
10 మంది మహిళలు, 13 మంది విటుల అరెస్ట్
పరారీలో నిర్వాహకుడు ప్రసన్న భార్గవ్
గుణదల(విజయవాడతూర్పు): స్పా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై మాచవరం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు సమీపంలో స్టూడియో 9, ఏపీ 23 పేరుతో చలసాని ప్రసన్న భార్గవ్ ప్రైవేట్ యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఆ బిల్డింగ్ పై భాగంలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆ ముసుగులో స్పా సెంటర్‌లో వ్యభిచార గృహం నడుపుతున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అక్రమంగా రప్పించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు.
అమ్మాయిలతో వల వేసి బడా బాబులను టార్గెట్ చేసి లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. ఆ బిల్డింగ్‌లో వ్యబిచారం జరుగుతున్నట్లు మాచవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి స్పా సెంటర్ పై దాడి చేశారు. అక్కడ ఉన్న పది మంది మహిళలను, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దాడి విషయం తెలిసిన భార్గవ్ పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలసులు గాలిస్తున్నారు.
మరెన్నో ఆరోపణలు..
భార్గవ్‌కు పలు వ్యభిచార ముఠాలతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూ ట్యూబ్ చానల్ పేరుతో ధనికులను, అధికారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నేతగా చెలామణి అవుతున్నట్లు చెబుతున్నారు.
ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..!