్రశ్నించింది. రెండేళ్ల తరువాత ఫిర్యాదుదారు ఇప్పుడే మేల్కొన్నారా? అని ప్రశ్నించింది. అసలేం జరుగుతోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అదుపులోకి తీసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు చింతపల్లి అల్లా భక్షు, చింతపల్లి అలియాస్ సత్తెనపల్లి పెద్ద సైదాను ఆదివారం ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేంత వరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్‌లో ఉంచాలని పల్నాడు జిల్లా మాచవరం పోలీసులను ఆదేశించింది. ఆదివారం ఉదయం వరకు వారిద్దరూ సీసీ కెమెరాలో కనిపిస్తూనే ఉండేలా చూడాలని తేల్చిచెప్పింది. ఒకవేళ మాచవరం పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోయినా, అవి పనిచేయకపోయినా అల్లా భక్షు, పెద్ద సైదాను సమీపంలో సీసీ కెమెరాలున్న మరో పోలీస్ స్టేషన్లో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం శనివారం రాత్రి 10 గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది.అక్రమ నిర్బంధంపై ‘హెబియస్ కార్పస్’ తన కుమారుడు చింతపల్లి అలియాస్ సత్తెనపల్లి పెద్ద సైదాను, తన మేనల్లుడు చింతపల్లి అల్లా భక్షును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన షేక్ చింతపల్లి నన్నే, గుంటూరు జానీబాషా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. శనివారం వీరిద్దరూ అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది.పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సార్వత్రిక ఎన్నికల తరువాత పెద్ద సైదా, అల్లా భక్షు గ్రామం విడిచి బయట ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరితో పాటు చాలామంది ప్రజలు సైతం గ్రామం విడిచివెళ్లారన్నారు. తెలంగాణలో ఉన్న సైదా, అల్లా భక్షును అకస్మాత్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వీరిద్దరి అరెస్ట్ గురించి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. వారి ఆచూకీ కూడా చెప్పడం లేదని వివరించారు. ఓ ప్రైవేటు ఎస్టేట్‌లో పెద్ద సైదాను, అల్లా భక్షును దాచేపల్లి పోలీసులు నిర్బంధించినట్టు తమకు తెలిసిందన్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా ఇలా నిర్బంధించడం చట్ట విరుద్ధమన్నారు.2023లో ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేశాం: ఎస్జీపీపోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. నిందితులిద్దరూ తీవ్ర నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. వీరిపై మాచవరం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారన్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో వారిని అరెస్ట్ చేశారన్నారు. ఆదివారం ఉదయం వారిని పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరుస్తారని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వారిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు విష్ణుతేజ సమాధానం ఇవ్వలేదు. అసలు ఘటన ఎప్పుడు జరిగిందని ధర్మాసనం తిరిగి ప్రశ్నించింది. 17.5.2023న ఘటన జరిగిందని విష్ణుతేజ చెప్పారు. దీనిపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రెండేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేశారా? అంటూ అమితాశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేమిటని, అసలు ఏం జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిర్యాదుదారు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకుంటే తాము చేయగలిగిందేమీ లేదని విష్ణుతేజ చెప్పగా.. రెండేళ్ల తరువాత ఫిర్యాదుదారు ఆకస్మాత్తుగా మేల్కొన్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
వైఎస్సార్సీపీ నాయకుడు అక్రమ అరెస్ట్
నర్సరావుపేట: పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు తెలంగాణలో తలదాచుకున్నా పోలీసులు వదలడం లేదు. టీడీపీ నేతలు చెప్పినట్లుగా వెంటాడి వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండల వైస్ ఎంపీపీ కుమారుడు, పిన్నెల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు చింతపల్లి జానీబేగం భర్త, వైఎస్సార్సీపీ మండల నాయకుడు పెద్ద సైదాను తెలంగాణ రాష్ట్రం మల్లారెడ్డిగూడెంలో శనివారం దాచేపల్లి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినట్లు ఆయన బంధువులు తెలిపారు. ఈ సందర్భంగా మాచవరం వైస్ ఎంపీపీ, సైదా తండ్రి చింతపల్లి నన్నే మాట్లాడుతూ ఉదయం ఓ ప్రైవేటు వాహనంలో దాచేపల్లి సీఐతోపాటు మరికొందరు పోలీసులు మల్లారెడ్డిగూడెంలోని తాము ఉంటున్న ఇంటి వద్దకు వచ్చారని చెప్పారు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉండి ఇంట్లో నిద్రిస్తున్న తన కుమారుడు సైదాను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు స్పందించి తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలని నన్నే కోరారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అల్లాభక్షును కూడా అరెస్ట్ చేశారు.మాజీ సీఎం జగన్‌ను కలిశారనే అక్కసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిన్నెల్లి గ్రామంలో టీడీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని విధ్వంసానికి పాల్పడ్డారు. అనేకమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో గ్రామాన్ని విడిచి వందలాది కుటుంబాలు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలను, గ్రామంలో జరుగుతున్న అరాచకాలను, అక్రమాలను, దౌర్జన్యాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చట్టపరమైన అనుమతులతో ఏప్రిల్ నెలలో ‘చలో పిన్నెల్లి’ కార్యక్రమం చేపట్టి వైఎస్సార్సీపీ సానుభూతిపరులను తిరిగి గ్రామంలోకి తీసుకొచ్చే బాధ్యతను వైఎస్ జగన్ తీసుకున్నారనే విషయం తెలిసి... ఎలాగైనా వారు రాకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతోనే టీడీపీ నాయకులు మళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 శ్రవణ్ రావుకు పోలీసుల నోటీసులు
-
తిరుపతి పోలీసులపై మోహిత్ రెడ్డి ఫైర్
-
పోలీసులపై సీదిరి అప్పలరాజు ఫైర్
-
Vishnu Priya: విష్ణు ప్రియకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్నే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటి విష్ణు ప్రియాకు (Vishnupriya) భారీ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.బెట్టింగ్ యాప్స్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణు ప్రియకు ముందుస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖులపై కేసులుబెట్టింగ్ యాప్ వివాదంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. విచారిస్తున్నారు. వారిలో విష్ణు ప్రియా సైతం ఉన్నారు. అయితే ఈ వివాదంలో నటి విష్ణుప్రియ మార్చి 20 పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.ఈ తరుణంలో విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుస్తు బెయిల్ కావాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ రోజు ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి మరియు దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ కేసులో పోలీసులతో సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు సూచించింది. చట్టబద్ధంగా దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
నాకు ప్రాణహాని ఉంది..
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి తెలిపింది. మంచిర్యాల జిల్లాకు చెందిన అఘోరితో కలిసి ఆమె మంగళవారం రాత్రి నెన్నెల పోలీసులను ఆశ్రయించింది. అనంతరం యువతి అఘోరి స్వగ్రామమైన నెన్నెల మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి వెళ్లింది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తమ కూతురు శ్రీవర్షిణికి అఘోరి మాయమాటలు చెప్పి వెంట తిప్పుకుంటోందని, తమ కూతురిని తమకు అప్పగించాలని మంగళగిరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, తాను మే జర్నని తన ఇష్ట ప్రకారమే అఘోరి వెంట వ చ్చానని, ఎవరూ బలవంతం చేయలేదని యు వతి పోలీసులకు తెలిపింది. తాను కూడా అఘోరి దీక్ష తీసుకున్నానని శ్రీవర్షిణిలో చెప్పినట్లు ఎస్సై ప్రసాద్ పేర్కొన్నారు. -
గీత దాటిన పోలీసులకు కోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టు: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో చట్టాలను గౌరవించకుండా కూటమి ప్రభుత్వం మెప్పుకోసమే పనిచేస్తున్న పోలీసులకు తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ అన్నారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగ అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్ కోసమే పనిచేస్తే పోలీసులే నష్టపోతారని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పోలీస్ యంత్రాంగం మీద న్యాయవ్యవస్థ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తీవ్రమైన ఆలోచనలో పడేశాయి. ప్రజలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. స్వేచ్ఛాయుతమైన ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో కీలకమైన పోలీస్ యంత్రాంగం చంద్రబాబు జేబు సంస్థగా మారిపోవడం బాధాకరం. ఒకే కంటెంట్ ఉన్న కేసుల్లో ఇంప్లీడ్ కావొచ్చేమోకానీ, పలుచోట్ల ఎఫ్ఐఆర్లు కట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన సూచనలు పోలీస్ యత్రాంగం పట్టించుకోవడం లేదు.అరెస్ట్ చేయొద్దని చెప్పినా, పీటీ వారెంట్ పేరుతో అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఒక ప్రణాళిక బద్ధంగా పైనుంచి వచ్చిన నాయకుల సూచనలను పోలీసులు పాటిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఒకానొక సందర్భంలో డీజీపీని కూడా కోర్టుకు పిలవాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ వార్నింగ్ ఇచ్చే దాకా తెచ్చుకోవడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. కోర్టు సీసీ టీవీ ఫుటేజీలు అడిగితే కోతులు కొరికేశాయని చెప్పుకునే పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చిందో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.వ్యవస్థీకృత నేరాల పేరుతో వేధింపులుగుంటూరులో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక రీల్ చేస్తే, అతడిని కర్నూలులో అరెస్ట్ చూపించారు. ఆయన్ను వ్యవస్థీకృత నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీన్ని కోర్టు ఆక్షేపించింది. మేం కళ్లు మూసుకుని ఉండలేమని గౌరవ హైకోర్టు చెప్పడం పోలీసుల వ్యవహారశైలికి నిదర్శనం. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షలు పడే నేరాలకు పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలని పలుమార్లు సూచించింది. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పింది. 41ఏ నోటీసు ఇచ్చాక స్పందించకుండ పారిపోయే ప్రయత్నం చేసినప్పుడే అరెస్ట్ చేయాలని కోర్టులు చెబుతున్నాయి. నరసరావుపేటలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి పెళ్ళిలో ఉంటే పోలీసులు మంగళగిరిలో ఉన్నట్టు చూపించారు. ఆ కేసులో ఆధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఎన్ఎస్ 111 యాక్ట్ ని సోషల్ మీడియా యాక్టీవీస్ట్ల కేసుల్లో ఎలా వర్తింపచేస్తారంటూ కోర్టు పలుమార్లు ఆక్షేపించినా పోలీసుల తీరులో మార్పు రావడం లేదు.రాష్ట్రంలో అడుగడుగునా అధికార దుర్వినియోగంరాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అడుగుడుగునా అధికార దుర్వినియోగం కనిపిస్తోంది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఎంపీపీ ఎన్నిక ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. గార్లపెంటలో ఇన్చార్జిగా ఉన్న గంగోజమ్మ తానే స్వయంగా వీడియో పంపినా కూడా అక్కడున్న లీడర్లపై కేసులు పెట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలో బలం లేకపోయినా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది.ఒక పక్క పోటీ చేయడం లేదని చెబుతూనే మరోపక్క ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టును టీడీపీ కోర్టును ఆశ్రయించింది. అత్తిలి, యలమంచలిలో ఎంపీపీ ఎన్నికలున్నాయి. రెండుచోట్లా వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా అడ్డదారులు తొక్కి మండలాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇలా అనైతిక కార్యకలాపాల ద్వారా గెలవాలని చూస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.పథకాల అమలుపై దృష్టిసారించండిరాష్ట్రంలో రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఒక పక్క మద్ధతు ధర లభించిక అప్పులపాలవుతున్నారు. మిర్చి రైతులు నెలరోజులకుపైగా ఆందోళనలు కొనసాగిస్తుంటే వారి కష్టాలు పట్టించుకునే వారే లేరు. పీ4 పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేసే పనులు పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీలకు, వెనుకబడిన వర్గాలకు కేటాయించిన పథకాలకు నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి పేదరికంపై యుద్ధం చేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో నాయకులు బెదిరింపులకు దిగుతుంటే వారి ఆదేశాలకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వత్తాసు పలకడం సబబేనా? -
ఏపీ సర్కార్, పోలీసులపై హైకోర్టు సర్జికల్ స్ట్రైక్!
-
పోలీసుల అతిపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం
-
మహానగరంలో ఏదీ భద్రత?
ఆడపిల్లల భద్రతకు ప్రమాదం పొంచివున్నదని స్పష్టంగా కనబడుతున్నా కళ్లుమూసుకున్న పోలీస్ యంత్రాంగం సాక్షిగా హైదరాబాద్‌లో మొన్న శనివారం ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది.ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తుండగా బోగీలో ఎవరూలేని సమయం చూసి దుండగుడు దాడి చేయగా తప్పించుకునే యత్నంలో నడుస్తున్న రైలునుంచి ఆమె దూకి తీవ్ర గాయాలపాలైంది. పగలంతా కిక్కిరిసి వుండే ఎంఎంటీఎస్ రైళ్లు చీకటిపడే వేళకు దాదాపు ఖాళీ అవుతుంటాయి. జనం ఎక్కువున్న సమయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆడవాళ్ల బోగీల్లో ఎక్కి వెకిలిచేష్టలకు పాల్పడటం, సెల్ఫోన్లు, ఆభరణాలు అపహరించటం వంటివి పెరిగాయని అనేకులు చెబుతున్నారు. హిజ్రాల ఆగడాలు సరేసరి. ఒంటరిగా ప్రయాణించక తప్పని స్థితిలో ఈ అరాచకాలు ఇంకెంత మితిమీర గలవో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ మాదిరి ఉదంతాలపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉంటాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రయాణికుల సంఘాలు కూడా ఆందోళనలు చేసినా పోలీసులు మేల్కొనలేదు. రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ) విభాగం అసలు దీన్ని సమస్యగానే భావించలేదు. ఆ విభాగాలు కర్తవ్య నిర్వహణలో విఫలం కావటమే నిజమైన సమస్య. కనీసం చీకటిపడింది మొదలు అర్ధరాత్రి సర్వీసులు ఆగిపోయే వరకైనా బందోబస్తు అవసరమని గ్రహించలేదు. సరిగదా అంతక్రితం ఎంఎంటీఎస్ రైళ్లలోవుండే హోంగార్డుల్ని సైతం ఈమధ్య తొలగించారంటున్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్లువుంటే కేవలం పది స్టేషన్లలో మాత్రమే భద్రత ఉండటం, అది కూడా అంతంత మాత్రం కావటం దారుణం. స్టేషన్లలో అక్కడక్కడ పేరుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ కానిస్టేబుళ్లు కనబడు తుంటారు. కానీ మహిళల కోచ్‌లు ఎలావున్నాయో, భద్రత ఏ మేరకు అవసరమో గమనించేపాటి పని కూడా వారినుంచి ఆశించే స్థితి లేదంటే నిర్వాహకులు సిగ్గుపడాలి. సాంకేతికత విస్తరించిన ఈ కాలంలో కూడా దాన్ని సవ్యంగా వినియోగించలేని అశక్తతలో ప్రభు త్వాలుండటం విచారకరం. హైదరాబాద్ నగర శివారులో 2019 నవంబర్‌లో ఒక మహిళా వైద్యు రాలిని అపహరించి, ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని తెలంగాణకు సంబంధించిందిగా చూడలేదు. అలాంటి పరిస్థితి ఏపీలో తలెత్తకూడదన్న సంకల్పంతో పోలీస్ వ్యవస్థను కదిలించి కేవలం మూడు నెలల వ్యవధిలోనే దిశ యాప్ అందుబాటులోకి తెచ్చారు. దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పారు. లక్షలాదిమంది ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవటంవల్ల ఆపత్కాలంలో అనేకమందిని రక్షించటం సాధ్యమైంది. 2021 సెప్టెంబర్‌లో ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాయటానికి ఢిల్లీ వెళ్లిన ఏపీ యువతి తెల్లారుజామున దిగి ఆటో ఎక్కాక కీడు శంకించినప్పుడు దిశ యాప్ వల్లే పోలీసులను అప్రమత్తం చేసింది. ఏపీ పోలీసుల సమన్వయంతో ఆమె క్షేమంగా పరీక్ష రాసింది. తిరిగి ఏపీకి వెళ్లే రైలు ఎక్కేవరకూ సాయం దొరికింది. హైదరాబాద్‌లో బెంగళూరు వెళ్లే రైలెక్కిన మహిళ సైతం ఈ యాప్‌ను ఉపయోగించుకునే తనను తాను రక్షించుకోగలిగింది. దేశంలో ఏ మూలనున్నా ఈ యాప్ ద్వారా సమాచారం అందుకుని మహిళలను రక్షించిన ఉదంతాలు కోకొల్లలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వెనకా ముందూ చూడకుండా దీన్ని రద్దుచేశారు. తొమ్మిది నెలలు జాప్యంచేసి, అదే యాప్‌కు సురక్షా అనే పేరు తగిలించి ఈ నెల మొదటివారంలో మళ్లీ తీసుకొచ్చారు. వేషం మారిన ఈ యాప్‌పై మహిళల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలా కూడా లేదు. అఘాయిత్యాలు మితిమీరిన ఈ కాలంలో దిశవంటి యాప్‌ను కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవరకైనా కొనసాగించాలన్న ఇంగితజ్ఞానం కూటమి ప్రభు త్వానికి లేకపోయింది. బహుశా ఆ యాప్ కొనసాగివుంటే ఎంఎంటీఎస్‌లో ఆపదలో చిక్కుకున్న యువతికి అది ఆసరాగా నిలిచేదేమో! ఎక్కడో వేరే రాష్ట్రంలోవున్న యువతులకు ఆపత్కాలంలో సాయపడటం మాట అటుంచి, తాడేపల్లిలో డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుండ గుల బారిన పడిన మహిళను కూడా కాపాడలేని అశక్తతలో ఏపీ పోలీసులు కూరుకుపోయారు. ఫలితంగా ఆ మహిళపై దుండగులు అత్యాచారం చేసి, హతమార్చారు. అదే ప్రాంతంలో మొన్న జనవరి 31న మరో మహిళ బలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈమాదిరి అఘాయిత్యాలకు అంతేలేదు.ఎంఎంటీఎస్ ఉదంతంలో రైల్వే పోలీసులు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. దుండ గుడు పట్టుబడవచ్చు కూడా. ఈ ఉదంతం పోలీసులకు ఎలాంటి గుణపాఠం నేర్పిందోగానీ మళ్లీ మరోటి జరిగేవరకూ పట్టనట్టు వ్యవహరించే ధోరణికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఖర్చు తగ్గించుకుని లాభార్జన చేయాలన్న యావ భద్రతకు తూట్లు పొడుస్తుందన్న సంగతి ఎంఎంటీఎస్ నిర్వాహకులు తెలుసుకోవాలి. ఆకతాయిలూ, అసాంఘిక శక్తులూ, యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించేవారూ తమకేం కాదన్న భరోసాతో ఉండటం మహిళలకూ, పిల్లలకూ ప్రాణాంతకమవుతుంది. రైల్వే స్టేషన్లతోపాటు బోగీల్లో సైతం సీసీ కెమెరాలుంటే, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుంటే, తక్షణం చర్యలు తీసుకునే యంత్రాంగం పనిచేస్తే ఆగడాలను అరికట్టడం సులభమవుతుంది. అలాగే మహిళల రక్షణకు తగిన యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. గడప దాటితే క్షేమంగా తిరిగొస్తామో లేదోనన్న భయాందోళనల మధ్య పౌరులు బతికే దుఃస్థితి ఉండటం మంచిదికాదని ప్రభుత్వం, రైల్వేశాఖ గుర్తించాలి. -
మరో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్: దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో వరంగల్‌కు చెందిన మావోయిస్టు సుధాకర్ ఉన్నారు. సుధీర్అలియాస్ సుధాకర్‌పై రూ.25 లక్షల రివార్డ్ ఉంది.మృతదేహాలతో పాటు ఆయుధాలను కూడా భద్రతా బలగాలు సాధ్వీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దంతేవాడ- బీజాపూర్ జిల్లాల సరిహద్దులో గల అడవుల్లో మావోయిస్టుల స్థావరాన్ని 500 మంది బలగాలు చుట్టుముట్టాయి.ఎన్కౌంటర్ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఆపరేషన్‌పై నిఘా పెట్టారు. ఘటనా స్థలంలో కూంబింగ్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భధ్రతా బలగాలను రంగంలోకి దించారు. -
మరదలి చేయి పట్టుకున్న బావపై కేసు..!
హైదరాబాద్: మహిళను వేధిస్తున్న ఆమె బావపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ హరీష్ తెలిపిన మేరకు.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ (31) జీహెచ్ఎంసీలో ఉద్యోగం చేస్తోంది. 2020లో ఆమెకు వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భర్త, అత్తా మామలు, బావ సంజీవ్‌కుమార్ (39)కుటుంబంతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు. కొంతకాలంగా సదరు మహిళను బావ సంజీవ్‌కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 22వ తేదీన బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా వచ్చి చేయి పట్టుకున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహకారంతో సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు సంజీవ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వెంటాడి వేటాడి..తండ్రిని చంపించిన కన్న కూతురు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాంఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు. -
రెచ్చిపోయిన సీఐ.. తిరగబడ్డ జనం
గుంటూరు: శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిన సీఐ రెచ్చిపోవడంతో ఓ మామూలు వివాదం శాంతిభద్రతలకే విఘాతం కలిగించే పరిస్థితికి దారితీసింది. ఫిర్యాదు చేసిన దళితులపైనే విచక్షణ మరిచి తన ప్రతాపం చూపడంతో.. ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఓ యువకుడిని సీఐ తుపాకీతో కొట్టడంతో న్యాయం చేయాల్సిన తమపైనే దాడిచేయడం ఏమిటని ప్రజలు ముట్టడించడంతో సదరు సీఐ అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. ఆగ్రహించిన ప్రజలు స్థానిక అంబేడ్కర్ బొమ్మ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలోని శాంతిపేటలో పోలేరమ్మ ఆలయ స్థలం ఉంది.ఈ స్థలాన్ని స్థానిక వ్యక్తి ఒకరు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ స్థలంలో సోమవారం షెడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ మురళీ, తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడికి ఫిరంగిపురం సీఐ బి.రవీంద్రబాబు హోంగార్డుతో అక్కడికి చేరుకున్నారు. వచ్చీ రావడంతో అక్కడ గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఫిర్యాదు చేసిన తమపైనే దాడి చేయడమేమిటని అక్కడి యువకులు ప్రశ్నించడంతో సీఐ ఆగ్రహానికి గురయ్యారు.తన గన్ బయటకుతీసి అఖిల్ అనే యువకుడిని కొట్టడంతో అతనూ గాయపడ్డాడు. దీంతో స్థానికులు సీఐ రవీంద్రబాబును ముట్టడించడంతో ఆయన అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. అనంతరం.. దళితులు సీఐ డౌన్ డౌన్ అంటూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న గుంటూరు డీఎస్పీ భానూదయ మేడికొండూరు, నల్లపాడు సీఐలు నాగూల్ మీరా, వంశీధర్‌తో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సీఐపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు పట్టుబట్టడంతో వారికి సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
Film Nagar: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మార్గాల్లో క్రాస్ మసాజ్ చేస్తున్న స్పా సెంటర్‌పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్ రోడ్డు నెంబర్–5లో అర్బన్ రిట్రీట్ పేరుతో మసాజ్ పార్లర్ నిర్వహిస్తున్నాడు. అయితే వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు అందుకున్న ఫిలింనగర్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలువురు యువతులు మసాజ్ థెరపిస్టుల పేరుతో క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో స్పా యజమాని అక్షయ్ బొహ్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త స్నేహితుడని కారు ఇస్తే... వెంగళరావునగర్: భర్త స్నేహితుడని నమ్మి కారు ఇస్తే దాన్ని సదరు వ్యక్తి తాకట్టు పెట్టిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... కె.లక్ష్మి అనే మహిళ కళ్యాణ్నగర్కాలనీలోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత ఏడాది జూన్ 10వ తేదీ తన భర్త స్నేహితుడైన పరమేశ్వర్‌రెడ్డి వచ్చి తన కారును తీసుకెళ్లాడు. నాలుగు రోజుల్లో ఇస్తానని చెప్పాడు. అయితే ఎంతకీ కారును తీసుకురాలేదు. ఈ నెల 5వ తేదీనాడు చల్లా మనోహర్ యాదవ్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి పరమేశ్వర్‌రెడ్డి కారును తనకు మార్ట్గేజ్ చేశాడని తెలియజేశాడు. దాంతో ఆమె మధురానగర్ పీఎస్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘రెండు కిలోల వెల్లుల్లి, రూ. 500 తెస్తేనే కేసు దర్యాప్తు’
ముజఫర్‌పూర్: అవినీతికి పాల్పడుతున్న పోలీసులకు సంబంధించిన ఉదంతాలను మనం అప్పుడప్పుడూ వింటుంటాం. ఇటువంటి ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందిస్తూ, అవినీతికి పాల్పడిన పోలీసులను సస్సెండ్ చేస్తుంటారు. అయితే బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పోలీసుల అవినీతి బాగోతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముజఫర్‌పూర్ పరిధిలోని మీనాపూర్ పోలీస్ స్టేషన్(Meenapur Police Station)కు వచ్చిన వృద్ధ దంపతులకు చేదు అనుభవం ఎదురయ్యింది. తమ కుమారుడు తప్పిపోయాడని, అతనిని వెదికిపెట్టాలంటూ వచ్చిన ఆ వృద్ధ తల్లిదండ్రుల విషయంలో పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తమ కుమారుడిని వెదికి పెట్టాలంటే రెండు కిలోల వెల్లుల్లి, ఐదు వందల రూపాయలు ఇవ్వాలని స్టేషన్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేస్తున్నారని ఆ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. కేసు ఇన్ఫార్మర్ యోగేంద్ర భగత్ మీడియాతో మాట్లాడుతూ ఆ దంపతుల ఏకైక కుమారుడు అజిత్ కుమార్ సిటీకి వెళ్లిన తరువాత అదృశ్యమయ్యాడన్నారు. మీనాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదన్నారు.బాధిత దంపతులు మీడియాతో మాట్లాడుతూ తాము స్టేషన్‌కు వెళ్ళినప్పుడల్లా పోలీసు అధికారులు(Police officers) తమను దూషిస్తూ, అక్కడి నుండి తరిమివేస్తుంటారని చెప్పారు. పోలీస్ ఇన్స్పెక్టర్ రెండు కిలోల వెల్లుల్లి, రూ.500 ఇస్తే కేసు దర్యాప్తు చేస్తామని చెబుతున్నారన్నారు. మా ఇంట్లో 50 గ్రాముల వెల్లుల్లి కూడా లేదని, అలాంటప్పుడు తాము రెండు కిలోల వెల్లుల్లిని ఎలా ఇవ్వగలమని బాధిత తండ్రి వాపోయాడు. తాజాగా బాధిత కుటుంబం బీహార్ మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా మానవ హక్కుల న్యాయవాది మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును పరిష్కరించడానికి బదులుగా, మరింత క్లిష్టతరం చేస్తున్నారని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. పోలీసులు ఈ కేసును దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే సీఐడీ దర్యాప్తు ఖచ్చితంగా అవసరమని అన్నారు.ఇది కూడా చదవండి: ‘డాన్స్ కోసం పుట్టి.. ప్రొఫెసర్ అయ్యారు’ -
విధుల ఒత్తిడి.. వ్యాధుల ముట్టడి..!
ఓ వైపు శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.. మరోవైపు ఆకతాయిలు పెచ్చు మీరుతున్నారు. ఇంకోవైపు గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు పెరుగుతున్నాయి. అన్నింటికీ పోలీసులే కావాలి. కానీ సరిపోయేంత సంఖ్యలో ఖాకీలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో లేరు. ఫలితంగా ఉన్న వారిపైనే ఒత్తిడి పడుతోంది. ఊపిరి సలపనంత పనితో వారి గుండెపై భారం పడుతోంది. తీవ్ర నిద్రలేమి, సరైన సమయానికి భోజనం లేక 30 ఏళ్లు దాటిన పోలీసులకు సైతం బీపీ, మధుమేహం వస్తున్నాయి. చాలా మందికి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు కూడా దెబ్బతింటున్నాయి. 50 ఏళ్లు దాటిన వారితో పాటు 35 ఏళ్లలోపు వారు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, కుటుంబ సభ్యులతో ఈ కష్టం పంచుకోలేక చాలా మంది తమలో తామే కుమిలిపోతున్నారు. సిబ్బంది.. ఇబ్బంది జిల్లాలో 38 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. ఉన్నవాళ్లలో 20 శాతం మందిని దేవాలయాలు, రాజకీయ సమావేశాలు, పోలీస్ పికెటింగ్, విద్యార్థుల పరీక్షలు వంటి బందోబ స్తు కార్యక్రమాలకు పంపుతుంటారు. ఒక్కో స్టేషన్లో 50 నుంచి 70 మంది ఉండాల్సి ఉన్నా పట్టుమని 20 మందైనా ఉండడం లేదు. ఈలోగా స్టేషన్లలో పెండెన్సీ కేసులు, కొత్త కేసులు, కొత్త చట్టాలు, కొత్త యాప్‌లు, సంకల్పాలు, అవగాహనలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల కొరత వేధిస్తోంది. మరో 500 మంది సిబ్బంది ఉంటే తప్ప ఉన్న వారి ఆరోగ్యం బాగు పడేట్లు కనిపించడం లేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ.. 50 ఏళ్లు దాటిన వారిని సైతం సుదూర (విజయవాడ)బందోబస్తులకు పంపిస్తుండటం ఇబ్బందిగా ఉంటుంది. టీఏ, డీఏలు, సరెండర్లీవ్లు కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పదిమంది వెళ్లాల్సిన స్థానంలో వందమందినైనా అక్కడి వాళ్లు అడుగుతుండటం, సొంత డబ్బులతోనే సిబ్బంది వెళ్తుండటం జీతాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. స్టేషన్లలో పోలీసు వాహనాల కొరత ఉండటంతో సొంత వాహనాలకు పెట్రోల్ పోసి పరిసర ప్రాంతాల విధుల్లో తిరగాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని జెమ్స్ లో ఇటీవల పోలీసులకు నిర్వహించిన మెడికల్ క్యాంపులో 103మందికి పైగా సిబ్బందికి గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్, స్టంట్స్ అవసరమని వైద్యులు నిర్ధారించారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.వీరి పరిస్థితే హెచ్చరిక.. జనవరిలో నగరంలోని ఒకటో పట్టణ పరిధిలో యువకుడైన నాగరాజు అనే హోంగార్డు గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, చిన్న పిల్లలున్నారు. జిల్లా కలెక్టరేట్ ట్రెజరీ విభాగంలో చెస్ట్ గార్డుగా ఉన్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ సవర జోక్యో గుండెపోటుతో మరణించాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన వరుసగా మూడురోజులు విధుల్లో ఉన్నారు. మందస హెడ్‌కానిస్టేబుల్ గవరయ్య (59) గుండెపోటుతోనే మరణించారు. నగరంలోనే కిడ్నీలు ఫెయిల్ అయి ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార బందోబస్తు విధులకు వెళ్లిన 57 ఏళ్ల ఆబోతుల లక్ష్మయ్య ఎండల వేడిమి తట్టుకోలేక స్ట్రోక్ వచ్చి విజయవాడలోనే మృతిచెందాడు. ఈయనది పోలాకి మండలం పల్లిపేట. సోంపేట ఎస్ఐ రవివర్మకు ఇటీవలే రెండోసారి స్ట్రోక్ వచ్చింది. తొలిసారి ఒక స్టంట్, ఇప్పుడు యాంజియోగ్రామ్ అవసరమన్నారు. ప్రస్తుతానికి లీవ్‌లో ఉన్నారు. కాశీబుగ్గ కానిస్టేబుల్‌కు హార్ట్ ప్రాబ్లెం ఉండటంతో స్టంట్ వేయించుకున్నారు. సోంపేటలో ఓ కానిస్టేబుల్‌కు ఇదే పరిస్థితి ఉంది. డే బై డే నైట్ డ్యూటీలతో సిక్.. గతంలో నైట్ బీట్ డ్యూటీల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉండేవారు. ఎస్ఐలు, సీఐలు రౌండ్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 ఏళ్లు నిండి రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఏఎస్ఐలు నుంచి హెడ్‌కానిస్టేబుళ్లు కూడా డే బై డే నైట్ బీట్లకు వెళ్లాల్సి వస్తోంది. అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఎస్ఐ–2లు వెళ్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు వరకు ఉండటమే కాక గంట గంటకూ లైవ్ లొకేషన్, రెండు ఫొటోలు పంపాల్సిందే. మళ్లీ ఉదయాన్నే రోల్‌కాల్ 8గంటలతో డ్యూటీ మొదలు. 7:45 కల్లా సిద్ధంగా ఉండాలి. సెట్కాన్ఫరెన్సు (ఎస్ఐ, ఆపై ర్యాంకు) అయితే 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మళ్లీ సాయంత్రం 5కి రోల్ కాల్, 7:30 నుంచి సెట్ కాన్ఫరెన్సు.. కొన్నిమార్లు జూమ్ కాన్ఫరెన్సులు.. సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఉంటాయి. (చదవండి: -
రెడ్ బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగపెడుతున్న కూటమి
-
ఎస్టీ రైతులపై పోలీసుల దాడి
ఖాజీపేట: చెరువులోని మట్టిని తరలించడంవల్ల తమ భూములకు నష్టం కలుగుతుందని ఎస్టీ రైతుల పోరాటం ఓవైపు.. ప్రభుత్వం అనుమతిచ్చిoది కాబట్టి చెరువు మట్టిని ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకుపోతాం అని కాంట్రాక్టర్ల బెదిరింపులతో ఆదివారం వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లె ఎస్టీ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఎస్టీ కాలనీ వాసులపై దాడిచేసి అడ్డొచ్చిన వారిని ఈడ్చిపడేసి పోలీసులు కాంట్రాక్టర్లకు దన్నుగా నిలిచారు. వివరాలివీ.. జాతీయ రహదారి నిర్మాణం కోసం నాగసానిపల్లె చెరువులో నుంచి మట్టిని తరలించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిoది. సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకునేందుకు అధికారులు ఓకే అన్నారు. అయితే, ఈ మట్టిని తరలించడంవల్ల చెరువుపై ఆధారపడ్డ రైతుల భూములకు నష్టం కల్గుతుందని.. సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని ఎస్టీ రైతులు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్నారు. అలాగే, చెరువు మట్టిని తరలించొద్దని ఎస్టీ రైతులు రహదారికి అడ్డుగా మట్టివేసి నిరసనకు దిగారు. కానీ, ప్రత్యేక బలగాలతో వచ్చిన పోలీసులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన వారిని ఈడ్చిపడేశారు. నిర్దాక్షిణ్యంగా చొక్కాలు పట్టుకుని బలవంతంగా జీపు ఎక్కించే ప్రయత్నం చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు వారిపై దౌర్జన్యం చేశారు. దీంతో నాగమ్మ అనే ఎస్టీ మహిళకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. అలాగే, బలరాంనాయక్ అనే రైతుపై కూడా పోలీసుల దాడిచేయడంతో అతనికీ గాయాలయ్యాయి. పైగా అతని మెడలోని బంగారు గొలుసు మాయమైంది. వీరితోపాటు మరో ముగ్గురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మట్టిని తరలించుకునేందుకు వీలుగా గ్రామంలో పోలీస్ పహారా ఏర్పాటుచేశారు. స్థానిక ప్రజలెవరూ అడ్డురాకుండా పోలీసులు తీవ్రస్థాయిలో గ్రామస్తులను హెచ్చరించారు. బయటకొస్తే కేసులు పెడతామని బెదిరించారు. అనంతరం కాంట్రాక్టర్లు రోడ్డుపై అడ్డుగా ఉన్న మట్టిని తొలగించి చెరువులోని మట్టిని యథేచ్ఛగా తరలించారు. పోలీసుల దౌర్జన్యం దారుణం.. మట్టి తరలింపుతో మా పొలానికి నీళ్లువచ్చే అవకాశంలేదు కాబట్టి నిరసన తెలుపుతున్నాం. అయితే, కాంట్రాక్టర్లకు మద్దతుగా పోలీసులు మాపై దౌర్జన్యం, దాడిచేయడం దారుణం. నా మెడలో గొలుసు పోయింది. పోలీసులు కాంట్రాక్టర్లకు మేలుచేయడం మంచి పద్ధతికాదు. – బలరాంనాయక్, నాగసానిపల్లె ఎస్టీ కాలనీరైతులు నష్టపోయినా ఫర్వాలేదా!? చెరువులో మట్టిని తరలించడంవల్ల మాకు పూర్తిగా నష్టం కల్గుతుందని మేం పోరాడుతున్నాం. కానీ, పోలీసులు మాత్రం కాంట్రాక్టర్ల మేలు కోరడం బాధాకరం. అంటే.. రైతులు నష్టపోయినా వారికి ఫర్వాలేదా!? – కృష్ణానాయక్, రైతు, నాగసానిపల్లె ఎస్టీ కాలనీ -
‘వంద కేసులను, వెయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొంటా’
సాక్షి,అమరావతి : వంద కేసులను, వేయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మాజీ మంత్రి విడదల రజిని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. ‘మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు. ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం.నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా.నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి’ అని పేర్కొన్నారు. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలువ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులుఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధంనా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం నేను ఎదురు…— Rajini Vidadala (@VidadalaRajini) March 23, 2025 -
ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్, తేడా వస్తే తాటతీస్తాం.. బుకీలకు పోలీసుల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్-18 మ్యాచ్ కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ముస్తాబైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుండడంతో ఉప్పల్ స్టేడియం వద్ద సందడి షురూ అయ్యింది.ఈ తరుణంలో హైదరాబాద్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం 2700 మంది పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. 450 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఐపీఎల్ సీజన్లో మొత్తం 10 జట్లు.. మొత్తం 73 మ్యాచ్‌లు ఆడనున్నాయి. మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో గతంతో పోలిస్తే ఈసారి భారీ బెట్టింగ్స్ బుకీలు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్స్,రిసార్ట్స్, రెస్టారెంట్స్ క్లబ్స్పై ఓ కన్నేశారు. ఏమాత్రం తేడా వచ్చినా బెట్టింగ్ రాయుళ్ల తాటతీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు39వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియం కావడంతో.. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులు తిరిగి వెళ్లేందుకు మెట్రో సేవలనూ అర్ధరాత్రి వరకూ పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..సన్‌రైజర్స్ సత్తా చాటుతుందా ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలు కానుంది. దీంతో హైదరాబాద్ గట్టుపై బోణీ కొట్టేదెవరని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..ఈ సారి కూడా సన్‌రైజర్స్ సత్తా చాటుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పట్టిష్టంగా ఇరు జట్లుసన్ రైజర్స్ హైదరాబాద్ టీం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తుండగా..ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలం కావడంతో..హెడ్, అభిషేక్, క్లాసెన్‌లు ఉగ్రరూపం చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ లేదు. యశస్వి జైశ్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడగా…అందులో ఎస్ఆర్హెచ్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్‌లలో విజయం సాధించింది. -
బెట్టింగ్ యాప్స్‌పై పోలీసుల స్పెషల్ ఫోకస్.. వారికి చుక్కలే..
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలను తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారు. ఇక, ఒక్కొక్కటిగా బెట్టింగ్‌లకు సంబంధించిన విషాదాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాదిలో తెలంగాణలో బెట్టింగ్‌కు 25 మందికిపైగా బలయ్యారు. ఆన్లైన్లో బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోనే ఎనిమిది మందికిపైగా ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. 2022 నుంచి ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఆత్మహత్యలు పెరిగాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడిన వారి కేసులను పోలీసులు వెలికి తీస్తున్నారు. అలాగే, బెట్టింగ్ యాప్స్‌ను గుర్తించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిర్వాహకులు, ప్రమోటర్లను పోలీసులు నిందితులుగా చేర్చారు.యాప్స్ ప్రమోషన్స్‌తో.. భారీగా లబ్ధి పొందిన సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లుకు సదరు బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బులు అందాయి, ఏయే మార్గాల్లో ఈ డబ్బులు ప్రమోటర్లు తీసుకున్నారనే కోణంలో.. వారి బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కేసులు నమోదైన వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు.మరోవైపు.. బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బెట్టింగ్ యాప్ ద్వారా 80 లక్షలు పోగొట్టుకున్న నెల్లూరుకు చెందిన రాంబాబు అనే బాధితుడు తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేయడంతో నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి ఆవేదన చెప్పుకున్నాడు. ఈ సందర్బంగా బాధితుడు రాంబాబు మాట్లాడుతూ.. ‘హీరోల ప్రమోషన్ చూసే నష్టపోయాను. నేను బెట్టింగ్ యాప్ లో పాల్గొని తప్పు చేశాను. నాకు ఏ శిక్ష పడినా పర్వాలేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు శిక్ష వేయాల్సిందే. అప్పుల వాళ్లు ఊళ్లోకి రానివ్వట్లేదు. ఫోన్ నెంబర్ మార్చుకొని పిచ్చోడిలా తిరుగుతున్నాను. ఐపీఎస్ అధికారి సజ్జనార్ చొరవ తీసుకోవడంతో బెట్టింగ్ యాప్‌ల బాగోతం బయటకు వచ్చింది. బెట్టింగ్ యాప్ బాధితులు దేశవ్యాప్తంగా ఉన్నారు. అమాయకులు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ పార్టీలు బెట్టింగ్ యాప్‌లను నిషేధిస్తామని మేనిఫెస్టోలో పెట్టే రోజులు వస్తాయి’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన కేసులో టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలను పంజాగుట్ట పోలీసులు గురువారం సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను 11 గంటల పాటు విచారించగా.. రీతూచౌదరి విచారణ ఐదున్నర గంటలకుపైగా కొనసాగింది. తొలుత ఇద్దరినీ వేర్వేరుగా.. అనంతరం కలిపి ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మూడు యాప్‌లకు ప్రచారం చేశానని విష్ణుప్రియ అంగీకరించినట్లు తెలిసింది. -
Amit Shah : నక్సల్స్‌కు అమిత్‌షా వార్నింగ్
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నక్సల్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. లొంగిపోయేందుకు మావోయిస్ట్‌లకు కేంద్రం అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే వారి పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వచ్చేడాది మార్చి నెల లోపు నక్సలిజాన్ని అంతచేస్తామని పునరుద్ఘాటించారు.గురువారం, ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 22మంది (అమిత్‌షా ట్విట్ చేసే సమయానికి)మావోయిస్టులు మృతి చెందారు.ఈ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌షా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నక్సల్ భారత్ ముక్త్ అభియాన్’ భారత సైనికులు మరో విజయం సాధించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బిజాపుర్,కంఖేర్ రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన కూంబింగ్‌లో 22మంది నక్సల్స్ మరణించారు. కేంద్రం నక్సల్స్ లొంగిపోయేందుకు అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే.. వారిపట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి లోపు నక్సల్స్ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ‘नक्सलमुक्त भारत अभियान’ की दिशा में आज हमारे जवानों ने एक और बड़ी सफलता हासिल की है। छत्तीसगढ़ के बीजापुर और कांकेर में हमारे सुरक्षा बलों के 2 अलग-अलग ऑपरेशन्स में 22 नक्सली मारे गए।मोदी सरकार नक्सलियों के विरुद्ध रुथलेस अप्रोच से आगे बढ़ रही है और समर्पण से लेकर समावेशन की…— Amit Shah (@AmitShah) March 20, 2025 -
ఏపీ పోలీసులకి పొన్నవోలు సీరియస్ వార్నింగ్..
-
పాక్‌కు మద్దతుగా గోడలపై నినాదాలు.. ఇద్దరు యువకులు అరెస్ట్
రామ్‌నగర్: కర్నాటకలోని రామ్‌నగర్ పట్టణంలో కలకలం రేపే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఆటోమొబైల్ కంపెనీ(Automobile company)లోని టాయిలెట్ గోడలపై పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు రాసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిని అహ్మద్ హుస్సేన్, సాదిక్‌లుగా గుర్తించారు.వివరాల్లోకి వెళితే ఈ ఉదంతం రామ్‌నగర్ పరిధిలోని బిడ్డీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడి టొయోటా ఆటోమొబైల్(Toyota Automobile) కంపెనీకి చెందిన హెచ్ఆర్ మార్చి 15న కంపెనీ నోటీసు బోర్డులో ఒక నోటీసు అతికించారు. ఈ నోటీసులో ఫ్యాక్టరీ లోపలున్న టాయిలెట్ గోడలపై పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదారుల రాయడాన్ని గుర్తించామని పేర్కొన్నారు. ఇలా రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దానిలో హెచ్చరించారు. ఈ ఉదంతంపై కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కంపెనీలో ఏడాదిగా కంట్రాక్ట్‌పై పనిచేస్తున్న అహ్మద్ హుస్సేన్, సాదిక్ ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నామని తెలిపారు. రామ్‌నగర్ ఎస్సీ శ్రీవాస్తవ్ మాట్టాడుతూ ఒక ప్రవేట్ కంపెనీలో పాక్‌కు మద్దతుగా నినాదాలు రాసినవారిని పట్టుకున్నామని, సెక్షన్ 67 ప్రకారం వారిపై కేసు నమోదు చేశామన్నారు.ఇది కూడా చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ప్రయాణాన్ని గుర్తుచేసే మిథిలా పెయింటింగ్ -
Transgender Dipu: ఎనిమిదేళ్ల క్రితం వివాహం
అనకాపల్లి టౌన్/కశింకోట/మునగపాక: బయ్యవరం వద్ద లభించిన శరీర భాగాలతో వెలుగు చూసిన వ్యక్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. బుధవారం మరో రెండు చోట్ల మిగతా శరీర భాగాలు లభ్యం కావడంతో హత్యకు గురైన వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించారు. బయ్యవరం వద్ద జాతీయ రహదారి వంతెన కింద మంగళవారం ఒక చేయితోపాటు నడుం కింద శరీర భాగాలతో ఉన్న మూట దొరకడంతో గుర్తు తెలియని మహిళ హత్యగా భావించిన పోలీసులు వాటిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి భద్రపరిచిన సంగతి తెలిసిందే. ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాలు మృతదేహం మిగిలిన భాగాల కోసం గాలింపు చేపట్టాయి. అనకాపల్లిలో డైట్ కళాశాల వద్ద జాతీయ రహదారి పక్కన జలగల మదుం వద్ద కాలువలో హతురాలి తల భాగం, ఎడమ చేయి లభ్యమయ్యాయి. మండలంలోని తాళ్లపాలెం జాతీయ రహదారి వంతెన దిగువన మొండెం భాగం సంచిలో లభ్యమైంది. వీటిని పరిశీలించి హత్యకు గురైన వ్యక్తిని అనకాపల్లి గవరపాలెం ముత్రాసు కాలనీకి చెందిన మైపల దిలీప్ శివశంకర్ అలియాస్ దీపు (40)గా గుర్తించారు. ప్రత్యేక బృందాలు విచారిస్తున్నట్లు స్థానిక సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. హత్యకు కారకునిగా భావిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన నిందితుడ్ని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నట్లు సమాచారం.ఎనిమిదేళ్ల క్రితం వివాహంపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తితో 8 సంవత్సరాల క్రితం దీపు వివాహం చేసుకొని మునగపాక మండలం నాగులాపల్లి వద్ద నివాసముంటున్నారు. ఆనవాళ్లను బట్టి పోలీసులు మృతదేహాన్ని గుర్తించి నాగులాపల్లిలోని దీపు ఇంటికి క్లూస్ టీమ్‌ను తీసుకొని వెళ్లారు. గదిలో ఎటువంటి ఆనవాళ్లు లేకుండా నిందితుడు జాగ్రత్త పడినట్టు తెలిసింది. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బుధవారం అనకాపల్లికి చెందిన హిజ్రాలందరూ తమ వర్గానికి చెందిన వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. నిందితులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, లేనిపక్షంలో తమ సంఘానికి అప్పగించాలని ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి ర్యాలీగా నెహ్రుచౌక్కు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిజ్రాలు కొండబాబు, భారతమ్మలు మాట్లాడుతూ నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి, దీపు గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారన్నారు. హత్య జరిగిన ముందు రోజు కూడా కలిసే ఉన్నారని తెలిపారు. గతంలో హిజ్రాలపై హత్యలు జరిగినప్పటికీ నేటి వరకూ పోలీసులు పట్టించుకోలేదని రోజురోజుకు హిజ్రాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అనంతరం నెహ్రుచౌక్ నుంచి ర్యాలీగా వచ్చి డీఎస్పీ శ్రావణితో హిజ్రాలు మాట్లాడారు. -
రోజుకు రూ. 5 వేలు ఇస్తేనే వస్తా..!
యశవంతపుర: భార్య వేధిస్తోందని ఆత్మహత్య చేసుకున్న భర్తల గురించి బెంగళూరులో వార్తలు వస్తుంటాయి. అదే రీతిలో భార్య సతాయిస్తోందని గోడు వెళ్లబోసుకున్నాడు ఓ భర్త. దగ్గరకు పిలిస్తే, రోజుకు రూ. 5 వేలు ఇస్తేనే వస్తానంటోందని వాపోయాడు. ఆమె వేధింపులను తట్టుకోలేక టెక్కీ భర్త పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు.. టెక్కీ శ్రీకాంత్‌కు 2022లో సదరు యువతితో వివాహమైంది. పెళ్లి రోజు నుంచి ఒక్కరోజు కూడా సంసారం చేయలేదు. పిల్లలు కావాలని శ్రీకాంత్ భార్యను అడగ్గా, 60 ఏళ్లు వయస్సు వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దాం, ఇప్పుడైతే ఎవరినైనా దత్తతకు తీసుకొందామని ఉచిత సలహాలిచ్చేది. భార్య కదా అని ఆమెను ముట్టుకోబోతే భగ్గుమనేది. డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించేది. పాటలు పెట్టి డ్యాన్సులు భర్త వర్క్ ఫ్రం హోంలో డ్యూటీ చేసుకుంటుంటే చాలు, ఆమె గట్టిగా పాటలు పెట్టి డ్యాన్స్ చేసేది. ఒక వేళ విడాకులు తీసుకోవాలని అనుకుంటే తనకు రూ.45 లక్షలు పరిహారం ఇవ్వాలని, ప్రతినెలా భరణం కింద పెద్దమొత్తం ముట్టజెప్పాలని తేల్చిచెప్పింది. ఇంత డబ్బును తానెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని బాధితుడు వాపోయాడు. ఇదే కాకుండా వీరిద్దరూ మాట్లాడిన ఆడియో సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. భార్యకు ఆమె తల్లిదండ్రులు వంత పాడుతున్నారని తెలిపాడు. ఈ మేరకు వయ్యలికావల్ ఠాణాలో అతడు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. -
పాకిస్థాన్‌లో అంతే.. ‘లూటీ చేయడానికి ఏమన్నా మిగిలాయా?’
ఇస్లామాబాద్ : పదుల సంఖ్యలో కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలతో రద్దీగా ఉండే ఏరియా. ఆ ప్రాంతానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగులు కంప్యూటర్లతో కుస్తీలు పడుతుంటారు. అయితే, ఎప్పటిలాగే విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు వచ్చారు.ఉద్యోగులు వచ్చిన రెండు గంటల తర్వాత పోలీసులు, దర్యాప్తు అధికారులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారు. ఈ దాడులపై సమాచారం అందుకున్న స్థానికులు ఆఫీసుల్లో చొరబడి లూఠీ చేశారు. చేతికి ఏది అందితే దాన్ని పట్టుకొని వెళ్లిపోయారు. దొంగిలిచ్చేందుకు వచ్చిన స్థానికులు సైతం లూటీ చేసేందుకు ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని ఆరా తీసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పాకిస్థాన్(Pakistan)లోని ఇస్లామాబాద్ సెక్టార్ ఎఫ్-11లో ఉన్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) అధికారులు దాడులు చేశారు. 24 మందిని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. అయితే, చైనీయులు నడుపుతున్న కాల్ సెంటర్‌పై దాడులు జరిగాయన్న సమాచారం ఆ నోటా ఈనోటా పాకింది. అంతే సమాచారం అందుకున్న స్థానికులు ఆ కాల్ సెంటర్లో చొరబడ్డారు. చేతికి అందిన ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, కీబోర్డులు, ఎక్స్‌టెన్సన్లు.. ఏదిపడితే అది ఎత్తుకెళ్లారు. ఫర్నీచర్, కట్లరీ సెట్లను కూడా లూటీ చేశారు. ఈ లూటీపై సమాచారం అందుకున్న మరి కొంతమంది ఫేక్ కాల్ సెంటర్‌కు వచ్చారు. తమకూ ఏదైనా దొరుకుతుందేమోనని ల్యాప్‌ట్యాప్స్‌ను చోరీ చేసిన వారిని ఆరా తీసిన దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ అవుతున్న వీడియోల్ని చూసేయండి.Pakistanis have Looted Call Centre operated by Chinese in Islamabad; Hundreds of Laptop, electronic components along with furniture and cutlery stolen during holy month of Ramadan pic.twitter.com/z6vjwBRRsq— Megh Updates 🚨™ (@MeghUpdates) March 17, 2025 -
ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ
సాక్షి,గుంటూరు: సీఐడీ కార్యాలయంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. పోసాని కృష్ణమురళికి సోమవారం కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. న్యాయవాది సమక్షంలోనే పోసానిని విచారించింది. కాగా, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదామరోవైపు, తనపై నమోదైన కేసులో బెయిల్ కోసం పోసాని కృష్ణమురళి గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా విచారణ నిమిత్తం మరింత సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది. -
విశాఖలో బార్లు, పబ్‌లలో పోలీసుల తనిఖీలు
విశాఖపట్నం: విశాఖలో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. సుమారు 450 పోలీస్ అధికారులు, సిబ్బందితో 92 బృందాలుగా 104 బార్లు, పబ్‌ల్లో ఏకకాలంలో తనిఖీ చేపట్టారు. ఇందులో సంబంధిత శాఖల నుంచి లైసెన్సులు లేకుండా వ్యాపారం, మైనర్లకు మద్యం విక్రయాలు, ఫైర్ ఎన్ఓసీలు, సీసీటీవీ, అక్రమ మద్యం, ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయాలు ఇలా అనేక అంశాలను క్షణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో 23 బార్లలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 14 బార్లకు ఫైర్ఎన్ఓసీ, 2 బార్లలో సీసీటీవీ కెమెరాలు, ఒకచోట ఫుడ్ లైసెన్స్ లేకుండా రెస్టారెంట్ నిర్వహణ, ట్రైడ్ లైసెన్సులు లేకుండా 2, పార్కింగ్ సదుపాయం లేకుండా 14, జీఎస్టీ లేకుండా ఒక బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు తేల్చారు. సదరు బార్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సిఫార్సు చేశారు. -
అక్రమ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కొరడా
-
మాజీ సర్పంచ్ దారుణ హత్య.. నూతనకల్ మండలంలో ఉద్రిక్తత
సాక్షి,సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్యాల మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్(61) పై గొడ్డలితో దుండగుల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధితుణ్ని అతని కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.అయితే హత్యకు పాల్పడిన నిందితుల ఇంటిపై బాధితుడి బంధువుల దాడి చేశారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు మోహరించారు. -
Posani Krishna Murali : న్యాయవాది సమక్షంలో విచారణ.. సీఐడీ కస్టడీకి పోసాని
సాక్షి,గుంటూరు: ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళికి కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ కస్టడీకి తీసుకొని ప్రశ్నించనుంది. న్యాయవాది సమక్షంలోనే పోసానిని సీఐడీ విచారించనుంది. కాగా, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. -
వయస్సు 19.. ‘నేను మీ అక్కనిరా’ అంటూ.. స్కూల్ విద్యార్థులను వ్యభిచారంలోకి దింపి..
సాక్షి, వరంగల్ : అభం శుభం తెలియని బాలికల జీవితాలతో ఆడుకున్న కిలాడీ లేడీని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మత్తులో ఆ మోసగత్తె చేసిన అరాచకాలు విని పోలీసులే అవాక్కయ్యారు. కొద్దిరోజుల క్రితం ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ.. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లంతా కలిసి వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తోంది ఈ ముఠా. నేను మీ అక్కని రా అంటూఇందుకోసం ఇన్ స్టాగ్రామ్‌ను వినియోగించింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్ చేయడంతో పాటు ఖరీదైన దుస్తులు, లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ ఫొటులు దిగింది. ఆ ఫొటోల్ని చూసిన నెటిజన్లు ఆమెను ఫాలో అవడం మొదలు పెట్టారు. అనతి కాలంలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగారు. అంతే పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో నేను మీ అక్కనిరా అంటూ వారితో మెల్లగా మాటలు కలుపుతోంది ఈ కిలాడీ లేడీ. ఇన్ స్టాలో తన ఫాలోవర్లను చూపించి క్రమంగా వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకొని కిడ్నాప్ చేస్తోంది. ఆపై బాలికలకు మత్తు పదార్ధాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతుంది.ఏడాదిన్నరగాఈ ముఠా దాదాపూ ఏడాదిన్నరగా ఇలాంటి పనులే చేస్తూ పలువురి బాలికల జీవితాల్ని నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు సమాచారం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెలుగులోకి కిలాడీ లేడీ గ్యాంగ్ అరాచకాలు ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని తెలిపింది. స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలింది. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో రెండ్రోజుల్లో ఆ కిలాడీ లేడీ లీలలను భయటపెట్టే అవకాశం ఉంది. -
రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. యూపీలో అమలు చేస్తున్న యాంటీ రోమియో స్క్యాడ్ తరహాలో యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్(Eve Teasing Squad)కు రూపకల్పన చేయనుంది. దీనికి సంబంధించి పోలీసు కమిషనర్ ఒక ప్రకటన చేశారు. ఈ స్వ్యాడ్కు ‘శిష్టాచార్ స్క్వాడ్’ అనే పేరు పెట్టారు. ఢిల్లీలోని ప్రతీ జిల్లాలో ఈ తరహాలోని రెండు స్క్వాడ్లు విధులు నిర్వహించనున్నాయి.ఈ ‘శిష్టాచార్ స్క్వాడ్’లో ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఎనిమిదిమంది కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండనున్నారు. వీరిలో నలుగురు మహిళా సిబ్బంది ఉంటారు. వీరిలో సాకేంతిక నిపుణత కలిగిన ఒకరు ఉండనున్నారు. ఈ స్క్వాడ్‌కు ఒక కారుతో పాటు ద్విచక్రవాహనాలను కూడా సమకూర్చనున్నారు. ఈ స్క్వాడ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు(Public transport)లో కూడా ప్రయాణించనున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేవిధంగా వారిని మోటివేట్ చేయనున్నారు.2017లో యూపీలోని యోగి సర్కారు రాష్ట్రంలోని మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు యాంటీ రోమియో స్క్వాడ్‌ను నియమించింది. వీరు స్కూళ్లు, కాలేజీల బయట జరిగే ఈవ్ టీజింగ్‌ను అరికడుతుంటారు. యాంటీ రోమియో స్క్వాడ్‌లో మహిళా కానిస్టేబుళ్లు సభ్యులుగా ఉంటారు. వీరు మహిళలపై వేధిపులకు పాల్పడేవారిని పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇది కూడా చదవండి: Kalpana Chawla: రెండు పుట్టిన రోజుల వ్యోమగామి -
భూ లక్ష్మి ఆలయంలో యాసిడ్ దాడి కేసు ఛేదించిన పోలీసులు
-
పోలీసులపై కన్నడ నటి రన్యా రావ్ సంచలన ఆరోపణలు
-
Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు
భాగల్పూర్: బీహార్(Bihar)లో గతకొన్ని రోజులుగా పోలీసులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటన భాగల్పూర్లో జరిగింది. శనివారం రాత్రి పోలీసులు గస్తీలో తిరుగుతుండగా, వారిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఘటన భాగల్పూర్ పరిధిలోని అంతీచక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన గురించి అంతీచక్ పోలీసు అధికారి అశుతోష్ కుమార్ మాట్లాడుతూ తమ పోలీసు బృందం(Police team) పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మాధవ్ రామ్‌పూర్ హరిచక్ గ్రామ సమీపంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటాన్ని గమనించారన్నారు. పోలీసులు ఆ వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించారని, అయితే ఇంతలోనే గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారని, పోలీసు వాహనం కూడా కొంతమేరకు ధ్వంసమయ్యిందని తెలిపారు. దాడికి పాల్పడినవారిని పోలీసులు అరెస్టు చేశారని, గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అశుతోష్ తెలిపారు. ఈ దాడికి ముందు అరారియా, ముంగేర్‌లో పోలీసు బృందాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. ఇది కూడా చదవండి: అమెరికాలో తుపాను బీభత్సం.. 17 మంది దుర్మరణం -
Bihar: హోలీ వివాదంలో జోక్యం.. పోలీసు అధికారి హత్య
ముంగేర్: బీహార్(Bihar)లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో మద్యం మత్తులో మునిగిన కొందరు యువకులు ఒక పోలీసు అధికారి తల పగులగొట్టారు. వెంటనే స్థానికులు ఆ పోలీసు అధికారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.ఈ ఘటనలో రోహ్తక్(Rohtak)కు చెందిన ఏఎస్ఐ సంతోష్ కుమార్ మృతిచెందారు. మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ముఫస్సిల్ పోలీస్ స్టేషన్‌కు డయల్ 112కు ఫోను వచ్చింది. నందలాల్‌పూర్‌లో మద్యం మత్తులో ఇరు వర్గాలు ఘర్ణణ పడుతున్నాయని ఆ ఫోను ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఏఎస్ఐ సంతోష్‌కుమార్ తన బృందంతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గొడవ పడుతున్న ఇరు గ్రూపులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయితే పోలీసులు ప్రయత్నం ఫలించలేదు. ఇంతలో వారిలో ఒకరు మారణాయుధంతో ఏఎస్ఐ సంతోష్ కుమార్ తల పగులగొట్టారు. వెంటనే అతను స్పృహ తప్పి కింద పడిపోయారు. అతని తల నుంచి విపరీతంగా రక్తం కారసాగింది. దీంతో స్థానికులు, పోలీసులు అతనిని వెంటనే ముంగేర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం సంతోష్ కుమార్‌ను ముంగేర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పట్నా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సంతోష్ కుమార్ మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు -
11 మంది మావోయిస్ట్ మిలీషియా సభ్యుల లొంగుబాటు
అల్లూరి సీతారామరాజు జిల్లా: 11 మంది మావోయిస్టు మిలీషియ సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఎస్పీ అమిత్ బర్ధర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జీకే వీధి మండలం గాలికొండ ఏరియా కమిటీకి చెందిన 11 మంది మావోయిస్టు మిలీషియ సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిపై ఒక్కొకరిపై సుమారు ఆరేడు కేసులు ఉన్నాయని తెలిపారు.2021లో అనేక నేరాల్లో వీరంతా పాల్గొన్నారు. లొంగిపోయిన వారిపై ఏ కేసులు లేకుండా వదిలిపెడుతున్నామని ఎస్పీ అమిత్ బర్ధర్ తెలిపారు. మావోయిస్టులు గిరిజనుల కోసం ఏనాడు పని చేయలేదని.. మావోయిస్టుల వలన గిరిజనులకు తీరని అన్యాయం జరిగిందని ఎస్పీ అన్నారు. -
రెచ్చిపోయిన గ్రామస్తులు.. పోలీసులపై దాడి.. ఏఎస్ఐ మృతి
పాట్నా: ఓ ఊరి గ్రామస్తులు దారుణానికి ఒడిగట్టారు. ఊర్లో పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడుల చేశారు. గ్రామస్తులు చేసిన దాడుల్లో ఏఎస్ఐ దుర్మరణం పాలయ్యారు.బీహార్ రాష్ట్రం, అరారియా జిల్లా ఫుల్కహా అనే గ్రామంలో అన్మోల్ యాదవ్ ఓ పేరు మోసిన క్రిమినల్. పలు నేరాలకు పాల్పడి.. పోలీసులు కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ఈ క్రమంలో బుధవారం అన్మోల్ యాదవ్ తన స్వగ్రామంలో పెళ్లి చేసుకుంటున్నాడనే సమాచారం పోలీసులకు అందింది.వెంటనే ఫుల్కహా గ్రామంలో పోలీసులు మోహరించారు. పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో గ్రామస్తులు రెచ్చిపోయారు. పోలీసులపై దాడులకు తెగబడ్డారు. దాడుల్లో ఏఎస్ఐ రాజీవ్ రంజన్ మాల్ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయాడు. అప్రమత్తమైన పోలీసులు రాజీవ్ రంజన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.వైద్య పరీక్షల్లో ఏఎస్ఐ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్పీ అంజన్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఆరుగురు ఆనుమోల్ యాదవ్ మద్దతుదారుల్ని అరెస్ట్ చేశారు. అనుమోల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. -
ఫాంహౌస్ కోళ్లపందాల కేసులో విచారణకు హాజరైన పోచంపల్లి
-
‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన
దేశంలో హోలీ వేడుకలు(Holi celebrations) అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. వాడవాడలా జనం ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటూ ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే హోలీ వేళ భద్రతా విధులు చేపడుతున్న పోలీసులు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సివస్తోంది. దీంతో వారు కొంతమేరకు అసంతృప్తికి లోనవుతున్నారు.ఒక పోలీసు తాను కుటుంబ సభ్యులతో హోలీ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నానంటూ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది. సాధారణంగా పండుగలకు ఎవరికైనా సెలవు ఉంటుంది. అలా లేని పక్షంలో ఆఫీసులో సెలవు పెట్టుకుని, పండుగపూట ఇంటిలోని వారితో ఆనందిస్తుంటారు. అయితే తనకు గత 27 ఏళ్లుగా ఎప్పుడూ ఇంటిలోనివారతో హోలీ ఆడేందుకు అవకాశం రాలేదని కానిస్టేబుల్(Constable) సంజీవ్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. यूपी पुलिस के संजीव कुमार सिंह जी का वीडियो देखकर मन बड़ा चिंतित हुआ जिन्होंने लगातार 27 साल सेवा दी हैलेकिन संजीव कुमार जी की माता जी का भी देहांत पिछले साल हुआ है और उनकी इस बार पहली होली है गांव में उनकी उपस्थिति अनिवार्य है लेकिन छुट्टी नहीं मिल पाई है और लगातार कुंभ में भी… pic.twitter.com/MGZgbtGtPm— Adv Deepak Babu (@dbabuadvocate) March 13, 2025ఈ వీడియోలో సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ‘ఫ్రెండ్స్, ఈ రోజు నేనెంతో ఆవేదన చెందుతున్నాను. నేను గత 27 ఏళ్లుగా పోలీసు డ్యూటీ నిర్వహిస్తున్నాను. ఈ 27 ఏళ్లలో ఎన్నడూ ఇంటిలోని వారితో హోలీ చేసుకోలేదు. మహాకుంభ్ డ్యూటీ ముగిశాక సెలవు దొరుకుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మేముండే హర్దోయీ(యూపీ)కి వెళ్లలేను. జనమంతా స్వస్థలాలకు వెళ్లి, హోలీ వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసు విధుల కారణంగా నేను ఇంటికి రాలేనని ఇంటిలోని వారికి చెప్పాను’ అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఇదేం హోలీరా బాబూ.. వీడియో వైరల్ -
నేడు హోలీ.. రంజాన్ ప్రార్థనలు.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: నేడు ఒకవైపు హోలీ(Holi) మరోవైపు రంజాన్ శుక్రవారం ప్రార్థనల సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశరాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడేందుకు పారామిలిటరీ(Paramilitary) దళాలతో పాటు 25,000 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఢిల్లీలో పోలీసులు 300కు పైగా సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి, డ్రోన్లు,సీసీటీవీ కెమెరాల సహాయంతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Delhi Police conducted a flag march in the Malviya Nagar area ahead of Holi celebrations and Jumma Namaz, which are due to be held tomorrow. pic.twitter.com/pNSUYB1Xc1— ANI (@ANI) March 13, 2025ఇక హోలీ వేడుకలు ఘనంగా జరిగే రాజస్థాన్ విషయానికొస్తే రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైపూర్ అదనపు పోలీస్ కమిషనర్(Police Commissioner) (లా అండ్ ఆర్డర్) రామేశ్వర్ సింగ్ మాట్లాడుతూ పోలీసు విభాగానికి చెందిన 11 మంది అదనపు డిప్యూటీ కమిషనర్లు, 40 మందికి పైగా అసిస్టెంట్ కమిషనర్లు, 80 మంది సర్కిల్ ఆఫీసర్లు, దాదాపు 1500 మంది కానిస్టేబుళ్లు భద్రతా ఏర్పాట్లను చూసుకుంటారని తెలిపారు. అలాగే 300 మందికి పైగా మహిళా సిబ్బంది కూడా భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటారన్నారు. హోలీ రోజున పెద్ద సంఖ్యలో పర్యాటకులు జైపూర్‌కు తరలివస్తారని తెలిపారు.#WATCH | Delhi Police conducted a bike rally in the Connaught Place area ahead of Holi celebrations and Jumma Namaz, which are due to be held tomorrow. pic.twitter.com/9yhAKsPs0I— ANI (@ANI) March 13, 2025శతాబ్దాల నాటి సనాతన ధర్మ సంప్రదాయాలను అనుసరించి, సామరస్యంగా హోలీ జరుపుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోలీ సందర్భంగా ఎవరిపైన అయినా బలవంతంగా రంగులు వేయవద్దని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. పరస్పర గౌరవంతో జరుపుకునే పండుగలు మరింత ఆనందాన్ని ఇస్తాయన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు ఉన్నందున ప్రతి జిల్లాలోని శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. హోలీ రోజున అణువణువునా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో పాటు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్, స్టంట్ బైకింగ్‌లపై నిఘా ఉంచడానికి ప్రత్యేక బృందాలను మోహరించామని యూపీ పోలీసు అధికారులు తెలిపారు. ఇదేవిధంగా వివిధ రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇది కూడా చదవండి: హోలీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ -
‘స్వార్గేట్’ కేసు : నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు
‘స్వార్గేట్’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది. 12 రోజుల పోలీసు కస్టడీ అనంతరం గడేను బుధవారం కోర్టులో హాజరు పరిచాం. కస్టడీని పొడిగించాలని కోర్టుకు విన్నవించాం. ఈమేరకు మార్చి 26 వరకూ నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ’అని క్రైంబ్రాంచ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముందే క్రిమినల్ నేపథ్యం ఫిబ్రవరి 25 తెల్లవారుజామున స్వార్గేట్ టెర్మినస్ వద్ద ఎమ్మెస్సార్టీసీ బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దత్తాత్రాయ్ గడే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. బాధితురాలు ఫిబ్రవరి 25 తెల్లవారుజామున సతారా జిల్లాలోని తన స్వస్థలానికి వెళ్లేందుకు స్వార్గేట్ బస్టాండ్‌లో వేచి ఉండగా బస్కండక్టర్నని చెప్పి గాడే ఆమెను అప్పటికే అక్కడ ఉన్న బస్సులో ఎక్కాల్సిందిగా కోరాడు. ఈమేరకు బాధితురాలు బస్సులోపలికి వెళ్లగా గాడే రెండు తలుపులూ మూసివేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం డ్రోన్లు స్నిఫర్ డాగ్‌ల సహాయంతో శిరూర్ తహసీల్ పరిధిలో తన స్వస్థలం గుణత్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గడేను పట్టుకున్నారు. అతడిపై ఇప్పటికే అరడజను క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. -
విచారణకు రావాల్సిందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బిగ్ షాకిచ్చారు పోలీసులు. ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన క్యాసినో, కోళ్ల పందేల కేసులో తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోకి పోచారం ఇంటికి వెళ్లిన పోలీసులు.. నోటీసులు అంటించారు. ఈ క్రమంలో రేపు మొయినాబాద్ పోలీసు స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, అంతకుముందు ఈ కేసులో ఇచ్చిన నోటీసులకు లాయర్ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాజాగా నోటీసుల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
Wine Shops Closed : వైన్‌షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
సాక్షి,హైదరాబాద్ : మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 14న మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీ ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి.ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక సూచలను జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా హోలీ షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, బహింగంగా ప్రదేశాల్లో వాహనదారులపై కలర్స్ వేసి ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. -
బ్రెయిన్ ఇంజురీలను నివారించడం ఎలా? పోలీసులకు అవగాహనా కార్యక్రమం
ప్రముఖ ఆసుపత్రి ఆలివ్ పోలీసుల అధికారుల కోసం బ్రెయిన్ ఇంజురీ అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ ప్రోగ్రాంను నిర్వహించింది. ప్రమాదాలు చోటు చేసుకుని, మెదడు తీవ్రగాయాలైన వ్యక్తుల ప్రాణాలను ఎలా కాపాడాలో తెలిపే విధంగా హైదరాబాద్‌లోని పోలీసులకు అవగాహన కల్పించింది. మెదడు గాయాల గురించి అవగాహన పెంచడం, ప్రభావవంతమైన నివారణ చర్యలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆలివ్ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.ఈ కార్యక్రమం మెదడు గాయాల ప్రమాదాలు , ముందస్తు గుర్తింపు, నివారణ చర్యల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మెదడు గాయాల అవగాహన, నివారణపై నిపుణుల చర్చలు జరిగాయి. ఆసుపత్రి వైద్యులు వివిధ రకాల మెదడు గాయాలు, వాటి దీర్ఘకాలిక ఆరోగ్య చిక్కులు, సరిగ్గా నయం కావడానికి ముందస్తు జాగ్రత్తలు, చికిత్స అవసరంపై సమాచారాన్ని అందించారు. ఈ గాయాల ప్రమాదాన్ని తగ్గించడానికి రహదారి భద్రత, హెల్మెట్లు ధరించడం, కార్యాలయ భద్రత వంటి నివారణ చర్యలను కూడా సెషన్ నొక్కి చెప్పింది. సమాజం మరియు పోలీసుల భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ, చట్ట అమలు అధికారులు మరియు స్థానిక ప్రభుత్వం భద్రతా ప్రోటోకాల్‌లను నిర్ధారించడంలో, అవగాహన పెంచడంలో ఎలా సహాయ పడతాయో ఈ కార్యక్రమం హైలైట్ చేసిందిహైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ నుండి ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీరిలో DCP- చంద్ర మోహన్ సౌత్ వెస్ట్ జోన్, ట్రాఫిక్ ACP ధనలక్ష్మి సౌత్ వెస్ట్ జోన్ ఘోషమల్, ఇన్స్పెక్టర్ మున్నవర్ కుల్షుంపురా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య కుల్షుంపురా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ అవగాహనను వ్యాప్తి చేయడంలో, భద్రతను నిర్ధారించడంలో చట్ట అమలు కీలక పాత్రను వారు గుర్తు చేశారు. బ్రెయిన్ ఇంజురీ, నివారణ, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స ప్రాముఖ్యతను ఆలివ్ నొక్కి చెబుతుంది. బ్రెయిన్ ఇంజురీలపై పెరుగుతున్న ఆందోళనల మధ్యఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మెదడు గాయాలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయనీ, అందుకే ముందస్తు వైద్యం ద్వారా ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఆలివ్ హాస్పిటల్ న్యూరోసర్జన్ డాక్టర్ రఘుర్కం తేజ తెలిపారు. మెదడు గాయాల బాధితులకు మరింత అవగాహన కల్పించడానికి , ఉత్తమ సంరక్షణను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమాలను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.ఈ కార్యక్రమంలో సౌత్ వెస్ట్ జోన్, DCP- చంద్ర మోహన్, ట్రాఫిక్ ACP ధనలక్ష్మి సౌత్ వెస్ట్ జోన్ ఘోషమల్, ఇన్స్పెక్టర్ మున్నవర్ కుల్షుంపురా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య కుల్షుంపురా, ఆసిఫ్ నగర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, గోల్కొండ ACP సయ్యద్ ఫియాజ్, ఘోషమల్ ట్రాఫిక్ CI బాలాజీ ధరావత్, గుడిమల్కాపూర్ CI రవి , టోలిచౌకి ట్రాఫిక్ CI సుధాకర్ ఉన్నారు. వైద్యుల సూచనలను స్వీకరించడంతోపాటు , వారి వ్యక్తిగత అధికార పరిధిలో ప్రజా భద్రతను ప్రోత్సహించడానికి దీన్ని ఆచరణలో చేర్చగల పద్ధతులను నేర్చుకున్నారు. భద్రతా ప్రోటోకాల్‌లు అమలుతోపాటు, మెదడు గాయం ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియజేసే విధంగా తమ బృందాలకు, సంఘాలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో నేర్చుకున్న వాటిని వినియోగిస్తామని పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. -
వైఎస్ఆర్ సీపీ యువత పోరును అడ్డుకుంటున్న పోలీసులు
-
భారత్ గెలుపు వేళ అభిమానులపై దాడి.. నిందితులకు పోలీసుల వింత శిక్ష
భోపాల్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా అభిమానాలు సంబరాలు జరుపుకున్నారు. సంబరాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అల్లర్లు చేలరేగాయి. అభిమానులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఘర్షణకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారికి పోలీసులు వింత శిక్ష విధించారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ టీమ్‌ని రోహిత్ సేన ఓడించింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేడక చేసుకున్నారు. విజయం అనంతరం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. అయితే, మధ్యప్రదేశ్ మోవ్, దేవాస్ నగరాల్లో విజయోత్సవాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేడుకల సందర్బంగా పట్టణంలోని జామా మసీదు దగ్గర అభిమానుల మీద దాడి జరిగింది. అక్కడ ఎందుకు ఊరేగింపు చేస్తున్నారంటూ గొడవ మొదలుపెట్టారు. మాటామాటా పెరగడంతో ఊరేగింపు మీద రాళ్ళు రువ్వారు. ఆ దాడిలో పలువురు క్రికెట్ ప్రేమికులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు అసాంఘిక శక్తులు క్రీడాభిమానుల వాహనాలను ధ్వంసం చేసారు. రెండు వాహనాలకు, రెండు దుకాణాలకూ నిప్పు పెట్టారు. దీంతో హింస చెలరేగింది.అయితే, దేవాస్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కొందరు యువకులు అత్యుత్సాహంతో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.VIDEO | Madhya Pradesh: Police shave heads and parade those accused of creating ruckus in Dewas after India's ICC Champions Trophy victory on the night of March 9. (Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/PqCIvX4p0y— Press Trust of India (@PTI_News) March 11, 2025 -
ఏపీ పోలీసులకు హైకోర్టు వార్నింగ్
-
కన్నడ నటి రన్యా రావ్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు
-
కోతిని తుపాకీతో కాల్చి వండి తినేశారు!
సేలం(తమిళనాడు): కోతిని(monkey) నాటు తుపాకీతో కాల్చి వండి తిన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..దిండుగల్ జిల్లా వీరసిన్నంపట్టి ప్రాంతానికి చెందిన రాజారాంకు అదే ప్రాంతంలో మామిడి, కొబ్బరి తో ఉంది. కోతకు వచ్చిన మామిడి కాయలను ఆరగిస్తూ కోతులు నష్టం కలిగించసాగాయి. దీంతో రాజారాం గ్రామానికి చెందిన జయమణికి రూ. 1000 ఇచ్చి కోతుల బెడద లేకుండా చేయాలని కోరారు. దీంతో జయమణి నాటు తుపాకీతో ఒక కోతిని కాల్చి, దాన్ని వండుకుని తిన్నట్టు తేలింది. ఇది తెలుసుకున్న సిరుమలై అటవీ శాఖ పోలీసులు రాజారాం, జయమణిలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
NRI డాక్టర్ రోజా మృతి కేసులో బిగ్ ట్విస్ట్
-
Vidadala Rajini: పత్తిపాటి పుల్లారావు డైరెక్షన్లో తప్పుడు కేసులు..ఇవిగో ఆధారాలు
-
సంబరాలు చేసుకుంటే తప్పేంటి ? రేవంత్ ను ప్రశ్నించిన బండి, కిషన్ రెడ్డి
-
దుబాయ్‌లో భర్త .. స్కూల్ ప్రిన్సిపాల్‌కి కాల్ చేస్తున్న యువకుడు
ఫిలింనగర్ (హైదరాబాద్): ‘ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్ చేస్తా’ అంటూ వివాహితను బెదిరిస్తున్న యువకుడిపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకి సమతాకాలనీలో నివసించే వివాహిత (32) స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కాగా, 2016 నుంచి భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. గత ఏడాది తన స్కూల్లో అడ్మిషన్లకు సంబంధించి ఇన్‌స్ట్రాగాంలో ప్రకటన పోస్ట్ చేసింది. షేక్ వసీం అనే యువకుడు ఆమె ఇన్‌స్ట్రాగాం అకౌంట్‌ను ఫాలో అవుతూ ఆమె ఫోన్ నెంబర్‌ను అడ్మిషన్ కావాలంటూ అడిగి తెలుసుకున్నాడు. తరచూ ఫోన్ చేస్తుండడంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో స్కూల్లో సిబ్బంది నుంచి ఆమె పర్సనల్ నెంబర్‌ను కూడా సేకరించాడు. అప్పటి నుంచి స్కూల్‌కు, ఆమె ఇంటికి తిరుగుతూ 24 గంటలూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో ఆమె పర్సనల్ నెంబర్‌ను కూడా లిఫ్ట్ చేయడం ఆపేసింది. ఈ నేపథ్యంలోనే షేక్ వసీం ర్యాపిడో డ్రైవర్‌ను బుక్ చేసుకుని ఆమె ఇంటికి పంపించి పార్శిల్ ఇస్తారు.. తీసుకురా అని చెప్పసాగాడు. ఆమె ఇంటికి వెళ్లిన ర్యాపిడో డ్రైవర్‌ను ఫోన్ ఆమెకు ఇవ్వు మాట్లాడతానంటూ వేధించడం మొదలుపెట్టాడు. గత ఏడు నెలల నుంచి నిందితుడి వేధింపులు రోజురోజుకు పెరిగాయి. ఇంటి చుట్టూ, స్కూల్ చుట్టూ తిరుగుతూ ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మరింత రెచ్చిపోయిన నిందితుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్ చేస్తానంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 78(2), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచక పర్వం.. వంతపాడుతున్న పోలీసులు
సాక్షి,నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయి. కొలిమిగుండ్ల మండలం చింత లాయపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. చీనితోటను జేసీబీతో నాశనం చేశారు. అయితే, చీనితోటను నాశనం చేయొద్దంటూ అడ్డుపడిన మహిళలపై కట్టెలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు,ఓ బాలిక తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ చీనితోట పంటవేసిన మూడు ఎకరాల పొలంపై కోర్టులో కేసు నడుస్తోంది. కేసు విచారణ కొనసాగుతుండగా సివిల్ కేసులో కొలిమిగుండ్ల సీఐ రమేష్ జోక్యం చేసుకున్నారు. ఆ పొలాన్ని టీడీపీ వర్గీయులకు అప్పగించాలంటూ సదరు పొలం యజమానిపై ఒత్తిడి తెచ్చారు. అయినా బాధితులు తలొగ్గక పోవడంతో కొలిమిగుండ్ల పోలీసులు దాడికి ఉసిగొల్పాడు.ఇక టీడీపీ నేతల దాడిలో బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితుల్ని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. బాధితులకు వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
బాలుడికి చెంపదెబ్బ.. పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్, ఆగిన శాలరీ హైక్
గాంధీ నగర్ : ప్రధాని మోదీ ఇవాళ తన సొంతరాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. అయితే, ఈ పర్యటనకు ముందు రోజు అంటే నిన్న ప్రధాని మోదీ ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు అధికారులు. అంత వరకు బాగానే ఉన్నా.. కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.ప్రధాని మోదీ రాక నేపథ్యంలో సెక్యూరిటీ రిత్యా ఆయా ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. గుజరాత్ పర్యటన వేళ గుజారత్‌లోని రతన్ చౌక్ వద్ద పోలీస్ ఉన్నతాధికారులు మోదీ కాన్వాయ్‌తో రిహారాల్స్ నిర్వహించారు. ఆ సమయంలో 17ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుకుంటూ పొరపాటున రిహార్సల్స్ జరిగే ప్రాంతం వైపు వచ్చాడు. వెంటనే రెప్పపాటులో సైకిల్‌ను వెనక్కి తిప్పాడు.అదే సమయంలో పక్కనే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ఎస్ బీఎస్ గాధ్వీ సదరు బాలుడిని జుట్టు పట్టుకుని లాగారు. ఆపై చెంప చెల్లు మనిపించాడు. దీంతో బాలుడు వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే, బాలుడిపై సదరు పోలీస్ అధికారి దాడి సమయంలో స్థానికంగా పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. సంబంధిత వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. వైరలైన వీడియోలపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ వానాని స్పందించారు. గాధ్వీ తీరు క్షమించరానిది. ప్రస్తుతం,మ్రోబి జిల్లాలో పోలీస్‌స్టేషన్‌లో విధిలు నిర్వహిస్తున్న ఆయన్ను కంట్రోల్ రూంకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు, ఏడాదిపాటు శాలరీ ఇంక్రిమెంట్ సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.This Gujarat Police officer brutally thrashed a harmless kid on a cycle just for coming in between the convoy of Police VVIP movement rehearsal.Look at how he makes a fist and punches the kid. NAME AND SHAME THIS COP UNITL HE IS SUSPENDED! pic.twitter.com/5a08yvdUVd— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025 -
వైఎస్ వివేకా వాచ్ మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
-
ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో పోసానిపై అక్రమ కేసు నమోదు
-
కొనసాగుతున్న కూటమి వేధింపులు.. పోసానిపై మరో కేసు నమోదు!
సాక్షి,గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో పోసానిపై మరో కేసు నమోదైంది. నరసరావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళీపై మరో కేసు నమోదైంది. దీంతో ఆదోని త్రీటౌన్ పోలీసులు గుంటూరు జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోసానిని గుంటూరు నుంచి కర్నూలుకు తరలిస్తున్నారు. -
హత్యలు చేసి... పుణ్యక్షేత్రాల్లో మకాం!
మార్కాపురం: అనుమానంతో భార్యను, ఆపై ఆమె తల్లిని హత్య చేసిన నిందితుడు పరారై.. పోలీసులకు దొరక్కుండా ఎనిమిది నెలలుగా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం యర్రగొండపాలెం మండలం యల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేళ్ల శ్రీనుకు, వేములకోట గ్రామానికి చెందిన కన్నెసాని నారాయణమ్మ కుమార్తె సునీతతో వివాహమైంది.భార్యపై అనుమానంతో తరచుగా వేధింపులకు గురిచేసేవాడు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 14న వేములకోటలోని తన అత్తగారింట్లో ఉన్న భార్య సునీతను రోకలిబండతో హత్యచేసి పరారయ్యాడు. పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే శ్రీను తన అత్త నారాయణమ్మను కూడా హతమార్చాలని నిర్ణయించుకుని గతేడాది జూన్ 30వ తేదీ రాత్రి వేములకోటలోని తన ఇంటిలో నిద్రపోతున్న ఆమెను కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపి పారిపోయాడు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పుణ్యక్షేత్రాల్లో నివాసం..నిందితుడైన శ్రీను హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకు పుణ్యక్షేత్రాల్లో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ వాడితే తనను పోలీసులు పట్టుకుంటారని భావించి దారిన పోయేవారి సెల్‌ఫోన్ తీసుకుని తెలిసిన వారికి ఫోన్‌చేస్తూ సమాచారం కనుక్కుంటూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు శ్రీనుకు తెలిసిన వారి ఫోన్నంబర్లపై నిఘా పెట్టారు. సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు ప్రత్యేక టీమును ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుడైన శ్రీను షిరిడీ, కాశీ, వేములవాడ, రామేశ్వరం, చెన్నై, పూణే తదితర ప్రాంతాల్లో ఉంటూ ఒక చోట టీ మాస్టరుగా, మరోచోట దోసె మాస్టరుగా హోటల్లో పనిచేస్తూ ఎక్కడా పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా మకాంలు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చాడు. కాగా నిందితుడు ఎక్కడ ఉన్నా శివాలయానికి వెళ్తాడని పోలీసులు గుర్తించి మాటు వేశారు. తిరుత్తణి దగ్గర త్రుటిలో తప్పించుకున్న శ్రీను శ్రీశైలం నుంచి త్రిపురాంతకం వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా శనివారం దేవరాజుగట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గాలింపు చర్యలు చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడు. అరెస్ట్ అనంతరం నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోలీసు సిబ్బందికి రివార్డులు.. ఎనిమిది నెలలలుగా తప్పించుకుని తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన శ్రీనును అరెస్టు చేసే విషయంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు, ఏఎస్సైలు ఎస్కే జిలానీ, డీ శ్రీనివాసరావు, సిబ్బంది వెంకటేశ్వర్లు, అరుణగిరి ఆంజనేయులు, జె వెంకటేశ్వర్లును ఎస్పీ దామోదర్ అభినందించారు. డీఎస్పీ నాగరాజు పలువురికి నగదు బహుమతి అందజేశారు. ప్రెస్మీట్లో సీఐ సుబ్బారావు, ఎస్సైలు అంకమరావు, సైదుబాబు పాల్గొన్నారు. -
సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: సైనిక్ స్కూళ్ల తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను కూడా దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో పోలీస్, యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నెలకొల్పాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్కూల్ బ్రోచర్, వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. స్కూల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రకటించారు. స్కూల్ యూనిఫామ్ నమూనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి శ్రీధర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర, ఐజీ రమేశ్, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 31న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ స్కూల్లో 50 శాతం సీట్లు యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 50 శాతం సాధారణ పౌరుల పిల్లలకు ఇస్తారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని అధికారుల బృందం గత రెండు నెలలుగా ఈ పాఠశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. అవసరమైన అనుమతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేశారు. -
పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ ట్వీట్
సాక్షి, అమరావతి: పోసాని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సినీ నటి పూనం కౌర్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులు ఇతర రాష్ట్రాల కంటే చాలా దారుణంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకోవడంలో వ్యక్తులను ఎత్తుకెళ్లడం చాలా బాధాకరం. ‘‘వ్యక్తిగతంగా నాకు భారీ నష్టం జరిగినప్పటికీ, సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అంటూ ఆమె ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.కాగా, పోసాని కృష్ణమురళి విషయంలో అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. పోసాని అనారోగ్యంతో ఉన్నా కానీ కూటమి సర్కార్ వేధింపుల పర్వం కొనసాగుతోంది. అరెస్టు సమయంలోనే తన అనారోగ్య సమస్యలు ఉన్నాయని పోసాని, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఎంఆర్ఐ చేయించుకోవాలని చెప్పినా కూడా వినిపించుకోకుండా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తమ దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారంటూ సంబేపల్లి ఎస్ఐ జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. తెల్లారిందాకా జీపులోనే తిప్పుతూ పోసానిని ఖాకీలు తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. 27న మధ్యాహ్నం ఓబులవారిపల్లె పీఎస్‌కు తరలించారు. అక్కడ ఏకంగా తొమ్మిది గంటల పాటు విచారించారు. -
పోసానిపై సీఐ స్టేట్మెంట్ ఇవ్వడమేంటి?.. ప్రకటనపై అనుమానాలు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిపై పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న పోసానిపై నాటకాలాడుతున్నారంటూ రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు ప్రకటన విడుదల చేయకుండా ముందుగానే సీఐ మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోసాని భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోసాని ఆరోగ్యంపై పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు.గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. పోసాని తీవ్రమైన గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్ హెర్నియా సర్జరీలో ఇన్ఫెక్షన్ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది.హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్ కార్డు సర్జరీ జరిగింది. కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్ సర్జరీ చేసిన స్టంట్ వేశారు వైద్యులు. హార్ట్ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో పోసాని బాధపడుతున్నారు. -
లైంగిక ఆరోపణలన్నీ నిజం కాదు: కేరళ హైకోర్టు
కొచ్చి: మగవారిపై లేనిపోని లైంగిక ఆరోపణలు చేసే మహిళల ఆటలు ఇకపై చెల్లవు. తప్పుడు లైంగిక ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించే మహిళలపై కేరళ హైకోర్టు(Kerala High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హైకోర్టు హెచ్చరించింది. ఫిర్యాదుదారులు చేస్తున్న ఆరోపణ అబద్ధమని తేలితే వారిపై చర్యలు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. మహిళలు దాఖలు చేస్తున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులన్నీ నూరు శాతం నిజమైనవి కావని, అందుకే ఇటువంటి ఫిర్యాదులపై వివరణాత్మక దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది.ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు స్వీకరించిన సందర్భంలో సంబంధిత అధికారులే కాదు, సదరు కోర్టులు కూడా చిక్కుల్లో పడతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన కన్నూర్‌కు చెందిన యువకునికి ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేస్తూ, జారీ చేసిన ఉత్తర్వులలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఎ. బదరుద్దీన్ ఈ విధంగా పేర్కొన్నారు.కొందరు మహిళలు చేసే ఫిర్యాదులు అబద్ధమని తెలిసినా, వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులు తటపటాయిస్తుంటారని, అటువంటి సందర్భాల్లో పోలీసులు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అధికారుల నిర్ణయాలు సరైనవైతే కోర్టు వారి ప్రయోజనాలను కాపాడుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. తప్పుడు ఫిర్యాదుల కారణంగా బాధితులకు కలిగే హానిని ఏ విధంగానూ తీర్చలేమని, అందుకే పోలీసులు దర్యాప్తు దశలోనే నిజానిజాలను నిర్థారించుకోవాలని కేరళ హైకోర్టు సూచించింది. ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో -
పెళ్లి అన్నాడు, పాప పుట్టాక కాదన్నాడు...
తిరుమలాయపాలెం(ఖమ్మం): అప్పటికే ఒకరి చేతిలో మోసపోయిన ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన దగ్గరి బంధువు పాప జన్మించాక ముఖం చాటేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలాయపాలెంకు చెందిన యువతికి నాలుగేళ్ల క్రితం క్రితం వివాహం జరగగా, 16 రోజులకే భర్త మరో మహిళతో వెళ్లిపోయాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటూ జీవనం సాగిస్తోంది. రెండేళ్లుగా ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుకు చెందిన మేనత్త కుమారుడు చిర్రా హరీశ్ వీరి ఇంటికి వచ్చివెళ్లే క్రమాన ఆమె అంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో ఆమె గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చాక తనతో ఎలాంటి సంబంధం లేదని, పాప తనకు పుట్టలేదంటూ హరీశ్ బుకాయించాడు. ఈక్రమాన ఆమె మూడు నెలల పాపను తీసుకుని హరీశ్ ఇంటికి వెళ్లగా ఆయనతో పాటు తల్లిదండ్రులు, సోదరి ఇంటికి రావొద్దని, వస్తే చంపేస్తామని బెదిరించారు. ఈమేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు. -
టీటీడీ చరిత్రలో బ్లాక్ డే..!
-
పోలీసులను ఒక్కటే అడుగుతున్న.. వల్లభనేని వంశీ భార్య ఎమోషనల్
-
పోసాని అరెస్ట్ విషయంలో ఏపీ పోలీసులు గేమ్!
-
పోసాని ఎక్కడ?.. పోలీసుల కుట్ర!
-
గుండెపోటుతో పడిపోయిన భక్తుడు... దేవుడిలా కాపాడిన పోలీసులు
-
Chandrashekhar Azad: ‘నా పేరు ఆజాద్.. స్వాతంత్ర్యం నా తండ్రి’
చంద్రశేఖర్ ఆజాద్(Chandrashekhar Azad).. దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు. 1906, జూలై 23న మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలోని భాబ్రాలో జన్మించిన ఆయన 1931, ఫిబ్రవరి 27న కన్నుమూశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిపడిన యువకెరటంగా పేరొందిన ఆయన వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని జీవితంలోని ప్రముఖ ఘట్టాలను గుర్తుచేసుకుందాం.చంద్రశేఖర్ చాలా చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్య పోరాటం(freedom fight)లో భాగస్వామ్యం వహించారు. 1922లో చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీజీ తన ఉద్యమాన్ని ఉపసంహరించడంతో ఆజాద్ కాంగ్రెస్ తీరుపై నిరాశచెందారు. దీని తరువాత ఆయన 1924లో పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, సచింద్రనాథ్ సన్యాల్, యోగేష్ చంద్ర ఛటర్జీ ఏర్పాటు చేసిన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరారు. దీనిలో చంద్రశేఖర్ తొలుత రామ్ ప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలో 1925లో కాకోరి ఘటనలో చురుకుగా పాల్గొన్నారు.చంద్రశేఖర్ 1928లో లాహోర్‌లో బ్రిటిష్ పోలీసు అధికారి ఎస్పీ సాండర్స్‌ను కాల్చి చంపి, లాలా లజపతి రాయ్(Lala Lajpati Roy) మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇది విజయవంతం కావడంతో చంద్రశేఖర్ బ్రిటిష్ ఖజానాను దోచుకుని, హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు నిధులు సమకూర్చారు. వీటిని విప్లవాత్మక కార్యకలాపాలకు వినియోగించేవారు. ఈ సంపద భారతీయులదని,దీనిని బ్రిటిష్ వారు దోచుకున్నారని చంద్రశేఖర్ తరచూ అనేవారు.‘ఆజాద్’ పేరు వెనుక..చంద్రశేఖర్‌కు ‘ఆజాద్’ అనే పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆయన 15 ఏళ్ల వయసులో ఏదో ఒక కేసులో న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. అక్కడ, న్యాయమూర్తి అతనిని పేరు అడిగినప్పుడు.. ‘నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు ఇండిపెండెన్స్, నా ఇల్లు జైలు’ అని చెప్పారు. ఈ మాట విన్న న్యాయమూర్తి ఆగ్రహించి, చంద్రశేఖర్‌కు 15 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ పేరు ఆజాద్ అయ్యింది. చంద్రశేఖర్ జీవితాంతం స్వేచ్ఛను కోరుకున్నారు.బ్రిటిషర్లతో పోరాడటానికి చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌లో సుఖ్‌దేవ్, అతని ఇతర సహచరులలో కలిసి ఒక పార్కులో కూర్చుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయం బ్రిటిష్ పాలకులకు తెలిసింది. దీంతో బ్రిటిష్ పోలీసులు అకస్మాత్తుగా చంద్రశేఖర్‌పై దాడి చేశారు. ఆజాద్ పోలీసుల తూటాలకు తీవ్రంగా గాయపడ్డారు. తాను బ్రిటిషర్లకు ఎప్పటికీ పట్టుబడనని, వారి ప్రభుత్వం తనను ఏనాటికీ ఉరితీయలేనని గతంలో ఆజాద్ పేర్కొన్నారు. అందుకే తన పిస్టల్‌తో తనను తాను కాల్చుకుని, మాతృభూమి కోసం తన ప్రాణాలను అర్పించారు ఆజాద్. ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి -
కూటమి కక్ష.. పోసాని కృష్ణమురళీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉన్న పోసానిని కూడా కూటమి సర్కార్ వదలలేదు. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు.పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడుతున్నారు. అరెస్టు నోటీసులో రేపటి తేదీ వేశారు. మరో వైపు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కాని, పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబర్లో ఓబులపల్లి పీఎస్ అంటూ పోలీసులు చెప్పారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోసానిపై 111 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ వర్గాలు అంటున్నాయి.కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధింపులు: అంబటి రాంబాబుఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. ‘కూటమి ప్రభుత్వం కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోసానిని తీసుకెళ్లారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది’’ అంబటి దుయ్యబట్టారు. -
‘నాపై కేసులన్నీ ఆరోపణలే’
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ ముగిసింది. ఐదు గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వంశీని జీజీహెచ్‌కి పోలీసులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. విచారణలో భాగంగా వంశీని 20 ప్రశ్నలను పోలీసులు అడిగారు. తనపై ఉన్న కేసులు తప్పుడువేనని వంశీ చెప్పినట్లు సమాచారం. తనపై కేసులు అన్ని ఆరోపణలేనని.. కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందేనని చెప్పినట్లు తెలిసింది.కాగా, వంశీ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో వంశీకి జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. దీంతో వంశీతో పాటు మరో నలుగురిని పోలీసులు మంగళవారం వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి మార్చి 11 వరకు రిమాండ్‌ను పొడిగించారు.అనంతరం పోలీసులు వంశీతో పాటు మరో నలుగురికి వైద్యపరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. కాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా స్థలం కబ్జా పేరుతో మంగళవారం మరో కేసును గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు. -
పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు
డీజీపీ పోస్టుపై మాకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండానియంత్రించుకుంటున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరాం. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: డీజీపీ పోస్టుపై తమకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండా నియంత్రించుకుంటున్నామని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆక్షేపించింది. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరామని పేర్కొంది. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) అందుబాటులో లేనందున సహాయ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను మార్చి 11వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రమణ అక్రమ నిర్బంధంపై పిటిషన్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖ జిల్లా మద్దిపాలెం, చైతన్యనగర్‌కి చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పరస్పర విరుద్ధంగా రెండు నివేదికలు... ధర్మాసనం ఆదేశాల మేరకు బొసా రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ తమ నివేదికలను అందచేశారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, ఈ రెండు నివేదికల్లో అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. రమణను పొదిలి పోలీసులు విశాఖలోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారని కమిషనర్ చెబుతుండగా.. ప్రకాశం ఎస్పీ మాత్రం విశాఖ ఎంవీవీ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారని తెలిపింది. అరెస్ట్ విషయంలో వాస్తవాలను కోర్టు ముందుంచడం లేదని, అందువల్లే డీజీపీ నుంచి నివేదిక కోరామని స్పష్టం చేసింది. వర్రా అక్రమ నిర్బంధం కేసులో విద్యాసాగర్ నాయుడుకు నోటీసులుసోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో వైఎస్సార్ కడప జిల్లా అప్పటి ఇన్చార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని హైకోర్టు సుమోటోగా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చింది. వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధం విషయంలో వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్‌పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు తెలిపింది. వాటికి బదులివ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందని స్పష్టం చేసింది. తన భర్త రవీంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వర్రా కళ్యాణి గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకి హైకోర్టు నోటీసులు
అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ. వర్రారవీంద్ర రెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో అప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్చార్జి ఎస్పి విద్యాసాగర్ నాయుడుని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చిన హైకోర్టు.వర్రా రవీంద్ర రెడ్డి నిర్బంధం విషయంలో వివరణకు అప్పటి ఇంచార్జ్ ఎస్పి విద్య సాగర్ నాయుడుని ఆదేశించిన కోర్టు. తదుపరి విచారణ మార్చి 10వ తేదీకి వాయిదా -
అవే కొంపముంచాయా? కోలకత్తా సెన్సేషనల్ కేసులో బిగ్ ట్విస్ట్!
కోలకతాలోని టాంగ్రాలోని నాలుగు అంతస్తుల భవనంలో ఒకే కుటుంబంలో ఒక మైనర్ బాలికతో సహా ముగ్గురు మహిళల హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా పోలీసులు ఆ కుటుంబం భారీ అప్పులు చేసిందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీవిలాసవంతమైన జీవనశైలిని వీడలేదు.ఈ కారణంగానే భార్యల్ని హత్యచేసి, ఆ తరువాత ఆత్మహత్యా యత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు హత్యలు జరిగిన రోజు ఇంట్లోని సీసీటీవీలను కూడా ఆఫ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.ప్రణయ్ డే , ప్రసున్ డే కుటుంబాలు విలాసవంతమైన జీవితానికి అలువాటుపడి అప్పుల పాలైపోయారు. అయినా ఇద్దరు సోదరులు తమ విలాసవంతమైన జీవనశైలిని వీడలేదు. దీనివల్ల అప్పులు మరింత పెరిగాయి. తోలు వస్తువుల వ్యాపారం చేసే వీరికి భారీ అప్పులు చేసిందని, అందుకే ఇద్దరు సోదరులు ఈ చర్యకు పాల్పడి ఉండవవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీసు వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితుల విచారణలో ఈ విషయాలు తేలాయని పోలీసులు తెలిపారు. చదవండి: రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీచందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఫిబ్రవరి 19 ఉదయం కోల్‌కతా తూర్పు శివార్లలోని టాంగ్రాలోని వారి నివాసం నుండి ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోదరులు ప్రణయ్, ప్రసున్ డే, వారి భార్యలు సుధేష్ణ, రోమి డేలతో కలిసి టాంగ్రాలోని ఇంట్లో నివసించేవారు. ప్రణయ్ సుధేష్ణల దంపతులకు ప్రతీక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అన్నదమ్ములిద్దరూ తమ భార్యల్ని, కుమార్తెను (ప్రణయ్ భార్య సుధేష్ణ (39), ప్రసున్ భార్య రోమి (44), ప్రసున్-రోమి కుమార్తె ప్రియాంవద(14)) హత్య చేసిన తరువాత ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నం విఫలం కావడంతో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. మరోవైపు మృతుల దేహాలపై గాయాలుండటం మరింత అనుమానాలను తావిచ్చింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఇవి హత్యలుగా తేలాయి. దీంతో ప్రణయ్, ప్రసున్లను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిమూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!అనేక అనుమానాలు, ప్రశ్నలుకోల్కతాలోనిఒక ఇంట్లో మైనర్‌బాలికతో సమా ఇద్దరు మహిళ హత్యలు గ్భ్రాంతికి గురిచేశాయి. అందరమూ కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకుని విషంతీసుకున్నామని, ప్రసున్, ప్రణయ్ తెలిపారు.కుటుంబ సభ్యులందరూ డ్రగ్ కలిపిన డెజర్ట్ తిన్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు.కానీ బాలికలో తప్ప, మిగిలిన ఇద్దరి మహిళల్లో విషయ ప్రయోగం జరిగిన దాఖలు కనిపించలేదని కూడా ఆయన తెలిపారు. పైగా పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు, తీవ్ర రక్త స్రావంగానే మరణాలు సంభవించాయని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. అలాగే మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుండి బుధవారం తెల్లవారుజామున 1 గంట మధ్య హత్యకు గురయ్యారు.బుధవారం తెల్లవారుజామున 12.51 గంటలకు ఇంటి నుండి బయలుదేరిన తర్వాత (సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం) అలా చేయడానికి వారికి రెండున్నర గంటలు ఎందుకు పట్టింది?ప్రమాదానికి ముందు వారు రెండున్నర గంటలు నగరం చుట్టూ ఎందుకు తిరిగారు?మంగళవారం ఇంటికి వచ్చిన పనిమనిషిని బుధవారం ఉదయం రమ్మని ఎందుకు అడిగారు?ఎయిర్‌బ్యాగ్‌లతో కారును ఢీకొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? బాలికను హత్య చేసి అబ్బాయిని తమ వెంట ఎందుకు తీసుకెళ్లారు? -
రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే!
అత్తాకోడళ్లంటే శత్రువులు అనే భావన చాలామందిలో స్థిరపడిపోయింది. వీరి మధ్య జరిగే వివాదాలను టీవీ సీరియళ్లలో ఆసక్తికరంగా చూపిస్తుంటారు. చిన్నపాటి విషయానికే కొందరు అత్తాకోడళ్లు తెగ తిట్టేసుకుంటారని, కొట్టేసుకుంటారనే ఆరోపణలు వినిపిస్తుంటాయ. తాజాగా అత్తాకోడళ్లకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రోడ్డున పడిన అత్తాకోడళ్ల ఉదంతం చోటుచేసుకుంది. సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో అత్తాకోడళ్లు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, కొట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరస్పరం తిట్టుకోవడంతో పాటు దుస్తులు చించుకునే వరకూ వెళ్లడాన్ని ఈ వీడియోలొ చూడవచ్చు. వారి కుటుంబ సభ్యులు అత్తాకోడళ్లను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ మాత్రం ఫలితం ఉండదు. Kalesh b/w Mother-in-Law and Daughter-in-Law Outside Court, Nashik MHpic.twitter.com/QAjcpr6sYu— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2025ఈ అత్తాకోడళ్లు(Daughter-in-laws) యద్ధంలో ముందుగా అత్త తన కోడలి జుట్టు పట్టుకుని కింద పడేస్తుంది. అయితే కోడలు తాను ఏం తక్కువ తిన్నానంటూ అత్తపై దాడికి దిగుతుంది. ఈ వీడియోలో నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ అత్తా కోడళ్ల యుద్దానికి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం కుటుంబ కలహాలకు మించిన రేంజ్లో ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం. ఇది కూడా చదవండి: Mahashivratri: మహాశివరాత్రి ఎలా మొదలయ్యిందంటే.. -
Visakhapatnam: మహిళపై జ్యోతిష్యుడు అత్యాచారం..
కొమ్మాది(విశాఖపట్నం): పెందుర్తి బీసీ కాలనీకి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర (50) అస్థి పంజరం కేసు మిస్టరీ వీడింది. భీమిలి నేరెళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక, ఊళ్ల చిన్నారావు పథకం ప్రకారం అతన్ని హత్య చేశారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు, సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమిలి పోలీసులు నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాలివి..పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్‌లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటింటికీ వెళ్లి జ్యోతిష్యం చెబుతుంటాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లలో పూజలు చేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఆయన ఈ నెల 9న ఆనందపురం వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి రాకపోవడంతో 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఉప్పాడ ప్రాంతంలో అప్పన్న తప్పిపోయినట్లు గుర్తించి, ఆ ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. అక్కడ ఓ ప్రైవేట్ లేఅవుట్లో అప్పన్నకు సంబంధించిన అవశేషాలు గుర్తించారు.పథకం ప్రకారం.. కత్తితో పొడిచికాగా.. నిందితులు నెల రోజుల కిందట ఆనందపురం మండలం లొగడలవానిపాలెంలో ఒక అద్దె ఇంట్లో దిగారు. అక్కడకు సమీపంలో ఉన్న యడ్ల తిరుపతమ్మ అనే టీ దుకాణం యజమానితో వారికి పరిచయం ఏర్పడింది. అదే టీ దుకాణానికి ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వస్తుండేవాడు. చుట్టు పక్కల గ్రామాల్లో వాస్తు, పూజలు చేస్తుండేవాడు. తనకు కూడా సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని నిందితురాలు అప్పన్నకు చెప్పగా ఇంటికి వచ్చి పూజలు చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో మౌనిక ఇంటికి వెళ్లిన అప్పన్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికై నా చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆమె ఈ విషయాన్ని తన భర్త చిన్నారావుకు తెలియజేయగా అప్పన్న దొరను హత్య చేయడానికి పథకం వేశారు. ఉప్పాడలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, పూజ చేయాలని చిన్నారావు అప్పన్నను నమ్మించాడు. రూ.7 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 9న బటన్ కత్తి, పల్సర్ బైక్ తెప్పించుకుని అతన్ని ఆనందపురం మండలం క్రాస్ రోడ్డు, బోయపాలెం మీదుగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లే అవుట్‌కు తీసుకువెళ్లాడు. అతన్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చిన్నారావు కుడిచేతి చూపుడు వేలికి గాయం కాగా కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్నాడు.ఒక రోజు ఆగి..ఆధారాలు లేకుండా చేసేందుకు తర్వాత రోజు టిన్నర్, పెట్రోల్ కొనుగోలు చేశాడు. 11వ తేదీ వేకువజాము 4 గంటల సమయంలో రెండు లీటర్ల టిన్నర్, మరో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని తన భార్యతో కలిసి బయలుదేరాడు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో చిన్నారావు జ్యోతిష్యుడిని హత్య చేశాడని, ఈ ఘటనలో భర్తకు మౌనిక సహకారం అందించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ బి.సుధాకర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బటన్ కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్ ప్యాంటు, అప్పన్నదొర ఫోన్ పౌచ్, లైటర్, పల్సర్ ద్విచక్రవాహనం, కీ పాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై! -
యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా.. 10 మంది మహిళలు అరెస్ట్
గుణదల(విజయవాడతూర్పు): స్పా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై మాచవరం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు సమీపంలో స్టూడియో 9, ఏపీ 23 పేరుతో చలసాని ప్రసన్న భార్గవ్ ప్రైవేట్ యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఆ బిల్డింగ్ పై భాగంలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆ ముసుగులో స్పా సెంటర్లో వ్యభిచార గృహం నడుపుతున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అక్రమంగా రప్పించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. అమ్మాయిలతో వల వేసి బడా బాబులను టార్గెట్ చేసి లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. ఆ బిల్డింగ్‌లో వ్యబిచారం జరుగుతున్నట్లు మాచవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి స్పా సెంటర్ పై దాడి చేశారు. అక్కడ ఉన్న పది మంది మహిళలను, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దాడి విషయం తెలిసిన భార్గవ్ పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలసులు గాలిస్తున్నారు.మరెన్నో ఆరోపణలు..భార్గవ్‌కు పలు వ్యభిచార ముఠాలతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూ ట్యూబ్ చానల్ పేరుతో ధనికులను, అధికారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నేతగా చెలామణి అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..! -
వివేకా హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రలు
-
పులివెందుల పోలీసులకు ఎదురుదెబ్బ
-
కోర్టులో పులివెందుల పోలీసులకు చుక్కెదురు
-
వైఎస్ జగన్ మీద అసభ్యకరమైన పోస్టులపై YSRCP లీగల్ సెల్ ఫిర్యాదు