మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం.. | Bollywood celebrities have visited spas in Austria, says Anil Kapoor | Sakshi
Sakshi News home page

మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం..

Published Thu, Apr 28 2016 6:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం.. - Sakshi

మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం..

న్యూఢిల్లీ: ఖరీదైన వస్తువులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేయడం లాంటి విషయాలకు దూరంగా ఉండాలని తన పిల్లలకు తరచూ చెప్నేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ అంటున్నాడు. ఇప్పటికీ తన వయసు మీద పడ్డట్లు కనిపించకుండా చూసుకునే అనిల్, తన పిల్లలకు సలహాలు ఇస్తుంటానని చెప్పాడు. సోనమ్ కపూర్, హర్షవర్థన్ కపూర్,రియా కపూర్ లకు ఆరోగ్యానికి సంబంధించిన వాటిపై ఖర్చు చేయడంలో తప్పులేదన్నాడు. ఆస్తులు, ఆభరణాలు, విలువైన బ్యాగులు లాంటివి కోనుగోలు చేయడం వృథా అని ఆయన అభిప్రాయపడ్డాడు. తాను మాత్రం స్పా సెంటర్లలో ఎక్కువగా గడుపటానికి ఇష్టపడతానని, అందువల్లే చాలా అనందంగా, ఆరోగ్యంగానూ ఉంటానని అనిల్ హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) 17వ ఎడిషన్ వేడుకల నిర్వహణ స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జరుగుతుందని తెలిపాడు. మెడికల్ స్పా ఎక్కడ ఉన్నా సరే వాటిలో అత్యుత్తమమైన వాటిలో కనీసం వారమైనా ఆరోగ్యం కోసం గడుపుతానని వెల్లడించాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బరువు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్ట్రియాలోని 'స్పా' సెంటర్లకు తరచుగా వెళ్తుంటారని చెప్పుకొచ్చాడు. వారసుడు హర్షవర్ధన్, సోనమ్ లతో కలిసి నటించే ఆలోచన ఉందా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ... మా ముగ్గురికి సమ ప్రాధాన్యం ఉండేలా ఏదైనా స్క్రిప్టుతో దర్శకుడు వస్తే  కచ్చితంగా ఇది నెరవేరుతుంది అంటూ అనిల్ కపూర్ నవ్వేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement