spa centers
-
Film Nagar: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మార్గాల్లో క్రాస్ మసాజ్ చేస్తున్న స్పా సెంటర్‌పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్ రోడ్డు నెంబర్–5లో అర్బన్ రిట్రీట్ పేరుతో మసాజ్ పార్లర్ నిర్వహిస్తున్నాడు. అయితే వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు అందుకున్న ఫిలింనగర్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలువురు యువతులు మసాజ్ థెరపిస్టుల పేరుతో క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో స్పా యజమాని అక్షయ్ బొహ్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త స్నేహితుడని కారు ఇస్తే... వెంగళరావునగర్: భర్త స్నేహితుడని నమ్మి కారు ఇస్తే దాన్ని సదరు వ్యక్తి తాకట్టు పెట్టిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... కె.లక్ష్మి అనే మహిళ కళ్యాణ్నగర్కాలనీలోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత ఏడాది జూన్ 10వ తేదీ తన భర్త స్నేహితుడైన పరమేశ్వర్‌రెడ్డి వచ్చి తన కారును తీసుకెళ్లాడు. నాలుగు రోజుల్లో ఇస్తానని చెప్పాడు. అయితే ఎంతకీ కారును తీసుకురాలేదు. ఈ నెల 5వ తేదీనాడు చల్లా మనోహర్ యాదవ్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి పరమేశ్వర్‌రెడ్డి కారును తనకు మార్ట్గేజ్ చేశాడని తెలియజేశాడు. దాంతో ఆమె మధురానగర్ పీఎస్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘పచ్చ’ బంధాలతో ‘రొచ్చు’ బిజినెస్
అప్పట్లో టీడీపీ పాలనలో కాల్‌మనీ కాలనాగులు.. ఇప్పుడు కూటమి సర్కారులో స్పా సెంటర్ల విష సర్పాలు..! నాడు మహిళలకు అధిక వడ్డీకి అప్పులిచ్చి.. తీర్చలేనివారిని వ్యభిచార రొంపిలోకి దించింది పచ్చ మూక..! నేడు స్పా సెంటర్ల ముసుగులోనూ అదే తీరున గలీజు దందా..! దాదాపు పదేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ రాకెట్ కొత్త అవతారంలో పుట్టుకొచ్చిందా అన్నట్లు.. ప్రస్తుతం స్పా రాకెట్ సాగుతోంది..! అప్పుడు.. ఇప్పుడు ఈ అరాచకానికి బలవుతున్నది మహిళలే కాగా.. అడ్డా విజయవాడనే కావడం.. గమనార్హం..! సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పైకి మసాజ్ కేంద్రాలు.. లోపల వ్యభిచార దందా..! అధికార కూటమి పార్టీలలోని ముఖ్య, ద్వితీయ స్థాయి నేతలతో ఉన్న సత్సంబంధాలే పునాది.. సమాజంలో ఉన్న పలుకుబడేపెట్టుబడి..! వాటితోనే కోట్లాది రూపా యల దందా..! కాల్ మనీ–సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో మునిగితేలిన టీడీపీ నాయకుల బాగోతాలు ఇదివరకే బట్టబయలయ్యాయి. ఇప్పుడు ‘స్పా’ (మసాజ్) సెంర్ల వంతు వచ్చింది. విజయవాడ నగరంలోని స్పా సెంటర్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాచవరం పోలీసులు గత నెలలో దాడిచేసి పది మంది మహిళలు, 13 మంది విటులను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్పాలలోని లోగుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్పాల నిర్వాహకులతో ‘క్రిడ్ ప్రోకో’ సంబంధాలున్న నాయకులు, పోలీసులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కూటమి వచ్చాక పట్టపగ్గాల్లేకుండా.. ఆరేడు నెలల్లో ‘స్పా’లలో వ్యభిచార, ఇతర జుగుప్సాకర వ్యవహారాలు పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలోని కొందరు కూటమి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల సహకారంతోనే నిర్వాహకులు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ధనికులు నివసించే కాలనీలు, కాస్త చాటుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్పాలను నెలకొల్పుతూ, ప్రాచుర్యం పొందిన తర్వాత అక్కడినుంచి మార్చేస్తూ కొత్త పేర్లతో నెలకొల్పుతూ దందా నడిపిస్తున్నారు. అబ్బో భార్గవ్.. అతడే సూత్రధారి చలసాని ప్రసన్నభార్గవ్.. విజయవాడ స్పా సెంటర్ల దందాలో ఇతడే కింగ్ పిన్. స్టూడియో 09, ఏపీ22 పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ అదే భవనం పైన స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్నాడు. గత నెలలో పోలీసులు దాడి చేసింది ఇతడి స్పా సెంటర్ పైనే. అయితే, పోలీసుల రాకపై నిర్వాహకుల హెచ్చరికలతో పలువురు తప్పించుకున్నారు. కాగా, ఏలూరుకు చెందిన భార్గవ్ తనకు కూటమి పార్టీల్లోని పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయంటూ వేర్వేరు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫొటోలను చూపుతూ హల్చల్ చేస్తున్నాడు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తదితరులతో కలిసి దిగిన ఫొటోలను అవసరమైన చోట ప్రదర్శిస్తూ ఫలానా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తమ బంధువులని, ప్రభుత్వమూ తమవాళ్లదేనంటూ హడావుడి చేస్తున్నాడు. దీనికోసం యూట్యూబ్ చానల్‌నూ అడ్డుపెట్టుకుంటున్నాడు. నల్ల అద్దాలతో కూడిన ఖరీదైన వాహనాలకు కూటమి పార్టీల లోగోలు ఏర్పాటు చేసుకుని అమ్మాయిల తరలింపునకు వాడుతున్నారు. విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారులు, ముఖ్య నాయకులతో ఉన్న సంబంధాలతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోనూ స్పాల మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నాడనే ఫిర్యాదులు ఉన్నాయి. భార్గవ్.. తెలుగు రాష్ట్రాల్లోని స్పా సెంటర్లకు అధ్యక్షుడిగా, ఆర్గనైజర్గానూ వ్యవహరిస్తుండడం గమనార్హం. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్పాల ముసుగులో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార కేంద్రాలకు అమ్మాయిల సరఫరాను భార్గవ్ విజయవాడ నుంచి మార్గదర్శనం చేస్తుంటాడు. ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే సాగిస్తున్నాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలి? ఏ అకౌంట్లో ఎంత మొత్తం జమ చేయాలి? ఏయే ఖాతాలకు బదిలీ చేయాలి? డెన్ల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించడం.. అంతా ఫోన్‌తోనే. దీంతో ప్రసన్న భార్గవ్ వేర్వేరుచోట్ల ఉన్నా రాకెట్‌ను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాడు. రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ స్పా సెంటర్లకు.. ఇదివరకే పరిచయాలున్న, వృత్తికి అలవాటుపడిన ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలను, వారి ద్వారా కొత్తవారిని పిలిపిస్తుంటారు. వారినుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయించుకుంటారు. ఈ డబ్బు తిరిగివ్వరు. కొందరినైతే రెండు, మూడు నెలలు కాంట్రాక్టు పద్ధతిన నిర్ణీత మొత్తానికి కుదుర్చుకుంటారు. వీరిని బృందాలుగా విభజించి ఇతర స్పాలకూ పంపుతుంటారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి సౌకర్యాలున్న రూంలను వారం, పది, పదిహేను రోజుల చొప్పున కేటాయిస్తారు. భార్గవ్ బృంద సభ్యులు సమాచారం ఇచ్చి విటులను రప్పిస్తుంటారు. వారి నుంచి రూ.5 వేలు–రూ.25 వేలు, అవగాహనను బట్టి ఇంకా ఎక్కువ యువతులు వసూలు చేసుకుంటారు. తమ డిపాజిట్‌ను మించి సంపాదించుకుని స్వస్థలాలకు, లేదా నిర్వాహకులు సూచించిన ఇతర ప్రాంతాల్లోని స్పా సెంటర్లకు వెళ్లిపోతారు.అదే సమయంలో స్పా నిర్వాహకులు కౌంటర్ ఫీజు కింద విటుల నుంచి రూ.2,500–రూ.6,500, ఒక్కో యువతి నుంచి టిప్ కింద రూ.1,500–రూ.2 వేల వరకు లాగేసుకుంటున్నారు. మొత్తంమీద నెలకు 80 నుంచి 90 మంది యువతుల ద్వారా డిపాజిట్లు, టిప్స్, కౌంటర్ ఫీజు తదితరాల రూపంలో భార్గవ్ ముఠా నెలకు రూ.రెండున్నర నుంచి రూ.3 కోట్లు పోగేసుకుంటోంది. ఇందులో పోలీసులతో పాటు ఎవరి వాటా వారికి చేరుతుంది. అనుచర బృందంతో వ్యవహారాలు చలసాని ప్రసన్న భార్గవ్‌కు అత్యంత నమ్మకమైన సహచర బృందం ఉంది. వీరిలో మహిళలే అధికం. భార్గవ్ వ్యక్తిగత అనుచరుడు కుమార్ తన సోదరి పేరిట స్పాలు, సెలూన్లు నిర్వహిస్తున్నారు. సతీష్ యువతుల సరఫరా మొదలు ఇతర పనులు చేస్తుంటాడు. గోపీచౌదరి వ్యాపార భాగస్వామి. పోలీసులు, మీడియా వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు యువతుల సరఫరాలో ప్రధాన బాధ్యత ఇతడిదే. నాలుగు నెలల కిందటే ఫిర్యాదు చేసినా‘నాలుగైదు నెలల కిందటే పై విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మహిళా సంఘాల వారికీ వివరించాం. వారు ఉన్నతా«ధికారులకు చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి ఒకరు ఒకటి, రెండు స్పా సెంటర్లకు వెళ్లి భారీఎత్తున బేరం కుదుర్చుకున్నారు. హెచ్చరికలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. మొక్కుబడిగా స్పా ముసుగులోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇలాంటివి విజయవాడలో ఎన్ని ఉన్నాయో పోలీసులకు బాగానే తెలుసు. –భార్గవ్ బాధితురాలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ ప్రెసిడెంట్‌గా.. చలసాని ప్రసన్న భార్గవ్ ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా– ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్’ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2024 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు సర్టిఫికెట్ ఉంది.కోడ్ పేర్లతో ఎర.. రాష్ట్రంలోని తన స్పాలకు వచ్చే యువతులు, విటులతో పాటు ఇతర స్పాలకు క్లయింట్లుగా వెళ్లి సమాచారాన్ని రాబట్టడం, ఆ తరువాత బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం భార్గవ్ బృందం దందాలో మరో కోణం. టెలిగ్రామ్, సీక్రెట్ నంబర్ల ద్వారా స్పాకు కొత్త యువతులు వచ్చారంటూ విటులకు సమాచారం చేరవేస్తుంటారు. ‘ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్యూ ఫ్లవర్స్ అవైలబుల్, ఫ్రెష్ లుక్స్, హాయ్ ఫ్రెండ్స్, న్యూ చాక్లెట్ అవైలబుల్’ వంటివి వారి కోడ్ పదాలు. ఆటో లిఫ్ట్, పిక్ అప్ మి లాంటి యాప్స్ ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఆహ్వానాలు ఉంటాయని సమాచారం. దాదాపు ఎనిమిది మంది సిబ్బందికి అదే పని. స్పాలలో డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. స్టాఫ్‌కు కూడా వీటి వివరాలు తెలియవు. స్పాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ స్థానిక పేద విద్యార్థినులు, యువతులను కూడా రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారాల ముసుగులో.. చలసాని ప్రసన్న భార్గవ్.. చలసాని కన్స్ట్రక్షన్స్, చలసాని మీడియా, పాంపరింగ్ రిసార్ట్స్ అండ్ స్పా, ఏపీ23 న్యూస్, స్టూడియో 9 సెలూన్ అండ్ స్పా, కోజి 9 సెలూన్ అండ్ స్పా, సిగ్నేచర్ సెలూన్ అండ్ స్పాతో పాటు మరికొన్నింటిలో వ్యాపార భాగస్వామి. ఇతరుల వ్యాపారాల గురించి తెలుసుకోవడం, పెట్టుబడిదారుగా చేరడం, కొంతకాలానికి వారిని దెబ్బతీయడం అతడి నైజమని బా«ధితులు వాపోతున్నారు. విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆయన చేతిలో మోసపోయినవారున్నారని గుర్తు చేస్తున్నారు. కాగా, భార్గవ్ తన బృందంలోని ముఖ్యులకు ఏరోజుకారోజు రాబడిలో పది నుంచి ముప్పయి శాతం వాటా ఇస్తున్నాడు. దీంతో యువతుల రాకపోకల నుంచి విటులకు ఆహ్వానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. భిన్న రకాల మీడియా మాటున ఏ రంగం వారినైనా బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడడని, తనకు సమాచారం ఇచి్చనవారికి దండిగానే ముట్టజెబుతాడని సమాచారం. -
స్పా సెంటర్లకే భారీ టోకరా
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ముఠా పశ్చిమ మండలంలోని స్పా సెంటర్లను టార్గెట్‌గా చేసుకుంది. ఆయా సెంటర్లకు కస్టమర్‌గా వెళ్లి, అసాంఘిక కార్యకలాపాల రంగు పూసి, సోదాలు చేసి, భయభ్రాంతులకు గురి చేసి, సెటిల్మెంట్కు పిలిచి, అందినకాడికి దండుకుంటోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ సహా అనేక చోట్ల పంజా విసిరిన ఈ ముఠా ఇప్పటికి దాదాపు రూ.50 లక్షల వరకు కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌కు కొందరు పోలీసులు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ చేసి, కస్టమర్‌గా వెళ్లి... వెస్ట్‌జోన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్పా లేదా మసాజ్ సెంటర్ వద్ద రెక్కీ నిర్వహిస్తున్న ఈ ముఠా అనువైన దాన్ని టార్గెట్ చేసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్‌లోనూ వీటిని ఎంపిక చేసుకుంటోంది. ఆపై దాని ఫోన్ నెంబర్ సేకరించే ఈ ముఠా సభ్యుడు నిర్వాహకులకు కాల్ చేస్తాడు. కస్టమర్ మాదిరిగా మాట్లాడుతూ ఆయా సెంటర్లు అందించే సేవలు, వాటి రుసుముల్ని తెలుసుకుంటాడు. ఈ తంతు పూర్తయిన తర్వాత వినియోగదారుడి మాదిరిగా ఆ సెంటర్‌కు వెళ్లే అతగాడు తనతో పాటు కండోమ్ ప్యాకెట్లు తీసుకువెళ్తాడు. ఇతడు వెళ్లే సమయంలో మిగిలిన ముఠా సభ్యులు ఆ సెంటర్‌కు సమీపంలోనే వేచి ఉంటారు. స్పా సెంటర్లోకి వెళ్లిన ముఠా సభ్యుడు అదును చూసుకుని తనతో తెచ్చిన కండోమ్ ప్యాకెట్లను మసాజ్ టేబుల్ కింద పడేస్తాడు. ఆ తర్వాత మిగిలిన వారికి సందేశం ఇచ్చి పోలీసుల మాదిరిగా రమ్మంటాడు. దాడి చేసి, హడావుడి చేస్తూ.... ఈ సందేశం అందుకున్న వెంటనే సమీపంలో వేచి ఉన్న ముఠా సభ్యులు పోలీసుల మాదిరిగా ఆ సెంటర్‌పై దాడి చేస్తారు. తొలుత సీసీ కెమెరాలను ఆపేసి, వాటి దృశ్యాలు రికార్డు అయ్యే డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) స్వాదీనం చేసుకుంటున్నారు. స్పా మొత్తం సోదాలు చేస్తున్నట్లు నటిస్తూ తమ ముఠా సభ్యుడు ఉన్న గదిలోకి వెళ్తారు. అక్కడి టేబుల్ కింద పడి ఉండే కండోమ్ ప్యాకెట్లు స్వాదీనం చేసుకుని, అతడితో పాటు థెరపిస్టును ‘అదుపులోకి’ తీసుకుంటారు. వీటి ఆధారంగా ఆ స్పాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ హడావుడి చేసి నిర్వాహకులను పూర్తి భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్లు పూర్తిగా తమ ట్రాప్‌లో పడ్డారని నిర్థారించుకున్న తర్వాత మరో అంకానికి తెరలేపుతారు. ముఠాకు చెందిన ఓ సభ్యుడు స్పా సెంటర్ నిర్వాహకులకు సహాయం చేస్తున్నట్లు ముందుకు వచ్చి వారితో మాట్లాడతాడు. సెంటర్లో ఏ తప్పు జరగట్లేదని తాను నమ్ముతున్నానని, ఈ విషయాన్ని తాను సెటిల్ చేస్తానంటూ చెప్తాడు. అటు నిర్వాహకులు, ఇటు పోలీసులుగా వచ్చిన తమ ముఠా సభ్యులతో మాట్లాడుతూ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ తంతు మొత్తం అయితే అదే స్పా సెంటర్లో లేదంటే మరో ప్రాంతంలోని రెస్టారెంట్లో జరుగుతోంది. కాగా అప్పుడప్పుడు స్పా సెంటర్ల కేంద్రంగా జరిగే అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్‌్కఫోర్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి వివాదాలను క్యాష్ చేసుకుంటూ ఈ ముఠా తమ దందా కొనసాగిస్తోంది. ఇలా ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు పశ్చిమ మండలంలోని పలు సెంటర్లపై పంజా విసిరి దాదాపు రూ.50 లక్షల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. ఈ ముఠాకు సహకరిస్తున్న వారిలో కొందరు పోలీసులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా.. 10 మంది మహిళలు అరెస్ట్
గుణదల(విజయవాడతూర్పు): స్పా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై మాచవరం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు సమీపంలో స్టూడియో 9, ఏపీ 23 పేరుతో చలసాని ప్రసన్న భార్గవ్ ప్రైవేట్ యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఆ బిల్డింగ్ పై భాగంలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆ ముసుగులో స్పా సెంటర్లో వ్యభిచార గృహం నడుపుతున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అక్రమంగా రప్పించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. అమ్మాయిలతో వల వేసి బడా బాబులను టార్గెట్ చేసి లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. ఆ బిల్డింగ్‌లో వ్యబిచారం జరుగుతున్నట్లు మాచవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి స్పా సెంటర్ పై దాడి చేశారు. అక్కడ ఉన్న పది మంది మహిళలను, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దాడి విషయం తెలిసిన భార్గవ్ పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలసులు గాలిస్తున్నారు.మరెన్నో ఆరోపణలు..భార్గవ్‌కు పలు వ్యభిచార ముఠాలతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూ ట్యూబ్ చానల్ పేరుతో ధనికులను, అధికారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నేతగా చెలామణి అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..! -
Hyderabad: హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం
గచ్చిబౌలి: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో స్టైలిష్ బ్యూటీ స్పా పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం దాడులు చేశారు. నిర్వాహకుడు సత్యనారాయణ, విటులు శ్రీకాంత్, గోవిందరావు, అప్పారావులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు కారు ప్రమాదాలు.. నలుగురికి గాయాలుమణికొండ: బుధవారం జరిగిన వేర్వేరు కారు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. నార్సింగి పోలీసులు తెలిపిన మేరకు.. రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్‌కు చెందిన విజయ్‌కుమార్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన స్నేహితురాలితో కలిసి బుధవారం తెల్లవారు జామున సుజికీ ఫ్రాంక్స్ కారులో కోకాపేట మూవీటవర్ వైపు లాంగ్ డ్రైవ్‌కు వచ్చారు. కారును వేగంగా నడపటం, ముందు లారీ వెళుతున్న విషయాన్ని గమనించకపోవటంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దాంతో విజయ్‌కుమార్‌తో పాటు అతని స్నేహితురాలికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించారు. మరో సంఘటనలో వోక్స్ వ్యాగన్ కారులో వికారాబాద్ నుంచి నార్సింగికి వస్తుండగా సీబీఐటీ కళాశాల ముందుకు రాగానే అదుపు తప్పిన కారు రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న హోర్డింగ్ పోల్‌ను ఢీ కొట్టింది. దాంతో కారు ముందు బాగం పూర్తిగా నుజ్జు,నుజ్జు అయ్యింది. అందులో ఉన్న కార్తీక్, అభిõÙక్రెడ్డిలకు స్వల్పగాయాలు కావటంతో వారు కారును అక్కడే వదిలి పారిపోయారు. రెండు కారు ప్రమాదాల కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
SPA: స్పా ముసుగులో వ్యభిచారం..
తిరువొత్తియూరు: చెన్నై, కొలత్తూరు శివపార్వతి నగర్ మూగాంబికై జంక్షన్ సమీపంలో ఓ ప్రైవేట్ బ్యూటీ పార్లర్, స్పా నిర్వహిస్తోంది. ఇందులో వ్యభిచారం వృత్తి జరుగుతున్నట్లు డిప్యూటీ కమిషనర్‌కు సమాచారం అందడంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులు స్పా సెంటర్లో బుధవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు.ఆసమయంలో వ్యభిచార వృత్తిని నడుపుతున్న మేనేజర్ మాధవన్ (24) అరెస్టు చేశారు. స్పాలో పనిచేస్తున్న అంబత్తూరుకు చెందిన ముగ్గురు మహిళలను రక్షించి ప్రభుత్వ శరణాలయానికి పంపించారు. మాధవన్‌ను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. స్పా నడుపుతున్న కొలత్తూరు మహాత్మాగాంధీ నగర్ కుచెందిన రంజిత్ (40) కోసం గాలిస్తున్నారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ముగ్గురు విటులను అరెస్టు చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటనారాయణ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లోని మూడు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఆ క్రమంలో ఈస్ట్ సీఐ మహేశ్వర రెడ్డి, ఎస్ నాగేంద్రబాబు, సిబ్బంది కలసి కొర్లగుంటలోని డీబీఆర్ హాస్పిటల్ రోడ్లో ఉన్న సీ–7 సెలూన్ అండ్ స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఆ సెంటర్లో నలుగురు మహిళలు, ముగ్గురు విటులను పక్క పక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ముగ్గురు విటులను అరెస్టు చేశారు. ఆ స్పా సెంటర్ మేనేజర్‌గా మనీషా, ఆర్గనైజర్లుగా మహి, ఆమె భర్త అఫ్తాబ్ వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. మహిళల అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ఆధ్యాత్మిక నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
Pets Spa: మేము నాటీ... మాకూ కావాలి బ్యూటీ! (ఫొటోలు)
-
హైదరాబాద్: స్పా సెంటర్ల మాటున గలీజు దందా!
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార దందా యథేచ్ఛగా సాగుతోంది. చందానగర్‌లో స్పా కేంద్రాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు కేపీహెచ్‌బీలోని సెలూన్ షాప్‌పై పోలీసులు దాడులు చేయగా.. సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు బట్టబయలలైంది. ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కూపాలుగా మారిన స్పా సెంటర్లపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న స్పా సెంటర్లనే కాకుండా.. వాటిల్లో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేయడాన్ని పలు స్పా సెంటర్లలో గుర్తించారు.గత నెలలో ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ స్టేషన్ల పరిధిలో లైసెన్లు లేకుండా నిర్వహిస్తున్నారని సమాచారంపై దాడులు చేశారు. జీహెచ్ఎంసీ లైసెన్స్‌లతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్లు, ప్రొఫెషనల్ థెరపిస్ట్‌లు లేకపోవడం, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్ సైతం లేవని తేలింది. అలాగే.. మార్గదర్శకాలు ఫాలో కాకుండా మహిళలతో క్రాస్ మసాజ్ చేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు గుర్తించారు -
స్పా సెంటర్లపై పోలీసులు దాడి..! ఐదుగురు యువతులు అరెస్ట్
హైదరాబాద్: మసాజ్ పేరుతో అక్రమంగా కొనసాగిస్తున్న స్పా కేంద్రాలపై గుడిమల్కాపూర్ పోలీసులు, సౌత్‌వెస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ షేక్ ముజీబ్ ఉర్ రెహా్మన్ తెలిపిన వివరాల ప్రకారం.. నానల్‌నగర్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జన్నత్, గోల్డెన్ అనే రెండు స్పా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు స్పా కేంద్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. స్పా, స్నూకర్, రిక్రియేషన్క్లబ్లకు ఇళ్లను అద్దెకిచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని ఇళ్ల నిర్వహకులకు ఇన్స్పెక్టర్ సూచించారు. -
HYD: వ్యవభిచార కూపాలుగా స్పా సెంటర్లు!
క్రైమ్: వ్యభిచార కూపాలుగా మారిన స్పా సెంటర్ల గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వెస్ట్ జోన్ పరిధిలో జరిగిన టాస్క్ ఫోర్స్ దాడుల్లో పలు మసాజ్ సెంటర్లు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న స్పా సెంటర్లనే కాకుండా.. వాటిల్లో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. దాదాపు 10 మసాజ్ పార్లర్ల మీద దాడులు చేసి.. 34 మంది నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ స్టేషన్ల పరిధిలో లైసెన్లు లేకుండా నిర్వహిస్తున్నారని సమాచారం మీద దాడులు చేశారు. జీహెచ్ఎంసీ లైసెన్స్‌లతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్లు, ప్రొఫెషనల్ థెరపిస్ట్‌లు లేకపోవడం, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్ సైతం లేవని తేలింది. అలాగే.. మార్గదర్శకాలు ఫాలో కాకుండా మహిళలతో క్రాస్ మసాజ్ చేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు గుర్తించారు. -
స్పా ముసుగులో వ్యభిచారం..సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
-
స్పా ముసుగులో వ్యభిచారం
బంజారాహిల్స్: ఫిలింనగర్ రోడ్ నెం.9లోని డీటైప్ క్వార్టర్స్‌లో కె.శ్రీనివాస్(32) అనే వ్యక్తి సిగ్నేచర్ వెల్నెస్ స్పా పేరుతో ఓ స్పాను నిర్వహిస్తున్నాడు. దీని ముసుగులో వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడితో పాటు క్రాస్ మసాజ్ చేస్తున్న యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీ కోసం అలవాటుపడ్డ శ్రీనివాస్ సిగ్నేచర్ వెల్నెస్ స్పాను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి థెరపిస్ట్‌ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందింది. ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి స్పాపై దాడి చేసి యువతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళల అక్రమ రవాణాతో పాటు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా ఈ తనిఖీల్లో తేలింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 370, 370ఏ, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా..
పెనమలూరు(విజయవాడ): తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో మసాజ్ కేంద్రాలపై (స్పా) పోలీసులు శనివారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునిసిపాలటీ పరిధిలో తాడిగడప వందడుగుల రోడ్డులో మసాజ్ కేంద్రం, ఇంజినీరింగ్ కాలేజీ ఎదురుగా శ్రీనివాస నగర్ కాలనీలో పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కిషోర్ అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఒక కేంద్రం, పోరంకిలో ఒక మసాజ్ కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. చదవండి: రాధ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. ఈ కేంద్రాలపై నిఘా ఉంచిన పోలీసులు దాడులు చేసి, 12 మంది మహిళలు, ఏడుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కిషోర్‌పై ఎస్పీ జాషువా విచారణకు ఆదేశించినట్టు సీఐ తెలిపారు. -
Kukatpally: స్పా, మసాజ్ సెంటర్ల మాటున అక్రమాలు..
సాక్షి, కూకట్పల్లి: నగరంలోని కూకట్‌పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం దందా నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. కాగా, పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు కూకట్‌పల్లిలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో స్పా ముసుగులో వ్యభిచారం నడుపుతున్న ముఠాలను గుర్తించారు. ఈ సందర్భంగా దాదాపు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఐదు స్పా సెంటర్లను మూసివేశారు. స్పా, మసాజ్ సెంటర్లు ఇవే.. - స్ప్రింగ్ వెల్ స్పా, మసాజ్ సెంటర్ - అవంతి స్పా, మసాజ్ సెంటర్ - సారా వెల్నెస్ స్పా, మసాజ్ సెంటర్ - స్నో యూనిసెక్స్ స్పా, మసాజ్‌సెంటర్ ఇక, ఈ విషయంలో సంబంధిత యజమానులు, నిర్వాహకులు, థెరపిస్టులను అవసరమైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీసు స్టేషన్లలకు అప్పగించారు. -
పాత భవనం.. లోపల భూతల స్వర్గం.. స్పా మాటున హైటెక్ వ్యభిచారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరంలో భూతల స్వర్గాన్ని తలపించేలా స్పా, సెలూన్లు, వెల్నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు నిర్వహిస్తున్నారు. బయటకు వేరే కలరింగ్ ఉన్నా లోపల మాత్రం పాడు పనులను ప్రోత్సహిస్తున్నారు. మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచార దందా కొనసాగుతోంది. వీటి మాయలో పడి ఎంతోమంది జేబులకు చిల్లులు పడుతుండగా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. వీటి నియంత్రణకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె. రాణా నేతృత్వంలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి విటులను అరెస్ట్‌చేసి కొందరికి ఈ మురికికూపం నుంచి విమక్తి కల్పించారు. మొదటి దశలో నగరంలో గుర్తించిన 190 స్పాలపై 18 ప్రత్యేక పోలీస్ బృందాలతో దాడులు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న స్పాలను సీజ్ చేసి నిర్వాకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది విటులను అదుపులోకి తీసుకొని 28 మంది యువతులకు మురికి కూపం నుంచి విముక్తి కల్పించారు. వారిని వారి సొంత గ్రామాలకు పంపారు. అనధికారికంగా నిర్వహణ.. గతంలో చేసిన తనిఖీల్లో చాలా వాటికి ఎలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా నిర్వహిస్తున్నారు. స్పా, మసాజ్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు. ఏకంగా కొన్ని స్పాలలో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు, అందుకు తగిన ఆధారాలు సైతం లభించడంతో పోలీసులు అటువంటి వాటిపై ఉక్కు పాదం మోపారు. రెండో దశలో పోలీసు నిఘా ఉన్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఓ హైటెక్ స్పా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. దీనిపై పోలీసులు పక్కా స్కెచ్‌తో బందరురోడ్డులో స్టింగ్ అపరేషన్ చేసి అక్కడ క్రాస్ మసాజ్ జరగుతున్నట్లు నిర్ధారించుకొన్నాక, రెవెన్యూ, లోకల్ పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులతో కలిసి దాడి చేసి స్పాను సీజ్ చేశారు. స్పా నిర్వాహకుడిని అరెస్ట్ చేసి, అక్కడ పట్టుబడిన యువతులను హోంకు తరలించారు. సెక్షన్ 18 కింద స్పాను ఖాళీ చేయించేలా అధికారులు హౌస్ ఓనర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇవే కాకుండా గతంలో నగరంలో స్పాలకు వెళ్లిన అమాయకుల ఫొటోలను తీసి, బెదిరించి డబ్బులు గుంజుతున్న ముఠాలను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. పాత భవనం.. లోపల భూతల స్వర్గం.. పైకి చూసేందుకు మూడు అంతస్తుల పాత భవనం అయినా లోపల మాత్రం భూతల స్వర్గాన్ని తలదన్నేలా వసతులున్నాయి. అధునాతన బాత్ సౌక్యరం కలిగి ఉంది. హైటెక్ సెక్యూరిటీ కార్డు సిస్టం ద్వారానే లోనికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. మొదట స్పాలోకి వెళ్లగానే అందులో జరిగే కార్యకలాపాలు చూసుకొనేందుకు వీలుగా కస్టమర్లతో మాట్లాడేందుకు మేనేజరు, రిసెప్షనిస్ట్ ఉంటారు. వారు కస్టమర్‌కు వారి వద్ద ఉన్న వివిధ రకాల సర్వీసులను వివరిస్తారు. ఈ విధంగా కస్టమర్ తనకు కావాల్సిన సర్వీసును ఎంపిక చేసుకున్న తరువాత, వారు ఎంపిక చేసుకున్న సర్వీసుకు అనుగుణంగా రూమ్‌లకు రూ.3,700 నుంచి రూ.13,000 వరకు వసూలు చేస్తున్నారు. కస్టమర్‌కు కావాల్సిన సర్వీస్‌ను ఎంపిక చేసుకున్న తరువాత మేనేజర్ అక్కడ తన వద్ద ఉన్న ఉద్యోగిని, కస్టమర్‌తో రూమ్ లోపలికి పంపిస్తారు. రూమ్ లోపల కస్టమర్‌కు కావాల్సిన సరీ్వస్ చేసే సమయంలో కస్టమర్లను మాటల్లో దించి తన హావభావాలు, డ్రెస్ కోడ్‌తో రెచ్చగొట్టేలా చేస్తారు. స్పా ఉద్యోగి కస్టమర్‌కు వివిధ రకాలైన లైంగిక సరీ్వస్‌లను చెప్పి, వాటి ఖర్చుల కనుగుణంగా అదనంగా రూ. నాలుగు వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలన్నీ పోలీసు స్టింగ్ అపరేషన్‌లో వెలుగు చూసినట్లు సమాచారం. కఠిన చర్యలు తీసుకొంటాం నగరంలో స్పాలకు ఎలాంటి అనుమతులు లేవు. గత ఏడాది అక్టోబర్ నుంచి స్పాలపై నిఘా పెట్టి దాడులు చేయించాం. అందులో 15 స్పాలలో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశాం. కొంత మంది అనుమతులు తీసుకొన్నామని చెబుతున్నా వాటిని అతిక్రమించి చేయకూడని పనులు చేస్తున్నారు. అటువంటి వాటిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొంటాం. నిబంధనల విరుద్దంగా కార్యకలాపాలు చేస్తున్న స్పాలపై దాడులు చేసి సీజ్ చేసి నిర్వాహకులను అరెస్టు చేశాం. – టి.కె. రాణా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్. -
స్పా, సెలూన్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: స్పా, సెలూన్లు, వెల్నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై విజయవాడ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత వారం రోజులుగా వీటిపైన పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఎనీ్టఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాల మేరకు డీసీపీ విశాల్ గున్నీ నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 18 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. ‘స్పా’ట్ పెట్టారు.. నగరంలో మాచవరం, మొగల్రాజపురం, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో 190కి పైగా స్పా సెంటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో ఇప్పటికే 60 స్పాలపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 46 స్పాలను సీజ్ చేశారు. పోలీసులు దాడులు చేస్తుండటంతో కొన్ని స్పాలను నిర్వాహకులు మూసివేశారు. అలాంటి వాటిపైనా పోలీసులు దృష్టి సారించి వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. వీటిపై దృష్టి.. ప్రధానంగా వీరి తనిఖీల్లో నిబంధనల ప్రకారం వ్యాపార నిర్వహణ కోసం లైసెన్సు తీసుకొన్నారా లేదా? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా? వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాలా వాటికి ఇలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొన్ని సెంటర్లలో స్పా, మసాజ్‌ల పేరుతో ఏకంగా క్రాస్ మసాజ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఇలా ఇప్పటి వరకు దివ్య యూనిసెక్స్ అండ్ బ్యూటీ సెలూన్, గోల్డెన్ ఓక్స్, హనీ బ్యూటీస్పా, ఫర్ యూ ఫ్యామిలీ సెలూన్ సెంటర్లలో క్రాస్ మసాజ్ జరుగుతున్నట్లు గుర్తించి, అందుకు తగిన ఆధారాలు లభించడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఏడుగురు స్పా నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 18 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. 28 మంది యువతులను ఈ మురికి కూపం నుంచి కాపాడి, వారిని తాత్కాలికంగా హోమ్స్‌లో ఉంచి వారి సొంత ఊళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పేరు మాత్రమే ఫ్యామిలీ.. చాలా సెంటర్లు ఫ్యామిలీ స్పాలంటూ పేర్లు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ, హరియాణా, ఈశాన్య రాష్ట్రాలు, థాయ్‌ల్యాండ్ చెందిన యువతులను తెచ్చి వీరితో క్రాస్ మసాజ్‌తో పాటు వ్యభిచారం కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. యువతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని, డబ్బు ఆశ చూపి, ఇక్కడికి వచ్చాక బలవంతంగా ఈ మురికికూపంలో దించుతున్నట్లు సమాచారం. ఈ తరహా స్పాల్లోకి వెళ్లేందుకు నిర్వాహకులు హై సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు చేసుకున్నారు. ఫింగర్ ప్రింట్ పెడితేనే లోపలికి అనుమతి ఉంటుంది. మొదట సాధారణ మసాజ్ సెంటర్లాగే నిర్వహించి.. ఆ తర్వాత నెమ్మదిగా కస్టమర్లను తమ మార్గంలోకి మలచుకుంటున్నట్లు తెలుస్తోంది. స్పాలోకి వెళ్లే విటుల నుంచి కూడా పెద్ద మొత్తంలో గుంజుతున్నట్లు సమాచారం. గట్టి నిఘా.. విజయవాడలో ఈ విష సంస్కృతి ప్రబలకుండా, వీటిపైన పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఆయా స్పా నిర్వాహకులకు పెద్ద తలకాయలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఈ స్పాల నిర్వహణలో పోలీసుల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర నిఘా వర్గాలు ఈ వ్యవహారంపైన సమాచారం సేకరిస్తున్నాయి. ఉపేక్షించేది లేదు.. స్పా సెంటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వీటిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఇటీవల మూసి వేసిన స్పాల గురించి కూడా ఆరా తీస్తున్నాం. ఆయా స్పాలను ఎప్పుడు మూసివేశారు? దాని నిర్వాహకులు ఎవరూ? గతంలో ఎన్నిరోజుల పాటు నిర్వహించారు? వంటి అంశాలను పరిశీలిస్తున్నాం. నగరంలోని ఏ ప్రాంతాలలోనైనా ఇలాంటివి జరిగితే.. 7328909090 (వాట్సాప్)కుగానీ, డయల్100గానీ సమాచారం ఇవ్వవచ్చు. వీటితో పాటు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా తెలుపవచ్చు. సమాచారం ఇచ్చే వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతాం. నిర్భయంగా సమాచారం ఇవ్వవచ్చు. – విశాల్ గున్నీ, డీసీపీ, ఎన్టీఆర్ జిల్లా -
పిల్లల పాలిట ‘యమకూపం’
అభం శుభం ఎరుగని పసిపిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమాజంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనాతీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసి వాళ్లపై జరుగుతున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమయం వచ్చింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనో వేదన నిరంతరం పచ్చిపుండే. ఈ దేశ అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షక పాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విషయంలో దోషులే. ‘‘మనిషిగా తలెత్తి బతక లేను మానవత లేని లోకాన్ని స్తుతించలేను’’ అంటారు ప్రసిద్ధ తెలుగు కవి దేవరకొండ బాల గంగాధర తిలక్. నాలుగు సంవత్సరాల పాప లేత చేతులపై వాతలు. ఏడేళ్ల బిడ్డలపై... మరిగే నీళ్లు పోయడం, వాతలు పెట్టడం, కొట్టడం... తిట్టడం.. ఇలాంటివి చెప్పనక్కర లేదు. ఈ ఆడపిల్లలకు ఈడు రాలేదు! పాపం... కోరికంటే తెలియదు. బలవం తంగా చేసిన ఇంజెక్షన్ల కారణంగా ఈ పిల్లలు ‘పెద్ద వాళ్లయ్యారు’. అంతేకాదు, ఎందరి చేతుల్లోనో నలిగి పోయారు. ఎందుకంటే, ఈ చిన్న ఆడపిల్లలకే డిమాండ్. విటుల వికృత కోర్కెలకు వారు బలైపో తున్నారు. ఎంత చిన్న అమ్మాయి అయితే అంత ఎక్కువ రేటు. ఇలాంటి కోర్కెలున్న వాళ్లు నిజంగా మనుషులేనా? ప్రత్యేక జాతా? ఎవరీ పిల్లలు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరీ కూనలు? ఎక్కడి నుంచి ఈ నరకానికి చేరారు? ఎక్కడ దొరికితే అక్కడ ఎత్తుకు వచ్చిన వాళ్లు. ఆడుకుంటూ అమాయకంగా చాక్లెట్ల కోసం వచ్చి జీవితాలు కోల్పోయినవాళ్లే ఈ ఆడపిల్లలు. ప్రధానంగా పేదల పిల్లలు. వలస కూలీల పిల్లలు. వారి అమ్మానాన్నలకు పనికి వెళ్లక తప్పదు. ఇలాంటి కూలీల బిడ్డలకు కేర్ సెంటర్లు ఉండవు. రోడ్ల మీదే అలా తిరుగుతుంటారు. దుర్మార్గులకు దొరికిపో తారు. అయినా వారి విషయం ఎవరూ పట్టించు కోరు. పోలీసులతో సహా.. వీళ్లేమైనా ధనవంతుల బిడ్డలా? అధికారం ఉన్న వారి కడుపున పుట్టారా? గ్లామర్ ఉన్న ప్రముఖుల పిల్లలా? వారి ‘అదృశ్యం’ సంచలన వార్త అవుతుందా? కాదు గదా! చూద్దాంలే అంటారు చట్టాలు అమలు చేయాల్సినవాళ్లు. రోజూ 194 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు భారతదే శంలో. అందులో జాడ దొరికేది సగం మంది మాత్రమే. ఈ ముక్కుపచ్చలారని పిల్లల్లో 51 శాతం మంది అపహరణకుగురయినవారే. ఈ పిల్లలందరినీ వేరే దేశాల వ్యభిచార గృహాలకు, మన దేశంలోని వ్యభిచార కూపాలకు, బూతు సినిమాలు తీయడా నికి, వెట్టి చాకిరి చేయడానికి దుండగులు తరలిస్తు న్నారు. ఇలా మాయమవుతూ దుర్భర జీవితం గడుపుతున్న పిల్లల గురించి సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు ప్రభుత్వాలు సహా ఎవరూ పట్టించు కున్న దాఖలాలు లేవు. ఫోన్లు, వాట్సాప్ ద్వారానే మొత్తం వ్యాపారం! ఈ అమాయక ఆడపిల్లలను ఎత్తుకొచ్చినవాళ్లు, మధ్య దళారులు, వారిని కొనేవాళ్లు–వీరందరూ చాలా తెలివిగా వ్యవహారం నడుపుతుంటారు. మొత్తం వ్యాపారం ఇప్పుడు ఫోను సంభాషణలు, వాట్సాప్ ఫొటోలతో నడుస్తోంది. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిల్ల వయసు ఎంత? ఇప్పటికి ఎంత వ్యాపారం చేయడానికి ఉపయోగప డింది? ఇలా అన్నింటికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు వారితో వ్యాపారం చేసేవారి దగ్గర ఉంటాయి. ఈ ఆడపిల్లలతో వ్యాపారం చేసే అసలు సూత్రధారులు ఇలాంటి వివరాలతోనే బేరాలు కుదుర్చుకుంటారు. గత సంవత్సరం లక్షా పదకొండు వేల మందికి పైగా పిల్లలు కనపడకుండా పోయారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి ఏటా 50 వేల మంది స్త్రీలు, పిల్లలు భారతదేశంలోకి అక్రమ రవాణా అవుతు న్నారు. దేశంలో ఈ వృత్తిలో ఉన్న రెండు కోట్ల మందిలో కోటీ అరవై లక్షల మంది అక్రమ రవాణా ద్వారా ఇతరుల బలవంతంతో వచ్చినవాళ్లే. అంటే ఎనభై శాతం మంది మహిళలు ఇలా వ్యభిచారకూపా లకు అక్రమ రవాణా కారణంగా చేరుకున్నవారే. భారీ ప్రభుత్వ వ్యవస్థ ఉన్న ఈ దేశంలో బాలల అక్రమ రవాణా అరికట్టడానికి ఇంత వరకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదు. నిర్ణీత కాంట్రాక్టు పద్ధతిలో పిల్లల తరలింపు కాంట్రాక్టు పద్ధతిలో పిల్లలను వ్యభిచార గృహాలకు ఇవ్వడం, ముందే నిర్ణయించిన గడువు తీరగానే మళ్లీ మరో ప్రదేశానికి తరలించడం చాలా ఏళ్లుగా జరుగు తోంది. ఇలా పిల్లలను అనేక చోట్లకు తరలించడం వల్ల వారి జాడ తెలుసుకోవడం చాలా కష్టమౌతోంది. ఇలా తీసుకొచ్చిన పిల్లలను బడి పిల్లల్లాగే తయారు చేశాక అపార్ట్మెంట్లలో నివాసాల మధ్య ఈ దుర్మా ర్గపు వృత్తి చేయిస్తున్నారు. అవసరాన్ని బట్టి వారిని నేలమాళిగల్లో దాచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ పిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమా జంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ అక్రమ సెక్స్ వ్యాపారంలో ఆడపిల్లలతోపాటు మగపిల్లలకు కూడా గిరాకీ పెరిగిపోతున్నది. ఈ పిల్లలతో ఇలా ప్రవర్తించడానికి కారణాలేంటి? అసహజమైన బూతు దృశ్యాలు విపరీతంగా చూసి రెచ్చిపోవడం, వయసు మీరుతున్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మా యిలు దొరకకపోవడం మాత్రమే కారణాలా? లేక ఎవరూ తాకని పసి కన్యలు కావాలనే మోజా? ఇలాంటి పిల్లలతో శారీరక సంబంధం పెట్టుకుంటే అప్పటికే ఉన్న రోగాలు పోతాయనే మూఢనమ్మ కమా? ముక్కుపచ్చలారని ఈ పిల్లలను ఎంతగా హింసించినా, ఎలాంటి వికృత లైంగిక చర్యలకు పాల్పడినా వారు అడ్డుచెప్పలేరనే నమ్మకమా? నిస్స హాయ స్థితిలో ఉండే అమ్మాయిలపై కామం పేరుతో శాడిజానికి పాల్పడి ఆనందించే రాక్షస లక్షణమా? ఇంకే కారణాలు మనుషులను మృగాలను మించి పోయేలా చేస్తున్నాయి? ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనా తీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసివాళ్లపై జరుగు తున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమ యం వచ్చింది. బిహార్ అనాథ గృహాల కథనాలు దారుణం ఉత్తరాది రాష్ట్రమైన బిహార్‌లోని అనాథ గృహాల కథ నాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఆయన రాజ కీయ నాయకుడు. మూడు పత్రికల యజమాని. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. ఆయన ఏడేళ్ల మూగ చెవిటి అమ్మాయిని కూడా వదల్లేదు. 34 మంది చిన్న బిడ్డలకు మత్తుమందులు ఇచ్చి అత్యాచారాలు చేసిన ఘటనలు ఇక్కడే జరుగుతున్నాయి. బిహార్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మంజూ వర్మ (ఈమె బుధ వారం పదవికి రాజీనామా చేశారు) భర్త ముజఫర్ పూర్ అనాథ బాలికల గృహంలో అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడమేగాక తానే స్వయంగా అత్యాచారం చేశాడు. అనాథ గృహంలోని ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై ఎవరో ఇచ్చిన నివేదిక ఎనిమిది నెలలపాటు అతీగతీ లేకుండా మంత్రి ఆఫీసులో పడి ఉంది. ఈ పిల్లల ఆక్రందనలు ఎవరూ వినలేదు. బయటకు ఈ పిల్లల అరుపులు, ఏడుపులు వినపడుతున్నా, బాలికలను జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతున్నా చుట్టూ ఉన్న జనం మాట్లాడలేదు. ఎందుకంటే వారికి భయం. ఈ దుర్మార్గాలకు సూత్రధారి అయిన బ్రజేష్ ఠాకూర్ తనను అరెస్ట్ చేశాక భయపడలేదు. పోలీసులు తీసు కుపోతున్నప్పుడు అతను నవ్వుకుంటూ ‘ఇదంతా రాజకీయ కుట్ర’ అని మీడియాకు ధైర్యంగా చెప్పా డంటే, అతనికి రాజకీయంపై ఎంత నమ్మకం? అతని నమ్మకం వమ్ముకాలేదు. జైలు ఆస్పత్రిలో ఠాకూర్‌కు రాజభోగాలందుతున్నాయి. అనాథ పిల్ల లంతా మానసిక, శారీరక గాయాలతో కునారి ల్లుతున్నారు. బ్రజేష్ ఠాకూర్ నడిపే మరో అనాథగృ హంలో 11 మంది పిల్లల ఆచూకీ లేదు. గువాహటీ మసాజ్ సెంటర్లో... ఇలాంటి అక్రమాలకే నిలయమైన గువాహటీ మసాజ్ సెంటర్ గురించి స్థానికులు ఫిర్యాదు చేసినా చాలా కాలం పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడి తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు 110 మంది అమ్మా యిలను రక్షించారు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో బ్లాక్ లిస్టులో ఉండి, అనుమతి లేని షెల్టర్ హోమ్‌కు పోలీ సులు అమ్మాయిలను ఇస్తూనే ఉన్నారు. ఈ అనాథ కేంద్రాల నుంచి రోజూ వ్యాన్లలో మైనారిటీ తీరని అమ్మాయిలను విటుల దగ్గరకు పంపడం పోలీసు లకు తెలుసు. మరి ఈ విటులు అధికారులా? రాజ కీయ నాయకులా? అనే విషయంపై పోలీసులు ఆరా తీయడం లేదు. విటులందరిపైనా పోక్సో చట్టం కింద కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? ఈ ఘటనలన్నింటికీ అక్రమ రవాణా చట్టం, వ్యభిచార నిరోధక చట్టంతోపాటు పోక్సో చట్టం కూడా వర్తి స్తుంది. వ్యభిచార కూపాల్లో మాదిరే ఈ గృహాలకు చేరిన పిల్లలు వాటి నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపై బతకాల్సిందే. ఈ హోమ్‌ల యజమానులకు రాజ కీయ పార్టీలు, అధికారుల అండదండలున్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా అక్రమ రవాణా బాధి తులను ఈ పునరావాస కేంద్రాలకు తరలిస్తూనే ఉన్నారు. వీటిలో పునరావాసం కల్పించేవి ఎన్ని? వ్యాపారం నడిపేవి ఎన్ని? ఎక్కడా పర్యవేక్షణ లేదు. ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు కూడా జవా బుదారీతనం లేదు. వేటిపైనా నిఘా లేదు. ‘పునరా వాసం’ మంచి లాభదాయక వ్యాపారంగా మారింది. అందుకే సుప్రీంకోర్టు ‘‘పసి పిల్లలపై అకృత్యాలు చేయడానికి ప్రభుత్వం నిధులు ఇస్తున్నదా? ఎందుకు సరైన తనిఖీ లేదు’’ అని ప్రభుత్వాన్ని నిల దీసింది. కనీసం అత్యాచార బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్నయినా ఎందుకు ఇవ్వలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనోవేదన నిరంతరం పచ్చిపుండే. ఈ పిల్లలు మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు భరోసా ఇవ్వాలని ఎవరూ అనుకోవడం లేదు. వారి మానసిక కల్లోలం సమసిపోవడానికి చికిత్స అందిం చాల్సిన బాధ్యత మనపై ఉందని ఎవరూ భావిం చడం లేదు. ఒక గృహంలో అకృత్యాలు జరిగినట్టు తేలితే పిల్లలను మరో గృహానికి తరలించి అధికా రులు చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ దేశ అధి కార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షకపాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విష యంలో దోషులే. నిర్లజ్జగా, బాధ్యత తీసుకోకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు అసలు నేరస్తులు. వ్యాసకర్త : పి. దేవి, సాంస్కృతిక కార్యకర్త ఈ–మెయిల్ : pa_devi@rediffmail.com -
మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం..
న్యూఢిల్లీ: ఖరీదైన వస్తువులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేయడం లాంటి విషయాలకు దూరంగా ఉండాలని తన పిల్లలకు తరచూ చెప్నేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ అంటున్నాడు. ఇప్పటికీ తన వయసు మీద పడ్డట్లు కనిపించకుండా చూసుకునే అనిల్, తన పిల్లలకు సలహాలు ఇస్తుంటానని చెప్పాడు. సోనమ్ కపూర్, హర్షవర్థన్ కపూర్,రియా కపూర్ లకు ఆరోగ్యానికి సంబంధించిన వాటిపై ఖర్చు చేయడంలో తప్పులేదన్నాడు. ఆస్తులు, ఆభరణాలు, విలువైన బ్యాగులు లాంటివి కోనుగోలు చేయడం వృథా అని ఆయన అభిప్రాయపడ్డాడు. తాను మాత్రం స్పా సెంటర్లలో ఎక్కువగా గడుపటానికి ఇష్టపడతానని, అందువల్లే చాలా అనందంగా, ఆరోగ్యంగానూ ఉంటానని అనిల్ హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) 17వ ఎడిషన్ వేడుకల నిర్వహణ స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జరుగుతుందని తెలిపాడు. మెడికల్ స్పా ఎక్కడ ఉన్నా సరే వాటిలో అత్యుత్తమమైన వాటిలో కనీసం వారమైనా ఆరోగ్యం కోసం గడుపుతానని వెల్లడించాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బరువు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్ట్రియాలోని 'స్పా' సెంటర్లకు తరచుగా వెళ్తుంటారని చెప్పుకొచ్చాడు. వారసుడు హర్షవర్ధన్, సోనమ్ లతో కలిసి నటించే ఆలోచన ఉందా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ... మా ముగ్గురికి సమ ప్రాధాన్యం ఉండేలా ఏదైనా స్క్రిప్టుతో దర్శకుడు వస్తే కచ్చితంగా ఇది నెరవేరుతుంది అంటూ అనిల్ కపూర్ నవ్వేశాడు.