
అనిల్ కపూర్, హర్షవర్థన్ కపూర్
అనిల్ కపూర్‌కు 2019 చాలా స్పెషల్ ఇయర్‌గా మారబోతోంది. ఈ ఏడాది తనయ సోనమ్ కపూర్‌తో తొలిసారి కలసి నటించారు. ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’లో తండ్రీ–కూతుళ్లలానే కనిపించారు. తాజాగా కుమారుడు హర్షవర్థన్ కపూర్‌తో కలసి యాక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. షూటర్ అభినవ్ బింద్రా జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. అభినవ్‌గా హర్షవర్థన్ కపూర్ యాక్ట్ చేస్తున్నారు.
ఇందులో అభినవ్ తండ్రి అప్జిత్ బింద్రా పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నారు. ‘‘దేశం గర్వించే వ్యక్తుల కథలో భాగమవ్వడం ఎప్పుడూ సంతోషమే. ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి అస్సలు సందేహించలేదు. రెండు సినిమాలే చేసినప్పటికీ మా అబ్బాయి నాతో నటించడానికి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు’’ అన్నారు అనిల్ కపూర్. ఇలా ఒకే ఏడాది కుమార్తె– కుమారుడితో నిజ జీవిత రిలేషన్‌షిప్‌నే స్క్రీన్ మీద చూపించడం విశేషమే.
Comments
Please login to add a commentAdd a comment