బంజారాహిల్స్: ఫిలింనగర్ రోడ్ నెం.9లోని డీటైప్ క్వార్టర్స్‌లో కె.శ్రీనివాస్(32) అనే వ్యక్తి సిగ్నేచర్ వెల్‌నెస్ స్పా పేరుతో ఓ స్పాను నిర్వహిస్తున్నాడు. దీని ముసుగులో వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడితో పాటు క్రాస్ మసాజ్ చేస్తున్న యువతులను అదుపులోకి తీసుకున్నారు.
ఈజీ మనీ కోసం అలవాటుపడ్డ శ్రీనివాస్ సిగ్నేచర్ వెల్‌నెస్ స్పాను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి థెరపిస్ట్‌ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందింది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి స్పాపై దాడి చేసి యువతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళల అక్రమ రవాణాతో పాటు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా ఈ తనిఖీల్లో తేలింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 370, 370ఏ, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment