Harshvardhan Kapoor
-
తనయుడితో తొలిసారి
అనిల్ కపూర్‌కు 2019 చాలా స్పెషల్ ఇయర్‌గా మారబోతోంది. ఈ ఏడాది తనయ సోనమ్ కపూర్‌తో తొలిసారి కలసి నటించారు. ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’లో తండ్రీ–కూతుళ్లలానే కనిపించారు. తాజాగా కుమారుడు హర్షవర్థన్ కపూర్‌తో కలసి యాక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. షూటర్ అభినవ్ బింద్రా జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. అభినవ్‌గా హర్షవర్థన్ కపూర్ యాక్ట్ చేస్తున్నారు. ఇందులో అభినవ్ తండ్రి అప్జిత్ బింద్రా పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నారు. ‘‘దేశం గర్వించే వ్యక్తుల కథలో భాగమవ్వడం ఎప్పుడూ సంతోషమే. ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి అస్సలు సందేహించలేదు. రెండు సినిమాలే చేసినప్పటికీ మా అబ్బాయి నాతో నటించడానికి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు’’ అన్నారు అనిల్ కపూర్. ఇలా ఒకే ఏడాది కుమార్తె– కుమారుడితో నిజ జీవిత రిలేషన్షిప్నే స్క్రీన్ మీద చూపించడం విశేషమే. -
క్షమాపణ చెప్పిన హీరో
ముంబై: డిజిలిత్ దోసాన్ జహ్ గురించి చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో హర్షవర్థన్ కపూర్ క్షమాపణ చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలు డిజిలిత్ ను బాధ పెట్టివుంటే క్షమించాలని కోరాడు. ‘డిజిలిత్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటనను అభిమానిస్తాను. నేనేదైనా తప్పుగా మాట్లాడివుంటే మన్నించాల’ని ట్వీట్ చేశాడు. డిజిలిత్ కు ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇవ్వడాన్ని అంతకుముందు హర్షవర్థన్ తప్పుబట్టాడు. ‘తొలి ఉత్తమ నటుడి అవార్డు కొత్తగా సినిమాలు చేసిన వారికి ఇస్తారు. వేరే భాషల్లో సినిమాలు చేసి హిందీలో మొదటి చిత్రంలో నటించిన వారిని డెబ్యూ అవార్డులకు ఎంపిక చేయడం శోచనీయం. వంద ఇంగ్లీషు సినిమాల్లో నటించినా హిందీలో తొలి చిత్రం చేస్తే నాకు డెబ్యూ కేటగిరిలో అవార్డులకు అర్హత ఉంటుంది. లియొనార్డో డికాప్రియో ఆస్కార్ అవార్డు అందుకున్నా.. బాలీవుడ్ లో సినిమా చేస్తే అతడికి కూడా డెబ్యూ పురస్కారం ఇస్తారేమోన’ని హర్షవర్థన్ వ్యంగంగా కామెంట్లు చేశాడు. అనిల్ కపూర్ తనయుడైన 26 ఏళ్ల హర్షవర్థన్ ‘మీర్జ్యా’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. -
స్టార్ వారసుడి సినిమాపై రివ్యూ వచ్చేసింది!
మరో స్టార్ వారసుడు ఈ శుక్రవారం బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకప్పటి టాప్ హీరో అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ ‘మీర్జ్యా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో సయామీ ఖేర్ హీరోయిన్గా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నది. ‘రేయ్’ సినిమాతో ఈ సుందరి ఇప్పటికే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘మీర్జ్యా’ ప్రివ్యూను చూసిన బాలీవుడ్ ప్రముఖులు పలువురు ’కదిలే కవిత్వంలా’ ఈ సినిమా సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హర్షవర్ధన్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలుపగా.. బిగ్ బీ అమితాబ్ ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ఈ సినిమా గురించి బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్లో ఇచ్చిన రివ్యూ ఇదే.. ‘మీర్జ్యా’ చూశాను. కదిలే కవిత్వం, అద్భుతమైన దృశ్యాలు, కథ చెప్పడంలో కొత్త దృక్పథం.. ఆకట్టుకుంది. - బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఊపిరి సలుపలేనంత అద్భుతంగా ఉంది. దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రాకు జోహార్లు. అందరూ అద్భుతంగా పనిచేశారు. హర్షవర్ధన్ మరో స్టార్ కాబోతున్నాడు. - అనుపమ్ ఖేర్ సినిమా నిజంగా కదిలే కవిత్వం. మెహ్రా చిత్రకారుడైతే అతనికి హర్షవర్ధన్, సయామీ ఖేర్ కుంచెలు. కథ కన్వాసు. సినిమా ఎంతో అందంగా ఉంది. తమ్ముడు హర్షవర్ధన్ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు మరింతగా పనిచేసి.. అనిల్కపూర్లా పేరు తెచ్చుకోవాలి. సయామీ ఖేర్ కూడా అద్భుతంగా నటించింది. - అర్జున్ కపూర్, హీరో ‘మీర్జ్యా’ సౌందర్యం నన్ను కట్టిపడేసింది. ఎంతో తపనతో ఈ సినిమా తీశారు. అద్భుతమైన దృశ్యాలు, అసాధారణమైన సంగీతం. కలల తొలి సినిమా అంటే ఇలా ఉండాలి. - షబానా ఆజ్మీ తమ సహజ నటనతో హర్షవర్ధన్, సయామి ఖేర్ విస్మయ పరిచారు. - ఫర్హా ఖాన్ -
మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం..
న్యూఢిల్లీ: ఖరీదైన వస్తువులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేయడం లాంటి విషయాలకు దూరంగా ఉండాలని తన పిల్లలకు తరచూ చెప్నేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ అంటున్నాడు. ఇప్పటికీ తన వయసు మీద పడ్డట్లు కనిపించకుండా చూసుకునే అనిల్, తన పిల్లలకు సలహాలు ఇస్తుంటానని చెప్పాడు. సోనమ్ కపూర్, హర్షవర్థన్ కపూర్,రియా కపూర్ లకు ఆరోగ్యానికి సంబంధించిన వాటిపై ఖర్చు చేయడంలో తప్పులేదన్నాడు. ఆస్తులు, ఆభరణాలు, విలువైన బ్యాగులు లాంటివి కోనుగోలు చేయడం వృథా అని ఆయన అభిప్రాయపడ్డాడు. తాను మాత్రం స్పా సెంటర్లలో ఎక్కువగా గడుపటానికి ఇష్టపడతానని, అందువల్లే చాలా అనందంగా, ఆరోగ్యంగానూ ఉంటానని అనిల్ హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) 17వ ఎడిషన్ వేడుకల నిర్వహణ స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జరుగుతుందని తెలిపాడు. మెడికల్ స్పా ఎక్కడ ఉన్నా సరే వాటిలో అత్యుత్తమమైన వాటిలో కనీసం వారమైనా ఆరోగ్యం కోసం గడుపుతానని వెల్లడించాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బరువు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్ట్రియాలోని 'స్పా' సెంటర్లకు తరచుగా వెళ్తుంటారని చెప్పుకొచ్చాడు. వారసుడు హర్షవర్ధన్, సోనమ్ లతో కలిసి నటించే ఆలోచన ఉందా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ... మా ముగ్గురికి సమ ప్రాధాన్యం ఉండేలా ఏదైనా స్క్రిప్టుతో దర్శకుడు వస్తే కచ్చితంగా ఇది నెరవేరుతుంది అంటూ అనిల్ కపూర్ నవ్వేశాడు. -
కొడుక్కి క్లాస్ పీకిన టాప్ హీరో!
ముంబై: అనిల్ కపూర్ తనయుడు, వర్ధమాన హీరో హర్షవర్థన్ కపూర్ తన ప్రేయసి సప్నా పాబీకి బ్రేకప్ చెప్పాడు. వీరిద్దరూ అనిల్ కపూర్ కారణంగా విడిపోయినట్టు బాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. '24' సినిమాలో అనిల్ కపూర్ కూతురిగా నటించిన సప్నాతో హర్షవర్థన్ ప్రేమలో పడ్డారు. యువజంట ప్రేమలోకాల్లో విహరించింది. విషయం అనిల్ కపూర్ కు తెలియడంతో కొడుక్కి క్లాస్ తీసుకున్నాడట. కెరీర్ ఆరంభంలో ప్రేమాదోమా అంటూ తిరిగితే మంచిది కాదని సలహాయిచ్చాడట. నీతో పాటు ఆమె కెరీర్ కూడా పాడవుతుందని నచ్చచెప్పాడు. తండ్రి మాటలను తలకెక్కించుకున్న హర్షవర్థన్ ప్రియురాలికి బ్రేకప్ చెప్పాడు. తన తమ్ముడికి సోనమ్ కపూర్ కూడా బ్రెయిన్ వాష్ చేసిందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. 'మిర్జియా' సినిమాతో హర్షవర్థన్ హీరోగా బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు 'రంగ్ దే బసంతి' ఫేమ్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది.