– ముగ్గురు మహిళల రక్షింపు
తిరువొత్తియూరు: చెన్నై, కొలత్తూరు శివపార్వతి నగర్ మూగాంబికై జంక్షన్ సమీపంలో ఓ ప్రైవేట్ బ్యూటీ పార్లర్, స్పా నిర్వహిస్తోంది. ఇందులో వ్యభిచారం వృత్తి జరుగుతున్నట్లు డిప్యూటీ కమిషనర్‌కు సమాచారం అందడంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులు స్పా సెంటర్‌లో బుధవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు.
ఆసమయంలో వ్యభిచార వృత్తిని నడుపుతున్న మేనేజర్ మాధవన్ (24) అరెస్టు చేశారు. స్పాలో పనిచేస్తున్న అంబత్తూరుకు చెందిన ముగ్గురు మహిళలను రక్షించి ప్రభుత్వ శరణాలయానికి పంపించారు. మాధవన్‌ను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. స్పా నడుపుతున్న కొలత్తూరు మహాత్మాగాంధీ నగర్ కుచెందిన రంజిత్ (40) కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment