![Police Raids On Massage Centres In Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/21/Police-Raids-On-Massage-Cen.jpg.webp?itok=8I7jqi89)
ప్రతీకాత్మక చిత్రం
పెనమలూరు(విజయవాడ): తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో మసాజ్ కేంద్రాలపై (స్పా) పోలీసులు శనివారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 19 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునిసిపాలటీ పరిధిలో తాడిగడప వందడుగుల రోడ్డులో మసాజ్ కేంద్రం, ఇంజినీరింగ్ కాలేజీ ఎదురుగా శ్రీనివాస నగర్ కాలనీలో పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కిషోర్ అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఒక కేంద్రం, పోరంకిలో ఒక మసాజ్ కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
చదవండి: రాధ హత్య కేసులో షాకింగ్ విషయాలు..
ఈ కేంద్రాలపై నిఘా ఉంచిన పోలీసులు దాడులు చేసి, 12 మంది మహిళలు, ఏడుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కిషోర్‌పై ఎస్పీ జాషువా విచారణకు ఆదేశించినట్టు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment