massage centres
-
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా..
పెనమలూరు(విజయవాడ): తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో మసాజ్ కేంద్రాలపై (స్పా) పోలీసులు శనివారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునిసిపాలటీ పరిధిలో తాడిగడప వందడుగుల రోడ్డులో మసాజ్ కేంద్రం, ఇంజినీరింగ్ కాలేజీ ఎదురుగా శ్రీనివాస నగర్ కాలనీలో పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కిషోర్ అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఒక కేంద్రం, పోరంకిలో ఒక మసాజ్ కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. చదవండి: రాధ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. ఈ కేంద్రాలపై నిఘా ఉంచిన పోలీసులు దాడులు చేసి, 12 మంది మహిళలు, ఏడుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కిషోర్‌పై ఎస్పీ జాషువా విచారణకు ఆదేశించినట్టు సీఐ తెలిపారు. -
అనుమతి లేని మసాజ్ సెంటర్‌పై దాడి
హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని ది సెంట్ హోటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై సైఫాబాద్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు మేనేజర్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి..
సాక్షి, చెన్నై: నగరంలో అనుమతులు లేకుండా సాగుతున్న మసాజ్ సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు. మసాజ్ సెంటర్లు, స్పాలలో వ్యభిచారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో వ్యభిచార నియంత్రణ విభాగంలో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఏసీబీకి చిక్కారు. మసాజ్ సెంటర్లు, స్పాలు, స్టార్ హోటళ్ల నుంచి వీరు లక్షల్లో లంచం తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రత్యేక బృందాలు రెండు రోజులుగా మసాజ్ సెంటర్లు, స్పాలపై దృష్టి పెట్టాయి. ఎనిమిది మసాజ్ సెంటర్లు ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది మహిళలకు విముక్తి కల్పించారు. నగరంలో మొత్తం 151 మసాజ్ సెంటర్లు, స్పాలు ఉండగా ఇందులో 63 సెంటర్లకు అనుమతులు కూడా లేవని తేలింది. ఈ సెంటర్లకు సీల్ వేశా రు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..) -
మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడి
-
మసాజ్ సెంటర్లపై దాడి.. 20 మంది అరెస్ట్
-
మసాజ్ సెంటర్లపై దాడి.. 16 మంది అరెస్టు
మాదాపూర్ ప్రాంతంలో ఉన్న పలు మసాజ్ సెంటర్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇటీవలి కాలంలో బంజారాహిల్స్ ప్రాంతంలో కూడా మసాజ్ సెంటర్ల మీద పోలీసు దాడులు జరిగాయి. ఇక తాజాగా మాదాపూర్ ప్రాంతంలో జరిగిన దాడిలో క్రాస్ మసాజ్‌లు చేస్తున్న పదిమంది యువతులను, ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. మగవారికి ఆడవాళ్లు మసాజ్ చేయడం చట్టప్రకారం నేరమని, అందుకే వారిని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు. -
బంజారాహిల్స్‌లో థాయ్ మసాజ్.. 21 మంది అరెస్టు
వెస్ట్‌జోన్ పోలీసులు మరోసారి మసాజ్ సెంటర్ల మీద దాడులు చేశారు. నాలుగు మసాజ్ సెంటర్లపై దాడులు చేసి మొత్తం 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది థాయ్‌లాండ్‌కు చెందిన మహిళలు, నలుగురు పశ్చిమ బెంగాల్ యువతులు ఉన్నారు. మసాజ్ చేయించుకుంటున్న ఏడుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవీకే, సిటీ సెంటర్, అఫ్సినిటీ, పిస్తా స్పాలపై పోలీసులు ఇప్పటివరకు దాడులు చేశారు.